Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 6

   
    శ్యామ్ మొదట్లో ఒక్కవారం రోజులు , మోహన్ చదువుతొంటే శ్రద్దగా విన్నాడు. ఆ తరువాత 'కుక్కతోక వంకర' అన్నట్టు యదాప్రకారంగా అయిపోయాడు. వినటానికి కూడా విసుక్కుని నిద్రపోయేవాడు. లేకపోతె రేడియో పెట్టుకునేవాడు. రేడియో మ్రోగుతున్నా, తన ఖర్మానతానుచదువుకునేవాడు మోహన్. శ్యామ్ పుణ్యమా అని మోహన్ చదువు పాడుచేసేవాడు కాడు.
    పోగ్రస్ రిపోర్టర్స్ వచ్చాయి. శ్యామ్ కు అన్నింట్లోనూ తక్కువ మార్కులోచ్చాయి.
    "ఇదేమిటి శ్యామ్!" అన్నాడు జనార్ధన్.
    "పరీక్షల్లో నాకు తలతిరిగింది మేలుకొని పైత్యం చేసింది. ఇవి క్వార్టర్లీ కదా! పభ్లిక్ లో మంచి మార్కులు తెచ్చుకుంటాను" అన్నాడు శ్యామ్ . మోహన్ విని సహించలేక పోయాడు.
    "ఎందుకు శ్యామ్ అబద్దాలాడతావు? నేనెంత బ్రతిమాలినా వినకుండా ఆ డర్టీ మేగజైన్స్ చదువుతూ కూర్చునే వాడివి. నేను చదువుతాను వినమన్నా విసుక్కున్నావు మార్కులు ఎలా వస్తాయి?"
    శ్యామ్ మోహన్ ను ఎర్రగా చూసి వెళ్ళిపోయాడు. తరువాత జనార్ధన్ గారు నేమ్మదిఒగా "శ్యామ్ ను నువ్వు మందలించకు. ఏదయినా ఉంటే నాకు చెప్పు నేను మందలిస్తాను" అన్నాడు.
    ఆ మాటల్లో 'శ్యామ్ ను మందలించే స్తోమత నీకులేదు' అన్న భావం స్పష్టంగా అర్ధమయింది మోహన్ కు.
    మోహన్ ఒంటరిగా చిక్కగానే చాచి చెళ్ళున కొట్టాడు శ్యామ్.
    "రాస్క్రెల్! నాన్నతో నా మీద నేరం చెబుతావా ఇంకోసారి ఇలా చేశావంటే ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి స్తాను ....."
    కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి మోహన్ కి _ శ్యామ్ కొట్టిన దెబ్బకి కాడు అక్కడి నుండి వెళ్ళిపొతే తన అవస్థ తలచుకుని ......
    వెళ్ళాలనే ఉద్దేశం మోహన్ కి కానీ, పంపేయ్యాలనే ఉద్దేశ్యం శ్యామ్ కి కానీ లేకపోవటం వల్ల ఆ ప్రస్తావన అక్కడితో ఆగిపోయింది.
    ఒకరోజు శ్యామ్ , మోహన్ బడి నుంచి వస్తోంటే ముందు ఒక ఆడపిల్ల నడిచివెళ్తోంది. ఆ పిల్ల తెల్లటి పరికిణీ కట్టుకుంది . ఆ పరికిణీ మీద రెడ్ ఇంక్ పెన్ విదిలించాడు శ్యామ్ . అంతటితో ఆగక ఫ్రెండ్స్ కందరికీ చూపించి అల్లరిచేసినవ్వాడు. ఆ పిల్ల బాధపడి వాళ్ళ అన్నకు చెప్పింది ఆ అబ్బాయి శ్యామ్ మీదకు వచ్చాడు. శ్యామ్ భయపడి "మోహన్"!" అన్నాడు.
    మోహన్ వెంటనే కదలలేక పోయాడు. శ్యామ్ చేసింది తప్పు _ అతడు దెబ్బలు తినవలసిందే _ అనిపించి౦ది.
    "మోహన్!" అన్నాడు శ్యామ్ మళ్ళీ ఆజ్ఞాపిస్తున్నట్లు ఏదోశక్తి తనను ముందుకు తోసినట్లు వెళ్ళి ఆ పిల్ల అన్నాను చావబాదాడు మోహన్, ఆ రోజు రాత్రి మొదటిసారిగా విచిత్రమయిన అశాంతికి లోనయ్యాడు మోహన్, అంతకు ముందేన్నడూ ఆకలితో మాడినప్పుడూ , అవమానాల పాలయినప్పుడూ కూడా అలాంటి అశాంతి కలుగలేదు.
    శ్యామ్ ఎలాగో కాఫీలు కొట్టి పదోక్జ్లాస్ పాసయ్యాడు కాని ఇంటర్ దాటలేకపోయాడు. శ్యామ్ ఫెయిలయి తను పాసయితే జనార్ధన్ తానను బి.ఏ , చదివిస్తాడో, చదివించడో, అనుకున్నాడు కానీ జనార్ధన్ మోహన్ ను చదివించాడు . "నీకు చదువులో ఆసక్తి, తెలివీ రెండూ ఉన్నాయి. చదువుకో! ఈ సారైనా శ్యామ్ పాసయ్యేలా చూడు!" అన్నాడు జనార్ధన్.
    అనుభవం నేర్పిన పాఠంతో అలాటిది అసంభవమని చెప్పలేదు మోహన్ "అలా గేనండి" అన్నాడు వినయంగా.    
    మోహన్ డిగ్రీ తీసుకునే సరికి అతి కష్టం మీద శ్యామ్ ఇంటర్ పాసయ్యాడు. అప్పటికీ జనార్ధన్ డి.జి. ఐ. అయ్యాడు జనార్ధన్ సహకారంతోనే మోహన్ సి.ఐ.డి ఆఫీసర్ అయ్యాడు.              
    "మీకు నా కృతఙ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్ధం కావటం లేదు ......" అన్నాడు మోహన్ నిజంగా కదిలిపోతూ.
    "శ్యామ్ ను సొంత తమ్ముడిలా చూసుకో! వాడికి అన్నివేళలా అండగా ఉండు నిజానికి ఇందుకే నేను నీకు సాయం చేశాను"
    "అది మీరు చెప్పాలా? శ్యామ్ నాకు తమ్ముడికంటె ఎక్కువ. శ్యామ్ ను ఏసహాయం చెయ్యాలన్నా నేను సిద్ధమే!" అన్నాడు మోహన్.
    ఆ మాటలు మనస్పూర్తిగానే అన్నాడు. ఆ వాగ్ధానం చెల్లించుకోవటానికి తను చెల్లించ వలసిన మూల్యమెంతో అతనికి అ ఆతరువాత కాని తెలియలేదు.
    మోహన్ చాలా స్ట్రిక్ ఆఫీసర్ గా పేరు సంపాదించుకున్నాడు. అందరూ అతణ్ణి గౌరవంతో చూసేవారు. సబార్జి నెట్స్ భయభక్తులతో ఉండేవారు.
    ఒక క్లబ్ లో గేంబ్లీంగ్ సాగుతోందని విన్నాడు మోహన్. అకస్మాత్తుగా రైడ్ చేశాడు. అక్కడ శ్యామ్ ను కూడా అరెస్టుయ్యాడు.
    ఆ రోజు జనార్ధన్ "శ్యామ్ అరెస్టుయ్యాడా!" అన్నాడు. "అవునండీ" అన్నాడు మోహన్ తలవంచుకుని బాధ పడుతూ .
    "వాడు విడుదల అయ్యేలా చూడు." దిగ్గున తలెత్తాడు మోహన్ ఆశ్చర్యంగా చూస్తూ, జనార్ధన్ పేలవంగా, నవ్వాడు.
    "అధికారం మన చేతుల్లో ఉన్నప్పుడు రూల్స్ ఎలా గైనా సర్దుకోవచ్చు _ మనవాళ్ళను మనం ఆదుకోకపొతే ఎలా? నాకు శ్యామ్ ఒక్కడే కొడుకు. వాడి మీదే నా పంచప్రాణాలు. ఈ విషయం నలుగురికీ తెలసి అల్లరి కాకా ముందు శ్యామ్ బయటపడేలా చూడు."
    "శ్యామ్ బయట పడ్డాడు.
    లోకమంతా తనను చూసి ఘొల్లున నవ్వినట్లయింది మోహన్ కి. అందరూ తననే వేలెత్తి చూపుతున్నట్లు అనిపించేది. మానసికంగా ఘోర నరకం. అనుభవించాడు వరం రోజుల వరకు ఎవరిముందు వంచిన తల ఎత్త లేక పోయాడు.
    అ తరువాత శ్యామ్ కారణంగా అప్పుడప్పుడు ఇలాటి నరకం అనుభవించటం తప్పనిసరి అయిపోయింది మోహన్ కి.
    ఇప్పుడు రేఖ ప్రక్కన శ్యామ్ ను చూసేసరికి గుండె ఝల్లుమంది . ఎలా శ్యామ్ ను రేఖ నుండి విడదీయటం? తను చెపితే వినడు!

 Previous Page Next Page