Previous Page Next Page 
వెలుగుబాట పేజి 8


    "మీరే మరొకసారి ఆలోచించుకోండి. అప్పుడు  న్యాయం మీకే బోధపడుతుంది. మీ అమ్మాయిని ఆమె న్యాయం మీకే బోధపడుతుంది. మీ అమ్మాయిని ఆమె ప్రేమిస్తున్న రామయ్యా కెందుకిచ్చి పెళ్ళిచేయకూడదూ?"

    ఈ మాటలతో మండిపడిపోయాడు బోసుబాబు.

    "ఏమన్నావు! నా కూతుర్ని ఆ లేకివెధవకిచ్చి పెళ్ళి చెయ్యనా? నాకూతురు వాడిని ప్రేమిస్తుందా? నా కూతురి మీద ఇలాంటి అపవాదులు వేస్తావా?"

    "క్షమించండి. ఒకరిమీద అపవాదులువేసే స్వభావం నాదికాదు. మీ  అమ్మాయే చెప్పింది అందుకని అన్నాను. అతడి అక్కను మీరు ప్రేమిస్తున్నారటకదా, అతడిని లేకివెధవ అంటారేం?" ఈ మాటలతో  బోసుబాబు బలవంతాన నిలుపుకొన్న సహనం పూర్తిగా జారిపోయింది.

    "నోర్ముయ్! నేను దాన్ని ప్రేమించానా? నా ఇంటి కొచ్చి మెక్కి నామీదా, నా కూతురిమీదా అభాండాలు వేస్తావా? బయటికి నడు."

    ఇంటికి రమ్మని ఆహ్వానించి, వద్దు వద్దంటున్నా బాలవంత పెట్టి  తినిపించి "మా ఇంటికొచ్చి మెక్కావు" అంటున్నాడు. గౌరవనీయుడయిన సాటి వ్యక్తిని "బయటికి నడు" అంటున్నాడు. మతిపోయినట్లు అతడిని చూసి ఒక విధమయిన చీదరింపుతో అక్కడినుంచి వచ్చేసాడు.

 

                                                            *    *    *

 

    రాత్రి సమయం. ఎవరో తలుపులు కొడితే నిద్ర కళ్ళతో తలుపులు తెరిచాడు కుమార్. వంటినిండా దెబ్బలతో రక్తం ఓడుతున్న మనిషిని ఓ  పదిమంది మోసుకొచ్చారు. చావు బతుకులలోఉన్న ఆ మనిషిని చూడగానే కుమార్ నిద్ర ఎక్కడిదక్కడ ఎగిరిపోయింది. వెంటనే ఆ మనుష్యులతో ఆస్పత్రికి బయలుదేరాడు. ముందు గాయాలకు కట్లుకట్టాడు. వంటినిండాకట్లే! ఆ మనిషి స్పృహలోలేడు రక్తం చాలాపోయింది. ఆస్పత్రిలో బ్లడ్ బేంక్ లేడు.

    "ఇతడికి ఎవరయినా రక్తం ఇయ్యగలరా?" అన్నాడు కుమార్. అందరూ వెనక్కు తగ్గారు. ఆ స్థితిలో వెంటనే ఇయ్యవలసిన కొన్ని ఇంజక్షన్స్ కూడా లేవు. ఉన్న ఇంజక్షన్స్ వాడేసాడు. అంతకంటె ఏంచెయ్యగలడు? అతడిఉంటే అతడి ముందుకు జరీపంచె, జరీకండువా బుగ్గ మీసాలతో ఉన్న వ్యక్తి వచ్చాడు.

    "నన్ను మీకు తెలిసేఉంటది. నా పేరు కెన్నడీబాబు! అది నాపేరు కాదనుకోండి. నాకు నేనే యెట్టుకున్నాను అంత గొప్పోణ్ణి కావాలని. ఏ అన్నేయం జరిగినా, నా మనసుడికిపోతాది అన్నేయాన్ని ఎదిరించాలిసిందే ఈడికిన్ని దెబ్బలు తగిలినట్లు ఓ సరిటిఫి కేటు అడెయ్యండి. ఆ తరువాత సంగతి జూసుకుంటాను" అన్నాడు.

    కుమార్ మనసు అతడి మాటలమీదలేదు. రోగి విషమ పరిస్థితిమీద ఉంది. సర్టిఫికేట్ ఇయ్యటం తన కర్తవ్యం కనుక వ్రాసిచ్చి "ఈ రోగికి వెంటనే కొన్ని యింజక్షన్లియ్యకపోతే బ్రతకడు, కావలసిన మందులు రాసిస్తాను, వెంటనే టౌన్ నుంచి తెప్పించగలరా?" అన్నాడు. కెన్నెడీబాబు మొహం నిండా బాధనూ, ఆవేదననూ ప్రకటిస్తూ "యేంటీ, ఆస్పత్రిలో మందులే లేవూ? యిట్టావుంది ప్రభుత్వం నేను యెంటనే కారులో యెల్లి టౌనంతా తిరిగి మందులట్టుకొస్తా" అని  ముందులట్టుకోస్తా" అని ముందు కుమార్ వ్రాసిఇచ్చిన సర్టిఫికేట్ అందుకుని భద్రంగా చొక్కా జేబులోదాచుకుని ఆ తర్వాత మందులు వ్రాసిన చీటీ పట్టుకుని చేతులు జోడించి నమస్కారంచేసి, తన ఆవేదనను వ్యక్తీకరించటానికి "ప్చ్" లాంటి శబ్దాలు చేస్తూ వెళ్ళిపోయాడు.

    రోగి మరణావస్థలో ఉన్నాడని తెలుసు. బ్రతికే ఆశ ఉందని తెలుసు. ఎలా బ్రతికించాలో తెలుసు. అయినా, ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు కుమార్. అతని ఆశ అంతా కెన్నెడీ తెస్తానని వాగ్దానంచేసిన మందుళ పైనే వుంది. గడియారం ముళ్ళు తిరిగిపోతున్నాయి. కాని, కెన్నెడీబాబు రాలేదు. అలా ఊరికే కూచో లేకపోయాడు కుమార్ . చూస్తూ చూస్తూ చేతులారా ఒక నిండు ప్రాణాన్ని మృత్యుముఖంలోకి పంపవలసిరావటం అతనికి భరించరానిదిగా ఉంది. ఇక కూచోలేక మందులకోసం తానే కెన్నెడీ ఇంటికి బయలుదేరాడు. తలుపు ఎన్నోసార్లు బాదాక కాని తెరుచుకోలేదు నిద్రమత్తుతో బయటికొచ్చాడు కెన్నెడీ బాబు. అతడి ముఖం చూడగానే అతడు మందుళ కోసం వెళ్ళలేదని అర్థమయిపోయింది కుమార్ కి పట్టరాని కోపం వచ్చింది.

    మీరు మందులకు వెళ్ళకుండా నిద్రపోతున్నారా? ఇప్పుడైనా వెళ్ళండి-" అన్నాడు కోపంగా కెన్నెడీబాబు అంతకంటే ఆగ్రహపరవశుడై "ఎవడురా ఈడు, నన్నే డబాయిస్తున్నాడు? ఎల్లెల్లు అర్దరాత్రి, ఏటా గోల! పొద్దున్న సూద్దాంలే" అని దబాలున తలుపు వేసేసుకున్నాడు. కెన్నెడీ బాబు నిజస్వరూపం అప్పటికి అర్థమయింది కుమార్ కి. ఉసూరుమంటు తిరిగి ఆస్పత్రికొచ్చాడు- అతడు వచ్చేసరికి ఒక యువతి, రోగి పక్కన కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తోంది -కుమార్ రాగానే చేతులు జోడించి "నా తమ్ముడు బతుకుతాడా బాబూ" అంది.

    "ఇప్పటికైనా ఇతడిని వెంటనే టౌన్ కి తీసికెళ్ళి పెద్ద ఆస్పత్రిలో చేర్పిస్తే బతుకుతాడు - మీరెవరు?"

    "నాపేరు సుందరమ్మ బాబూ!"

    కుమార్ బుర్రలో మెరుపుమెరిసింది.

    "అంటే బోసుబాబుగారి...."

    ఆ యువతి తలదించుకుంది.

    కుమార్ ఉత్సాహంతో "అయితే ఇంకేం? వెంటనే బోసు బాబుగారినడిగి ఒకలాగా ఇతడిని ఆస్పత్రికి తీసికెళ్దాం" అన్నాడు.

    సుందరమ్మ వికృతంగా నవ్వింది.

    "ఎంత సత్తెకాలపోడివి బాబూ! ఈ బోసు బాబులూ కెన్నెడీ బాబులూ మన నాదుకుంటారనుకుంటున్నావా? వాళ్లు ఈ పేర్లు పెట్టుకున్నది గోముఖ వ్యాఘ్రాల్లాగ జనాన్ని నమ్మించి గొంతులు కోయడానికి.

    సుందరమ్మ మధ్య మధ్య ఏడుస్తూ చెప్పినదాన్ని బట్టి జరిగిన సంగతి కుమార్ కి తెలిసింది.

    సరళ రామయ్యలు రహస్యంగా గుళ్లో పెళ్ళి చేసుకోవాలనుకున్నారు- కొందరు స్నేహితుల సహాయంతో రామయ్య అన్ని ఏర్పాట్లూ చేసాడు- సరళ రహస్యంగా ఇంట్లోంచి వచ్చేసింది. ఈ ఏర్పట్లన్నీ బోసుబాబు టౌన్ లో ఉన్నప్పుడు చేసుకున్నారు. కానీ, బోసుబాబుకు ఎలా తెలిసిందో సమయానికి వచ్చి వళ్ళు  తెలియని కోపంతో రామయ్యను చితకబాదేసి అతడు స్పృహతప్పాక సరళను ఇంటికి ఈడ్చు కొచ్చాడు. బోసుబాబుకీ, కెన్నెడీబాబుకీ రాజకీయంగా పార్టీకక్షలున్నాయి- ఇద్దరూ  ఒకరినొకరు సాధించుకొవటానికి, అవకాశాలకోసం ఎదురుచూస్తూంటారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోరు. అందుకే కెన్నెడీ బాబు దెబ్బలుతిని స్పృహతప్పి పడివున్న రామయ్యను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అతడికి కావలసింది బోసుబాబుమీద నేరం ఆరోపించటానికి డాక్టర్ సర్టిఫికేట్ కాని, రామయ్య ఆరోగ్యం బాగుపడటంకాదు.

    నిర్ఘాంతపోయాడు కుమార్-

    ఇదేం లోకం? వీళ్ళంతా మనుష్యులేనా?

    బోసుబాబుకి బోలెడంత  డబ్బుంది- దానితో కొనుక్కున్న పలుకుబడుంది- ఈ రెంటి సహాయంతో చాకచక్యంగా కేసంతా కుమార్ మీదికి తిప్పేసాడు.

    "మా అమ్మాయి రామయ్యను పెళ్ళిచేసుకోవటం నాకిష్టంలేదు- ఇద్దరమూ ఘర్షణపడ్డాం. ఘర్షణలో ఇద్దరికీ గాయాలు తగలాయి.  నామీద దెబ్బతీయటానికి కాచుకుని ఉన్న కెన్నెడీబాబు గోరింతలు కొండంతలు చేసి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని కేసు పెట్టించాడు. నిజానికి రామయ్య చచ్చిపోయింది కుమార్ అశ్రద్ధవల్ల. ఆస్పత్రిలో మంచి మందులన్నీ రహస్యంగా అమ్ముకుని కాలపరిమితి దాటిన మందుల్ని రహస్యంగా అమ్ముకుని కాలపరిమితి దాటినా మందుల్ని మాత్రమే ఆస్పత్రిలో ఉంచాడు- ఆ ఇంజక్షన్లు ఇయ్యటంవల్ల పరిస్థితి వికటించింది- ఆ పరిస్థితుల్లో రోగిని వదిలి ఈయన అర్థరాత్రివేళ ఎక్కడికివెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో దేవుడికే తెలియాలి. రోగి చనిపోవటంలో ఆశ్చర్యమేముందీ?" ఇదీ బోసుబాబు కధనం.

    కుమార్ జరిగినది జరిగినట్లు చెప్పాడు.

    కానీ.....

    చావుదెబ్బలు కొట్టినట్లు బోసుబాబు ఒప్పుకోలేదు. ఆస్పత్రులకు మందులు సప్లయిచేయలేదని ప్రభుత్వం ఒప్పుకోలేదు.

    కుమార్ రాత్రివేళ మందులు తెప్పించటానికి తన  దగ్గరకి వచ్చాడనీ నిద్రపోతూ అతడి అభ్యర్ధనను తిరస్కరించాననీ కెన్నడీబాబు ఒప్పుకోలేదు.

    ఈ వార్త పత్రికల కెక్కింది. ప్రతిపక్షంవారు ప్రభుత్వ అసమర్ధతనూ, ప్రభుత్వ ఆస్పత్రులలో డాక్టర్ల దురాగతాలను వేనోళ్ళతో పత్రికా ముఖంగా దుమ్మెత్తిపోసారు.

 Previous Page Next Page