Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 6


    ----పడగ్గదిలో నుండి నాలుగు అస్థిపంజరాల్ని తవ్వి వెలుపలకు తీశారు.....రష్యన్ రోదసీ యాత్రకు ఎన్నికయిన భారతీయులకు భారత రోదసీ యాత్రికుల భార్యల సంఘం తమ అభినందనలు తెలియజేసారు. రోదసి యాత్రికులు.....
    ......ఇక నుంచి సగం ఛార్జీ భరించాల్సివుంటుందని రైల్వేమంత్రి లోక్ సభలో ప్రకటించారు. త్వరలో సీజన్ టికెట్ల రేట్లు పెరగబోతున్నట్లు కూడా మంత్రి సభ్యులకుతెలిపారు....
    "మిస్ ఇండియా మరియు మిస్ హైద్రాబాద్ ఎన్నికయిన ఉమారాణి ఆంద్రప్రదేశ్ లోని తెనాలిలో జన్మించింది.
    ......ఒకే తల రెండు శరీరాలతో వున్న ఈ శిశువును చూడ్డానికి జనం ఎగబడుతున్నారు....
    .....రెండింట్లో ఒకటే వుంచుకోవచ్చునని అందాలపోటీ జడ్జీలు అభిప్రాయపడుతున్నారు.....ఆమె అందం అద్భుతం అని ఒక జడ్జి అన్నారు. ఆమె.....
    .....నిరుద్యోగ యువకుల పాలిటకల్పతరువని ముఖ్యమంత్రి అన్నారు.....
    తులసి నవ్వాపుకోలేక ట్రాన్సిష్టర్ ఆఫ్ చేసేసింది.    
    "మీ ట్రాన్సిష్టర్ కూడా జాలీటైప్ లాగుంది" నవ్వటం ఆపి అంది సుశీల.
    "మీకు జాలీ అంటే చాలా లైకింగ్ వున్నట్లుంది. మీరు కూడా ఇక్కడే వుండిపోకూడదు? ముగ్గురం జాలీగా జీవితం గడిపేయవచ్చు"
    ఆమె నవ్వటం ఆపేసింది. "మీరు చాలా ట్విస్టింగా మాట్లాడుతున్నారు...." అంది చిరుకోపంతో.
    "అన్నిచోట్లట్విస్టింగానే వుంటాను. కావాలంటే తులసిని అడగండి."
    ఆమె భోజనం ముగించి చేయి కడుక్కుంది.
    "బైది బై మీ మెజర్ మెంట్స్ ఏమిటి? అయ్ మీన్ మీ ఫోమ్ బెడ్...."
    "ఎందుకు?" విచిత్రంగా చూస్తూ అడిగింది.
    "వీటిమీద ధీసిస్ చెప్తున్నాను. మెజర్ మెంట్స్ ను బట్టి ఉపయోగించేవారి మనసులను స్టడీచేయటం నా హాబీ....."
    ఆమె వెళ్ళిపోయింది.
    సురేష్ రైల్వేరిజర్వేషన్ ఆఫీస్ కి బయల్దేరాడు.
    చాలాకోలాహలంగా వుందక్కడ.
    "ఎక్స్ క్యూజ్ మీ...."
    కౌంటర్ దగ్గరున్న అమ్మాయిపాములా తలెత్తింది.
    "ఒక జిరాఫీ.....ఒక లేడీ కావాలి.....ఏకౌంటర్ లో ఇస్తారు?"
    ఆమె బెదిరిపోయింది.
    "బెగ్ యువర్ పార్డన్....."
    "జిరాఫీ.....ఒకలేడీ....జిరాఫీ మెడబాగా పొడుగుండేది చూసి ఇవ్వండి....."
    "ఇది 'జూ' కాదు" చిరుకోపంతో అంది.
    రిజర్వేషన్ ఆఫీస్ అతను చుట్టూ ఓసారి చూశాడు.
    "ఓ సారి! పక్షులకూతలు, జంతువుల అరుపులు వినబడుతూంటే రైల్వే 'జూ' అనుకున్నాను."
    "అవి కాలింగ్ బెల్స్...."
    "బెగ్ యువర్ పార్డన్?"
    ఆమెకు కోపంవచ్చింది. "అవి కాలింగ్ బెల్స్!" గట్టిగా అంది.
    "అయ్ సీ! అయితే రెండు బెర్త్ లు ఇవ్వండి నర్సాపూర్ కి.....కౌంటర్ ఫాయిల్ అందించాడు.
    ఆమె టికెట్స్ మీద వివరాలు రాసుకుంది.
    "చూడండీ మిస్! బెర్తులు పక్కపక్కనే ఇవ్వండి...."
    ఆమె రాయటం ఆపింది.
    "ఒకటి పైన ఒకటికింద.......పరవాలేదా?"
    "పైన నేనూ మా తులసా?"
    "ఎవరయినా పర్లేదు"
    "చూశారా! నేనూ అదే చెప్తూంటానెప్పుడూ తులసికి! కాదు.....చాలాతేడా వస్తుందంటుంది మా తులసి. ఆమె ఏదో మాట్లాడబోయింది కానీ అంతలోకే ఏదో అర్ధమయిపోయినట్లు మొఖంలో ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఆ ఎక్స్ ప్రెషన్ వెనుకే మొఖంలో కి రక్తం చివ్వున చిమ్మింది."
    హఠాత్తుగా సీరియస్ అయిపోయింది.
    టికెట్స్ అతని ముందుకి తోసిచిల్లర ఇచ్చేసింది.
    "థాంక్యూవెరీమచ్! మా ఇద్దరికీ ఎంతో ఉపయోగపడేసలహా ఇచ్చినందుకు...."
    ఆమె పళ్ళు కొరికింది.
    ఇల్లు చేరుకునేసరికి తులసీ, గంగాభవానీ కబుర్లు చెప్పుకుంటున్నారు.
    అతనిని చూడగానే గంగాభవానీ చటుక్కున లేచినిలబడింది.
    "అయ్యయ్యో! ఎందుకు లేచారు? మీరే భంగిమలో వున్నా బాగానే వుంటారు...."
    "కంగ్రాచ్యులేషన్స్" అంది తులసి చేతిలోని కవర్ అతని మీదకు విసిరేస్తూ. సురేష్ ఆశ్చర్యంగా కవర్ అందుకుని లెటర్ తీసి చదివాడు.
    "అపాయింట్ మెంట్ ఆర్డర్ త్రీస్టార్ హోటల్లో."
    "ఇప్పుడింకవెంటనే పెళ్ళి చేసుకోవాల్సిందేదబాయింపుగా అంది గంగాభవాని."
    "ఇప్పుడా?" ఆశ్చర్యంగా అడిగాడు ఇంపాజిబుల్!
    "ఎందుకని? ఎక్స్ పీరియన్స్ చాలా సంపాదించారుగా?"
    "ఇది ఇద్దరిజీవితాలకు సంబంధించిన విషయం! ఒకరినొకరు ఇంకా లోతుగా అర్ధం చేసుకోవాలి మేడమ్ ఒకరోజుతో ఆగే వ్యవహారంకాదుగదా! జీవితమంతా కిందామీదా పడుతూనే ఉండాలి! మీ సంగతేమో నాకు తెలీదు కానీ తులసికి కిందా మీదకంటే..మీదా కిందా....."
    ఆమె మొఖం ఎర్రబడిపోయింది.
    "తర్వాత చెప్పలేదనకండి మళ్ళీ! పెళ్ళి వెంటనే జరగకపోతే ఇల్లు ఖచ్చితంగా ఖాళీ చేయాల్సి వస్తుంది."
    సురేష్ జాలిపడ్డాడు.
    "అయ్యోమా కోసమని మీరు త్యాగంచేసి ఇల్లు ఖాళీ చేస్తారాసరే! ఏం చేస్తాం? మీకింకో ఇల్లు వెతికిపెట్టడానికి మేమూ సహాయం చేస్తాం."
    ఆమె కోపంతారా స్థాయికొచ్చేసింది.
    "అలాగా! చూద్దాం! ఎవరు ఖాళీచేస్తారో....." రుసరుసలాడుతూ ఇంట్లోకి నడిచింది. తులసి సురేష్ చేయిపట్టుకుని లోపలకులాక్కువెళ్ళింది.
    "లోపలమహేష్ కుర్చీలో కూర్చుని తెల్లకాగితం మీద ఏదో రాస్తున్నాడు."
    "హలో!" చిరునవ్వుతో పలుకరించాడు సురేష్.
    "హలో!" ఒక్క నిమిషం! పొయిట్రీ రాస్తున్నాను. అయిపోవచ్చింది.
    "నీతో పనుండివచ్చాడు" తులసిచెప్తోంది.
    "అలా చెప్పమన్నాడేమోగానీ నిజానికి నేను ఇంట్లో లేననుకుని వచ్చివుంటాడు."
    మహేష్ పొయిట్రీ రాయటం ఆపి మరీ నవ్వసాగాడు.
    తులసివిసిరిన ఫ్లవర్ వాజ్ భుజం పక్కనుంచి దూసుకుపోయి గోడకు కొట్టుకుని కిందపడింది.
    రెండోవేపు నుంచీ వినిపించింది కిలకిలారావం.
    అప్పుడు చూశాడటు.

 Previous Page Next Page