Previous Page Next Page 
విషవలయం పేజి 6

    "నేను వున్నానుగా" అంది ఉష మళ్ళీ.

    "అవును మీరు వున్నారు. అదే నాకు తృప్తి. అని సత్యమూర్తి మెదలకుండా పడుకుని ఏదో ఆలోచించసాగాడు.

    "ఇప్పుడు టైము పదకొండయింది మీకు ఆకలి వేయిటము లేదూ?"

    "వేస్తోంది కొంచం

    "మరి అయితే చెప్పకుండా మౌనంగా పడుకుంటారేం? స్టవ్ మీద పాలు వెచ్చపెడతాను. పాలల్లో ముంచుకొని రొట్టెతినండి" అంటూ ఆమె స్టవ్ వెలిగించి- ఆ ప్రయత్నంలో వుంది.

    "మీరిలా వంటరిగా యిక్కడ యితసేపు వుంటే మీ అన్నయ్య ఏమీ అనుకోడా?" అని అడగాలనిపించింది సత్యమూర్తికి కానీ ఆ ప్రశ్న అతనికే మోటుగా స్పురించి గప్ చుప్ గా ఊరుకున్నాడు.

    ఉష అక్కడున్న గిన్నెలు అటూయిటూ సర్దింది. పాలు స్టవ్ మీద పెట్టాక గదిలో చిందర వందరగా వున్న బట్టలన్నీ శుభ్రంగా ఒకచోట చేర్చి మడిచి పెట్టి "మీ పనిమనిషితో పనిచేయించుకోవటం మీకు చేతకాదా? ఊరికినే జీతం యిచ్చి పోషిస్తున్నారా ఏం?" అనడిగింది కిటికీకి ఆనుకుని అతనివైపు చూస్తూ.

    "అది నాకంటే బద్దకస్తురాలు. గాడిని అశుభ్రంగా వుంచటంలో మేమిద్దరం ఒకరిమీద ఒకరు పోటీ పడుతూంటాము."

    "అలాగా? అయితే ఎందుకు ఆ జీతము దండుగ మనిషి? తీసిపారెయ్యండి."

    "మరి పనెవరు చేస్తారు?"

    "నేను"

     అతను చకితుడై మరుక్షణంలో సిగ్గుతో కుంచించుకుపోతూ "పొంది ఉషా, పరిహాసం చెయ్యటం మీకే చెల్లు" అన్నాడు.

    "నేను జమీందారునా? బలే! మా నాన్నగార్కి పరమలోభి అని పేరు వుంది. ఆ తండ్రికి కుమారుడ్ని. మీకు జీతం కూడా సరిగ్గా ఇవ్వలేను."

    "పోనీ నేను వుచితంగా చెయ్యకూడదా? ఆ అర్హత నాకు లేదా?"

    అత నామేవైపు నివ్వెరపోయి చూశాడు. కాని ఆమె అప్పటికే స్టవ్ వైపు తిరిగి పాలు క్రిందకు దించుతోంది. అతని హావ భావాలేమీ గమనిస్తున్నట్లు లేదు. ఉష ఇట్లా మాట్లాడటం అతనికి చిత్రంగా తోచింది. ఆమెలో యిత చిలిపితనం, చొరవ వున్నాయని అతను అంతకుముందెప్పుడూ ఊహించ లేకపోయాడు. పడుకొని ఆలోచిస్తున్నాడు. ఒక మూడు నిమిషాలు గడిచాక ఆమె అతని దగ్గరకు వచ్చి "తీసుకోండి" అనేసరికి తలెత్తి ఆమె ముఖంలోకి చూసి మళ్ళీ ఒకసారి నివ్వెరపోయాడు. ప్రశాంతంగా, ఏమీ తొట్రుపాటు లేకుండా గంభీరంగా వుంది ఆమె ముఖం.

    అతడు మాట్లాడకుండా లేచి కూర్చుని ఆమె చేతిలోంచి గిన్నె అందుకున్నాడు.

    ఆ అన్నా చెల్లెళ్ళిద్దరి గురించీ అతనికి వింతగా తోచింది. తను ఎవరో, తన వివరాలు ఏమిటో వాళ్ళకు తెలీదు. ఎప్పుడూ అడగలేదు.

    అతనితో కాస్త తినిపించి, ధైర్య వచనాలు చెప్పి, ఉష వెళ్ళి పోయింది.

    ఆ సాయంత్రం అతనికి జ్వరం మళ్ళి ఎక్కువై పోయింది. ప్రసాదరావు అతన్ని చూడటానికి వచ్చినప్పుడు అతను దీనంగా "నేను వంటరిగా యీ రాత్రి పడుకోలేనండి. నాకు అయోమయంగా వుంది, మీరు ఇక్కడ నాకు సాయంగా పడుకోవాలి, తప్పదు" అని బ్రతిమిలాడాడు.

    నిజమే. అతని వళ్ళు కాలిపోతోంది. ప్రసాదరావు కాదనలేక సైకిలు మీద ఇంటికి పోయి చెప్పి వచ్చి తను అక్కడే వుండిపోయాడు.

    ఓ అర్దరాత్రివేళ సత్యమూర్తికి మెలకువ వచ్చింది. అతని మనసులో ఉష మెదిలింది. తాను ఎంత మూడుడు. అంత చిన్నవయసులో వున్న స్త్రీని వొంటరిగా విడిచి ఆమె అన్న ఇక్కడ గడపడానికి తనే బాధ్యుడు. పాపం యీ రాత్రివేళ ఒకరీతి ఆ ఇంట్లో భయం లేకుండా ఎలా పడుకుని వుందో. బెడ్ లైటు వెల్తుర్లో ప్రసాదరావువైపు చూశాడు. చాపమీద పడుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సానుభూతితో, జాలితో సత్యమూర్తి చలించిపోయాడు. అతని కన్నులలో నీళ్ళు తిరిగాయి.

    అతని జ్వరం పూర్తిగా నిమ్మదించేంత వరకూ ఆ అన్నాచెళ్ళిద్దరూ అతన్ని సపర్యలలో ముంచి తేల్చారు. వారిపట్ల అతని మనసు కృతజతా పూర్ణమైపోయింది.

    తరువాత వాళ్ళు మరీ సన్నిహితులయిపోయారు. ఒకసారి ఏదో పండుగ వస్తే తమ యింటికి భోజనానికి పిల్చారు అతన్ని. అతను ఇద్దరికీ ఖరీదైన బహుమతులుతీసుకుపోయాడు. ఎందుకు ఇలాంటివి తీసుకొస్తారంటూ ఉష అతన్ని మందలించింది. అంతేకాదు. వాళ్ళ ఇబ్బందుల్ని చూచాయాగా గ్రహించి అతను తెగించి సహాయం చెయ్యబోతే మృదువుగా తిరస్కరించి, తప్పించుకునేవాళ్ళు.
   

 Previous Page Next Page