Previous Page Next Page 
భామ కలాపం పేజి 6

 

    వారం గడిచింది.


    డబ్బున్న అమ్మాయిలు చాలామందికి కట్టిన చిర మళ్ళీ కట్టాలంటే కనీసం నెలా, నెలా పదిహేను రోజులు తిరగాలి.

 

    సుదీర ఒకసారి కట్టిన చీర మళ్ళీ కట్టాలంటే కనీసం సంవత్సరం గడవాలి. తన వార్డ్ రోబ్ లో ఎప్పుడూ మూడొందల అరవై అయిదు డ్రెసెస్ కి తక్కువ కాకుండా మెయిన్ టెయిన్ చేస్తుంది.


    అలాగే ఇవాళ ఎక్కిన కారు వారం రోజుల దాకా ఎక్కదు సుదీర. ఏడు వారాల నగల లాగా ఆమె దగ్గర ఏడు కార్లు ఉన్నాయి.


    క్రితం ఆదివారం నాడు వాడిన ఫోర్డు కారు వంతు మళ్ళీ ఆదివారం నాడు వచ్చింది. ఈ వారం రోజుల నుంచి ఛోటూ డ్యూటీకి రావడం లేదు. ఇవాళే వచ్చాడు అతను. కుడిచేతికి బాండేజ్ ఉంది. జేగురు రంగులో రక్తం మరకలు ఉన్నాయి దానికి.


    "ఏమయింది?" అంది సుదీర.


    ఛోటూ ఏదో చెప్పడానికి నోరు తెరిచి అప్పుడే అక్కడికి వచ్చిన సారధి మొహంలోని హెచ్చరికను అర్ధం చేసుకుని, నోరు ముసేసుకున్నాడు.


    "కారుకి టైరు మారుస్తుంటే జాకి తగిలి గాయమయిందిట. ఛోటూ! నువ్వు రెస్టు తీసుకో. నేను అమ్మాయిగారిని తిసుకేళతాను" అని డోర్ తెరిచి, డ్రయివింగ్ సీట్లో కూర్చోబోయాడు సారధి.


    "వద్దు. నేను డ్రైవ్ చేయగలను. " అంటూ తనే చటుక్కున ఆ సీట్లో కూర్చుంది సుదీర.


    "సుదీరా!'

 

    "మిస్ సుదీరా అని పిలు!"

 

    మొహం గంటు పెట్టుకున్నాడు సారధి. "తోడు లేకుండా మీ రోక్కరే వెళ్ళారంటే మీ మమ్మీ డాడీ చాలా కోపగించుకుంటారు."

 

    "ఎవరి మీద?"

 

    కొంచెం సంకోచిస్తూ "నామీదే !" అన్నాడు సారధి.


    "సో! కోపగించుకోని......నాకేం?" అంటూ కారు స్టార్ట్ చేసింది సుదీర. రియర్ వ్యూ మిర్రర్ లో నుంచి ఎర్రబడిన సారధి మొహం కనబడుతోంది. అతను తన కోపాన్నంతా ఛోటూ మీదికి మళ్ళిస్తున్నాడు.


    కొద్ది క్షణాల తర్వాత గేటు దాటి , రోడ్డెక్కింది కారు. ఆ విధిలో అంతా బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్ళు! ప్రతి ఇంటికి చుట్టుతా బోలెడంత ఖాళి స్థలం. చాలా ఇళ్ళలో కిటికిలకి ఎయిర్ కండిషనర్స్ కనబడుతున్నాయి. రోడ్డుకి రెండువైపులా పెద్ద పెద్ద చెట్లు.


    కారు స్పీడు పెంచింది సుదీర.

 

    ఎక్కడినుంచో సన్నటి వాసన ఏమిటిది? పెట్రోలు లీక్ అవుతోందా? ఉహు! కాదు. ప్రేట్రోలు వాసన చాలా బాగుంటుంది. తనకి ఇష్టం. ఇదేదో చెడ్డ వాసన. కారుని అంటి పెట్టుకునే వస్తోంది.


    వాటిజ్ ఇట్.

 

    కారు మెయిన్ రోడ్డు మీదకి టర్న్ అయింది. టాప్ గేరు వేసి యాక్సిలెటర్ ని తొక్కి ఉంచింది సుదీర. గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో సౌక్యంగా జారిపోతోంది కారు. ఎడమ చేతితో స్టిరింగ్ పట్టుకుని, కుడిచేతిని విండో మీద ఆనించి డ్రయివ్ చేస్తోంది సుదీర.


    గాల్లో మెల్లగా తేలుతూ వచ్చి, ఆమె మెడ మీద పడింది ఏదో.


    తడుముకుని దాన్ని తీసేసింది సుదీర. ఏదో పక్షి ఈక.


    కాసేపటి తర్వాత మళ్ళీ మరో ఈక ఆమె బుగ్గని మృదువుగా స్పృశించి జారి ఒళ్లో పడింది.


    వారం రోజుల నుంచి ఛోటూ సెలవులో ఉండటం వల్ల కారుని ఎవరూ సరిగా తుడిచినట్లు లేదు. చిరకుపడుతూ ఆ ఈకను తీసి విండోలోంచి బయట పడేసింది.


    అలవోకగా క్లచ్ నొక్కి గబగబ స్టిరింగ్ తిప్పి కారుని లేప్టుకి టర్న్ చేసింది. గాలిని కోస్తున్నట్లు రోవ్వున బొంగరంలా తిరిగింది కారు. ఆ విసురుకి ఒక్కసారిగా పది ఈకలు ఆమె తలమీద, మేడమీద, భుజాల మీద పడ్డాయి. ఇంకో నాలుగు ఈకలు ఎగిరి మెల్లిగా డాష్ బోర్త్డుమీదికి దిగాయి.


    ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది.


    వెనక సీట్లో రెక్కలన్ని ఉడిపోయి చచ్చిపోయి పడి ఉన్న అదేమిటి?

 

    రామచిలుక!

 

    క్రితం ఆదివారం నాడు, భరత్ ఇంటినుంచి తిరిగి వచ్చాక సిల్వర్ మూతికి ఎర్రగా ఏదో అంటి ఉంటే నొకరు చేత స్నానం చేయించడం గుర్తు వచ్చింది.


    అంటే........

    ఆ భరత్ పెంపుడు చిలకని సిల్వర్ చంపి కార్లో పడేసిందా? గుడ్ గాడ్!


    'మా అన్నయ్య పంచ ప్రాణాలు ఆ చిలకలోనే ఉంటాయి' అని భారతి చెప్పడం గుర్తొచ్చింది. పై ప్రాణాలు పైనే పోయినట్లనిపించింది. తను ఆ రోజున తప్పు జరిగిందని క్షమార్పణ చెప్పడానికి వెళ్ళి , ఇంకొక తప్పు చేసి వచ్చిందన్నమాట!


    చటుక్కున తల ఎత్తి చూసింది సుదీర. తను తల తిప్పి వెనక సీట్లోకి చూస్తూ రాంగ్ సైడ్ వచ్చేసి రోడ్డుకి కుడివైపున డ్రైవ్ చేస్తోంది. ఎదురుగా వస్తున్న ఒక అంబాసిడర్ కారుని డాష్ కొట్టబోయి, కంగారుగా ఎడమచేతివైపుకి వెళ్ళిపోయింది.


    తప్పు దిద్దుకుని తను కూడా కారుని రోడ్డుకి ఎడమ వైపు తీసుకురాబోయింది సుదీర. అరక్షణం తర్వాత అంబాసిడర్ ని గుద్దేసింది. గలగలమని శబ్దం చేస్తూ అద్దాలు పగిలాయి. కీచుమని రోద చేస్తూ టైర్లు స్కిడ్ అయ్యాయి. లోహం చిరుగుతున్న శబ్దం.


    సుదీర కారు కంట్రోలు తప్పిపోయి , ఎదురుగా ఉన్న ట్రాఫిక్ ఐలాండ్ తాలుకు సిమెంటు దిమ్మను గుద్ది, ఆగింది.

    ట్రాఫిక్ ఐలాండులో నిల్చున్న కానిస్టేబుల్ భయభ్రాంతుడై పరిగెత్తి పేవ్ మెంట్ ఎక్కాడు.


    "షిట్!" అని విసుక్కుంటూ కారు దిగింది సుదీర. పరిశీలనగా తన కారుని చూసుకుంది. ఎక్కవ డామేజ్ కాలేదు. మడ్ గార్డ్ కొంచెం వంకరపోయింది. ఎడమ హెడ్ లైటు ఒకటి పగిలిపోయింది. రెండు చోట్ల పెయింట్ పోయి స్క్రాచెస్ పడ్డాయి.


    అంబాసిడర్ మాత్రం బాగా దెబ్బతిన్నది. తలుపు ఒకటి ఉడి కిందపడిపోయింది. దాన్లోనుంఛి కోపంగా దిగాడు ఒకాయన. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. తెల్లగా నెరసిపోయిన దుబ్బు జుట్టు - తల మీద దుది అతికించినట్లు కనబడుతోంది. స్టిరింగ్ తగిలి, నుదుటి మీద బొప్పి కట్టింది.


    కిందపడిపోయిన పైపుని తీసుకున్నాడు అయన. 'యూ యాంగ్ మిస్..........'

 

    ఇలాంటి గొడవల్లో డిఫెన్సు కంటే అఫేన్సు మంచిదని సారధి చెప్పడం ఒకసారి విన్నది సుదీర! ఎదుటి వాడు నేరం ఆరోపించే లోపల అతని మీదకే నేరం నెట్టేసి, కంగారు పెట్టెయ్యడం.


    "కళ్ళు కాళ్ళలో ఉన్నాయా నీకు?" అంది మొదటి అస్త్రం వదులుతూ. "రోడ్డు మీద ట్రాఫిక్ కనబడటం లెదూ? లేకపోతె తాగి ఉన్నావా? ఆర్ యూ డ్రంక్? యూ రాటెన్ సన్ ఆఫ్ ఎ బిచ్! నా కారుని నాశనం చేశావ్!" అంది గబగబ.


    ఈ ఎదురు దాడికి అయన బిత్తరపోయాడు. "నువ్వే డాష్ కొట్టి పైగా నన్ను......'


    "షటప్ బాస్టర్డ్!" అంది సుదీర కూల్ గా. "రేపొద్దున లోగా నీ డ్రైవింగ్ లైసెన్స్ కాన్సిల్ చేయిస్తాను."

 

    ట్రాఫిక్ కానిస్టేబుల్ పరుగెత్తుకు వచ్చాడు. పాకెట్ బుక్ తీసి సుదీర కారు నెంబరు నోట్ చేసుకుంటూ , "మీ డ్రైవింగ్ లైసెన్సు, ఆర్. సి. బుక్కు చుపించండ్రి. రాంగ్ సైడ్ ల వస్తూ యాక్సిడెంట్ చేసిండ్రు మీరు" అన్నాడు.


    వెంటనే వంగి, ఎడం కాలికి ఉన్న మెట్రో దావూద్ చెప్పు తీసింది సుదీర. "ఏమిట్రా వాగుతున్నావ్? నీ నంబరెంత? ఎ పోలిస్ స్టేషన్ నీది?"


    పోలిస్ కానిస్టేబుల్ మొహం కోపంతో వికృతంగా మారింది. ఎడమ చేత్తో విజిలు తీసి ఉదుతూ, కుడిచేత్తో సుదీర చేతిని పట్టుకున్నాడు.


    అడ చిరతలా విదిలించుకుంది సుదీర. అప్పటికే పోగయి ఉన్న జనాన్ని తప్పించుకుని ఎదురుగా ఉన్న ఫాన్సీ షాపులోకి త్వరత్వరగా నడిచింది.


    షాపు ఓనరు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అతని చేతిఉలోని రిసీవరు విసురుగా లాక్కుని, ఫోన్ డిస్ కనెక్టు చేసింది సుదీర. తర్వాత తను ఒక నంబరుకి రింగ్ చేసింది.

    "హలో అంకుల్! మార్నింగ్! నేను ఇక్కడ చిన్న ఆక్సిడెంట్ లో ఇరుక్కున్నాను. గొడవవుతోంది. ఐ నీడ్ యువర్ హెల్ప్! ఏమిటి? అతడ్ని ఫోన్ దగ్గరికి పిలవనా? ఒకే! థాంక్స్ ఎలాట్!" అని రిసీవర్ పక్కనే పెట్టేసి, "డిస్ కనెక్ట్ చెయ్యకు......ఇప్పుడే వస్తాను" అని షాపు ఓనరు తో చెప్పింది.


    అప్పటిదాకా తెల్లబోయి చూస్తున్న అతను తేరుకుని, ఒక్క గుటక మింగాడు. దానితో బాటు తను అనదలచుకున్న మాటలన్ని కూడా మింగేశాడు. నిండా పాతికేళ్ళు లేని ఆ అమ్మాయి అంత సాహసంగా ప్రవర్తిస్తోంటే ఆమె వెనుక వున్న బలం. బలగం ఎంతటివో అతనికి అర్ధం అయింది.


    ఆ అంబాసిడర్ కారు యజమాని ఆక్సిడెంట్ ఎలా అయిందో కానిస్టేబుల్ తో చెబుతున్నాడు. అతను దానికి తల ఊపుతూ, "అవును సార్! నేను చూస్తూనే ఉన్నాను సార్! ఆ అమ్మాయే రాంగ్ సైడ్ వచ్చి........." అంటూ వున్నాడు.


    సుదీర వాళ్ళని కట్ చేస్తూ, "నీకు ఫోన్ వచ్చింది మాట్లాడు" అంది కారు వోనరుతో.


    అతను ఉగ్రుడయ్యాడు. "అమ్మాయ్! మంచి మర్యాదా నేర్చుకో! నేనెవర్నో నీకు తెలియదు. ఫారిన్ రిటర్నడ్ ప్లాసిక్ సర్జెన్ని! ఐ విల్ సి దట్..........."

 Previous Page Next Page