సుశీల అడ్డ దిడ్డం ప్రశ్నలు వెయ్యకుండా అంత త్వరగా ఒప్పుకున్నందుకు చాలా సంతోషించింది ప్రసూన.
ఎంతో శ్రద్ధగా అలంకరించుకుంది. అన్నమాట తప్పకుండా వచ్చాడు మోహన్ ..... ఆప్యాయంగా ఆహ్వానించింది. ఏవేవో ఫలహారాలు అతని ముందు పెట్టింది. ఫలహారం చేస్తూ "నన్నెందుకు రమ్మన్నారు ?" అన్నాడు మోహన్ మామూలుగా ......
తన ధోరణి ప్రసూనకు ఇబ్బందిగా ఉంది. నవ్వి "అంతమంది ఆడపిల్లల్లో మీరు నన్ను గుర్తు పెట్టుకుంటారని అనుకోలేదు." అంది .......
మోహన్ తెల్లబోయి "నిన్న మీరు పలకరించే వరకూ మీ రేవరావు నాకు తెలీదు ....." అన్నాడు.
ప్రసూన ఇంక భరించలేకపోయింది.
"ఏయ్ మిష్టర్ ! ఆడపిల్లలకు ప్రేమలేఖలు వ్రాసిఅల్లరి పెడదామనుకుంటున్నారా?" అంది .....
"నేను .... ఆడపిల్లలకు .... ప్రేమ లేఖలు వ్రాస్తావా? ఎవరికీ వ్రాశాను ?....."
"ఎవరికో వ్రాస్తే నాకెందుకు? నాకు వ్రాయబట్టే నేను అడుగుతున్నాను........"
"మీకు ప్రేమలేఖ వ్రాశానా? చూపించండి ........"
ఎప్పుడూ తన బేగ్ లో ఉంచుకునే ప్రేమ లేఖ తీసి దానిని చూసి ఫక్కున నవ్వాడు మోహన్ ......
"ఇది నేను రాయలేదు __ కావాలంటే నా రైటింగ్ చూడండి ......."
ఒక కాగితం తీసుకుని "డియర్ సునా......." అని వ్రాసి చూపించాడు . ఆ దస్తూరికీ ఉత్తరంలో దస్తూరికి పోలికలేదు .......
ప్రసూన ముఖం వెలవెలబోయింది.
"అదీగాక నేను మాట్లాడుతొంటే వింటారు కదా నేను వ్రాస్తే ఇంత చప్పగా వ్రాస్తావా?"
అవమానంతో తల క్రిందకు వాలి పోతోంది ప్రసూనకు ......
"ఇంతకూ మీరు నన్నెందుకు పిలిపించారు? ఆ ప్రేమ లేఖకు సమాధానం ఇయ్యడానికా?"
మోహన్ కళ్ళలో కొంటేనవ్వు ..... ప్రసూన మానసు మండిపోయింది . ఆ మంటలో రాబోయే కన్నీళ్ళు ఆవిరయిపోయాయి.
"కాదు! ఇలాంటి పోకిరీ పనులు చెయ్యకుండా బుద్ధి చెప్పటానికి ......."
"నేను నమ్మను ..... అలా అయితే ఇంట్లో ఎవరూ లేకుండా చూసి పిలిచేవారు కాదు. ఇంత శ్రద్దగా అలంకరించుకునే వారు కారు ..... నాకీ ఫలహారం పెట్టెవారు కాదు ....." ప్రసూన చటుక్కున మొఖం తిప్పుకుంది . పైట కొంగులో ముఖం దాచుకుంది.
మోహన్ కొంటే తనం ఎగిరి పోయింది.
"అయాం సారీ!" అన్నాడు.
ప్రసూన పైట కొంగులోనుండి ముఖం బయటకు తియ్యలేదు .
ఆ పైట చాటున ముఖం ఏం చేస్తుందో ఎగసి పడుతున్న వక్షస్థలం చెప్పుతోంది ......
"ఇలా అయితే నేను వెళ్ళిపోవలసి వస్తుంది . ఇలా చూడండి వక్షస్థలం చెప్పుతోంది ......
ఇలా అయితే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలా చూడండి . మామూలుగా నవ్వండి ........"
"ఒక్క నిముషం వెళ్ళకండి ....." పైట చాటునుండే అని బాత్ రూమ్ లోకి పరుగెట్టింది ప్రసూన. వెంటనే బయటకు వచ్చింది. చేక్కిళ్ళూ , కళ్ళూ ఎఱ్ఱగా ఉన్నాయి. మామూలుగా నవ్వాతానికి ప్రయత్నించింది.
మోహన్ కాలేజి విషయాలు అవి ఇవి చాలా మాట్లాడాడు __ అతని మాటల్లో పడి మధ్య మధ్య ప్రసూన నవ్వేసింది.
ఒక్క అరగంట కూర్చుని "వెళతాను" అని లేచాడు మోహన్. ప్రసూన తల ఊపింది. ఉండమని అనలేదు. గుమ్మందాకా వెళ్ళిన మోహన్ ఒక్క క్షణం ఆగదు . "నేను బీదవాడ్ని _ కష్టపడి చదువుకుంటున్న వాడ్ని __ ప్రేమించటంలాంటి హాబీలు నాకు లేవు ....." అన్నాడు.
ప్రసూన మాట్లాడలేదు. మోహన్ వెళ్ళిపోయాడు. అంతవరకూ ఆణచుకున్న దుఃఖం ఒక్కసారి పొంగివచ్చింది ప్రసూనకు.
చేతులతో ముఖము కప్పుకుని ఏడుస్తున్న ప్రసూన భుజంమీద చెయ్యిపడేసరికి ఉలిక్కిఅప్ది సుశీలను చూసి కోపంగా "ఎందుకొచ్చావ్ ? రావద్దని చెప్పలేదూ?" అంది.
"నీ అర్జెంటు పని అయ్యాకే వచ్చానుగా! బస్ స్టాఫ్ దగ్గర కారాపి మోహన్ వెళ్ళిపోయాకే వచ్చాను."
ప్రసూన కర్ధమాయి పోయింది సుశీల చేసిన పని!
ఆ తరువాత మోహన్ కలుస్తాడనే ఆశలేకపోయింది ప్రసూనకు. ఫైనల్ ఇయిర్ పూర్తీలవతంతో ఎక్కడి వాళ్ళక్కడ విడిపోయారు .... తరువాత ఇన్నాళ్ళకు మోహన్ ను కలుసుకోవడం ..... సిగ్గునూ , సంకోచాన్నీ సంతోషాన్నీ కూడా కలిగించింది ప్రసూనకు . కపహీ సిఫ్ చేస్తూ "సుశీల మీ స్నేహితురాలా" అన్నాడు మోహన్ .....
"అవును సాంబశివరావుగారి అమ్మాయి ......"
చురుగ్గా చూశాడు మోహన్ .......
"సాంబశివ౦గారు మీకు మొదటినుంచి _ అంటే ఈ పనిలో చెరకముందు నుంచి తెలుసా? ....."
"చాలా చిన్నప్పట్నుంచి తెలుసు. ఆయనా మా నాన్నగారూ మంచి స్నేహితులు ........"
మీ నాన్నగారు ఏమి చేస్తుంటారు?"
ప్రసూన తడబడింది "వ్యాపారం" అంది __ ఇంకేమీ అడగలేదు మోహన్ ........
చీర కుచ్చేళ్ళు చెదరకుండా వయ్యారంగా లయగా నడిస్తూ "హాలో మిస్ ప్రసూన" అంటూ వచ్చిన రేఖ మోహన్ ను చూసి ఆగిపోయింది .....
"ఈవిడ రేఖ __ ఇక్కడ డాన్సర్ " అంటూ పరిచయం చేసింది ప్రసూన ......
రేఖచేతులు జోడిస్తూ , మోహన్ ను చూసి అదొక రకంగా నవ్వింది ..... మోహన్ తిరిగి నవ్విననవ్వుకు రేఖ మీది విలాసపునవ్వు ఎగిరిపోయింది. "మీ స్నేహితురాలా?" అని ప్రసూనను అడిగాడు మోహన్ __
"అవును " అంది రేఖ.
"కాదు" అనలేకపోయింది ప్రసూన.
"నేను వస్తాను థాంక్సు!" అని వెళ్ళిపోయాడు మోహన్ ....
రేఖ విలాసంగా నవ్వి "నేను వెళ్తాను . ఒకసారి నిన్ను చూద్దామని వచ్చాను" అని వెళ్ళిపోయింది.
ప్రసూన తన బేగ్ లో అపురూపంగా దాచుకున్న కాగితం బయటకు తీసి చూసింది ..... అందులో రెండే రెండు మాటలున్నాయి.
"డియర్ సునా!"
ఆనాడు ఆ ప్రేమలేఖలోది. తన దస్తూరి కాదని నిరూపిస్తూ మోహన్ రాసిన మాటలు.