Previous Page Next Page 
అనిత పేజి 5


        
    "శారదా! ఆగాగు ఇప్పుడు నేను వచ్చింది పరామర్శలు చేయించుకోవడానికి కాదు. పెళ్లి సంబందాలు వెతకటానికి....."
    శారదమ్మ పిచ్చిపట్టిన దానిలాగా చూపింది.
    "ఏవిటి? పెళ్లి సంబంధాలా? నువ్వు మళ్ళీ ఈ వయసులో."
    విరగబడి నవ్వాడు దయాశంకర్...

    "పిల్లనిచ్చేవాడుంటే నేనూ చేసుకుంటాను. కానీ పెళ్ళి సంబంధాలు వెతక వలసింది నాకు కాదు. అనితకి___"
    "అనిత ఎవరు?"
    "ఓ! నీ కసలు ఏమీ  తెలియదు కదూ! అనిత నా కూతురు. బంగారు బొమ్మ ఫోటో చూడు."
    అనిత  ఫోటో శారదమ్మ కిచ్చాడు దయాశంకర్.
    "ఎంత బాగుంది! అచ్చు  హిందువుల పిల్లలాగా___" ముచ్చట పడింది శారదమ్మ.
    "అవును. దానికి అన్నీ  మన అలావాట్లే వచ్చాయి. నేను రోజాను  పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ 'నీకు పిల్లలు పుడితే పెళ్లేలా చేస్తావ్?' అని భయపెట్టారు.
    ఆ మాటలు రోజాతో  చెప్తే రోజా నవ్వేసి మనలాగే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు,' అనేసింది అదే బాగుందని ఇన్నాళ్లూ నిశ్చింతగా ఉన్నాను. ఈ అనిత ఉందే. ఇది  నా ప్రాణం తీసింది."
    "ఏం? ఎవరిని ప్రేమించింది?"
    భయంగా అడిగింది శారదమ్మ.
    పకపక నవ్వాడు దయాశంకర్.
    "ప్రేమిస్తే బెంగదేనికి? సుఖంగా అది కోరిన వాడికిచ్చి పెళ్ళి చేసే వాడిని. అది ఎవరినీ ప్రేమించలేదు. 'నీ యిష్టం నాన్నా! నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళను చేసుకుంటాను అంది."
    "ఎంత మంచి పిల్ల!" మురిసిపోయింది శారదమ్మ.
    "మంచిదా? రణగోండిరాలుగాయ? ఇప్పుడు  న్నేం చెయ్యమంటావో చెప్పు. చచ్చినట్లు సంబంధాలు వెతుకుతున్నాను. ఈ ఊళ్ళో ఒక సంబంధం ఉందని విని వచ్చాను. పెళ్ళికొడుకు......"
    దయాశంకర్ మాట పూర్తీ కాకుండనే రాజారావు వచ్చాడు.
    "ఇత నెవరు?" ఆశ్చర్యంగా అడిగాడు దయాశంకర్.
    "మా పెద్దబ్బాయి రాజారావు. లా పాపయి ఈ ఊళ్ళోనే లాయరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటు పొలం పనులు కూడా వాడే చూసుకుంటున్నాడు. వీడి తరువాతది సుశీల బి. యస్ సి. చదువుతోంది. దీనికి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాం. సంబంధం ఇంచుమించు కుదిరినట్లే. ఆ తరువాతది కమల పోర్తుఫారం చదువుతోంది. ఆఖరివాడు కన్ని - సెకండ్ ఫారంలో ఉన్నాడు."
    "బాగుంది!"
    రాజారావునే చూస్తూ ఆలోచిస్తూ అన్నాడు దయాశంకర్.
    "రాజా! ఈయన మీ మావయ్య".
    "రాజారావు దయాశంకర్ ని ఎన్నాడూ చూడకపోయినా అతని గుఱించి విన్నాడు నమస్కారంచేసి "అత్తయ్యగారిని కూడా తీసుకొచ్చారా?" అన్నాడు మామూలు మర్యాద సూచకంగా___
    "ఆహా! పరవాలేదోయ్ ! మా కంటె మీరే నయం. మీ నాన్న మమ్మల్ని వీథిలోంచే వెళ్ళకొట్టాడు. నువ్వు ప్రేమగా అత్తయ్య గారిని గూడా తీసుకు రమ్మంటున్నావ్! ప్చ్! ఈ మార్పు చూసే అదృష్టం ఆవిడికి లేదయ్యా! పై లోకానికి వెళ్ళిపోయింది."
    "అయామ్ సారీ!"
    "దట్సాల్ రైట్!"
    మీ ఆరోగ్యం బాగుందా?"   

 Previous Page Next Page