"చూద్దాం. ఆ పిల్లని మన దగ్గిరుంచుకుని బ్లాక్ మెయిల్ చేస్తే తల్లి ఇంకా ఎక్కువిస్తుందేమో?"
ఆర్నాయనో! ఏంటో అనుకున్నాను భలే తెలివైన బుర్ర నీది" మళ్ళీ చెయ్యెత్తి భుజం మీద చరచబోయాడు. సుబ్బయ్య వొడుపుగా తప్పుకునేసరికి ముందుకు తూలి బస్తాకు ముక్కు గుద్దుకుని "అబ్బా! అనుకుని "ఓర్నాయనో! నువు దెబ్బతియ్యటంలోను, తప్పుకోవడంలోను కూడా మొనగాడివే. కానీ మనిషివి బండ బారలేదు. ఎక్కువ రోజులు పోలీసు వాళ్ళకి చుట్టంగా లేనట్టున్నావు."
ఖైదులో వున్నాను అనడానికి బదులుగా పోలీసు వాళ్ళ చుట్టంగా వున్నామనుకోవడం క్రిమినల్స్ మధ్య ఒక జోక్. జైలుని అంత తేలిగ్గా భావించకపొతే సునాయాసంగా నేరాలు చెయ్యలేరు.
లారీ బెజవాడలో ఆగింది.
"మీరు మరోదారి సుస్కోండి. ఈ రేతిరికి నా బండి యిడ ఆగిపోద్ది సరుకు గోడౌనుకి అందివాల"
మిత్రులిద్దరూ లారీ నుండి క్రిందకి దూకారు. తెలతెలవారుతోంది అప్పటికి.
"మనం ఈ వేషాల్లో రోడ్డు మీద నడిస్తే తప్పకుండా కేసులు దొరకని ఏ పోలిసోడో సరదాగా మన్ని పట్టుకుంటాడు. వేషాలు మార్చి పెద్దమనుష్యుల్లా పోజుకొట్టాలి"
"ఐడియాబాగానే వుంది. కానిలారీలో పోయేవాళ్ళకి మంచి వేషాలెందుకు?"
"మనం మంచి వేషాలేసుకుంటే ఎవరైనా కార్లలో పోయేటోల్లే లిప్ట్ యివచ్చు"
"వండ్రఫుల్ కార్లో పోయినంత దూరం పోయి కార్లో వాళ్ళ పెట్టె బేడా సర్దేయచ్చు" హుషారుగా అన్నాడు జాన్. ఇద్దరూ మారుమూల హొటల్లో చిన్నగది తీసుకుని స్నానాలు చేశారు. రెడీమేడ్ షాప్ కి వెళ్ళి చెరొక జత బట్టలు కొనుక్కున్నారు. తరువాత చేరొకటి ఎయిర్ బేగ్స్ కూడా కొనుక్కున్నారు హొటల్ గదిలో కొచ్చి షోక్ గా తయారయ్యారు. ఎయిర్ బేగ్స్ లో పాట న్యూస్ పేపర్లు కూరి పైన అందమైన నేప్ కిన్స్ అమర్చాడు సుబ్బయ్య. ఇద్దరూ రోడ్డున పడ్డారు. ఖర్చు అంతా జాన్ చేతే పెట్టించాడు సుబ్బయ్య.
"కారులో పోయేవాళ్ళు మనకి లిప్టు యిస్తారంటావా?" అనుమానిస్తూన్నాడు జాన్.
ఎలాంటి వాళ్ళనైనా బుట్టలో వెయ్యటంలోనే వుంది.
హారన్ వినిపించింది. ఇద్దరూ ఆశగా వెనక్కి తిరిగారు. మారుతి కారు ఆపమన్నట్లు చెయ్యి జపాడు సుబ్బయ్య కారాగింది. కారు విండోలోంచి అమ్మాయి తల బయటపెట్టి,
"ఏమిటి?" అంది కోకిల స్వరంతో.
"జాన్ ని వెనక్కి నెట్టి ముందుకొచ్చాడు సుబ్బయ్య.
"మేడమ్! చాగల్లులో మా సిస్టర్ కి చాలా సీరియస్ గా వుందని వైర్ వచ్చింది, ట్రైన్ లో వెళ్తే చివర చూపులైనా అందుతాయో అందవో- కర్మకాండలన్ని అయిపోయాక చేరుకున్నా ఆశ్చర్యం లేదు."
కసుక్కున నవ్విందామ్మాయి. ఆ నవు చూసి బోలెడు ధైర్యం వచ్చింది ఇద్దరికి.
టాక్సీ దొరుకుతుందేమోనని చూస్తున్నాం. మేరెందాక వెళ్తున్నారు"
"నేను నూజీవిడు వెళ్తూన్నాను కావాలంటే లిప్టుయిస్తాను"
అప్పటికి సమయం సాయంత్రం ఆరుగంటలు.
"థాంక్యూ మేడమ్! థాంక్యూ వేరిమచ్"
సంబరంగా వెళ్ళి ఆ అమ్మాయి పక్కన కూర్చున్నాడు సుబ్బయ్య నవుకుంటూ.
వెనుక కూర్చున్నాడు జాన్.
రెండు కిలోమీటర్లు దూరం వెళ్ళేసరికి హైవే మీద కీచుమని శబ్దం చేసుకుంటూ ఆగిపోయింది కారు. ఇగ్నిషన్ కీ అటూ యిటూ తిప్పే కారు స్టార్ట్ చెయ్యడానికి ప్రయత్నించింది ఆ అమ్మాయి కారు కోపంగా బర్రుమని అరిచింది గాని కదల్లేదు.
పెట్రోల్ అయిపోయినట్టుంది ఆ వెధవలు నిండా పోయ్యొద్దు?" విసుక్కుంది అమ్మాయి.
"ఏ వెధవలు?" అడిగాడు సుబ్బయ్య.
"మా నౌకరు వెధవలు" విసుక్కుంటూ చెప్పింది. మిత్రులిద్దరికీ ఆ మాటల్తో ఆ అమ్మాయి మీద గౌరవం పెరిగింది.
వాళ్ళిద్దరి వైపు బేలగా చూసి "డిక్కీలో పెట్రోల్ టిన్ వుంది. మీ ఇద్దరిలో యేవరైనా పెట్రోల్ బంక్ కి వెళ్ళి పెట్రోల్ తెచ్చి పెట్టగలరా?" అంది. సుబ్బయ్య టిన్ తీసుకుని నడిచాడు జాన్ అతన్ని కలుసుకొని "గురూ! పెట్రోల్ బంక్ దాకా వెళ్ళడం, పెట్రోల్ తేవడం యిదంతా ఎందుకు వచ్చిన అవస్థ. ఇప్పుడే దీన్ని బెదిరించి ఆ మెరుస్తున్న సూట్ కేస్ పట్టుకుపోతేనని పూర్తయి పోతుంది కదా!" అన్నాడు.
"తొందరపడకు గురూ! ఇప్పుడు టైము యింకా ఏడు కూడా కాలేదు. ఇంకెవరైనా కూడా యీ దారిని వచ్చే ప్రమాదం వుంది. బెజవాడ నుంచి ఆర్.టి.సి బస్సులు కూడా వస్తుంటాయి. అందుచేత ప్రస్తుతానికి పెట్రోల్ తీసుకొచ్చి మరికొంత దూరం పోనిచ్చి చుట్టూ ఎవరు లేరని నిర్ధారణ చేసుకొని మన పనిచూసుకోవచ్చు"
కాదనలేకపోయాడు జాన్.
ఆ అమ్మాయి పర్సు తీసి డబ్బులిస్తున్నట్లు నటించింది.
"ఆహా....హా...వద్దులెండి మేము కూడా వస్తున్నాంగా. ఆ మాత్రం పెట్రోలు మేం కొనగలం" అనేశాడు సుబ్బయ్య.
ఇద్దరూ కాళ్ళిడ్చుకుంటు పెట్రోల్ బంక్ వెదుక్కుంటూబయలుదేరారు.
"బోడిగొప్ప అది డబ్బులిస్తానంటుంటే నువెందుకడ్డుకున్నావు?" సుబ్బయ్యని కసిరాడు జాన్.
"నీ ముఖం ఆ మాత్రం గొప్ప చూపించకపొతే ఆవిడకి మన మీద పూర్తీ నమ్మకం కుదుర్తుందా! పెట్రోల్ కి మహా అయితే ఇరవై, లేకపోతే ముప్పై అంతేగా, అవిడోంటిమీద నగలు చూశావా! ఇది కూడా మన మంచికే వచ్చింది. ఈ వంకన మరికొంత ఆలస్యం అవుతుంది. మరో రెండు గంటల్లో ఆవిడ వొంటి మీద నగలు సూట్ కేస్ లో ఏవుందో అదంతా అన్నీ మనకేగా!"
"ఆ అమ్మాయిని కూడా వొదిలిపెట్టద్దు. అనుభవించాల్సిందే" ఆశగా అన్నాడు సుబ్బయ్య.
"అలాగే! నీ యిష్టం.
ఎలాగైతేనే పెట్రోల్ బంక్ చేరుకోగలిగారు. జాన్ పెట్రోల్ పోయించుకుంటుంటే, సుబ్బయ్య లోపలి కెళ్ళి పెట్రోల్ బంక్ మేనేజరుతో కబుర్లు చెప్పి వచ్చాడు . అతడే మాట్లాడాడో వినబదకపోయినా , అందరితోను అంత కలుపుగోలుగా వుండగలిగే అతడి నేర్పు చూసి యిర్ష్య పడ్డాడు. కాస్సేపు సుబ్బయ్య కాస్సేపు జాన్ పెట్రోల్ టిన్ మెసుకుంటూ కారుకి ఫర్లాంగు దూరంలో స్థభించి నిలబడిపోయాడు. కార్లో ఆ అమ్మాయి లేదు. కారు చుట్టూ యునిఫారంలో పోలీసులు. కారుకి కొంచెం దూరంలో పోలీసు జీపు.