"మీకాశ్రమ అక్కర్లేదు...... నేనే వెళుతున్నాను"
"నేను ప్రాక్టికల్ మనిషిని......"
టక్కున ఆగేడా యువకుడు
"అర్ధమైంది చీఫ్ మినిష్టర్ ...... బఫూన్లురాజకీయ నాయకులై విద్యాధికుల్ని శాసిస్తున్న రాజ్యంలో మీరింతకన్నా ఎక్కువగా ఆలోచించలేరని యిందాకే తెలిసింది..... నేనూ సిద్దంగానే వున్నాను..... గుర్తుంచుకోండి నా పేరు త్యాగి"
అది ఛాలెంజ్ కాదు.....
కత్తిని మించిన పదునైన కలం గల ఓ జర్నలిస్టు ప్రదర్శిస్తున్న ఆత్మా విశ్వాసం.
ప్రెస్ కాన్ ఫరెన్స్ అర్దాంతరంగా ముగిసిపోయింది.
బయటకువచ్చి మోటార్ బైక్ స్టార్ట్ చేయబోతుంటే పలుకరించా రెవరో
"హలో"
పక్కకి చూశాడు.
"ఐయామ్ లిజి....... టైమ్సాఫ్ ఇండియా రిపోర్టర్ ని"
"నైస్ టు సీయూ ......"
'మీరింతగా ఆవేశంగా మాట్లాడాల్సిందికాదేమో"
రెండుపదుల వయసున్న లిజీ బాబ్డ్ హెయిర్ ని సవరించుకుంటూ నిదానంగా అడిగింది.
"మీరువస్తున్నది ప్రెస్ కాన్ ఫరెన్స్ నుంచేనా?"
అవాక్కయిందామే" అంటే పరిసరాల్ని గమనించడం మీకు అలవాటు లేదనుకుంటాను."
"వచ్చినపని అందుక్కాదు కాబట్టి అవసరం పడలేదు"
ప్రొఫెషన్ మాట అటుంచితే ఓ వయసులో ఉన్న అందమైన అమ్మాయితో మాట్లాడుతున్నాననే స్పృహ కనిపించడం లేదతడిలో.
"ప్రొఫెషన్ లోకి కొత్తగా వచ్చారనుకుంటాను"
జవాబుచెప్పలేదు త్యాగి.
"కాబట్టే ముఖ్యమంత్రి రాజారాం గురించి అంతగా మీకు తెలిసినట్టులేదు"
అతను ప్రశాంతంగా చూస్తున్నాఅతడి చూపుల్లో నివాడి కాస్త యిబ్బందిగా అనిపించింది.
"ఇలా అంటున్నందుకు మరోలా అనుకోకండి"
"ఫర్వాలేదు...... ఏం చెప్పాలనుకున్నదీ వరుసగా చెప్పేయండి"
"మీరుపనిచేసే పత్రిక మీద ఆయనకి సదభిప్రాయంలేదు"
"ఐసీ......"
త్యాగి అంత ఈజీగా తీసుకోవటం ఆమెకు నచ్చలేదు.
"పూర్వం ఆ పత్రిక రిపోర్టర్ కూడా ఇలా దురుసుగా ప్రవర్తించి ఆ తర్వాత ఓ ఎక్సిడెంట్ లో చనిపోయాడు.
"థాంక్యూ"
"దేనికి?"
"నన్ను మరో యాక్సిడెంటు నుంచి రక్షించాలనుకుంటున్నందుకు"
"అదికాదు ....."
"న్యూయార్క్ రోడ్స్ కూడా చాలా రద్దీగా వుంటాయి"
హఠాత్తుగా న్యూయార్క్ రిఫరెన్సేమిటో ఆమెకు బోధపడలేదు.
"అయినా అక్కడ నేనే ప్రమాదానికీ గురికాలేదు"
అప్రతిభురాలై అడిగింది "న్యూయార్క్ లో ఏం చేసేవారు?"
"న్యూయార్క్ టైమ్స్ పత్రిక రెస్పాడెంట్ గా వుండేవాడ్ని"
"సారీ"
"దేనికి?"
"మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినందుకు"
"అంటే ఇప్పుడు ఏక్సిడెంట్ అయ్యేఅవకాశం లేదంటారా?"
"అలా అని కాదు....."
"యూసీ మిస్ లిజీ" ప్రసన్నంగా అన్నాడు "బ్లాక్ మార్కెటీర్స్, స్మగ్లర్సూ, వీధి కాలనుకున్న ఓ వ్యక్తి ప్రమాదాలకి దూరం యీదేశంలో నిజాయితీగా బతకాలనుకున్న ఓ వ్యక్తి ప్రమాదాలకి దూరం కాలేడు...... ఆ విషయం నాకూ వర్తిస్తుంది"
"మరి తెలిసీ ....."
"చిన్న ప్రశ్న......"
"అడగండి"
"ఇప్పుడేచెప్పనక్కర్లేదు....."
మరోసారికలిసే సూచన్ని అతడలావ్యక్తం ఆమెకూ సంతోషం కలిగించిందేమో "అడగండి"
"బాగాబిజీగా ఉన్న రోడ్డుమీద మీరు నడుస్తుండగా అందంగా అలంకరించుకున్న ఓ వ్యక్తి మిమ్మల్ని సమీపించాడు"
ఆమె ఆసక్తిగా వింటూంది.
"సభ్యతగా మిమ్మల్ని పలకరించి తన పర్సు పోయింది కాబట్టి తన వూరు వెళ్ళడానికి టిక్కెట్టు కొనుక్కోడానికి పది రూపాయలు సహాయం చేయమన్నాడు.....
సరిగ్గా అదే సమయంలో జవసత్వాలుడిగిన ఓ భిక్షగాడు మీ దగ్గరకు వచ్చిన తమమనవడు జ్వరంతో బాధపడుతున్నాడని పది రూపాయలు దానంచేసి డాక్టర్ దగ్గరకుతీసుకెళ్ళే సహాయంచేయమని అర్ధించాడు ఎవరో ఒకరికో సహాయంచేయాలనుకున్నారు. ఆలాంటప్పుడు మీ రెవరికి పదిరూపాయలిస్తారు?"
సులభంగానే అనిపించినా ఏదో మెలికవున్నట్టనిపించింది.
"తర్వాత చెప్పండి మిస్ లిజీ..... సీయూ" బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆమె చూస్తుండగానే.
తేరుకోలేకపోయింది చాలా సేపటి దాకా .....
ఎందుకో.......
తనూ ఆ వృత్తిలో ఉన్న దైనా ఎందుకో అతడ్ని చూస్తుంటే భయమనిపించింది.
కారణం ముఖ్యమంత్రిగురించి, అతడి అనుచరుల ప్రాక్టికాలిటీ గురించి బాగా తెలుసు కాబట్టి.
ఆమె ఊహ తప్పుకాలేదు.....
నలభైఅయిదేళ్ళ వయసుకే బ్లాక్ మార్కెటీర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థానానికెదిగిన రాజారాంగారు ఆ క్షణంలో ఆలోచిస్తున్నది అసమ్మతి వర్గంగురించి.
కాదు........
యుద్దానికి సన్నద్దమవుతున్నట్టు కనిపించిన త్యాగి గురించి.......
* * *
"బాస్టర్డ్"
మరో ఫ్లవర్ వాజ్ ని నేలపై విసిరికొట్టాడు బ్రహ్మాజీ.
అసహనంతో అతడి బట్టలు తడిసిపోతున్నాయి, అప్పటికి ఏడు పెగ్గులు తీసుకుని స్థిమితంగా వుండలేకపోతున్నాడు.
సూర్యుడుఅస్తమించి గంటయింది. అతడి ముందున్న యీవెనింగ్ ఎడిషన్ రిలీజైగంటన్నరయింది. అందులో కొత్తగా ఏర్పడిన మంత్రివర్గానికి చెందిన జాబితావుందికాని బ్రహ్మాజీపేరు లేదు.
నిజానికి తన పేరు ఉండదేమో అని ఉదయమే అనిపించింది...... అయినా ఏదో ఆశ ......
ఇప్పటికి మూడు విడతలుగా అధికార పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైనా గుడిసెల సంఘాలకూ, కార్మికవర్గాలకే నాయకుడిగా నగరంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఒక్కసారీ మంత్రిపదవినిచేపట్ట లేకపోయాడు.