Previous Page Next Page 
వెలుగుబాట పేజి 7


    "మీరు రారా!"
    "సస్పెండ్ చేయబడ్డవాణ్ణి, మీతో వస్తే మీకు ఉద్యోగం వచ్చినట్లే."
    "నాకు భయంగా ఉంది."
    "ఇకమీదట ఇక్కడ ఒంటరిగా ఉద్యోగం చెయ్యవలసిన వారు, ఇంతదానికే భయపడితే ఎలా? ఇదేనా మీ స్త్రీల సమానత్వం?" తనకు భయం దేనికో ఆమె  చెప్పలేక పోయింది. అసలలాంటి ఆలోచన రావటమే మనసుకి చికాగ్గా ఉంది. మనసు దిటవు పరచుకొని, బయలుదేరింది యమ్మేల్యేగారున్న గెస్ట్ హౌస్ కి. అక్కడ చాలా మంది ఆయన దర్శనార్ధం ఉన్నారు. అతని పి.ఎ. కాబోలు తన ఇచ్ఛానుసారం వచ్చిన వాళ్ళని లోపలికి పంపిస్తున్నాడు. ఝాన్సీ అడుగు పెట్టగానే అందరి కళ్ళు ఆమెవైపు తిరిగాయి. విచిత్రంగా చూశాయి. ఆమె శరీరం జుగుప్సతో జలదరించింది. "ఛీ ఛీ! ఏం దేశం? ఏం మనుష్యులు? ఇలాంటి దేశంలో ఇంకా ఎన్ని యుగాలు పడుతుంది, స్త్రీ తానొక వ్యక్తిగా నిలబడటానికి?" అనుకొంది.
    అతని పి.ఎ. ఝాన్సీని వెంటనే లోపలి పంపించాడు. అందుకు ఝాన్సీకి సంతోషం కలగలేదు. లోపలి వెళ్ళింది. సోఫాలో కూచుని వున్నాడు ఎమ్మెల్యే. బాగా లావుగా వున్నాడు, పెద్ద బొజ్జ, నల్లని ముక్కు, నీగ్రో ముఖంలాగ లావుపాటి ముక్కు, లావుపాటి పెదవులు. ఆమె రాకనుక్రీగంటతో గమనించి! కూచోమని సైగచేసి పక్కనున్న అతనితో మరింత గట్టిగా మాట్లాడసాగాడు.
    "నేనసలు సెంటర్ మినిస్టర్ నయిపోవలసిందయ్యా! ఈసారి తప్పకుండా అయిపోతాను, రక్షణ మంత్రినయిపోతాను."
    "మీరు తలుచుకొంటే, అదెంత పనండీ!" అతి వినయంగా, అత్యంత నమ్మకంగా అన్నాడు అవతలి వ్యక్తి. అప్పుడు యమ్మేల్యేగారు ఝాన్సీవంక చూసి "ఏంటమ్మా! ఏం పనిమీదొచ్చావు?" అన్నాడు.
    అతడు "ఆమ్మ" అని సంబోధించినా ఆ చూపులూ, మాటలూ, ఝాన్సీకి కాపరం కలిగిస్తున్నాయి. అతి ప్రయత్నం మీద తనను తాను నిగ్రహించుకుంటూ "నేను హరిజన యువతినండి. ఇక్కడి హాస్పిటల్ లో నన్ను డాక్టర్ గా  వేయించమని ప్రార్ధించతానికి వచ్చాను" అంది వినయంగా.
    "హరిజన యువతివా! అయితే ఆ ఉగ్యోగం నీకే తప్పకుండా వేయిస్తాను. హరిజనులకు సేవ చేయటానికే నేను కంకణం కట్టుకున్నాను." అనవసరంగా ఉద్రేకపడిపోతూ అన్నాడు. పక్కనున్న వ్యక్తి ప్రశంసంగా తలఊపాడు, ఏమి మాట్లాడాలో తోచక కావచ్చు.
    "థాంక్స్-వెళతానండీ" అని నమస్కారంచేసి లేచింది. ఆ యమ్మెల్యే ఝాన్సీని సాగనంపటానికి లేచేడు. అది అతడు పట్టెడలో మువ్వలు వడ్డాణంలో మువ్వలు పాంజేబులలో మువ్వలు అన్ని కలిసి గోలగోలగా శబ్దం చేస్తున్నాయి.
    "డాక్టర్ గారూ! మా నాన్న నిన్ను భోజనానికి రమ్మంటున్నాడు."
    ఆ అమ్మాయిని విచిత్రంగా చూస్తూ "మీ నాన్నఎవరు?" అన్నాడు.
    "మా నాన్న తెలీదా? బోసుబాబు! అది అసలుపేరు కాదనుకో. మా నాన్న దేశభక్తితో ఆ పేరు పెట్టుకొన్నాడు."
    "అలాగా."
    "డాక్టర్ గారూ! నువ్వు మా నాన్న చెప్పింది వినకు."
    "మీ నాన్న నాతో ఏం చెప్పలేదు."
    "ఇప్పుడు భోజనానికొస్తే చెపుతాడు."
    "సరే వినను."
    "అదేంటి? ఏం చెపుతాడని అడగవేం?"
    "ఏం చెపుతాడు?"
    సరళ సిగ్గుపడటం మొదలుపెట్టింది. కుమార్ కాసేపు చూసి తన పని చేసుకోసాగాడు. సరళ కోపంగా అతని ఎదుటికివచ్చి నిలబడి "నన్ను పెళ్ళిచేసుకోమని చెపుతాడు" అంది గట్టిగా. అదిరిపడ్డాడు కుమార్ - ఏమీ అర్ధంకాక వెర్రి చూపులు చూసాడు.
    "నువ్వు నిజంగా చాలా బాగున్నావు."
    "థాంక్స్."
    "కానీ చాలా ఆలస్యంగా వచ్చావు ఇక్కడికి"
    "అయామ్ సారీ"
    "నేను ఇదివరకే నా మనసు మరొకళ్ళకి ఇచ్చేసాను".
    "థేంగ్గాడ్!"
    "అంటే?"
    "నువ్వు ప్రేమించిన వాళ్ళతో నీకు పెళ్ళి జరుగుగాక అని."
    "మీరు మంచివారండీ."
    "ఎవరిని ప్రేమించావని అడగవేం?"
    "అలాంటి విషయాలు నాకు చెప్పక్కర్లేదండీ."
    "చెప్పాలి, పెళ్ళిచేసుకోబోయేవాళ్ళముందు ఏ విషయమూ దాచకూడదు."
    "చంపారు."
    "అంటే?"
    "నేను నిన్ను పెళ్ళిచేసుకోబోవటంలేదూ.......అని"
    "నిజంగా ఎంత మంచివాడివి, రామయ్య అలా చెప్పాడేం మరి?"
    "ఎలా చెప్పాడు?"
    "నువ్వు నన్ను తప్పకుండా పెళ్ళిచేసుకుంటావన్నాడు. మా నాన్న ఆస్థి ఎవరూ వదులుకోరన్నాడు."
    "ఫూల్"
    "ఏయ్! అతన్ని ఒక్క మాటఅన్నా నేను సహించను. వాడిని నేను  ప్రేమించాను."
    "వాడినా!"
    "అవును వాడు గవళ్ళ సుందరమ్మ తమ్ముడు. సుందరమ్మని మా నాన్న ఉంచుకున్నాడు. మాకు వరసకూడా కలిసింది."
    "బాగుంది."
    "వాడినసలు ఇంట్లోకి రానిచ్చింది మా నాన్నే! తీరా ఇప్పుడు ప్రేమించుకున్నాక తిడుతున్నాడు. ప్రేమా లేదు  గీమా లేదు చంపుతా-అంటున్నాడు."
    "అన్యాయం."
    "కదూ! మా ఇంటికి భోజనానికి రా. ఆ మాటే మా నాన్నతో  చెప్పు."
    "వస్తాను."
    కుమార్ బోసుబాబు ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక అతడిని ఏదో మీటింగులలో ఉపన్యాసాలిస్తుండగా చూసినట్టు గుర్తొచ్చింది. అతని మాటలలో పెద్ద ఆసక్తికలిగించే విషయమేదీ లేకపోయినా, జనంలోంచి చప్పట్లు కొట్టే జనమని! వాళ్ళకి నీ, నా భేదం లేదు. డబ్బిస్తే చాలు, ఎవరు మాట్లాడుతున్నా ఉండుండి చప్పట్లు కొట్టేస్తారు. ఒకసారి ఒకమీటింగ్ లో "మన ప్రియతమ నాయకుడు మనకు దూరమయ్యాడు " అన్నా చప్పట్లు కొట్టేసారట!
    బోసుబాబు కుమార్ ని చాలా గౌరవంగా ఆహ్వానించాడు. ఒక మోస్తరు పల్లెలో ఇల్లయినా చాలా అధునికంగా కట్టారు. విశాలమైన డైనింగ్ హల్ డైనింగ్ టేబుల్, అన్నీ ఉన్నాయి. ఇన్ని ఆధునికంగా ఉన్నా వడ్డనలో మాత్రం ఆధునికత లేదు. ఇది తిను, అది తిను అని వద్దంటున్నా బలవంతంగా పళ్లెంలో వడ్డించేసారు తండ్రీ కూతురూ. ఏదీ పారెయ్యటానికి మనసొప్పని కుమార్ ఆ భోజనం చెయ్యటానికి చాలా అవస్థపడిపోయాడు. భోజనం ముగిసాక తాంబూలం కూడా ఇచ్చి విశాలమైన తన భావంతీని తన వెండి సామగ్రినీ చూపించి, చూచాయగా తన సంపదను సూచించి అప్పుడు సంభాషణను అసలు విషయంలోకి దింపాడు.
    "నాకు ఈ కుల మత భేదాలు లేవండీ! హరిజనులంటే తక్కువ కులం వాళ్ళిని నాకేం చిన్న చూపులేదు. మీరు హరిజనులయినా మా అమ్మాయిని మీకిచ్చి పెళ్ళి చెయ్యాలనుకొంటున్నాను. మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవటానికి కావలసిన ధనసహాయం చేస్తాను. మీరు నా కొడుకులాగా నా కళ్ళముందుంటే చాలు."
    అతని మాటల్లో అడుగడుగునా ధ్వనించిన అవమానానికిరగిలిపోయాడు కుమార్.
    "బోసుబాబుగారూ! మీ మాటెలాఉన్నా హరిజనులు తక్కువ వాళ్ళనే అభిప్రాయం నాకసలు లేదు. అంచేత నేనేదో తక్కువ వాడినని అనుకోవటంలేదు నాకంటే ఎక్కువ వాళ్ళను చేసుకుని, ఆ ఆధిక్యత పులుముకోవాలనే ఆశలేదు. అసలందులో ఆధిక్యత ఏం లేదు. నేను కొడుకులాగా మీ కళ్ళముందు ఉండటం అసంభవం. అనే నింకొకరికి కొడుకుని" తన సూచనకు కుమార్ ఎగిరి గంతేస్తాడనుకొన్న బోసుబాబు ఆ మాటలకు నిర్ఘాంతపోయాడు. ఓటమి అంగీకరించలేని అతని అహం లోలోపల బుసకొట్టింది. కృత్రిమ సంస్కారంతో అణచుకొని మరొకసారి ఆలోచించుకోండి" అన్నాడు మర్యాదగానే___

 Previous Page Next Page