Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 51

   
    "లలిత చాలామంచిది. ఆవిడ ముఖం చూసినా జాలి కలగలేదా?"    
    ప్రసూనకు మండిపోయింది.    
    "మంచి అంటే ఏమిటి మీ ఉద్దేశంలో, పతి సేవా పరాయణురాలు అనా? అయితే లలితగారిలో అలాంటి మంచితనం లేదని నేను రూఢిగా చెప్పగలను......అంచేత నా వల్ల ఆవిడకు జరిగిన అపకారమేమీ లేదు. మీరు నిష్కారణంగా జాలిపడకండి.    
    ఒక్కక్షణం ఆగి ప్రసూన వ్యంగ్యంగా మళ్ళీ అడిగింది.    
    "రేఖతో 'వ్యవహారం' ఎంతవరకు వచ్చింది?"    
    'వ్యవహారం' అనే మాటకు ఎన్ని అర్దాలైన ఉన్నాయి. ఆ అర్దాలన్నీ ధ్వనించేలాగనే అంది ప్రసూన.    
    "నా పనిమీద నేను ఎందరినైనా కలుసుకోవలసి వస్తుంది."    
    "అవును పాపం! రేఖ చెప్పింది.... మొన్నరాత్రి అంతా హోటల్ గదిలోనే ఉండిపోవలసి వచ్చిందట!"    
    దొంగనోట్లు ఎక్కడ ప్రింట్ అవుతున్నాయో తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు మోహన్. ఏరకంగానైనా దానికి ఆధారాలు సంపాదించాలి! రేఖ ఏమైనా ఉపయగపడగలదేమో చూడాలని అనుకున్నాడు.    
    "మీకు ఉపయోగ పడటంకన్న నాకు కావలసిన దేముందీ?    
    "అంత అదృష్టమా?" రండి!" అంది రేఖ
    రేఖ ఎంత తెలివైనదో మోహన్ కు బాగా అర్ధమయింది. తలచుకుంటే రేఖ తనకు సహాయం చెయ్యగలదు. "విశ్వాసం" లాంటి పిచ్చి సెంటిమెంట్లు పెట్టుకునే వ్యక్తికాదు రేఖ..... కానీ మూల్యం కోరకుండా తనకు సహాయం చెయ్యదు___చూడాలి!    
    మోహన్ ను ఎంతో ఆదరంగా ఆహ్వానించింది రేఖ     
    "ఏం కావాలో చెప్పండి!" అంది.    
    "మీ హోటల్ లో..... .....    
    "అన్నీ దొరుకుతాయి".... ....    
    "నాకు కావలసినవి కొన్ని విషయాలు!"    
    "ఇది హోటల్ సార్! ఇక్కడ ప్రతీదీ కొనుక్కోవలసిందే!"    
    "కొనాలనే వచ్చాను. బేరం కుదరాలిగదా!"    
    "బేరం సంగతి చూసుకుందాం లెండి! ముందు మీరేం తీసుకుంటారో చెప్పండి!"    
    "కాఫీ చాలు!"    
    "అబ్బ! అన్ని విషయాల్లోనూ సింపుల్! పోనీయండి మీ ఇష్టమే నా ఇష్టం!"    
    కాఫీ తాగుతూ "జీవితంలో ఏదైనా భరించగలం! కానీ, ఒంటరితనం మాత్రం భరించలేం!" అంది.    
    రేఖ ఏ విషయానికి దారి తీస్తోందో మోహన్ ఊహించగలిగాడు......    
    'మీకు ఒంటరి తనమేమిటి?' అన్నాడు. రేఖ లోపల బాధపడింది. ఇతడు మంచివాడే కావచ్చు! తన నెందుకు అవమానిస్తాడు? తన మనసులో రగిలే జ్వాలలు ఇతనికి అర్ధం కావా?    
    "ఒంటరిని కాక ..... ప్రసూన లాగ తోడు వెతుక్కుమ్తూ ఎక్కడంటే అక్కడ ఉండగలనా?"    
    రేఖ గురిచూసి వదిలిన బాణం బాగా నాటుకుంది. తనను తాను నిగ్రహించుకోవటానికి మోహన్ తనకున్న శక్తినంతా వినియోగించవలసి వచ్చింది.    
    "నకు సమాజమంటే చాలా భయమండీ! దాన్ని ఎదిరించలేను. నలుగురిలో ఉన్నప్పుడు 'అవున'ని పించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఉంటామంటే ఏం బాగుంటుంది చెప్పండి!"    
    మోహన్ కు అవకాశం వచ్చింది.    
    "దానికేముంది లెండి! అబద్దాలాడటం తెలిసి నటన చక్కగా చేతనయితే ఎంతమందిలో నయినా "అవును" అనిపించుకోవచ్చు.    
    లోలోపల పళ్ళునూరుకొని పక పాక నవ్వింది రేఖ.    
    "మీకు కావలసిన విషయాలేమిటో చెప్పండి.
    
                                          23
    
    "ఆరోజు రికార్డు దొరికింది. అసలు ప్రింటు ఎక్కడవుతున్నాయో, ఎవరు చేస్తున్నారో, తెలుసుకోవాలి!"    
    "అదా? అసలు ఈ ఊళ్ళో జరగటం లేదేమో!" మోహన్ రేఖ ముఖంలోకి పరిశీలనగా చూశాడు-- ఎంతో అమాయకంగా ఉంది.    
    "సాంబశివంగారు అప్పుడప్పుడు వైజాగ్ వెళ్తారు. బొంబాయి కూడ వెళతారు. ఎక్కడికి వెళతారో నాకు తెలుసు. మీరు కనుక్కోమంటే ట్రంకాల్ చేసి కనుక్కుంటాను."    
    "ఇదంతా వేషాలేమో" అని అనుమానం రాకపోలేదు మోహన్ కి..... ఒక్కక్షణం ఆలోచించి "కనుక్కోండి" అన్నాడు. తనకు నష్టమేముందీ? ఏం తెలుస్తుందో? రేఖ వైజాగ్ కు బుక్ చేసిన ట్రంక్ కాల్ రావటానికి రెండు గంటలు పట్టింది.

 Previous Page Next Page