Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 8


    
    చాలా లేతగా ఉందీ అమ్మాయి. పాతికేళ్ళు వుంటాయేమో కానీ, ఇరవై ఒకటీ ఇరవైరెండూ అంటే నమ్మెయ్యొచ్చు. కొందరి శరీర తత్త్వం అది. వయసు కనబడదు.
    
    మరి శంకర్రావు చాలా పెద్దవాడిలా కనబడుతాడేం? బతుకు బరువు వల్ల క్రుంగిపోయి, వయసు పదేళ్ళు పెరిగినట్లు కనబడుతాడేమో.
    
    శారదకి గాఢంగా నిద్ర పట్టినందుకు సుధీర్ సంతోషించాడు. అలవాటుగా నాడి పరీక్షించి, తర్వాత వెడల్పాటి ప్లాస్టర్ తీసుకుని ఆ బుగ్గమీద నుంచీ ఈ బుగ్గమీద దాకా అతికించాడు. ఆమె పెదిమలు ప్లాస్టర్ కింద బిగుసుకు పోయాయి. సన్నని నైలాన్ తాడుతో ఆమె చేతులు బిగించి, లోపల్నుంచి రూం లాక్ చేశాడు.
    
    తర్వాత ఆమె వైపు పరీక్షగా చూశాడు.
    
    కొద్దిగా అందంగానే వుందీ అమ్మాయి.
    
    అయినా అందం కాదు తన కిప్పుడు కావాల్సింది.
    
    బీభత్సం    
    
    శీలంకోసం కొట్టుకులాడే మధ్య తరగతి స్త్రీ, శీలం కోల్పోతున్నప్పుడు కళ్ళలో కనబడే భయం, ఆరాటం, దుఃఖం, పెనుగులాట - అన్నీ చూడాలి.
    
    శీలం! మిడిల్ క్లాస్ మొరాలిటీ!
    
    బాగా డబ్బున్న వాళ్ళు శీలాన్ని లక్ష్యపెట్టరు.
    
    బొత్తిగా డబ్బులేని అట్టడుగుపొర మనుష్యులకి శీలం అక్కర్లేదు!
    
    కానీ, మధ్య తరగతి మనుషులకి?
    
    అమ్మో! ప్రతి ఆడదీ సీతగా ఉండాల్సిందే.
    
    శారద కళ్ళు తెరిచింది. గాభరాగా చూసింది.
    
    ఏమిటి? ఏమిటిది? మౌనంగానే ఆమె కళ్ళలో ప్రశ్న.
    
    వెర్రివాడిలా చూశాడు సుధీర్.
    
    అరుద్దామంటే నోరు పెగలట్లేదు శారదకు. చెంప కందిపోయేలా ప్లాస్టర్ పట్టీ పట్టేసి వుంది.
    
    "నువ్వు బాగానే ఉంటావు" అన్నాడు సుధీర్.    

    కంపించిపోతూ చూసింది శారద.
    
    సుధీర్ దగ్గరకొచ్చి మంచంమీద కూర్చున్నాడు. శారద గుండె దడదడలాడుతోంది. అతను కూడా కొద్దిగా వణుకుతున్నాడు. మాటలు తడబడుతూ వస్తున్నాయి. తాగాడా? లేకపోతే ఏమిటీ విపరీతం! ఏం చేసింది తను? ఏంచేస్తాడు తనని? చంపేస్తాడా?
    
    "నేను తాగాననుకుంటున్నావా? బ్లడీ హెల్! నేను తాగాను! కానీ తెలివి తప్పేంతగా కాదు."
    
    చటుక్కున లేచి నిలబడింది శారద. తలుపువైపు పరిగెత్తబోయింది.
    
    కాలు అడ్డం పెట్టాడు సుధీర్. తట్టుకుని బోర్లా పడిపోయింది శారద. చేతులు కట్టేసి ఉండడంవల్ల లేవడం సాధ్యంకాలేదు. అంత విసురుగా తల నేలకి తగిలిన షాక్ కి తలలో బాంబు బద్దలయినంతగా నొప్పి కలిగింది. నిస్సహాయంగా అలా పడిపోయే ఉంది శారద.    

    "ఫర్వాలేదు! బాగానే వుంటావు నువ్వు!"
    
    శారద పెదిమ చిట్లి రక్తం వస్తూంది. ఉప్పగా అనిపిస్తూంది నోరు, రక్తంరుచితో.
    
    "నీకంటే, వందరెట్లు అందంగా ఉండే ఆడవాళ్ళని నేను డబ్బుతో కొన్నాను. జెస్సీ, సునందా, షీలా....వీళ్ళందరూ ఒకళ్ళకంటే ఒకళ్ళు బావుంటారు. వీళ్ళందరి అందం కలిపి పోగేస్తే, దానికి వందరెట్లు అందంగా ఉంటుంది నా భార్య శశి. నా దృష్టిలో నువ్వు వాళ్ళ కాళ్ళ గోటికి సరిపోవు. అయినా, నువ్వు నాకు కావాలి.     ఎందుకో తెలుసా?"
    
    శారదకి కడుపులో తిప్పినట్లయింది, అతని మాటలు వింటుంటే.
    
    "రేప్ చేసి చూడ్డంకోసం! రేప్ చేస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఐ వాంట్ టు నో! ఇష్టమైన అమ్మాయితో శృంగారం ఎలా ఉంటుందో తెలుసు. కట్టుకున్న భార్యతో సంసారం ఎలా ఉంటుందో తెలుసు. డబ్బు పారేస్తే యాంత్రికంగా ప్రవర్తించే అమ్మాయిలు తెలుసు. కానీ...కానీ....బలవంతంగా ఒక ఆడదాన్ని - అందులోనూ శీలం అంటే చచ్చిపోయే మిడిల్ క్లాస్ మొరాలిటీ ఉన్న నీలాంటిదాన్ని - వద్దు వద్దంటూ గింజుకుంటూ భయంతో చెమటలు కారిపోతూ పులికి దొరికిన లేడిలా బెదిరిపోతున్న దాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుంది? ఐ వాన్నా డూ ఇట్! ఐ వాన్నా నో ఇట్!"
    
    భయంతో - అసహ్యంతో చచ్చిపోదామనిపించింది శారదకు.
    
    "మళ్ళీ చెబుతున్నాను. నీ అందానికి దాసున్నయిపోయీ, నీమీద భ్రమపడీ కాదు. ఇది కేవలం ఎక్స్ పెరిమెంట్. లేకపోతే సెక్స్ పెరిమెంట్ అందామా?" అతను నవ్వాడు. అతని నవ్వు సహజంగా లేదు. శవాన్ని చూసి పిచ్చివాడు నవ్వినట్లుంది.
    
    శారదకు అనుమాన మొచ్చింది. 'అతనికి మనస్థిమితం లేదా? మరెందుకిలా చేస్తున్నాడు? తను ఇక్కన్నుంచి క్షేమంగా బయటపడగలదా?'
    
    "మనుషుల్ని చంపలేదు నేను, ఇప్పటిదాకా కానీ ఆడపిల్లల్ని కొరికి, నమిలి తినెయ్యగలను. కమాన్, ఐయామ్ గోయింగ్ టు రేప్ యూ! పుస్తకాల్లో రాసిందీ, సినిమాల్లో చూసిందీ ఇవాళ ప్రాక్టికల్ గా తెలుసుకుంటాను. ఇదిగో - నీ చేతులు విప్పేస్తున్నాను. నువ్విప్పుడు ఫ్రీ! కాని అరవకుండా నోటికి ప్లాస్టర్ మాత్రం వుంచేస్తాను! రెడీనా?"
        
    చలిజ్వరం వచ్చిన దానిలాగా వణికిపోతూ, పెనుగులాడుతూ, చెమటలు కారిపోతూ అతనికి అందకుండా ఉండాలని శతవిధాలా ప్రయత్నిస్తూంది శారద.
    
    వినోదంగా తన ఎడమ చేత్తో ఆమె రెండు చేతులూ బిగించి పట్టుకుని, తనకి సమ ఉజ్జీకాని ఆటగాడికి కాస్త ఫెయిర్ ఛాన్స్ ఇస్తున్నట్లు మధ్య మధ్యలో ఆమె చేతులు వదిలేసి, అంతలోనే మళ్ళీ బిగించి పట్టుకున్నాడు సుధీర్.

 Previous Page Next Page