Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 5

               
                                      3

    చిరంజీవిని కలుసుకోవాలనుకున్నాడు మోహన్. తనుసాదారణంగా సాయంత్రం వేళ పబ్లిక్ పార్కులో ఉంటానని చెప్పాడు. చిరంజీవి. అక్కడ సాయంత్రం చాలామంది స్టూడెంట్స్ పోగవుతారు, వాళ్ళతో ఉంటానన్నాడు. అందుకే పార్కుకి వచ్చాడు. చిరంజీవి కోసం వెతుకుతోన్న మోహన్ చూపులు ఒకచోట ఆగిపోయాయి.  రేఖతో కబుర్లు చెబుతూ కులాసాగా నవ్వుతున్నాడు శ్యామ్. మోహన్ ను చూడగానే ఒక్కక్షణం గతుక్కుమన్నాడు. మరుక్షణమే తేరుకున్నాడు. ధైర్యంగా నవ్వుతూ "హాలో! మోహన్!" అన్నాడు.
    ఆ నవ్వు వెకిలిగావుంది. డాబుగావుంది. అపాలజిటిక్  గా లేకపోలేదు. కానీ, అంతకు మించి అధికారికంగా వుంది.
    రేఖ ఆశ్చర్యంగా శ్యాం ను చూస్తూ "అయన నీకు తెలుసా?" అంది.
    "ఆ! మా అన్నయ్య!" గొప్పగా అన్నాడు శ్యామ్. రేఖ ఒక చెయ్యిమీద వెనక్కీ వొరిగి విలాసంగా నవ్వుతూ "ఇతను మీ తమ్ముడా?" అంది.
    ఆ మాటలలో మాటలకందని మనసును తాకే వేటకారం వుంది.
    మోహన్ సమాధానం చెప్పకుండా గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు. 'ఇతను నా తమ్ముడు కాదు' అని మాత్రం అనలేకపోయాడు.
    శ్యామ్ తనను అన్నగా చెప్పుకుంటే బాగుండునని మోహన్ ఎంతో తపించిపోయిన రోజులెన్నో ఉన్నాయి. కానీ, ఆ రోజుల్లో ఒక్కసారికూడా శ్యామ్ తన నోటితో తను మోహన్ ను అన్నగా ఎవ్వరికీ పరిచయం చెయ్యలేదు. అసలు మోహన్ మనసులో తపన శ్యామ్ అర్ధమైందో, లేదో? శ్యామ్ లాంటి వ్యక్తులు మాటలు మాత్రమె వినగలరు. వాటి వెనకవున్న ప్రాణాన్ని అర్ధం చేసుకోలేదు. వికసించిన సృష్టిలో రంగులు మాత్రమె చూడగలరు __ ఆ వెనుక వున్న పరిమళాన్ని ఆస్వాదించలేరు.
    మోహన్ కు తను ఎవరికీ పుట్టాడో తెలియదు. కానీ ఎందరెందరి దయాభిక్షమీద పెరిగాడో తెలుసు. ఆ దయ వెనకాల ఉన్న స్వార్ధం తెలుసు. ఆ స్వార్ధం వెనుక బుసలుకొట్టే క్రౌర్యం తెలుసు. ఎలా కలిగిందో, ఏమైనా చదువుకోవాలనే పట్టుదల మాత్రం కలిగింది. ఆ రోజు స్కూల్ లో శ్యామ్ ను చిన్నవాడ్ని చేసి నిష్కారణంగా నలుగురు పెద్దవాళ్ళు చావా కొడుతున్నారు. మోహన్ చూడలేక పోయాడు. అడ్డుకున్నాడు. ఏ ప్రాణికి కావలసిన రక్షణ ఆ ప్రాణికి ఏదో ఒక విధంగా అందిస్తుంది ప్రకృతి . అందుకే ఒకపూట తిని మరోఇక పూట తినక గాలికి పెరిగే మోహన్ ముందు నిలవకపోయారు. శ్యామ్ కొడుతున్న వాళ్ళు చూశాడు _ తన కెరియర్ విప్పుకొంటూ "నీ కేరియన్ కూడా తెచ్చుకో" అన్నాడు.
    "నాకు కెరియర్ లేదు. మధ్యాహ్నం అన్నం తెచ్చుకోను!" అన్నాడు మోహన్.
    శ్యామ్ మోహన్ సంగతులన్నీ తెలుసుకున్నాడు. తన అన్నంలో సగం మోహన్ కు పెట్టాడు.
    ఆ సాయంత్రం మోహన్ ని తనతో ఇంటికి తీసికెళ్ళాడు.
    ఆ ఇల్లూ, ఆ వాతావరణమూ, స్వర్గలోకంలో అడుగు పేట్టినట్లు అనిపించింది. తండ్రి రాగానే "నా క్లాస్ మేట్ నాన్నా!" అని పరిచయం చేశాడు శ్యామ్.
    మోహన్ ఆకారాన్ని చూసి ముఖం చిట్లించుకున్నాడు జనార్ధన్. శ్యామ్ జరిగింది చెప్పగానే మోహన్ ను చూసి అదరపూర్వకంగా నవ్వాడు అందుకే పొంగిపోయాడు మోహన్. శ్యామ్ కు చిన్న తనంలోనే తల్లిపోయింది . జనార్ధన్ మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. "నువ్వు ఇవాళ ఇక్కడ ఉండిపో!" అన్నాడు శ్యామ్ . మోహన్ సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ రోజు శ్యామ్ తో కలసి డైనింగు టేబుల్ మీద కూరలతో పచ్చళ్ళతో, భోజనం చేస్తోంటే తన ఒళ్ళు తనకు తెలియ లేదు మోహన్ కు. 'ఎప్పుడూ ఇలా గడిచిపొతే .....' అనుకున్నాడు. గడవదని గ్రహించి నిట్టూర్చాడు.
    ఆ రాత్రిపుస్తకం తెరవకుండా పక్కమీద పడుకున్న శ్యామ్ ను చూసి "రేపు ఇంగ్లీషు టెస్ట్ కదూ! చదువు కోవూ!" అన్నాడు మోహన్.
    "అబ్బా! నాకు దెబ్బలు తగిలాయి __ చదవలేను" విసుగ్గా అన్నాడు శ్యామ్.
    "పోనీ! నేను చదువుతాను వింటావా?"
    "చదువు ........"
    మోహన్ ఉత్సాహంగా చదివి తనే వివరించి కూడా చెప్పాడు. అదీ ఒక ఆటలాగే ఉంటే శ్రద్ధగా విన్నాడు శ్యామ్.
    ఆ మరునాడు శ్యామ్ బడికితయారవుతోంటే మోహన్ కూడా కూడా వుండి పుస్తకాలదించి , పెన్ లో ఇంక పోసి సహాయపడ్డాడు. ఈ అనుభవం శ్యామ్ కి చాలా హాయిగా వుంది.
    "నాన్నా! మోహన్ ని మన దగ్గరే ఉంచేసుకుందాం! పాపం, అతని కెవరూలేరు" అన్నాడు శ్యామ్.
    జనార్ధన్ ఒక్కక్షణం ఆలోచించి "సరే!" అన్నాడు పట్టరాని ఆనందంతో జనార్ధన్ కాళ్ళకు నమష్కరం చేశాడు మోహన్. చటుక్కున కలలను వెనకు తీసుకున్నాడు జనార్ధన్ అతనికి కొంచెం సిగ్గుకూడా వేసింది జనార్ధన్ మోహన్ ని తమ ఇంట్లో ఉంచుకోవడంలో వున్నది. ఔధార్యన్ని మించిన స్వార్ధం ఉంది . అతడు పోలీస్ ఆఫీసర్. మనుషుల్నీ నిశితంగా పరిశీలించి వాళ్ళ స్వభావాలు అంచనా ప్రదర్శించిన అణుకువ అయన దృష్టిని ఆకట్టుకుంది. రాత్రి మోహన్ తెలివి తేటల్లో ఆయనకు నమ్మకం కుదిరింది. ఎన్నడూ తనంతట తను శ్రద్ధగా చదవని శ్యామ్ ఏ ట్యూషన్ మాస్టర్ కీలొంగని శ్యామ్ __ మోహన్ చదువుతుంటే శ్రద్ధగా వినడం కూడా గమనించాడు. ఒక వయసులో పిల్లలకు పెద్దవాళ్ళకంటె, ట్యూషన్ మాస్టర్లకంటె శ్నేహితులే ఎక్కువగా చెప్పగలరు. మోహన్ అనాధ కావచ్చునేమో కాని అలాగా పిల్ల వాడిలాలేడు. చదువుకోవాలానే పట్టుదలా , చదువులో ఆసక్తీ, చదివినది గ్రహించి చెప్పగల చురుకుదనమూ కూడా కనిపిస్తున్నాయి. తల్లిపోయాక శ్యామ్ను ఇంట్లో సరిగ్గా అదుపులో పెట్టేవాళ్ళు లేకపోయారు. ఒక ముసలావిడ ఉంది కాని ఆవిడ మాట శ్యామ్ వినడు. ఎప్పుడూ పనిలో మునిగితేలే జనార్ధన్ శ్యామ్ సంగతి సరిగ్గా పట్టించుకోలేక పోతున్నాడు. ఇలాంటప్పుడు శ్యామ్  కు మోహన్ లాంటి స్నేహితుడు ఇంటోనే వుండటం మంచిదనుకున్నాడు జనార్ధన్ . శ్యామ్ ఇంట్లో ఉండిపోవటం పరమానదంగా వుంది మోహన్ కు.
    "నా అబట్టలు ఇస్రీ చెయ్యి" "నా పుస్తకాలు సర్దు" __ "ఆ టిఫిన్ ఇలా పట్రా" _ అని శ్యామ్ ఆజ్ఞాపించటం మోహన్ కు కష్టమనిపించలేదు. అతడు ఇంతకు మించిపోయిన ఈసడింపులు తిన్నాడు. పట్టెడు మెతుకులకోసం ఇంతకు మించినబండ చాకీరీ చేశాడు.

 Previous Page Next Page