Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 4


    "శుభవార్తే....."
    "ఓ! అయితే ఈ శుభవార్తనేం చేద్దాం?"
    "సెలబ్రేట్ చేసుకుందాం"
    "అంటే జూలియన్ సీజరేనా?"
    "నో......" ఖచ్చితంగా అంది.
    "మరి?"
    "అయ్ వాంట్ దిస్ బేబీ!" అతనివంక చూడకుండానే చెప్పింది.
    సురేష్ ఉలిక్కిపడ్డాడు.
    "ఆర్ యూసీరియస్?"
    "యస్. అయామ్ సీరియస్"
    "ఇప్పుడెందుకు బేబీ?"
    "బికాజ్ వుయ్ కెన్ ఎఫర్ట్ ఎ బేబీ నౌ!"
    "నో...... అయ్ కాంట్.....
    "అయితే స్నేహితుల్లాగా విడిపోదాం......"
    "స్నేహితులు విడిపోరు......"
    "అయితే ఇవాళ్టినుంచి మనం శత్రువులం......ఎవర్దారినవారు పోదాం.."
    "హా! దెబ్బతీసేశావ్...."
    "ఎందుకు?"
    "మనం శత్రువులన్నావ్ కాబట్టి.......రాత్రింబవళ్ళు కలబడి యుద్ధంచేస్తూనే వుండాలిక....." తులసి భోజనం ఆపి త్రుళ్ళి త్రుళ్ళినవ్వ సాగింది.
    "చాలూ నెంబర్ వన్....."
    ఇల్లు చేరుకునేసరికి గంగాభవాని తాడుమీద బట్టలారేస్తుంది.
    "కాయా, పండా? తులసిని అడిగింది ఆత్రుతగా."
    "కొబ్బరిబొళ్ళాం" కల్పించుకుంటూ అన్నాడు సురేష్.
    ఆమె మొఖం మాడిపోయింది. చూపుల్లో డేగ వచ్చేసింది.
    "మొఖం మారినంత మాత్రాన ఆ బుద్దెక్కడికిపోతుంది?" రుసరుసలాడుతూ అంది.
    "తలుపు బయట నిలబడిలోపల మాటలు మీకు మాత్రం వినేబుద్దిలేదూ నేనేమయినా కంప్లెయింట్ చేశానా?"
    "అలాంటి బుద్ది నాకేం లేదు రోషంగా అందామె."
    "బుద్దిమారితే మీకే ప్రమాదం! తర్వాత నన్నేమీ అనకండి!" బెదిరించాడు సురేష్.
    "నాకేం ప్రమాదం?" రోషంగా అడిగింది.
    "ఇలా రోషంగా అడిగే యశోధర అనే రౌడీ టైపిస్టు కవలపిల్లల్ని కంది....." అంటూ మీదకొస్తున్న తులసిని తప్పించుకోడానికి ఇంట్లోకి పరుగెత్తాడు.
    "మధ్యాహ్నం చెప్తాను అంతా...." గంగాభవానీతో అంది తులసి.
    "ఆ మనిషిని వదిలేసెయ్! లేకపోతే ఎప్పటికయినా నీ కొంప ముంచుతాడు...." కిటికీలోంచి గట్టిగా నవ్వాడు సురేష్.
    "మరి మీ ఇద్దరూ ఎలా మానేజ్ చేస్తారు? డూయిట్ 'యువర్ సెల్ఫ్' మెథడా?"
    "అంటే?" అనుమానంగా అడిగింది గంగాభవాని.
    "అదే......టీ.వీ.లో కొత్తగా వస్తోంది కదా ప్రోగ్రామ్.....అందులో మొన్నరాత్రి ఒకామెను చూపించారు పాపం భర్తపోయినా కూడా ఆమె కష్టపడి పిల్లల్ని కని పెంచుతోందట....."
    గంగాభవానిలోపలికెళ్ళి విసురుగా తలుపువేసుకుంది.
    తులసి నవ్వాపుకుంటూ లోపలికొచ్చేసింది.
    "డ్రస్ మార్చుకోవాలి, అటు తిరుగు."
    సురేష్ వెనక్కు తిరిగాడు.
    "వేషాలన్నీ తెలుసులే అద్దంముందునుంచేలే...."
    అద్దానికి దూరంగా వెళ్ళి నిలబడ్డాడు.
    "రేపు మనం మా అక్కవాళ్ళ ఊరెళ్ళాలి....." బట్టలు మార్చుకుంటూ అందామె.
    సురేష్ ఉలిక్కిపడ్డాడు.
    "మీ అక్కగారింటికెళ్ళాలి అని నువ్వన్నట్లు వినిపించింది....." ఆమెతో అన్నాడు.
    "అవును వెళ్తున్నాం....."
    "అసలు నీకో అక్క వున్నట్లు నాకు చెప్పలేదే ఎప్పుడూ....."
    "అనవసర విషయాలు మాట్లాడటంనా కలవాటు లేదు.....అదిగాక ఈ రోజు వరకు 'నువ్వెవరు' నీ వాళ్ళెవరయినావున్నారా? అని నన్నడగలేదు నువ్వు....."
    "ఆల్ రైట్! ఇప్పుడడుగుతున్నాను....చెప్పు! నువ్వెవరు, నీ వాళ్ళెవరయినా వున్నారా?"
    "ఆమెకు నవ్వాగలేదు. అతని దగ్గరగా నడిచి అభిముఖంగా నిలబడి అతని మెడచుట్టూ చేతులు వేసింది."
    "నేనెవరో చెప్పాలా?"
    "చెప్పాలి! కాని భాషలో కాదు! యాక్షన్ లో....."
    "అతనిని తనకు హత్తుకుంటూ పెదాల మీద ముద్దుపెట్టుకుంది."
    "ఇప్పుడర్దమయిందా, నేనెవరో?"
    "సగమే అర్ధమయింది.....ఆమెను చుట్టేస్తూ అన్నాడు."
    "అది చాలులే ప్రస్తుతానికి" అతనిని తోసివేసింది.
    "ఇంతకూ మీ అక్క కథేమిటి? ఇంతవరకు మీ ఇద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలులేవు..... రాకపోకలు లేవు....."
    "మనకథంతా అక్కకి ముందే తెలుసు. నా మంచీ చెడూ నేనే నిర్ణయించుకోవాలని అక్క అభిప్రాయం. అందుకే జోక్యం కలుగచేసుకోలేదు. చిన్నప్పటినుంచీ అక్క ప్రిన్సిపుల్స్! వీలయినంతవరకూ మనం ఒకరి కష్టాలు మన నెత్తినవేసుకోకూడదు.....మన కష్టాలు ఇంకొకరి నెత్తిన రుద్దకూడదు అనే మనస్తత్వం."
    "మరిప్పుడు మాత్రం ఎందుకు వెళ్ళటం?"
    "ఇప్పుడవసరం! మొదటి కాన్పుకి అక్క సహాయం వుంటే మంచిది....." ఈ విషయాలన్నీ మాట్లాడివస్తే.....
    "ఏ ఊళ్ళోవుంటోందామె?"
    "వైజాగ్....."
    సురేష్ మంచంమీద పడుకున్నాడు. తులసి వంట చేస్తోంది.
    రేడియోలో నుంచి తెలుగు సినిమా తాలూకూ బూతుపాట వినబడుతోంది.
    తలుపు నెమ్మదిగా కదిలినచప్పుడు......
    సురేష్ కి అర్ధమయిపోయింది.
    గంగాభవాని......తలుపుకింద సందులోనుంచి చీరకుచ్చిళ్ళు కనబడుతూనే ఉన్నాయ్. బహుశాతాము మాట్లాడుకున్నమాటలన్నీ వింటూ కీ హోల్ లో నుంచి లోపలకు చూస్తూండి ఉంటుంది.
    తులసి దగ్గరకు నడిచాడతను.
    "చూశావా! మళ్ళీ మాటలు వింటోంది..... ఇందాకేమో ఆబుద్ది లేదనిబుకాయించింది."

 Previous Page Next Page