"సర్కల్ జాయిన్ అవ్వనే జ్ఞాపికా! రన్నింగ్ వెహికల్ నుంచి కింది హ్యాట్ తీసుకున్నావే.... ఆ ఫీట్ చేస్తే సరిపోతుంది!" స్ఫూర్తి.
"అవునూఁ.... ఎవరు నేర్పారే నీకు డ్రైవింగ్?!"
"దానికింకెవరు నేర్పుతారు? వాళ్ళ డాడ్..!" అంది కామిని.
"య్యాఁ! మై డాడ్ ఈజ్ ఎ స్పెషల్ పర్సన్!" అని తడిబట్టల మీదే మెల్లగా బాడీ షేక్ చేస్తూ డాన్స్ స్టార్ట్ చేసింది.
కామినీ, స్ఫూర్తీ జాయిన్ అయి కాసేపయ్యాక అందరూ పొడిపొడిగా అయిపోయారు.
కానీ, వాళ్ళు అబ్జర్వ్ చెయ్యలేదు- కిటికీ ఎదురుగా టీ స్టాల్ నుండి ఒక వ్యక్తీ తమను బైనాక్యులర్ లోంచి చూస్తున్నాడనీ , తాము బట్టలు మార్చుకోవడం కూడా చూశాడనీ!
* * *
తెల్లవారుఝామునే లేచి వర్క్ స్టార్ట్ చేశారు.... స్ఫూర్తి, కామిని!
` జ్ఞాపిక లేవలేదు.
వాళ్ళూ డిస్టర్బ్ చేయలేదు కొంచెంసేపు! అయితే.... మళ్లీ లేపలేదని కోప్పడుతుందని-
"జ్ఞాపికా.... లే! ఏంటీ మొద్దునిద్ర? రాత్రంతా ఏం చేశావ్.... కలలు కన్నావా? లే... లే!" అని పిలిచినా లేవలేదు.
స్ఫూర్తి వెళ్లి నుదుటి మీద చెయ్యేసి చూసింది. హై ఫీవర్!
"ఏయ్ఁ కామీ.... జ్ఞాపికకి ఫీవర్! వార్డెన్ కు చెప్పిరా!" తొందరచేసింది.
గబగబా కామిని కూడా వచ్చి జ్ఞాపికను టచ్ చేసి చూసింది.
"మైగాడ్! టెంపరేచర్ బాగా ఉందే! చెప్తే వింది కాదు.... వర్షంలో తడవద్దని!" అంటూ వార్డన్ కు చెప్పి వచ్చింది.
వార్డన్ వచ్చి జ్ఞాపికను చూసి హాస్టల్ డాక్టర్ కు ఫోన్ చేసింది. జ్ఞాపికను తన రూమ్ కు తీస్కెళ్లింది. స్ఫూర్తినీ, కామినినీ - "మీరెళ్లండి! మీరు డిస్టర్బ్ అవ్వాల్సిన పనిలేదు అంది.
"నో మేడమ్!మేం చూసుకుంటాం.... తనని!" ఆన్నా వినిపించుకోలేదు.
గత్యంతరం లేక వచ్చేశారు. ఇద్దరూ కాలేజ్ కెళ్లిపోయారు.
డాక్టర్ టాబ్లెట్స్ వేసినా టెంపరేచర్ కంట్రోల్ కాలేదు. విపరీతమైనచలికి వణికిపోసాగింది. జ్ఞాపిక హై ఫీవర్ లో ఏవేవో కలవరించసాగింది. డాక్టర్ హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామని- వార్డెన్ పర్మిషన్ తో తన నర్సింగ్ హొమ్ కు తీసుకెళ్లారు.
రేవతీ, స్ఫూర్తీ, కామినిలతోపాటు జ్ఞాపిక లేకపోతే లీజర్ అవర్ లో అడిగారు రేవంత్, క్రాంత్, ఈష్- జ్ఞాపిక ఎందుకు రాకేదని!
ఫీవరోచ్చిన విషయం చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేశారనీ, వార్డెన్ తమను డిస్టర్బ్ కావద్దన్నారనీ చెప్పారు. 'ఈవెనింగ్ హాస్పిటల్ కెళ్దాం....' అనుకున్నారందరూ.
రేవంత్- "నాకు లైబ్రరీలో వర్కుంది..... క్లాసుకు రాను" అని వెళ్లిపోయాడు ఈ గ్రూపులోంచి.
ఎంతకీ ఫీవర్ కంట్రోల్ జ్ఞాపికకు. పైగా.... వాళ్ళ డాడీని కలవరించసాగింది.
డాక్టర్ వార్డన్ కు ఫోన్ చేసి చెప్పారు.... వాళ్ళ డాడీకి ఫోన్ చెయ్యమని!
"నేను ఉదయం నుండీ ట్రై చేస్తున్నా లైన్స్ కలవట్లేదు" అని చెప్పింది వార్డెన్.
'జ్ఞాపిక దగ్గర ఎవరయినా క్లోజ్ పర్సన్ ఉంటే బావుండు!' అనుకున్నారు డాక్టర్.
అప్పుడోచ్చాడా అబ్బాయి-
'జ్ఞాపిక అనే అమ్మాయి ఫీవర్ తో అడ్మిట్ అయ్యింది కదా! రూమ్ నెంబర్ ఎంత?" అని!
నర్స్ తీసుకొచ్చింది.
డాక్టర్ ను విష్ చేసి, 'జ్ఞాపిక ఫాదర్ పంపించారు నన్ను.... జ్ఞాపికను చూసుకోవడానికి!" అన్నాడు.
"థాంక్యూ! నేనిప్పుడదే అనుకుంటున్నాను. మా నర్సింగ్ హొమ్ లో పేషంట్ కు తోడు అక్కర్లేదు. నర్సులే చూసుకుంటారంతా! ఎవర్నీ అలో చెయ్యం కూడా! కానీ, ఈ అమ్మాయి వాళ్ళ డాడీని కలవరిస్తోంది. అందుకీ ఎవరయినా ఉంటే బావుండు అనుకుంటున్నాను మీరు చూసుకుంటారుగా....వస్తాను!" అని వెళ్లిపోయింది.
వెళ్లి జ్ఞాపిక పక్కన కూర్చున్నాడతను.
జ్ఞాపిక వడలిన సన్నజాజి తీగలా వాలిపోయి ఉంది. పెదవులు డ్రై అయిపోయిన కమలతోనల్లా ఉన్నాయి. సెలైన్ పెట్టి ఉంది.
"దాహం... దాహం... వాటర్ డాడ్.... వాటర్!" అంది.
సెలైన్ ఉండగా వాటర్ తాగించకూడదు కనుక తన తల చాతీ కానించుకుని, అక్కడి బాటిల్ లోని నీళ్లు గ్లాసులోకి వంచి పక్కనే బ్యాండేజ్ దూది తడిపి పెదవుల కద్దాడు.
ఆత్రంగా నోరు తెరిచింది నీళ్లసుకుని!
"వాటర్ డాడ్... ప్లీజ్!" అంది కళ్ళు మూసుకుని!
"నో! వాటర్ తాగ్గూడడు! కావాలంటే మళ్లీ కాటన్ టచ్ ఇస్తాను" అని మళ్లీ తడిచిన కాటన్ పెదవుల కద్ది పడుకోబెట్టాడు.
చెయ్యి గట్టిగా పట్టుకుని పక్కకు తిరగబోయింది.
"నో..." అంటూ సెలైన్ పడిపోకుండా పట్టుకుని, తనను సరిగా పడుకోబెట్టాడతడు.
కొద్దిసేపటికే చెమటలు పట్టసాగాయి జ్ఞాపికకి! కప్పిన రెజాయ్ తీసి, జారిన పైజమా ఫిట్ చేసి, లాల్చీ సర్ది, ఫ్యాన్ కొంచెం స్పీడ్ పెంచాడు.
చలితో ముడుచుకోబోయింది.
సెలైన్ పడిపోతుందని, సూది చేతిలో విరుగుతుందని- ఠక్కున తనను శోల్దర్స్ పట్టుకుని గట్టిగా అదిమి పట్టుకున్నాడు.
జ్ఞాపిక అతనిని గట్టిగా వాటేసుకుని, డాడ్.... డాడ్.... నెప్పి! తలనొప్పి డాడ్! వామిటింగ్ వస్తూంది డాడ్! డాడ్ ఐ కాంట్ బేర్! డూ సమ్ థింగ్ డాడ్! ప్లీజ్.... ఏదయినా చెయ్యి డాడ్!" అని గారంగా మారాం చెయ్యసాగింది
ఎంత చదూకున్నా, పిల్లలకు తల్లయినా నాన్న దగ్గర కూతురు గారాలూ, మారాంలూ మాననే మానదు... అదేవిటో! నిజంగా... తండ్రిప్రేమ దొరికిన అమ్మాయి అదృష్టవంతురాలు.
తనని అలాగే అదిమిపట్టుకుని ఫ్యాన్ స్పీడ్ తగ్గించాడు. తల ఒళ్ళో పెట్టుకుని తలను నొక్కిపట్టుకున్నాడు. అప్పుడప్పుడు దూదితో పెదాలు తడుపుతూ, తనను చిన్నపిల్లలా చూసుకుంటూనే ఉన్నాడు సాయంత్రం వరకూ!
సాయంత్రం కాగానే తనను సరిగా పడుకోబెట్టి రెజాయ్ కప్పి-
"ఓ.కే. హనీ! నేను ఇప్పుడే వస్తాను.... నువ్వు పడుకో!" అన్నాడు.
"నో డాడ్- ప్లీజ్.... వెళ్లొద్దు!" అంది కళ్ళు తెరవకుండానే.
"వచ్చేస్తా! జస్ట్... ఇప్పుడే వచ్చేస్తా!" అని నుదురు తడిమి ముద్దుపెట్టి చెయ్యి విడిపించుకుని మెల్లగా దూరంగా నడిచాడు వెనక్కి చూస్తూ! వెళ్తూ వెళ్తూ దిండు పక్కన చిన్న కర్చీఫ్ పెట్టి వెళ్లాడు.
దానిమీద "ఐ లైక్ యు హనీ!" అని ఉంది.
* * *
సాయంత్రం పైవ్ అయ్యేసరికి-
స్ఫూర్తి కామిని, క్రాంత్, రేవంత్, ఈష్.... వీళ్లోచ్చేసరికి జ్ఞాపిక కాన్షస్ లో కొచ్చింది.
గోలగోలగా బోకేస్ పట్టుకుని అంతరూ వచ్చేసరికి కొద్దిగా హుషారు వచ్చింది జ్ఞాపికలో. లేచికూర్చుని కబుర్లు చెప్పసాగింది.
స్ఫూర్తి జ్యూస్ తీసి జ్ఞాపిక చేతికిస్తూ.... దిండు పక్కన ఉన్న కర్చీఫ్ చూసింది.
వెరైటీగా ఉందది.
"వాటీజ్ దిస్? లవ్లీ కలర్!" అని చేతిలోకి తీసుకుంది.... పింక్ కలర్ టర్కీ కర్చీఫ్ ను.
దానిమీద వయొలెట్ కలర్ లోని అక్షరాలు "ఐ లైక్ యూ హనీ!" అని గట్టిగా చదివేసరికి అందరూ ఇంట్రస్ట్ చూపించారు.
అది అందరి చేతులూ మారి, చివరిగా జ్ఞాపిక చేతికొచ్చింద!
"ఎవరయి ఉంటారేఁ.... ఇక్కడ పెట్టింది!" కామిని అడిగింది.
జ్ఞాపిక కర్చీఫ్ అందుకుని స్మెల్ చూసింది.
సేమ్ స్మెల్! సంపెంగలూ, మొగలిపుప్పోడీ కలిసిన స్మెల్! ఓకే ఒక్క ఎవిడెన్స్...!!
ఏయ్ఁ.... ఇది రోమియో స్మెల్!" అరిచింది చిన్నగా.
"ఇక్కడికెలా వచ్చాడు? ఎలా తెలుసు తనకి?" స్ఫూర్తి ఆశ్చర్యపోయింది.
"ఓ.కే. లీవ్ దట్ టాపిక్!" అని కామిని పోస్ట్ పోన్ చేసిందా టాపిక్ ని. బాయ్స్ ఇంటర్ ఫియర్ అవలేదు.... వాళ్ళంతట వాళ్ళే చెప్పందే అడగడమెందుకని!
అదే మెచ్యూర్డ్ మనుషుల మెంటాలిటీ! అనవసరపు ఇంట్రస్ట్.... అనవసరపు యాంగ్జయిటీ... అధికప్రసంగం ఉండవు! ఎంత క్లోజ్ గా ఉన్నా లిమిట్ లో ఉంటారు. లిమిట్స్ లో ఉంటూ క్లోజ్ గా ఉంటారు! 'మాతో డిస్కస్ చేసేదయితే చెప్పేవారుగా....' అనుకుంటారంతే! 'చెప్పినప్పుడే డిస్కస్ చేద్దాం....' అనుకుంటారంతే! ఈ మెచ్యూరిటీ అందరికీ వుంటే అనవసరపు అపార్థాలూ, డామినేషన్లూ ఉండనే సమాజంలో! ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఆక్స్ ఫర్డ్ మానర్స్ ఇది!
"ఓ.కే- ఆల్ ది బెస్ట్ జ్ఞాపికా!" అని బాయ్స్ వెళ్లిపోయారు.
స్ఫూర్తీ, కామినీ ఇంకాసేపు ఉండి, హాస్పిటల్ రూల్స్ ప్రకారం వెళ్లిపోవాల్సిన టైమపడంతో వాళ్ళూ వెళ్లిపోయారు.
అందరూ వెళ్లాక - ఆ కర్చీఫ్ ని చేతిలోకి తీసుకుంది జ్ఞాపిక.
తనకు 'పింక్' ఇష్టమని అతనికెటా తెలుసు?
'లవ్లీ లెటర్స్' అనుకుంది అక్షరాలు తడుముతూ! అప్పటిదాకా మాట్లాడడం వల్ల నీరసం వచ్చి వెనక్కివాలి పడుకొబోతూ- కర్చీఫ్ విప్పి మొహంమీద పరుచుకుంది.
మైల్డ్ స్మెల్..!
ఈ స్మెల్ తనను టర్ చేసినట్లూ, ఛాతీకి అనించుకున్నట్లూ, దూదిలో పెదాలు తడిపినట్లూ... లీలగా కదలసాగింది ఊహలో!
'కలా...?!' అనుకుంది ఓసారి.
మళ్లీ మెల్లగా అన్ కాన్షస్ లోకి వెళ్లిపోయింది మగతగా!
నర్స్ వచ్చి ఇంజెక్షన్ ఇవ్వడం, డాక్టర్ టెస్ట్ చేసి "నైట్ కు కొంచెం చూసుకోవాలి.... హై ఫీవర్ రావచ్చు" అని చెప్పడం.... మసకమసకగానే అనిపించాయి.
మొహంమీద మళ్లీ కర్చీఫ్ సరిచేసి వెళ్లింది నర్స్. వెళ్తూవెళ్తూ... కర్చీఫ్ మీద కనిపించిన అక్షరాల్ని చదివి లోలోపలే నవ్వుకుంది.
ఆరోజు నైట్ కు స్పెషల్ పర్మిషన్ తో ఆ అబ్బాయి జ్ఞాపిక రూమ్ లో కొచ్చాడు.
జ్ఞాపిక మొహంమీద పింక్ కర్చీఫ్ తో నిద్రపోతోంది! రెస్ట్ కోసం టాబ్లెట్స్ ఇచ్చారేమో... మత్తుగా వున్నట్టుంది! కర్చీఫ్ ని తీసి మూసుకున్న కనురెప్పల పై తన చూపుడువేలు ఉంచి తీసి పెదాలకద్దుకున్నాడు.
"సర్....జ్యూస్ టైమ్! టాబ్లెట్స్ కూడా వేయాలి!" అంటూ నర్స్ వచ్చింది.
"నేనిస్తాను.... అక్కడ పెట్టేసి వెళ్లండి!" అన్నాడు.
నర్స్ వెళ్లాక- మగతలో ఉన్న జ్ఞాపికను లేపి భుజానికానించుకున్నాడు. టాబ్లెట్స్ వేసి, జ్యూస్ తాగించాడు.
నర్స్ ని పిలిచి "తనకు డ్రస్ మార్చలేదనుకుంటాను ఈరోజు!" అని అడిగాడు.
"లేదు సర్! తనసలు డ్రస్ తెచ్చుకోలేదు" చెప్పింది నర్స్.
అతడు బయటికెళ్లి పదినిముషాల్లో వచ్చాడు.... లెమన్ కలర్ వైటీతో!
దాన్ని నర్స్ కిచ్చి- "తనకు ఒళ్ళు తుడిచి ఫ్రెష్ చేసి నైటీ వేయండి....ప్లీజ్!" రిక్వెస్ట్ చేశాడు.
మార్చాక లోపలికి వెళ్లాడు. జ్ఞాపిక ఇంకా నిద్రలోనే ఉంది.
బుక్ చదువుకుంటూ పక్కనే కూర్చున్నాడు.
12:30కి నర్స్ వచ్చి "మీరు పడుకోండి సర్! మేం చూసుకుంటాం!" అన్నా- "ప్లీజ్" అని పంపేశాడు.
తెల్లవారుఝామున ఐదేయ్యేవరకూ అలాగే కూర్చున్నాడు....నైట్ కు లేస్తుందేమోనని! లేవలేదు.
ఐదింటికి నర్స్ వచ్చి చెప్పింది-
"సర్.... ఈ అమ్మాయి ఫాదర్ వచ్చారు!" అని.
"జస్ట్... ఇప్పుడే వస్తాను- మీరిక్కడే ఉండండి!" అని బయటకు నడిచాడు. నడిచేముందు తన జేబులోంచి శాండల్ వుడ్ ప్లవర్ జ్ఞాపిక దిండు పక్కన పెట్టాడు.
జ్ఞాపిక డాడ్ హడావిడిగా ఎంటరయ్యారు.... డాక్టర్ తో సహా!
కారిడార్ లో ఆయనకు తగలబోయి పక్కకు జరిగి వెళ్లిపోయాడతను.
లోపలికి రాగానే ఆయన హంగామా మొదలెట్టారు-
"హౌ ఈజ్ షి....హాఁ?! ఇక్కడా నా కూతుర్ని జాయిన్ చేసేది? అపోలో ఏవయిందీ.... అక్కడెందుకు అడ్మిట్ చెయ్యలేదు? నాకు ఫోన్ కలవలేదు. లేపోతే నేనే తీస్కెళ్లిపోయేవాడిని. టెన్ అవర్స్ హై ఫీవరంటే... తనెంత వీక్ అయ్యుంటుంది!" అని రూమ్ లోకి ఎంటర్ అవుతూనే.
"హనీ! హనీ! హౌ ఆర్ యు!" అని దగ్గరకు వచ్చారు.
లెమన్ కలర్ నైటీ లో ఫేష్ గా ఉన్న ఫేస్ తో కళ్ళు తెరిచిన కూతుర్ని చూసి రిలాక్స్ య్యారాయన.
కళ్ళు తెరవగానే.... సంపెంగ పూలూ, మొగలిపుప్పోడీ కలిసిన వాసన రూమంతా పరుచుకున్నట్లనిపించింది జ్ఞాపికకి! అదెలా వచ్చింది? డాడ్ కదా... డాడ్ దగ్గర ఎప్పుడూ ఈ స్మెల్ లేదు. మరి.... ఎక్కడిది? అర్ధంకాలేదు.
"హాయ్ఁ...డాడ్! ఐ యాం ఓ.కె. డోంట్ వర్రీ!" అంది.
ఆయన ఎదురుగా కూర్చుని- "మనం ఇప్పుడు అపోలో వెళ్తున్నాం. టోటల్ గా టెస్ట్ లన్నీ చేయిస్తాను నీకు! అన్ని రిపోర్టుల్లోనూ ఏవీ లేదన్నాకే నువ్వు హాస్టల్ కెళ్తావ్!" అన్నారాయన.
"డాడ! మీరు డాడ్ మాత్రమే కాదు.... డాక్టర్ కూడా! మామూలు ఫీవర్ కు మీ పేషంట్ ను అపోలో కెళ్లి అన్ని టెస్ట్ లూ చేయించమని సలహా ఇస్తారా?" నవ్వుతూ అడిగింది.
"బట్... యు ఆర్ మై చైల్డ్! మై హార్ట్! నువ్వు నా పేషంట్ వి కాదు! గెట్ రెడీ!" అన్నారు.
"నిజంగా మీరు అచ్చం డాడ్ లా బిహేవ్ చేస్తున్నారు. ప్లీజ్.... ఒక డాక్టర్ లా బిహేవ్ చేయండీ!" రిక్వెస్ట్ చేసింది మెత్తగా!
"హనీ...."
"ప్లీజ్...!" "అంత సీరియస్ ఏమీ లేదండి! ఫీవర్ కూడా కంట్రోలయింది. టెంపరేచర్ రికార్డ్ చూడండి!" అని రిపోర్ట్ చేతికిచ్చారు డాక్టర్.
"అదీకాక- మీరు పంపించిన ఆ అబ్బాయి నిన్నటినుండీ ఈ అమ్మాయిని కనిపెట్టుకునే ఉన్నాడు!"
"వ్వాట్.... నేను పంపించిన అబ్బాయా?" శరత్.
"అవును సర్! దట్ హాండ్ సమ్ బాయ్!"
"నెవ్వర్! నేనెవర్నీ పంపలేదు."
అప్పుడు తనవైపు చూసుకుంది. జ్ఞాపిక.