Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 8


    ఇతర దేశాలనించి వచ్చినవాళ్ళు అతని చురుకుతనాన్ని శ్రమనూ, అడవులు కొండలవెంట సాగిపోవటంలో అతనికున్న నేర్పరితనాన్ని గుర్తించారు. అంతేకాక అతడు అపూర్వమయిన తన అనుభవాలను కధలు కధలుగా వారికి వినిపించేవాడు. అందునించి అతని వ్యక్తిత్వానికి వారు బాగా ఆకర్షితులయ్యేవారు. అస్సాం అడవులో పులుల్నీ, నాగాలాండ్ కొండల్లో కోబ్రాలనూ, హిమవుల్లో యాక్ మృగాల్ని అతడు ఎదుర్కొన్న దృశ్యాల్ని వివరించి చెపుతూవుంటే వారిశరీరాలు భయంతో జలదరించేవి. తన్మయులై వింటూ వుండేవారు. అంతేకాదు అతడిని హీరోని చూచినట్టు ఆరాధనా భావంతో చూచేవారు.
    టూర్ అయిపోయిన తరువాత తిరిగిపోతూ చాలా పెద్ద పెద్ద మొత్తాల్లో అతనికి డబ్బు అందించేవారు.
    ఇవన్నీ కాక లూయిమ్ దగ్గర మరొక ఉత్తమ లక్షణం ఉండేది. అతడు డబ్బులు యిస్తేనే తీసుకునేవాడు. కాని దొంగతనం పంచన అనేవి ఎరుగడు. అవకాశం వచ్చినా మరొకరిసొత్తు అపహరించాలంటే అతని మనసు ఎదురు తిరిగేది. ఎంతో విలువైన వస్తువులు చేజిక్కించకునే అవకాశం వచ్చినా లూయిమ్ ఆశపడకు శ్రమించి ఎవరిసొత్తు వారికి అప్పగించేవాడు.
    అందునించి అస్సాం వచ్చే టూరిస్టులకు అతడు అండ దండలు యివ్వగలిగిన ప్రధమ వ్యక్తిగా పేరు ప్రతిష్టలు ఆర్జించాడు. ఫలితంశంగా చాలా దానం వారు అతనికి యిచ్చారు.
    ఫిజో పుట్టే నాటికి లూయిమ్ దగ్గర లక్షలు  మూలుగు తున్నాయి. వయసుకూడా ఏడుపదులు దాటింది. అయినా అతడు తన వృత్తి మానుకోలేదు. తొమ్మిది పదులు నిండే వరకు మృత్యువు త్ఘనకు చిర విశ్రాంతి యిచ్చేవరకూ శ్రమించాడు. ఫిజ్ పరిస్థితి వేరు అతడు తనకు ఊహ తెలిసేనాటికి లక్షాధికారి బిడ్డ అయినా తండ్రి మార్గాన్ని అనుసరించాడు. తండ్రి తనతో పాటుగా ఫిజ్ ను తీసుకువెళ్ళి ఎన్నో మార్గాలు పరిచయం చేశాడు. అంతేకాక ఆవృత్తిలో ఉండేవారికి కావలసిన మెళకువలన్నీ నేర్పించాడు.
    యిరవై సంవత్సరాలు వచ్చేసరికి ఆ విద్యలో ఆరితేలిపోయినాడు ఫిజో. చాలాకాలం అటవీశాఖ అధికారులకు సాయపడుతూ తండ్రి యిచ్చిన ఆస్థిని పెంచాడు.
    ఖట్మండూకి వాయవ్యంగా భోజ్ పూర్ కి ఈశాన్యంగా హిమసానువుల్లో ప్రపంచానికి కిరీటంలా ఉన్న ఎవరెస్ట్ అధిరోహించాలని అతని చిరకాల వాంఛ. అది తీర్చుకుందుకు పర్వతారోహణ బృందాలతో పాటుగా పనిచేయటం ప్ర్రారంభించాడు.
    ఆ ప్రయత్నంలో ఉండగానే మాలతి గురించి తెలుసుకున్నాడు. ప్రధమ ప్రయత్నం యిలా విఫలమయింది. కెప్టెన్ ఆదర్శవంతురాలయిన యువతి ఆమె పట్టుదల. ధైర్య సాహసాలు అతనికి వచ్చాయి. ఆమెతోపాటుగా ఎన్నటికయినా ఎవరెస్ట్ అధిరోహించగలనని అతని దృఢ విశ్వాసం. అందునించి ఆమెను ప్రాణాలకు తెగించి అయినా కాపాడుకోవాలని అభిలషించాడు.
    ఆలోచనల్లో ఉండగానే టీమరగకాగి తెర్లుతున్నాయి. దాన్ని దింపి చల్లార్చుకుని రెండు గ్రుక్కలు మ్రింగిన తరువాత శరీరంలోకి శక్తి ప్రవేశించినట్లు అయింది.
    అతడు మాప్ బయటకు తీసాడు తానున్న చోటుకు దక్షిణంగా పెద్దలోయ ఉన్నట్టుగా మాప్ లో గుర్తించబడింది. ఆ లోయలోకి లాగివేయబడింది మాలతి. ఆమెను రక్షించేందుకు ఆలోయలోకి తనూ వెళ్ళాలి. అక్కడది వీలు అవుతుందో కాదో పర్వత శ్రేణుల్లో లోయల్ని అధిగమించటం క్లిష్టమయిన సమస్య.
    ఒక్కొక్కసారి అరకిలోమీటరు దిగి తావెళ్ళగలిగిన బొటుకు చుట్టు తిరిగిపోవాలంటే పాతిక కిలోమీటర్లు నడవాలి. పరిస్థితి ఎటువంటిది అయినా ఎదుర్కొనేందుకు సంసిద్ధుడు అయి బయలుదేరినాడు ఫిజో.
    అవసరమయిన సామగ్రిని కిట్ లో భద్రపరిచాడు. చాల లేదు. అక్షిణంగా పయనించాక రాత్రి తాను వచ్చిన లోయ అంచులు కన్పించినాయి. ఆ అంచులమీద నిలిచి చూస్తే లోయ అతి భయంకరంగా కన్పించింది. లోయలోకి దిగడం ఎలా?
    
                          4
    
    ప్రంచడమయిన తమ నివాస గృహ ముఖంనించి అదృశ్య మవుతూంది. ఉదయకాంతి కొండలమీద అన్ని దిక్కులా పరుచుకుంది. రవికిరణం శరీరాన్ని సోకగానే ఉలికిపడి కళ్ళు తెరచింది కెప్టెన్ మాలతి.
    అతనంత ఆశ్చర్యంతో తనవంకే చూస్తున్న రెండు కళ్ళు మిలమిల లాడుతున్నాయి. రాత్రి తనను  భుజంమీద మోసుకు వచ్చిన ప్రాణి తాలూకు రూపవిలాసాలను ప్రధమంగా గనులారా చూచింది కెప్టెన్ మాలతి. ఆ రూపాన్ని చూస్తుంటే ఆమె నేత్రాలు ఆశ్చర్య విప్పారితాలయినాయి.
    విభ్రాంతితో ఆమె నిలువెల్లా ఒక ప్రశ్నార్ధకంగా మారిపోయింది. గతరాత్రి అతని భుజాలమీద తాను కొన్ని మైళ్ళ పర్యంతం పయనించిన విషయం జ్ఞాపకం  రాగానే ఆమెకు మతి పోయినంతపని అయింది. జనావాసాలకు దూర ప్రాంతాలలో కొండగుహలో అతనితోపాటు ఒక రాత్రిలో సగభాగం గడచి పోయిన సంగతి తలపుకువస్తే భయవిహ్వలత అవుతోంది.
    గుండెలు అమిత వేగంగా కొట్టుకుంటున్నాయి.
    సూదుల్లా గ్రుచ్చుకుంటున్న అతని చూపుల్ని తట్టుకోలేక ముఖాన్ని దింపుకుందామె. తాను అతనివంక ఎంత ఆశ్చర్య విస్పారితంగా చూస్తూ ఉందో అతడు అలానే చూస్తున్నాడు. తాను ధరించిన వస్త్రాలు అతనికి అమిత మయిన ఆశ్చర్యాన్ని కొలుపు తున్నాయనిపిస్తోంది. చివరిసారి తాను ధరించిన రంగురంగు వస్త్రాలవంక చూసుకుంది కెప్టెన్ మాలతి. అతడు ధరించినది చిమరీమృగం తాలూకు చర్మం.
    అంత చలిలోనూ అతడు ధరించినది అంతమాత్రమేప: మిగిలిన శరీరమంతా నగ్నంగానే కనిపిస్తోంది. శిరోజాలను సంస్కరించుకోవాలన్న విషయం మీద అతడికి రవ్వంత అయినా ఆసక్తిలేనట్లుగా కన్పిస్తోంది. గోధుమవర్ణం శిరోజాలు మొహం మీదికి పడుతున్నాయి. నుదురు ఎత్తుగా విశాలంగా ఉంది.

 Previous Page Next Page