Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 6

    తనకు పైజమా, లాల్చీ తీసి వైటీ వేసి ఉంది. ఆ నైటీ నుండి వస్తోంది... సేమ్ స్మెల్- రోమియో స్మెల్!
    'మైగాడ్.... రాత్రంతా నాతో  ఆ రోమియో ఉన్నాడా?' అనుకుంది.
    "నా డ్రస్ ఎవరు మార్చారు" కంగారుపడింది.
    "మేమే! కానీ, ఆ అబ్బాయే  తెచ్చాడు" చెప్పింది నర్స్.
    "హూ ఈజ్ హి హనీ?" అడిగాడు డాడ్.
    "ఐడోంట్ నో డాడ్!" భుజాలెగరేసింది.
    "ఎనీ హౌఁ.... థాంక్స్ టు హిమ్! నా రెస్పాన్సిబులితీ తీసుకున్నాడు!" రిలాక్స్ డ్ గా ఫీలయ్యారాయన.
    అప్పటిదాకా అక్కడి మాటలన్నీ విన్న  ఒక ఆకారం కిటికీ దగ్గర నుండి వెళ్లిపోయింది.
    జ్ఞాపిక నార్మల్ అవడంతో డిస్ చార్జ్ చేసి - కూతుర్ని హాస్టల్ లో విడవడం ఎందుకూ, ఇంటికి తీసుకెళ్దాం... అనుకున్నాడాయన!
    క్లాసెస్ పోతాయని జ్ఞాపిక అనడంతో- హాస్టల్లో వదిలేసి - వార్డెన్ కూ, రూమ్ మేట్స్ కూ మరీ మరీ చెప్పి- స్ఫూర్తి, కామినీ "మేమున్నాం కదా  అంకుల్!" అన్నాక - వదల్లేక వదిలివెళ్లారు కూతుర్ని.
    స్నానానికి వెళ్లి నైటీ విప్పుతూ చూసుకుంది జ్ఞాపిక.
    'వాటె లవ్లీ కలర్...., వాటె నైస్ టెస్ట్! ఐ లైక్ యూ రోమియో!' అనుకుంది మనసులో.
    తను స్నానం చేస్తుండగా దూరంనుండి బైనాక్యులర్ తో రెండు కళ్ళు తన బాడీ మొత్తాన్నీ చూస్తున్నాయనే ఆలోచనే రాలేదు తనకు. చూపులతో తనను తినేస్తున్నాడనీ తెలీదు. తను అంగాంగం సబ్బు రాసినప్పుడల్లా దానిని క్లోజప్ లోకి జరుపుతూ అణువణువూ చూస్తూ.... మధ్యలో బైనాక్యులర్ అలాగే  పట్టుకుని, ఇంకో చేత్తో బ్రౌన్ షుగర్ నోట్లో వేసుకుంటూ పచ్చని కళ్ళతో...!
                                                                                   4
    ఈవెనింగ్ టైమ్!
    లీజర్ గా ఉన్నారు హాస్టల్లో అమ్మాయిలు! ఆరోజు హొళీ....హాలిడే!
    కానీ, హొళీకి సంబంధించిన సందడేమీ లేదు. ఎవరి రూమ్ లో వాళ్ళు..., హొళీ ఆడుకోలేదన్న అసంతృప్తి అందరిలోనూ!
    జ్ఞాపిక బోర్లా పడుకుని ;స్పార్ట కస్' ఫస్ట్ చాప్టర్ చదువుతోంది.
    'అమెరికాలో శిలువ అనేది లీగల్ పనిష్ మెంట్. ఏదయినా మామూలు తప్పుచేసిన వారికి జరిమానా.... కొరడాదెబ్బలు! అంతకంటే పెద్ద రేంజ్ లో తప్పు- అంటే ....ప్రభుత్వానికి వ్యతిరేకమయిన విధానాలను ప్రోత్సహించడం లేదా పాల్గొనడం లాంటివి చేస్తే శిలువ వేసేవారు. శిలువ అంటే.... తప్పు చేసిన మనిషి సైజులో శిలువను చేయించి, దాన్ని పడుకోబెట్టి నేరస్థుణ్ని దానిపై పడుకోబెట్టి, కాళ్లు రెండూ కలిపి పెద్ద ఇనుపరాడ్ తో గోడకు క్యాలెండర్ తగిలించినట్టు పెద్దసుత్తితో సహా పాదాలను తగిలించి, ఆ తరువాత అరచేతులను 'T' షేప్ లో ఉన్న చెక్కలకు ఇనుపరాడ్ లతో కొట్టి తగిలించేవారు.
    పాదాలకు, చేతులకు బలమైన ఇనుప మేకులు కొడుతూ ఉంటే.... ఆ వ్యక్తీ జంతువులా భీకరంగా అరిచేవాడు. ఒక్కోదెబ్బకూ రక్తనాళాలో పేలిపోయేలా బొబ్బరి;ల్లేవాడు. చుట్టుపక్కల ఇండ్లలోని పిల్లలు దడుచుకునేవారు. ముసలివాళ్ళ గుండెలదిరిపోయేవి. పడుచువాళ్ళు భర్తలను కౌగిలించుకునేవారు. జనం పొగయ్యేవారు.
    సైనికులు ఆ శిలువను ఈడ్చుకెళ్లి ఊరిబయట రాజమార్గంలో పాతేవారు. మేకులు కొట్టించుకున్న వ్యక్తి మెడ వెనుక  ఆధారం లేక, వాలి తల బరువెక్కుతుండగా....చేతుల నుండీ, పాదాల నుండీ రక్తస్రావం జరిగీ జరిగీ మరణించాలి.
    మధ్యలో డేగలు బ్రతికుండగానే అతన్ని పొడుచుకు తినేవి. ఆ గాయాల గుండా కూడా రక్తం స్రవించేది!  మళ్లీ  అక్కడే  పొడుస్తూ ఉండేవి.
    మొదట మొదట బాధకు అరుస్తారు. రానురాను అరిచే ఓపిక శరీరం మొత్తం కదిలికదిలి వణుకుతారు. ఒక్కరోజులో మరణం సంభవించేది కాదు. అయినా.... అలాగే  ఎండలో, వానలో, రాత్రి చలిలో.... ఆ వ్యక్తి శిలువ మీంచి రక్తం ధారలు  కట్టీకట్టీ ఆఖరి రక్తంచుక్క అయిపోయాక మరణించేవాడు.
    ఒక్కోసారి బలమైన పురుషులైతే.... నెలరోజులు శిలువమీదున్న సాక్ష్యాలున్నాయి. మరణించేవరకూ అతని బంధువులూ, స్నేహితులూ వచ్చి చూసి రోదించేవారు.
    అతను చనిపోయాడని నిర్థారించాక-శరీరాన్ని బంధువులకు అప్పచెప్పేవారు.
    ఆ శిక్ష ద్వారా రాజమార్గం నుండి రాజ్యంలోకి వచ్చేవారికి - రాచరికాన్ని ఎదిరిస్తే కలిగే శిక్షకు వీళ్ళు ఉదాహరణగా ఉండేవారు. ఒక్కోసారి ఆ మార్గం పొడువునా పదీ, ఇరవై శిలువలుండేవి.'
    .... చదివేసరికి 'ఇంత భయంకరమా రాజరిక వ్యవస్థ?! తమ  నెదిరించిన  వారిని ఇంత రాక్షసంగా శిక్షించడమా? అంటే.... వారి అధికారపు చెలాయింపు- భయంతోనేగానీ, పటిష్టతతో కాదన్నమాట! అయ్యో.... జీసస్ ను కూడా ఇంత బాధించడం - అందుకేనా! జీసస్ కు వెనుక ఇలా ఎంతమంది సాక్ష్యంలేని జీసస్ లు చరిత్రపునాదుల్లో రక్తస్రావం చేసుకున్నారో! అందుకే ప్రపంచం 'రాచరికం వద్దూ.., ప్రజాస్వామ్యం కావాలీ, కావాలీ....'  అని కాంక్షించిందేమో! ఆ  కాంక్ష తీరడానికి, మనల్ని బ్రతికించడానికి మానవజాతిలో ఎన్ని అని కాంక్షించిందేమో! ఆ కాంక్ష తీరడానికి, మనల్ని బ్రతికించడానికి మానవజాతిలో ఎన్ని జీవితాలు బలయ్యాయో!'....అలాగే దిండుమీద పడుకుని ఉండిపోయింది జ్ఞాపిక.
    'మానవులు-మానవులను ఎందుకింత రాక్షసంగా శిక్షించుకుంటారు? ఏ జంతువూ తన జాతి జంతువును శిక్షించుకోదు. ఒక్క మానవులే తమ జాతిని తామే అంతం చేసుకుంటారు. రాక్షసంగా, క్రూరంగా హింసించుకుంటారు. హింసిస్తూ ఆనందపడుతుంటారు! ఛీ....మానవుడా! జంతుజాలంలో అధమతి అధముడా! ప్రకృతికి విషజంతువా! మెదడున్న క్రూరమృగమా!'... అంటూ కసిగా తిట్టుకుంది. ఇక  కంటిన్యూ చెయ్యలేకపోయింది. ఆపేసింది బుర్రవేడికి!
    ఏయ్ఁ...! నలుగురైదుగురు అమ్మాయిలు పరుగెత్తుకొచ్చారు.
    నిద్రపోతున్న స్ఫూర్తి ఎగ్గిరిపడింది! డ్రస్ రిపేర్ చేసుకుంటున్న కామిని ఉలిక్కిపడింది. జ్ఞాపిక  ఠక్కున లేచికూర్చుంది.
    "య్యా! య్యా! య్యా! య్యా..!"  అని ఆ  అమ్మాయిలు అందరీ చేతులూ పట్టి బయటికి లాగారు. సంతోషం ఆపుకోలేకపోతున్నారు.
    "వాట్ హ్యాపెండ్?!" వీళ్ళకూ - వాళ్ళ ఆనందం చూస్తే ఆనందంగా ఉంది... కారణం తెలియకున్నా! ఒక్కోసారంతే... కారణం తెలియకపోయినా ఎదుటివాళ్ళు ఆనందంగా ఉంటే మనకీ ఆనందం కలుగుతుంది.
    "వార్డెన్ హొళీ ఆడుకోడానికి ఒప్పుకున్నారోచ్!" గట్టిగా అరిచారు.
    "వాఁవ్! వాఁవ్! వాఁవ్...! చెలో..." అని అందరూ హాస్టల్ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ డ్రమ్స్ లో హొళీనీళ్లు కలిపి ఉన్నాయి.
    రేవతి కూడా సంతోషం పట్టలేక ఎగరసాగింది.
    "ఆర్ యూ హ్యాపీ?" జ్ఞాపిక అడిగింది రేవతిని.
    "య్యా! వెర్రీమచ్....వెరీమచ్!" అంది-జ్ఞాపికను ఎత్తి పైకిలేపి. ఈమధ్య తనలో బాగా మార్పు వచ్చింది. పూర్తిగా డ్రగ్స్ మానేసినట్టే! అయినా అందర్లో కలిసేది కాదు! కానీ, ఈరోజు తనే ముందుకువచ్చి పార్టిసిపేట్ చెయ్యసాగింది.
    "నాక్కూడా ఆనందంగా ఉంది! బట్....హొళీ అడ్డం కన్నా నువ్వానందంగా ఉండడం చూసి! రియల్ గా ! ఒక్కవిషయం చెప్పనా రేవతీ- నువ్వు  నవ్వుతుంటే చాలాచాలా బావుంటావు."
    "కానీ, నేను నవ్వితే అసహ్యంగా, కుష్టువాడి రాగంలా ఉంటుందనేవాడు మా రెండో నాన్న!" మళ్లీ మొహం వాడింది రేవతిది.
    "నో! నో! నవ్వితే ఫౌంటెన్ చినుకులు రాలినట్టుంటుంది! రియల్లీ... నా మాట నమ్మవా!" జ్ఞాపిక అంది.
    "నమ్మాను" అని చెప్పకుండా- కదిలి కదిలి నవ్వి, "ఐలైక్ యూ యార్! ఐ లైక్ యూ సో మచ్!" అంది. నవ్వీ నవ్వీ కళ్ళలోంచి నీళ్లోచ్చాయి తనకు.
    "హేయ్ఁ! కమాన్! జాయిన్ వితజ్!" అరిచారు అమ్మాయిలూ.
    స్ఫూర్తి హడావిడిగా వచ్చి-
    "జ్ఞాపికా! మనం కాస్ట్ లీ డ్రెసెస్ లో వున్నాం! ఇవి తీసేద్దాం... పాడయిపోతాయి!" అంది. ముగ్గురూ లోపలికి వచ్చి వంటిమీది డ్రెసెస్  తీసి  నైటిస్ వేసుకున్నారు. వీళ్ళు డ్రెస్ మార్చుకునేప్పుడు తమను కళ్ళతో షూట్ చేస్తున్న బైనాక్యులర్ గురించిన ఆలోచన రాలేదు.
    బయటకు వెళ్లిపోయి జాయినయ్యారు.
    వీళ్ళ ఆనందం చూసి వార్డెన్, కుక్, మిగతా వర్కర్స్ అందరూ వరండాలో చేరారు.
    అమ్మాయిలు- రంగురంగుల పూలగుత్తులు, రకరకాల పరిమళపు కాంతుల! నవ్వుతూ తుళ్లుతూ ఉండే అమ్మాయిల్లో ప్రకృత్తి నిజంగా ఒదిగిపోతుంది.ఎంతో అందమైన ప్రకృతి దృశ్యాలన్నీ ఒకవైపు- విరిసీ విరియని అమాయకత్వపు నవ్వుతో ఉన్న అమ్మాయిని ఒకవైపూ పెడితే అందరూ అమ్మాయినే తన్మయులై చూసి తీరతారు. ఇక - అమ్మాయి నవ్వుతూ, తుళ్ళుతూ -కదిలే  తరంగాల్లంటి శారీరంతో అరుస్తూ ఆడుకుంటుంటే... రెండు కళ్ళెందుకు మానవుడికి?! ఒళ్ళంతా కళ్ళు కావద్దూ?!
    అందరికీ పిచికారీలు అందాయి. ఆడటం అన్నింటికన్నా గొప్పకళ! అందుకేనేమో... ప్లేటో అంటాడూ- 'ఆర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇమిటేషన్ ఆఫ్ ది నేచర్!' అని. మనం వింటామా? ఛస్తే వినం.
     ఇక.... ఒకటే తంపరలు! రంగురంగుల తుంపరలు...! ఇంధ్రనస్సు కరిగి వర్షిస్తే- ఆ రంగుల్లోంచిచినుకులు రాలితే- ఎలా  ఉంటుందో.... అలా రంగురంగు పిచికారీలు!
    వెంట్రుకలు తడిచి నుదురు కతుక్కున్నాయి... బట్టలు తడిసి  సోయగాలకు  బిగుసుకున్నాయి. అందాలు ఆడుకుంటున్నాయి..., చందాలు ఉరకలేస్తున్నాయి....., ఆనందాలు కట్టలు తెగుతున్నాయి! పుడమి పులకరించినట్లుగా భూమ్మీద కూడా రంగులు రంగులు!
    ఆడీ ఆడీ వార్డెన్ ను కూడా లాక్కొచ్చారు- "ప్లీజ్ మేమ్..." అని!
    ఆ తరువాత ఒక్కరొక్కర్నే అందర్నీ జాయిన్ చేశారు. వయసూ, హుందాతనం అవతలపెట్టి అందరూ ఆడుకున్నారు.
    నిజంగా ఆటలో ఎంత ఆనందముంది కదా! హూందాతనంతో, పెద్దరికంతో ఎందుకు చాలామంది ఆనందానికి దూరంగా ఉంటారు? అసలు ఆనందానికి వయసు పరిమితి - ఒక దక్షిణ  భారతదేశంలోనే! ప్రపంచం మొత్తంమ్మీద ఉత్తర భారతంతో పోల్చుకుంటుంటే... మనం సరదాలూ, సంతోషాలూ 'పెద్దరికం' పేరుతో పోగొట్టుకుంటున్నట్టే!
    అవుతోంది జీవితం అంతకంతకూ హ్రస్వం-
    పెరుగుతోంది రోజురోజుకీ కాలం వేగం!
    అందుకనే మనమంతా అహర్నిశం-
    హాయిగా, హాయ్ హాయ్ గా గడుపుదాం!
    'స్వర్ణపిశాచి నగరంలో పిశాచాల్లా బ్రతుకున్న నాగరికుల ఆశ లేమిని వదలుకోండ'ని 'మాక్సిమ్ గోర్కీ' అన్నా... ఎంతమంది ప్రపంచ మానవులు విన్నారు గనుక! విన్నా... ఎంతమంది పాటించారు గనుక?! ఆనాటి కాలంలోనే మనుషులు పిశాచాల్లా బ్రతుకుతున్నారని కనిపెట్టేసిన మేధావీ.... నీకు కలాల అక్షరాల అభిషేకిత వందనాలు సుమా! మా  కలాలు కోట్లయినా నీ ఒక్క అక్షరానికి సాటి రానేరావు సుమా! మానవగుండెల్ని తవ్వితవ్వి సుదీర్ఘ లోయల నిధుల జాడలను వెతికి ప్రపంచానికి బహూకరించిన శ్రామిక నిర్వచనమా! నిత్యాగ్నిగుండ ప్రజ్వలనమా! జన్మంతా రగిలి, ఆనందాన్ని చిలికి మానవజాతికి అందిస్తే అలవోకగా ఒలకచొసుకునే మూర్ఖులం మేమా?
    నీళ్లు పడీ, అమ్మాయిల తోక్కిడికీ అక్కడంతా బురదయింది.
    'ఇక.. ఆపెయ్యండ' ని వార్డెన్ చెప్పడంతో - మెల్లగా అమ్మాయిలు ఆట ఆపేశారు.
    ఒక్కొక్కరూ నీళ్లు కారుతున్న బట్టలను ఎత్తి పిండుకుంటూంటే.... కంపౌండ్ వాల్ కు అనుకుని ఉన్న పెద్దచెట్టు గుబురుకొమ్మల్లోంచి ఒక గ్రూప్- వీళ్ళను చూసి నాలుక తడుపుకుంటోందని వార్డెన్ కూడా గమనించలేకపోయారు.
    'పాపం... ఎప్పుడూ స్ట్రిక్ట్ గా  ఉండి వీళ్ళను బాధపెడతాను. కనీసం ఈరోజయినా వీళ్ళ ఆనందం చూశాను' అనుకున్నారు.
    అమ్మాయిలందరూ వరండాల్లోంచి రూముల్లోకి వస్తూంటే... బట్టల నీళ్లు  కారి పాలిష్ బండలపై కాళ్లు జారుతున్నాయి. స్ఫూర్తి అలాగే జారి పడబోయింది. కామిని కాచ్ చేసింది. కానీ, వరండా బాల్కనీ నడుముకు బాగా తగిలి కలుక్కుమంది.
    మెల్లగా నడిపిస్తూ రూమ్ లోకి  తీసుకొచ్చింది కామిని.
    "ఏంకాదు...నేను మసాజ్ చేస్తాను - పోతుందిలే! ఇంకానయం... పడలేదు. ఫ్రాక్చర్ అయ్యుండేది!" అని కంగారుపడ్డారు జ్ఞాపిక, కామినీ!
    స్నానం చేసేప్పుడు వంగి బకెట్లోంచి  నీళ్లు ముంచుకోలేకపోయింది స్ఫూర్తి- నడుం నొప్పితో! పెట్టీకోట్ గుండెల వరకూ కట్టుకొమ్మని, స్టూల్ మీద కూర్చోబెట్టి స్నానం చేయించారు.
    వార్డెన్ కు తెలియజేస్తే కోప్పడ్డారావిడ. "ఇదుగో... ఇలాటివి ఏవో తెచ్చుకుంటారనే నేను అనవసరపు హడావిడీ చెయ్యనివ్వను. నా మాట వింటారా! ఏదో ఒకవిధంగా కన్విన్స్ చేసుకుంటారాయే!" అని.
    డాక్టర్ కు ఫోన్ చేశారావిడ. డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చి- స్ఫూర్తి 'మరీ నెప్పి' అని గొడవచేయడంతో.... రాత్రికి బాగా నిద్రపట్టేందుకేవో టాబ్లెట్స్ రాశారాయన.
    హాస్టల్లో ఉండే పిల్లల మధ్య ఎంత కోఆపరేషన్ ఉంటుందంటే... సొంత ఫ్యామిలీమెంబర్స్ మధ్య కూడా లేనంత! వాళ్ళకు సంతోషమొచ్చినా, డి ప్రెషన్ వచ్చినా పంచుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ తోనే! కనుక ఎదుటివాళ్ళకు ప్రాబ్లమ్ వచ్చినపుడు- తమకు ప్రాబ్లమ్ వచ్చినపుడు తామేమి ఆశిస్తారో అది చేసేస్తారు! అసలీ కో ఆపరేషన్ జీవితపు అన్ని భాగాలలో ఉంటే జీవితం నందనవనం అయిపోతుంది.
    వార్డెన్నడిగి-హాలిడే కాబట్టి చిన్నచిన్న షాపింగ్ కు పర్మిషన్ తీసుకున్నారు స్టూడెంట్స్.
    కామినీ, జ్ఞాపిక కూడా వెళ్లాలనుకున్నారు. కానీ, స్ఫూర్తిని వదిలేసి వెళ్లాలనిపించలేదు.
    జ్ఞాపిక- "నేనుంటాన్లే! మాక్కావలసినవి కూడా నువ్వే తెచ్చెయ్యి! నేను స్ఫూర్తిని చూసుకుంటాను" అని  ఇద్దరికీ కావలసినవి లిస్టిచ్చారు.
    "నాకేం ఫర్వాలేదు...నువ్వెళ్లవే!" అంటే కూడా జ్ఞాపిక వెళ్లలేదు.
    కామిని కూడా ఒప్పుకోలేదు... స్ఫూర్తిని ఒక్కదాన్నీ వదిలి వెళ్లడానికి! ఇంచుమించుగా వీళ్ళ రూమ్ కి అటూఇటూ ఉన్న  నాలుగేసి రూముల్లోని అమ్మాయిలంతా వెళ్లారు.
    కామినీ తనతోపాటు రేవతిని తీస్కెళ్లింది. రేవతిని ఒక్కదాన్నీ వెళ్లనివ్వడం లేదింక ఎక్కడికీ!
    అందరూ వెళ్లాక- స్ఫూర్తి నెప్పిగా ఉందంటే.... డాక్టర్ ఇచ్చిన బామ్ మసాజ్ చేసింది జ్ఞాపిక. ఈవెనింగ్ వేయాల్సిన టాబ్లెట్స్ వేసింది. నెప్పి తట్టుకోలేక జ్ఞాపిక ఇచ్చింది కాక మరో నిద్రటాబ్లెట్ వేసుకుంది స్ఫూర్తి... జ్ఞాపిక చూడకుండా!
    ఆరూ- ఆరున్నర సమయం!
    చలికాలం.... చీకటి పడిందప్పటికే! ఎంత చలయినా జ్ఞాపికకు ఈవినింగ్ బాత్ అలవాటు. స్ఫూర్తికి నిద్రపట్టేవరకూ ఏదో  చదువుతూ కూర్చుని, నిద్రపట్టాక తలుపు బోల్డ్ వేసి టేప్ ఆన్ చేసింది.
    "లెట్ మి టెల్... వన్స్ వన్స్ వన్స్
    హార్ట్ ఈజ్ బీటింగ్... డింగ్ డాంగ్ బెల్స్!
    సో - లెట్ మీ టెల్ వన్స్ వన్స్
    జస్ట్ ఐ లవ్ యూ ఐలవ్ యూ ఐలవ్ యూ

 Previous Page Next Page