Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 4

    ముగ్గురూ రేవతి తలమీద టపటపా కొట్టి -
    "రాక్షసగొంతుతో అరచి గుండెలదరగొట్టావ్ కదే! ఏం జరిగిందోనని కంగారుపడిచచ్చాం!" తిట్టారు  ముగ్గురూ  కోరస్ గా.
    "కొట్టారు... సరిపోలేదా? దానికి వడ్డీగా మళ్లీ తిట్టాలా? మీరేగా అడిగారు....నేనుచెప్పాను. అడిగినందుకు మిమ్మల్ని  మీరు ముందు కొట్టుకుని, తర్వాత నన్ను చెప్పినందుకు కొట్టాలీగానీ..., ముందే నన్ను కొడతారేంటే?" దబాయింపుకు దిగింది.
    "సరే! బుద్దుంటే ఇంకేదీ నిన్ను అడగం! అడిగినా అన్నిటికీ ప్రిపేరయి అడుగుతాం!" అని ఎవరి తలమీద వాళ్ళు  కొట్టుకున్నాక శాంతించింది రేవతి.
    "సరేలే... ఇది టాపిక్ ను డైవర్ట్ చేయడంలో ఎక్స్ పర్ట్!" అని రేవతిని మళ్లీ తిట్టి-
    "నీకు ఏదంటే భయమే? రేవతిలా స్పెషల్ గా కాకుండా మామూలుగా చెప్పు" స్ఫూర్తిని కామిని అడిగింది.
    "నాకు ఈవిల్... ఈవిల్ అంటే భయం!" స్పష్టంగా చెప్పింది.
    "ఎందుకు? నిన్ను నీవు ఎప్పుడూ అద్దంలో చూసుకోలేదా? అప్పుడప్పుడూ అద్దంలో చూసుకుంటూండు.... ఈవిల్ అంటే భయం పోతుంది!" రేవతి-స్ఫూర్తి భుజంమీద తడుతూ, ధైర్యం ఇస్తూ సిన్సియర్ అడ్వైజ్ ఇచ్చింది.
    స్ఫూర్తి  సీరియస్ గా టీషర్ట్ చేతులు పైకి మడిచి రేవతిపై ఫిజికల్ ఎటాక్ కు దిగబోతుండగా...జ్ఞాపికా, కామినీ చెరో చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపి-
    "పోనీలేవే! నిన్ను ఇన్సల్ట్ చెయ్యాలని కాదు... అదేదో తెలీక వాగింది!" ఆపడానికి ప్రయత్నించారు.
    "నేనేం తెలీక వాగలా! ఈ మసకచీకట్లో జుట్టు విరబోసుకుని, తెల్ల టీషర్ట్ లో... అది అచ్చం 'మోడరన్ ఇండియన్ ఈవిల్' లాగా కనిపించింది.... అదే చెప్పాను" అని తను స్ఫూర్తికి దూరంగా జరిగి పారిపోవడానికి సిద్దమవుతూ చెప్పి మరీ రెచ్చగొట్టింది.
    "ప్లీజ్! నన్ను వదలండే... ఆ డన్ లప్ నీ , ఆ సోడాబుడ్డినీ, ఆ వాటర్ మిలన్ నీ... ఇప్పుడే అటో ఇటో  తేల్చేస్తా!" స్ఫూర్తికి కోపం పెరిగిపోయింది.
    ఇద్దర్నీ కూల్ చేసి కూర్చో బెట్టేసరికి పావుగంటయింది.
    ఇద్దర్నీ కూల్ చేసి  కూర్చోబెట్టేసరికి పావుగంటయింది.
    "సరే! నీకేవంటే భయంలేదు. కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు!" స్ధిరంగా చెప్పింది.
    "నాకేవంటేనూ భయంలేదు. కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు!" స్థిరంగా చెప్పింది.
    ముగ్గురూ ఒకర్నొకరు చూసుకున్నారు. 'దీని పొగరు ఎలాగే అణచడం?'... అని సైగ చేసుకున్నారు- 'ఏం  చేద్దామే..?' అని!
    ముగ్గురూ దగ్గరగా జరిగి గుసగుసగా మాట్లాడుకున్నారు.
    "సరే... నువ్వు టెస్ట్ కు రెడీనా?" ముగ్గురూ అడిగారు.
    "రెడీ..!" మళ్లీ స్థిరంగా చెప్పింది.
    కామిని చున్నీ తీసి జ్ఞాపిక కళ్ళకు గంతలుగా కట్టి-
    "చూడూ... పండు వెన్నెల! చల్లగాలి! పక్కనే శ్మశానం! పుర్రెలు, చితి మంటలు! నువ్వొక్కదానివే... కళ్ళు కనిపించడం లేదు! ఇలాగే చున్నీ  విప్పకుండా రూమ్ కు రావాలి ఒంటరిగా...!  అర్థమయిందా మా టెస్ట్?!" అడిగారు గంతలు సరిచేసి.
    "మీరెంత హిప్నటైజ్ చేసినా ;లాభం లేదు. నేనోచ్చేస్తాను... మీరెళ్లండి! నేనోచ్చేసరికి నాకు ఐస్ క్రీమ్ రెడీ చెయ్యండి!" కాన్ఫిడెంట్ గా చెప్పింది.
    "ఆలోచించుకో.... మళ్లీ!" బెదిరింపుగా అడిగారు.
    "చించుకున్నాలే.... పోండే! ఇదో పే...ద్ద టెస్ట్! దీనికో ఆలోచన!" విసుక్కుంది.
    "దీనికి ఓవర్ కాన్ఫిడెన్స్!" గొణుక్కుంటూ వెళ్లి రూమ్ లో వెయిట్ చెయ్యసాగారు.
    చల్లగాలి! నిశ్శబ్దం..!!
    గాలికి వెంట్రుకలు మెడమీద పాకుతూ గిలిగిలి రేపుతున్నాయి!కరెక్ట్ గా ఎన్ని అడుగులు నడిస్తే హాస్టల్ ముందువైపుకు మలుపు వస్తుందో ముందే అంచనా వేసుకుంది కనుక- చేతులు సాచి మెల్లగా, దైర్యంగా అడుగడుగు వేయసాగింది.
    అలా కొన్ని అడుగులు వేశాక- ముక్కుమీద ఏదో మెత్తటిగాలి సుడిగా వచ్చి తనను కదిపించినట్లయి కొంచెం తూలింది.
    ఎవరో తనను పడకుండా భుజంమీద రెండుచేతులూ ఆనించి పట్టుకున్నారు.
    "వదలండే... నేను నడవగల్ను!" విసుక్కుంది రోషంగా!
    వదిలేశారు.
    మరో రెండడుగులు వేశాక చెవిలోలకును చూపుడువేలితో సున్నితంగా కదిలించారు.
    "చంపుతా... ముట్టుకుంటే!" మళ్లీ అరిచింది.
    వదిలేశారు.
    రెండడుగులు వేశాక గడ్డంమీద నుండి మెడవంపులోకి ఆపై కిందికీ ఏదో చూపుడువేలు పాకినట్లనిపించి మొహం విదిలించింది. అయినా దైర్యంగానే అడుగులు వేసింది. ఈసారి పక్కనే, దగ్గరగా ఏదో ఆకారం నడిచినట్లనిపించింది!
    తడిమి చూడబోతే దూరంగా జరిగినట్లనిపించింది.
    అలాగే నడుస్తూ... మలుపు దగ్గరకు వచ్చిందనే ఐడియా రాగానే-సడన్ గా మలుపు తిరిగింది. స్లిప్పర్స్ కు రాయి తగిలి తూలి వెనకకు పడబోతూ గాలిలోకి చేతులుచాచింది పట్టుకోసం.
    అంతే..!
    ఏవో రెండుచేతులు తనను నడుంమీద బాలెన్స్ డ్ గా పట్టుకుని పైకి లేపాయి.
    ఆ ఆధారాన్ని పడకుండా గట్టిగా ఒడిసిపట్టుకుంది జ్ఞాపిక.
    నులివెచ్చని శరీరమది.
    నిలువెల్లా అదిమి పట్టుకుంది! ఆ శరీరం తన ఫ్రెండ్స్ ది కాదనిపించింది. ఊపిరి మెడకు తగిలి, దానితోపాటు ఏదో గరుకు స్పర్శ!
    అదేంటీ... పట్టుపురుగు  పాకినట్టు- ముదురాకు కోళ్లు నూనూగుగా తడిమినట్టు- సీతాకోకకచిలుక తన రెక్కలతో సుతిమెత్తగా రుద్దినట్లు- ఒళ్ళంతా చలిలో కూడా తీయని జలదరింపు! దానికితోడు -వెచ్చని ఊపిరి మళ్లీ..!
    'ఏంటది... దెయ్యమా! దెయ్యం ఇంత బావుంటుందా? ఇంత బావుంటే దెయ్యానికి భయపడటమెందుకు అనవసరంగా! ఎంచక్కా ఫ్రెండ్ షిప్ చెయ్యొచ్చుగా!' అనుకుంటుండగా-
    అప్పుడొచ్చింది... ముక్కుకొసలకు అత్యంత  దగ్గరగా జరిగి, పెదవుల కెదురుగా ఆనీ ఆనకుండా తగిలిన మృదు తాకిడిలోంచి సంపెంగలూ,  మొగలిపుప్పోడీ కలిపినా స్మెల్... స్కిన్ స్మెల్!
    ఇది... ఇది... ఆ రోమియో స్కిన్ స్మెల్!
    అంతే...
    పట్టుకోవాలనే ఆతృత "కెవ్వు" మని అరిచి, "హెల్ప్... హెల్ప్... కాచ్ హిమ్!" అనేలోపే వెంటనే ఆ ఆకారం తనకు దూరమయినట్లనిపించి- కళ్ళకున్న చున్నీ  తీసి  పారేయబోతే అంత సులువుగా రాలేదు.
    గబుక్కున చెయ్యి ముందుకుచాస్తే ఆ ఆకారం బెల్ట్ దొరికింది. కానీ, అంతలోకే జారిపోయింది. బలవంతాన చున్నీ పీకి పడేసి రోమియో ఎటళ్లడోనని వెతికేసరికి- ఆ స్మెల్ జాడగానీ, మనిషి జాడగానీ లేదు.
    అప్పటికే కామినీ, స్ఫూర్తీ, రేవతీ వచ్చి ఎదురుగా నిలుచుని నడుము మీద చేతులు పెట్టుకుని-
    "నీకసలు భయం లేదు! హాఁ... ప్రాక్టికల్ గా  నిరూపిస్తావు! కదా...! వెక్కిరింతగా అడిగారు.
    "నేను భయపడి పరవలేదే! రోమియో... అదే రోమియోనే! నాకు  కనబడకుండా నన్ను టీజ్ చేస్తున్నాడని చెప్పానే! అతనే... వచ్చాడు! నేను అతని స్కిన్ స్మెల గుర్తుపట్టాను! అక్కడ్నుంచీ ఇక్కడిదాకా తోడోచ్చాడే! నేను మీరనుకున్నాను.... నన్ను పట్టుకున్నాడు కూడా! ఇదుగో చూడు... ఇక్కడా!" అని నడుం చూపించింది.
    "అందుకే -అందుకే అతన్ని పట్టుకోవాలని అరిచాను. భయపడికాదు... ప్రామిస్ నాకు భయంలేదే! అతన్ని పట్టుకోవాలనీ...."
    అందరి ఫేసుల్లోనూ అపనమ్మకం! పైగా.... తమను పూల్ ను చెయ్యాలని చూస్తున్నట్టు అనుమానం!
    "నిజంగానే! రోమియోనే..." మళ్లీ చెప్పబోయింది.
    "షటప్! నువ్వో జూలియట్...నీకో రోమియో! ఏ మగదెయ్యమో అయ్యుంటుంది! నువ్వు రోమియో అనుకునుంటావు!" స్ఫూర్తి క్లియరెన్స్ ఇచ్చింది.
    "యూ షట్ ఫస్ట్! అది దెయ్యం కాదు... పర్సన్! నేను బెల్ట్ పట్టుకున్నాను కూడా! దెయ్యాన్ని టచ్ ఎలా చేస్తామే?!" వాదనకి దిగింది జ్ఞాపిక.
    "దెయ్యమే టచ్ అయ్యే బెల్ట్ పెట్టుకుని వచ్చుంటుంది! ఎనీహౌఁ...నీకు మగ దెయ్యమంటే భయం- ఒప్పేసుకో!" రేవతి కాంప్రమైజ్ కు వచ్చింది.
    "అది కాదే..."
    జ్ఞాపికను ముగ్గురు మూడువైపులా ఎత్తుకుని తీసుకొచ్చి రూమ్ లో బెడ్ మీద వదిలేసి పడుకొబెట్టి రగ్గుకప్పి మంచి నీళ్ల గ్లాసు చేతికిచ్చి సుదుటి మీద చెమట తుడిచి-
    "రిలాక్స్ జ్ఞాపికా.... రిలాక్స్!" అని అనునయించసాగారు.
    "నేను హెల్ప్ అనరిచినపుడు వెంటనే మీరోచ్చుంటే ఆ రోమియో దొరికేవాడే!" అని  చెప్పబోతుంటే-
    "ఉష్...! నువ్వు షాక్ లో ఉన్నావు! మే మొప్పుకొంటున్నాం! నీకు భయంలేదు.... ఓ.కే.! ఇక ఆ టాపిక్ వదిలేసి పడుకో! అనవసరంగా పోటీపెట్టి దీన్ని అప్ సెట్ చేశామే!" స్ఫూర్తి జాలిపడింది.
    "య్యా! ఇది తెల్లార్లూ రోమియో దెయ్యాన్నే కలవరిస్తుందేమో!" రేవతి జాలిపడింది.
    "అది దెయ్యం కాదే.... నా మెడమీద ఊపిరి కూడా తగిలింది. అసలు దెయ్యానికి ఊపిరుంటుందా?" మళ్లీ అడిగింది జ్ఞాపిక.
    గదిలోని లైటు తీసేసీ, జ్ఞాపికను బలవంతగా పడుకోబెట్టి రగ్గు కప్పి ముగ్గురూ పక్కన కూర్చుని లేవకుండా పట్టుకున్నారు.
    "నేనోడి పోలేదే! ఆ స్టూపిడ్ రోమియో నన్నూ..."
    "రోమియో! రోమియో!రోమియో! మేమొప్పుకున్నాం... ఇక పడుకో! అది దెయ్యం కాదు! నీకు  భయంలేదు.... ఓ.క్కే!" అన్నాక పడుకుంది.
    "కానీ వాళ్ళను నమ్మించడమెలాగో అర్థంకాక, "మీ ఖర్మ!" అని తలకొట్టుకుని ఆవులించి నిద్రపోయింది.
    "మన ఖర్మ!" అని ముగ్గురూ తలకొట్టుకుని, కాపలా కాశారు - మధ్యలో లేచి "రోమియోనే... దెయ్యంకాదే!" అన్నపుడల్లా రిలాక్స్ పడుకోబెడుతూ.   
                                              3
    రేవంత్ జ్ఞాపికకు డి.బి.యం.యస్. నోట్స్ డిక్టేట్ చేస్తూనే ఉన్నాడు... ఫాస్ట్ గా!
    అదేమో చిన్నది కాదు... ప్లస్- స్కోరింగ్  మాటర్! చూసి రాసుకోవడం, లేదా జిరాక్స్ చేసుకోవడం కంటే రన్నింగ్  నోట్స్ లో రివిజన్ చేసినట్లవుతుందని రేవంత్, జ్ఞాపికల ఆలోచన! రన్నింగ్ నోట్స్ లో చెప్పడం ద్వారా రేవంత్ కు, రాయడం ద్వారా జ్ఞాపికకు ఇద్దరికీ రివిజన్ అవుతుంది. రిస్క్ అయినా అదే  ప్రిఫర్ చేస్తారిద్దరూ! యం.సి.ఎ.లో స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లో కంటే లైబ్రరీలో, సీనియర్స్ గైడెన్స్ లోనే ఎక్కువుంటారు.
    యూనివర్సిటీ లాన్ లో సబ్జెక్టు పడిపోయి వెదర్ మారుతున్నా చూసుకోలేదు. ఇద్దరూ~
    సడన్ చినుకులు స్టార్టయ్యాయి.
    చటుక్కున లేచి,  ఫస్ట్ బుక్స్ పేపర్స్ క్యారీబ్యాగ్ లో సర్దేసుకుని చుట్టూ చూశారు.
    అప్పటికే పెద్దదయింది వర్షం! రేవంత్ కోట్ లో ఉన్నాడు. జ్ఞాపిక లాంగ్ స్కర్ట్ అండ్ టీషర్ట్ లో, హెయిర్ వదిలేసి   ఉంది. తడిచిపోవడం ఎక్కువయింది.
    "జస్ట్ వెయిట్... నా వెహికల్ లో క్యాప్ ఉంది-తెచ్చుకుంటాను!" జ్ఞాపిక వెహికల్ పార్కింగ్ వైపు వెళ్లబోయింది.
    "ప్లీజ్... టేక్ మై కోట్! అక్కడికి వెళ్లేలోపే పూర్తిగా అడిచిపోతావు. అప్పుడు నువ్వు హ్యాట్ పెట్టుకున్నా వేస్ట్!" అని కోట్ విప్పుతుండగా...
    "ఏయ్ డోంట్! నీకెలా?"
    "నాకక్కర్లేదు! నీది బుషీ హెయిర్ కదా! తడిస్తే జలుబు చేస్తుందని!"
    "బట్... నువ్వు తడిచిపోతావు కదా!" ఒప్పుకోలేదు జ్ఞాపిక మనస్సు.
    "ఓ.కే! వుయ్ విల్ డు వన్ థింగ్... ఇఫ్ యు డోంట్ మైండ్..." అని కోట్ విప్పి ఇద్దరి తల మీదా కవర్ చేశాడు గొడుగులా!
    అక్కణ్ణుంచీ ఇద్దరూ వెహికల్స్ పార్కింగ్ వైపు నడిచారు.
    హైహీల్స్ లో , స్కీన్ కలర్ సాక్స్ లో మెరుస్తున్న జ్ఞాపిక పాదాలను చూస్తూ- ఆ పాదాల వెంబడే అడుగులు వేయసాగాడు రేవంత్... లేకపోతే కోట్ విడిపోతుంది మరి!
    వెహికల్ దగ్గరికి రాగానే కోట్ లోంచి పరుగెత్తుకెళ్లి డిక్కీలోంచి హ్యాట్, రెయిన్ కోట్ తీసింది! కానీ, అప్పటికే తడిచిపోయింది.
    "ఏయ్ఁ.... వేరిట్ ఫాస్ట్!" అన్నాడు.
    "థాంక్యూ రేవంత్! లక్కీథింగ్.... బుక్స్, పేపర్స్ తడవలేదు" అని క్యారీ బ్యాగ్ డిక్కీలో పెట్టి కైనటిక్ స్టార్ట్ చేసింది.
    పలుచటి ప్లాసిక్ట్ రెయిన్ కోట్ లోంచి జ్ఞాపిక - శిల్పంపై మంచి కప్పినట్టుగా ఉంది. హ్యాట్ లో కవర్ చేసిన హెయిర్ అక్కడక్కడ పాయలుగా జారి, దాన్నుంచి చినుకులు జారుతున్నాయి... మొహం మీద, షోల్డర్స్ మీద!
     కోట్ వేసుకోకుండా అలాగే గొడుగులా పట్టుకుని తనవైపే చూస్తున్న రేవంత్ ను....
    "వాట్  హ్యాపెంద్! కమాన్.... టేక్ యువర్ హ్యాట్ అండ్ వేర్ యువర్ కోట్! లేపోతే రేపు జ్వరం  ఖాయం!" అంది.
    ఉలిక్కిపడి, తనూ రెయిన్ కు రెడీ అయిపోయి బైక్ స్టార్ట్ చేశాడు.
    "థాంక్యూ రేవంత్... ఫర్ యువర్ కో ఆపరేషన్! బై!"
``    "బై! టేక్ కేర్ ఆఫ్ యు!"  అని రేవంత్ వెళ్లిపోయాడు.
    దారిలో స్ఫూర్తి, కామినీల వెహికల్స్ కలిశాయి. ప్లెయిన్ గా ఉన్న రోడ్ మీద వర్షంలో తడుస్తూ డ్రైవింగ్ చేయడం జ్ఞాపికకు ఇష్టం.
    హాస్టల్ దగ్గరికొచ్చేసింది.
    "స్ఫూర్తీ కామూ! ఒక్క రౌండ్  కొడదామే అలా!" అంది జ్ఞాపిక.
    "ఏమ్మా... తడిచింది చాల్లా?! నేను రాను" స్ఫూర్తి.
    "కామూ... కామూ... రా  యార్!" రిక్వెస్ట్ చేసింది.
    "సారీ... నువ్వెళ్లు! తలతిక్క టేస్టులూ, నువ్వునూ!" అని ఆగిపోయారిద్దరూ- అక్కడి సిటీబస్ షెల్టర్ దగ్గర.
    "మరిక్కడే  ఉండండి... ఒకే రౌండ్ - హాఁ!" అని స్పీడ్ పెంచి రివర్స్ తీసుకుని వెనక్కి వెళ్లి వెహికల్ తో  రౌండ్స్ కొట్టసాగింది. హ్యాట్ జారిపోయి, హెయిర్ విడిపోయింది. అయినా ఆగలేదు. అలా రౌండ్స్ కొడుతూనే ఉంది.
    స్ఫూర్తీ, కామినీ దగ్గరికొచ్చి-
    "స్టాప్ జ్ఞాపికా.... డోంట్ డు ఎక్స్ స్!" అని ఇద్దరూ అరచినా వినిపించుకోలేదు.
    ఇద్దరూ వెహికల్స్ స్టార్ట్ చేసి, "వుయ్ ఆర్ గోయింగ్!" అనేసరికి- డ్రైవ్ చేస్తూనే  కిందపడ్డ హ్యాట్ అందుకుని వాళ్ళతో జాయిన్ అయిపోయింది.
    రూమ్ కొచ్చాక-

 Previous Page Next Page