Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 6

వికాలంగుల పాఠశాలకి ఇరవై వేలు విరాళమిచ్చారని అనగానే అణువేద ముఖంలో అప్రసన్నత చాలా వరకు తగ్గింది.
"లోపలికి రండి" మర్యాదగా ఆహ్వానించింది. వాళ్ళిద్దరూ కూర్చోగానే కౌసల్య సేపు చూసింది. ఆ అమ్మాయి కాలింగ్ బజార్ నొక్కి వెయిటర్ రాగానే మూడు కప్పుల కాఫీ ఆర్డరు చేసింది.
"న పేరు జీవన్. నాకు డాన్సు గురించి పెద్దగా ఏం తెలియదు. కాని ఈ రోజు మీ అభినయం చూసిన తరువాత యీ లోకంలో కళలన్నిటిలో నృత్యకళ చాలా గొప్పదనిపించింది." తన్ని తను పరిచయం చేసుకుంటూ చెప్పాడు జీవన్.
"థెంక్సు!" జీవన్ కళ్ళలో రాజసంతో పాటు కొంత పసితనం కూడా వుండటం గమనించింది అణువేద. ప్రతి చిన్నదానికి బోలెడంత ఉత్సాహపడిపోతాడు. పెద్దగాలి బెలూన్ చూసిన చిన్నపిల్లాడిలా కళ్ళు పైకెత్తి వింతగా చూస్తాడు.
"మీరు హైదరాబాదు ఎప్పుడైనా వస్తారా?"
"మాది హైదరాబాదే. మా అమ్మమ్మగారు భువనేశ్వర్ లో వుంటారు. నేనెక్కువగా హైదరాబాదులో వుంటాను."
సన్నగా విజిల్ వేశాడు జీవన్ వెంటనే తప్పు చేసి దొరికిపోయిన చిన్నపిల్లాడిలా నాలిక్కరుచుకున్నాడు. సిగ్గుపడుతున్న ఆడపిల్లలా అతని మొహం ఎర్రగా కందిపోయింది. నవు అపుకుంది అణువేద.
"నేను హైదరాబాద్ తరచుగా వస్తుంటాను. క్రికెట్ మ్యాచ్ కోసం. లాల్ బహుదూర్ స్టేడియంలో అడుతుంటాను సాధారణంగా రెడ్డి హొటల్ లో బస చేస్తుంటాను. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకోవచ్చా?" వెంటనే సమాధానం చెప్పలేక పోయింది అణువేద. ఈ విధంగా పరిచయాలు పెంచుకోవడం అమెకిష్టం ఉండదు. అభిమానులంటూ వచ్చిన వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తే యింటిముందు పెద్ద క్యూ ఏర్పడిపోతుందని ఆమెకి బాగా తెలుసు. ఆమె పిన తండ్రి యీ విషయంలో ఎప్పటికప్పుడు ఆమెని హెచ్చరిస్తూనే వుంటాడు.
"ప్లీజ్!" అన్నాడు ప్రాధేయపడుతున్నట్లు.
"జీవన్ కుటుంబంతో నాకు మొదటినుంచి పరిచయముంది. తాత ముత్తాతల కాలం నుంచి కవులని కళాకారులని యెంతో పోషించింది. ఆ వంశం. జీవన్ సాధారణంగా ఆడపిల్లల వెంట తిరిగే పోకిరి అబ్బాయి కాడు. వికలాంగులైన పసివారి కోసం నిస్వార్ధంగా నువు యిచ్చిన ప్రోగ్రాం చూసి నువంటే గౌరవం పెంచుకున్నాడు."
 అతని స్నేహాన్ని రికమెండు చేస్తున్నట్లు చెప్పింది హైమ.
జీవన్ చటుక్కున కుర్చిలోంచి ముందుకు వొంగి,
"మా చల్లపల్లిలో మీ డాన్సు ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే వస్తారా?" అని అడిగాడు.
"ఎందుకు రాను ఇటిజ్ మై ప్రొఫెషన్.
"అయితే ఆర్కెస్ట్రాకి ప్రత్యేకించి రెండువేలు మేమంతా ప్రత్యేకంగా ఒక వేన్ లో వస్తాము. వేన్ చార్జీలు యిచ్చుకోవాలి. నా పారితోషకం....."
"అంతా కలిసి పదివేలిస్తాను సరిపోతుందా! ఇంకా ఎక్కువకావాలన్నా ఇస్తాను.
డబ్బు గురించి ఆలోచించకండి దేవుడు మాకేదో యింత ఇచ్చాడు."
"ఇంతకీ డాన్సు ప్రోగ్రాం యే సందర్భంలో? ఏ శ్రీరామనవమి త్సవాలలో కాదు కదా!"
"కాదు...కాదు" చటుక్కున అనేశాడు. అసలు డాన్సు ప్రోగ్రాంలు ఏ సందర్భాలలో ఏర్పాట్లు చేస్తారో ఎవరు చేస్తారో అతనికి యేమి తెలియదు. అప్పటికప్పుడు ఆలోచిస్తూ, "మా వూళ్ళో కొత్తగా ఒక మహిళాసమాజం పెట్టారు. అక్కడ మీ ప్రోగ్రాం ఏర్పాటు చేయిద్దామని" అన్నాడు.
"మహిళా సమాజ కార్యకర్తలలో ఎవరన్నా మీకు తెలుసా? మరోసారి ఖంగారు పడిపోయాడు జీవన్. అతడు మహిళా సమాజం యేర్పాటు చేశారని ఎవరో అంటుంటే విన్నాడే తప్ప అది ఎక్కడుందో కూడా తెలియదు జీవన్ తడబడుతూ.
"వాళ్ళెవరు నాకు తెలియదు. ఆడవాళ్ళకి కాస్త సహాయం చేద్దామని ఆలోచనతో అడుగుతున్నానంతే" అతడు చాలా అనాలోచితంగా మాట్లాడుతున్నాడని అర్ధమైంది అణువెదకి. నవు అపుకుంది.
"మీరు అన్నీ ఆలోచించుకొని నాకు ఉత్తరం వ్రాయండి. నాకు అనుకూలమైన డేట్ తెలియపరుస్తాను దాని ప్రకారం ప్రోగ్రాం ఏర్పాటు చేద్దురు గాని."
"థెంక్యూ! థెంక్యూ వెరిమచ్" చాలా ఉత్సాహంగా అన్నాడు. కాని అణువేద ముఖంలో అతనికి కావలసిన రెస్పాన్సు కనిపించలేదు.
"మీ ఎడ్రస్" అడిగాడు అణువేదని. అణువేద కౌసల్య వేపు చూసింది. కౌసల్య బ్రీఫ్ కేస్ తెరచి హ్యాండ్ బాగ్ లోంచి అణువేద విజిటింగ్ కార్డు తీసి జీవన్ కి అందించింది.
జాగ్రత్తగా తన షర్టు జేబులో పెట్టుకున్నాడు దాన్ని. ఇహ వెళ్ళమన్నట్టు లేచి నిలబడింది అణువేద. హైమ అర్ధం చేసుకుని తను కూడా లేచి, "ఇక వెళతాం" అని చేతులు జోడించింది. లేవక తప్పలేదు జీవన్ కి. అతని కళ్ళల్లో అణువేద పట్ల ఆకర్షణ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పెద్దగా పట్టించుకోలేదు అణువేద. ఈ రకమైన ఎడ్మిరేషన్ ఆమె చాలామంది కళ్ళల్లో చూసింది. ఆమె డాన్సర్. అంచేత పదిమంది కళ్ళల్లో పడక తప్పదు. అంచేత మిగిలిన వాళ్ళకంటే మరింత జాగ్రత్తగా వుండాలి.
పదిహేనురోజుల తరువాత హైదరాబాద్ ఎడ్రసు జీవన్ దగ్గిర నుంచి ఉత్తరం వచ్చింది. అణువేదకి" ఆమెకి వీలైన డేట్ తెలియపరిస్తే చల్లపల్లిలో డాన్సు ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామని" జీవన్ విషయం అప్పుడే మరిచిపోయింది. అణువేద డాన్సు ప్రోగ్రాం వగైరా మాటలన్నీ కేవలం తనతో మాట్లాడటానికి జీవన్ కల్పించుకున్న అబద్దాల కారణాలకునుకోంది. ఇపుడు ఉత్తరం చూశాక అతడి నిజాయితీతో కాస్త నమ్మకం కలిగింది. అనుకూలమైన డేట్ తెలియజేస్తూ ఎడాన్సుగా డబ్బు పంపమని వ్రాసింది. తిరుగు టపాలో ఐదువేలకి డ్రాప్ట్ ఆహ్వానము వచ్చేసాయి. తన డాన్సు ట్రూపుతో స్పెషల్ వేన్ లో బయలుదేరింది అణువేద. వేన్ చల్లపల్లి పొలిమేరల్లోకి వచ్చేసరికి తన మారుతి కారులో రెడీగా వున్నాడు జీవన్.
"రండి! మిమ్మల్ని మా బంగాళాకి తీసుకెళ్తాను." అని ఆమెని తన కారులో ఆహ్వానించాడు అణువేద వేన్ దిగలేదు.
"మీరు ముందు గైడ్ చెయ్యండి మేము వేన్ లో మీ కారు ఫాలో అవుతాము" అంది.
జీవన్ ముఖంలో స్పష్టంగా కనిపించిన ఆశాభంగం అణువేదకి ఆనందాన్నే కలిగించింది. తను ఈ జమిందారీ మెరుపులకి భ్రమసిపోతానని అతడు అనుకోకూడదు వేన్ మారుతి ఫాలో అయింది. మహల్ "బీస్ సాల్ బాద్" మొదలైన సినిమాల్లో లాంటి పాతకాలపు బంగాళా ముందు కారాగింది. వేన్ లోంచి దిగిన అణువేదకి ఆ బంగాళా చూడగానే భయంతో గుండె గుభిల్లుమంది పెచ్చులు రాలిపోతున్న గోడలు, వార్నిషులు వెలసిపోతున్న దార బంధాలు, ఎత్తైన స్తంబాలు, వాటికీ మధ్య విరిగిపోయిన నగిషీలు భయంతో కళ్ళప్పగించి అణువేద చూస్తుండగా లోపల్నించి ఏదో తెల్లని ఆకారం చేతులూపుకుంటూ వచ్చింది. కేవున కేక పెట్టింది.
"భయపడ్డారా?' నెమ్మదిగా వినిపించింది జీవన్ గొంతు బెదరినట్టు చూసి చిన్నగా నవ్వి "మొన్ననే ఏదో దెయ్యాల భూతాల సినిమా చూశాను. అందులో ఊరి చివరి పాడుబడ్డ బంగాళా గుర్తొచ్చి భయం వేసింది" అంది.

 Previous Page Next Page