Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 5

ఆ సాయంత్రం ఫోన్ వైపు భయంగా చూస్తూ కూర్చుంది. జీవన్  స్వభావం బాగా తెలిసిన ఆమె అతడు మళ్ళా తప్పకుండా ప్రయత్నిస్తాడని ఎదురు చూడసాగింది.

ఆమె అనుమానించినట్లే ఫోన్ మోగింది. ఫోన్ ఐదారు సార్లు రింగ్ అయ్యేవరకు ఫోన్ తియ్యకుండా కూర్చుంది. తరువాత నిగ్రహించుకోవటం ఆమె వశం కాలేదు. వొణికే చేతులతో ఫోన్ తీసి "హల్లో!" అంది అటువైపు నించి వినిపించిన గొంతు ఆ ఆశించినట్లు జీవన్ ది కాదు.

"నేనమ్మా! గిరీశాన్ని! గుర్తుపట్టావా?" అరిచాడు అటు వైపు నించి.

వెంటనే మాట్లాడలేకపోయింది. ఆ గొంతు జీవన్ ది కానందుకు తనకి కలిగిన ఆశాభంగానికి, తనే ఆశ్చర్యపోయింది. ఇంకా ఎంత ప్రేమిస్తోంది అతన్ని.

"ఏమ్మా! మాట్లాడవు నన్ను గుర్తు పట్టలేదా? మీ అయన స్నేహితున్ని మీ యింటికి రెండు మూడుసార్లు భోజనానికి కూడా వచ్చాను. ఇంట్లో పార్టీలు కుదరవని నువు విసుక్కున్నావు గుర్తొచ్చిందా?"

అతని మాటలకి నవొచ్చింది ఆమెకి మనషులు యింత కలగలుపుగా ఎలా వుంటారో.

ఇతడిలో అనేక లోపాలు ఆమెకు తెలుసు కాని యీ బోలతనంలో కుత్సితుడిలా కనిపించక కులాసా మనిషిలా తోస్తాడు. అతడు మాట్లాడుతున్నంత సేపూ అతని బలహీనతలు గుర్తురావు. నవులజల్లుల్లో ఎగిరిపోతాయి.

"గుర్తుంది ఏమిటి విశేషం? ఎక్కడ్నుంచి ఫోన్ చేస్తున్నారు?"

"హైదరాబాదు నుంచే ఒక ధర్మసంకటంలో పడ్డానమ్మా! నీ సలహా కావాలి."

"హైదరాబాదు నుంచి ఇక్కడికి ఫోను చేసి అందుకోవలసిన సలహా ఏమిటండి?"

"ఓ రహస్యం ఉంది. చెప్తే జీవన్ కి ద్రోహం చెసినట్లవుతుంది. చెప్పకపోతే ఒక ఉత్తమ యిల్లాలికి- అంటే నీకు అన్యాయం జరిగిపోతుంది. ఏం చెయ్యమంటావు?"

 అణులో ఉత్కంట పెరిగింది. జీవన్ తల్లి, అక్క అతణ్ణి బలవంత పెట్టి రెండో పెళ్ళికి వోప్పిస్తారేమో అనేదే ఆమె భయపడే విషయం.

"జీవన్ మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నాడా?"

"అయ్యాయ్యో! కాదమ్మాఇది అంతకంటే చాలా ఘోరమైన విషయం. చెప్పడానికే నోరు రావడం లేదు."

"చెప్పండి చంపక" భరించలేక విసుక్కుని గభాల్న నాలిక్కరుచుకుంది.

"నిన్ను చంపకుండా వుండటానికే ఫోను చేస్తున్నానమ్మా! నేని విషయం చెప్పకపోతే నువు నిజంగా చచ్చిపోయే ప్రమాదం వుంది."

మరోసారి చెప్పండి అని అడగలేదు అణు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని కూర్చుంది.

ఒక నిమిషం చూచి గిరీశం తనే చెప్పాడు.

మీ అయన నీ కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకురమ్మని ఒక గుండాని పంపాడు. అతడు చైల్డ్ రేపిస్ట్. విషయము ముందుగానే చెప్తే నీ జాగార్తలో నువు వుంటావని...."

అణుచేతిలో నించి రిసీవరు జారిపోయింది. అటువేపు నుంచి గిరీశం "హల్లో! హల్లో!" అని అరుస్తున్నా ఆమె పట్టించుకోలేదు. జీవన్ ఎందుకిలా వేధిస్తూన్నాడు తనని. అంత మహాపదాధంయేం చేసింది? ఆమె ఆలోచనలు పదేళ్ళు వెళ్ళాయి.

 అంగవైకల్యం కలిగిన శిశువులకు శిక్షణ యివటం కోసం నడుపుతున్న పాఠశాల అది, తిరుపతి దేవస్థానం వారి ఎడ్మినిస్ట్రెటివ్ ఆఫీసు పక్కనున్న బహిరంగస్థలంలో ఆ పాఠశాల సహాయార్ధం అణువేద నృత్య ప్రదర్శన ఇస్తోంది. విధివశాన శారీరక వైకల్యాలు వచ్చినా మానసికంగా చెదిరిపోకుండా రకరకాల వ్యాపకాలతో ఎంతో యాక్టివ్ గా కాలం గడువుతున్న పాఠశాలలో బాలబాలికలు అన్ని దశల వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళు టిచర్ల గైడెన్సు లో ముందు వరుసల్లో కూర్చున్నారు తెర వెనుక నుంచి లాల్ గుడి జయరామన్ తిల్లానా మంద్రస్వరంలో వినిపిస్తుండగా తెరపైకి లేచింది. భరతనాట్య భంగిమతో అణువేద సభకు నమస్కరించగానే సభలో కరతాళధ్వనులు మారుమ్రోగాయి. చక్కని అంగ సౌష్ఠవం , కధలు చెప్తున్నట్లనిపించే ఆకర్షనీయమైన నల్లని కళ్ళు , అపురూపమైన నృత్యాభినయం, పరవశించిపోయారు ప్రేక్షకులు.

మొదట తిల్లానా తరువాత త్యాగరాజు కృతి, తరువాత ఒక దేశభక్తి గీతం అభిన్యించింది. ప్రేక్షకులలో ప్రతి ఒక్కరి హృదయంలోను ముద్రితమై పోయాయి. ఆమె అభినయ భంగిమలు. ప్రదర్శన ముగిసిం తరువాత అలంకరణతోనే స్టేజి దిగివచ్చి వికలాంగులైన బాలబాలికలను ఒక్కొక్కరిని ప్రేమగా భుజంతట్టి పలకరించింది. పొంగిపోయాయి ఆ బేల మనసులు. ఉహల్లో వుండే స్వర్గాదిపత్యమేదో తమకు అబ్బినంతగా ఉప్పొంగిపోయారు. పెద్ద పెద్ద వెళ్లేందరో ఆమెను పలకరించాలని, ఆమెను ఆహ్వానించాలని ప్రయత్నించారు. కానీ ఆమె మాత్రం బాలబాలికలందరిని పలకరించే వరకు మరేవరిని తలెత్తి చూడలేదు. వికలాంగ బాలిబాలికలతో మాట్లాడటం పూర్తి చేసాక వాళ్ళ ముఖంలో చిరునవులను సంతృప్తిగా చూసుకున్నాక అపుడు తిరిగింది పెద్దలవైపు.

అక్కడ చేరిన వారిలో ప్రతిఒక్కరు తమ హొదాలు చాటుకోవడానికి రకరకాలుగా తాపత్రయపడుతున్నారు. బంగారు చైన్ వున్న ఖరీదైన ఫేవర్ లూ చేతిగడియారం ఒకడు పైకి కనబడేలా చెయ్యి జాపాడు. మెడలో రవల లాకెట్ వున్న గోల్డ్ చైన్ సిల్కు లాల్చిలోంచి బయట పడేసుకున్నాడు మరో పెద్దమనిషి పొందురు జారీ అంచు ఖద్దరు పంచె పైన అత్తాకోడళ్ళ జరి కండువాను దర్జాగా సర్దుకున్నాడొక ప్రజానాయకుడు.


    అణువేదకి అందరి ముఖాలు ఒకేలాగా కనిపించాయి. గాజు బొమ్మని చూసినట్టు అందరిని చూస్తూ చిరు నవుతో చేతులు జోడించి ఒకరికి తనతో మాట్లాడే అవకాశం యివ్వకుండా వచ్చి కారులో కూర్చుంది. కారు హొటల్ భీమాస్ చేరుకుంది.

అక్కడే ఆమె బస. తన గదిలోకి వెళ్లి వేషం మార్చుకుని స్నానం చేసి నిరాడంబరంగా తయారై చదువుకుంటూ కూర్చుంది. అన్నీ చోట్లా ఎల్లవేళలా ఆమెని కని పెట్టుకునుండే ఆమె ఎటెండరు కోసల్య తలుపు దగ్గర కూర్చొని ఆరోజు అణువేద అభినయించిన దేశభక్తి గీతం కూనిరాగాలు తీస్తోంది.

"లోపలికి రావచ్చునా?" వినిపించింది హైమవతి గొంతు.
చదువుతున్న పుస్తకం మూసేసి 'రా! నీ కోసమే యెదురు చూస్తున్నాను,' అంటూ గుమ్మం దగ్గరికి యేదురొచ్చి చటుక్కున ఆగిపోయింది అక్కడ. హైమపక్కన ఆజానుబాహువైన మరొక యువకుడున్నాడు. వేష భాషలు చూస్తే పాతకాలపు యువరాజావారిలా వున్నాడు. చుడిదార్ పైజమా, మోకాళ్ళు దిగిన పొడుగు చేతుల సిల్కు లాల్చి, రాజసం ఉట్టిపడే విశాలమైన కళ్ళు, ఆకర్షణియమైన చిరునవు.
హైమ వైపు చూసి మొహం చిట్లించింది. కంగారు పడిపోయింది హైమా. అణువేద మనసు ఆమెకు తెలుసు బస చేసిన చోటికి మగవాళ్ళని తీసుకు రావడం ఆమె కిష్టముండదు.


"సారీ! అణు! నీకు ముందుగా చెప్పకుండా తీసుకొచ్చేశాను. ఈయన ఒకప్పటి చల్లపల్లి జమిందారు గారి మునిమనుమడు. అద్బుతమైన క్రికెట్ ప్లేయర్ ఎం. ఎస్ సి. పాసైయ్యారు. మా పాఠశాలకి ఇరవైవేలు విరాళంఇచ్చారు. నిన్ను కలుసుకుని నీతో మాట్లాడుతానంటే తీసుకొచ్చాను." గబగబా చెప్పింది హైమా. హైమ వికలాంగుల పాఠశాలలో టిచరు అణువేదకి చిన్నప్పటి క్లాస్ మేట్, ఫ్రేండు.

 Previous Page Next Page