Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 5


    "పోనీలే.....ఎవరి హాబీ వాళ్ళది."
    "చిన్న లెసన్ చెప్తాను చూడు....." అంటూ హాంగర్ తీసుకెళ్ళి శబ్దంకాకుండా తలుపు దగ్గరకిందపడుకుని హాంగర్ కొక్కెం నెమ్మదిగా బయటకుతోసి దానితో చీరకుచ్చెళ్లు పట్టించి లోపలకు లాగాడు. చీర అంచులోపలికొచ్చింది.
    అది మరికొంతలోపలకు లాగి గ్రిప్ దొరికాక గట్టిగా ఒక్క లాగులాగాడు. చాలా భాగం లోపలికొచ్చేసిందది. బయట నుంచి కెవ్వున కేక వినిపించింది.
    సురేష్ అదిరిపడ్డాడు. ఆ గొంతుగంగాభవాని గొంతులాలేదు. ఛటుక్కున లేచి తలుపుతీశాడు. ఎదురుగా ఓ యువతివంటిమీద మిగిలిన కొంచెం చీరను గట్టిగాపట్టుకొని లంగా, జాకెట్ మీద నిలబడి ఉంది ఆమె ముఖంలో భయం సిగ్గు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయ్. ఆమె కేకవిని బయటికొచ్చినగంగాభవాని నిర్ఘాంతపోయి చూస్తోంది. మిగిలిన కొద్ది చీరనూ ఛటుక్కున పైటగా వేసుకుందామె. తులసికూడా బయటికొచ్చి ఆమెను చూసి ఆశ్చర్యపోయింది.
    "ఓ అయామ్ సారీ! లోపలకు రావే....." నొచ్చుకుంటూ అందామె.
    ఆ అమ్మాయిచీరనంతా వెనక్కులాక్కుంటోంది. సురేష్ 'ఇహి' అన్నాడు నొచ్చుకుంటూ, తులసివేపు ప్రశ్నమొఖంతో చూశాడు.
    "సుశీల, సురేష్ నేను చెప్పలేదూ? షేర్స్ బ్రోకర్ గా వర్క్ చేస్తోందని...." పరిచయం చేసిందామె.
    "నమస్తే" అన్నాడు సురేష్.
    "నమస్తే" అందామె చీర చుట్టేసుకుంటూ.
    "అయామ్ వెరీసారీ! మీరనుకోలేదు. గంగాభవాని గారనుకుని చీరకుచ్చిళ్ళు లాగేశాను...." ఆ పక్కనే నిలబడ్డ గంగాభవాని అదిరిపడింది.
    "అంటే నా చీర కుచ్చిళ్ళు లాగేద్దామనా?" ఉక్రోషంగా అంది.
    "అవును! తలుపుచాటున నిలబడి మాటలు ఎవరువిన్నా చీర లాగేస్తాను...."
    "సురేష్" అసహనంగా అంది తులసి.
    "ఓ.కే. గంగాభవానిగారూ! మా ఇంటికి గెస్ట్ వచ్చారు. వెళ్ళాక మీ చీర సంగతి మాట్లాడుకుందాం" నవ్వుతూ చెప్పాడు.
    సుశీలతులసితో పాటు వంటింట్లోకి నడిచి చీర కట్టుకునిబయటి కొచ్చింది.
    ఇద్దరికి పరిచయం చేసింది తులసి.
    "గ్లాడ్ టు సీయూ...." అంది సుశీల.
    "గ్లాడ్ టు సీయూ......అఫ్ కోర్స్.....విత్ శారీ....."
    ఆమె నవ్వేసింది సిగ్గుతో.
    "ఇన్ ఫాక్ట్ ఇప్పటికంటే ఇందాకే మీరు చాలా అందంగా ఉన్నారు....."
    "సుశీల మొఖం ఎర్రబడింది."
    సురేష్ మందలింపుగా అంది తులసి.
    "ఓ.కే. బైదిబై మీరు షేర్స్ అమ్మటానికి వచ్చారుకదూ....."
    "యస్....."
    "ఫోమ్ బెడ్స్ కంపెనీ షేర్స్! అంతేనా?"
    "యస్! ఫోమ్ బెడ్స్ కంపెనీ.....చాలాబ్రైట్ ఫ్యూచర్ వుంది దానికి."
    "అఫ్ కోర్స్! ఫోమ్ బెడ్స్ లేకపోతే దేశమంతా అల్లాకల్లోలం అయిపోతుంది! రివాల్యూషన్ కూడా రావచ్చు."
    ఆమె అర్ధంకానట్లు చూసింది.
    అదెలా?
    "ఎలాగేముందీ? దేశం మొత్తంమీద పాప్యులేషన్ ప్రొడక్షన్ ఆగి పోతుంది కదా...."
    "సురేష్ మాటలకేంగాని.....ఈ షేర్లగురించి చెప్పు! కొంటే ఏమిటి లాభం? అడిగింది తులసి."
    "ఇప్పుడు కొనేసి పెట్టుకుంటే కంపెనీకి బాగా లాభంవచ్చినప్పుడు అమ్మకానికి పెట్టేయవచ్చు అప్పుడు మంచి రేటువస్తుంది. అంటే బోలెడు ప్రాఫిట్."
    "ఒకవేళ కంపెనీకి నష్టం వస్తే?" అడిగాడు సురేష్.
    సుశీలకేం మాట్లాడాలో తెలీలేదు కొద్దిక్షణాలపాటు.
    "నష్టం ఎలా వస్తుంది? మీరేవప్పుకున్నారు కదా ఫోమ్ బెడ్స్ కి చాలా మంచి ఫ్యూచర్ ఉందని." వప్పుకున్నాం! కానీ ఒకవేళ ఇంకెవరయినా ఫోమ్ బెడ్స్ కి బదులుగా ఇంకేమయినా కొత్త మెకానికల్ డివైన్ కనుక్కుంటే?
    అంటే?
    "అంటే ఉదాహరణకు స్ప్రింగ్ యాక్షన్ చేర్స్ లాంటివి."
    "దేనికవి? అనుమానంగా అడిగిందామె."
    "రండి. ఈ చైర్ మీద ప్రాక్టికల్ గా చూపిస్తాను."
    "సురేష్ మాటలుపట్టించుకోకు." బాగా సిగ్గుపడిపోయిన సుశీలను మళ్ళిస్తూ అంది తులసి.
    "ఇంతకూ ఎన్ని షేర్స్ కొనాలంటావ్?"
    "పదివేలరూపాయలు ఇన్ వెస్ట్ చేస్తే మంచిది."
    "ఆల్ రైట్ డన్......"
    సుశీల మొఖంలో ఆనందంకనిపించింది.
    "అయితే మనకు డీల్ కుదిరిందన్నమాట" నవ్వుతూ అన్నాడు.
    ఆమె తలూపింది.
    "ఇవాల్టినుంచీ మనం ముగ్గురం ఫోమ్ బెడ్స్ షేర్ చేసుకోవచ్చు అంతేనా?"
    "అవును....."అనేసి నాలిక్కరచుకుందామె. మొఖం ఎర్రబడిపోయింది.
    తులసిపదివేలకు చెక్ రాసి ఆమెకిచ్సింది.
    థాంక్యూ ఈ కంపెనీ టార్గెట్ పూర్తయిపోయింది....దీనితో?
    కొద్దిసేపు కబుర్లలో మునిగిపోయారు.
    "పద భోజనం చేద్దాం" అంది తులసి.
    "తులసి అదృష్టవంతురాలు.....మీలాంటి జాలీటైప్ దొరకటం నా అదృష్టం.
    సుశీల కంగారుగా తులసి వేపు చూసింది.
    అప్పుడే ట్రాన్సిష్టర్ లో రెండుతెలుగు రేడియో స్టేషన్ లు కలబడి పోయినయ్. ప్రముఖ ఆఫ్రికా నాయకులు శ్రీ జికోగో ప్రభుత్వ ఆహ్వానం పై భారత పర్యటనకు నేడు అరుదెంచారు. ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ రాష్ట్రపతి శ్రీ వెంకట్రామన్ ఆయనకు విమానాశ్రయం వద్దఘనమైన స్వాగతం ఇచ్చారు. శ్రీ జికోగో.....తెల్లగా పొట్టిగా వుంటాడు. మొఖం మీద మూడు కత్తిగాట్లు వుంటాయ్. తేకుగు తమిళభాషలు మాట్లాడగలదు. నెత్తిమీద ఒక కుచ్చుటోపీకూడా వుంటుంది. బూట్లుతొడుగు తాడుగానీ సాక్స్ లు వుండవు.
    తరచుగా అంబర్ బీడీలు తాగుతుంటాడు ఇతని ఆచూకి తెలిపినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని నగర పోలీస్ కమీషనర్ గారు చెప్తున్నారు......
    ......ప్రముఖసంఘ సేవకురాలు శ్రీమతిలిల్లీజయరామ్ కి ప్రపంచ శాంతి బహుమతి లభించింది. ఈమె....
    ......తన భర్తనూ, ప్రియుడినీ ఒకే బుల్లెట్ తో కాల్చిచంపిందని ప్రత్యక్షసాక్ష్యాల కథనం,
    ఆ తరువాత......
    .....ఆమెకు వరుసగా ముగ్గురు పిల్లలు జన్మించారు. శ్రీమతి లిల్లీకి పుట్టుకతోనే శాంతికాముకురాలనీ గవర్నర్ శ్రీ గబగ్ షీన్ కోషి అన్నారు. ఎనిమిదేళ్ళ వయసులోనే శ్రీమతి లిల్లీ......
    .......ఒక ప్రియుడిని కాల్చి చంపినట్లు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయ్.....
    .....ఇప్పటికి ఆమె......

 Previous Page Next Page