"మీరు ....." అన్నాడు మోహన్ ప్రసూనతో పాటు పరిసరాలను కూడా గమనిస్తూ.......
"నాపేరు మరచిపోయారా ?" అంది ప్రసూన నవ్వి .....
"లేదు. మరచిపోలేదు. ఒకసారి తెలుసుకున్నాక మరచిపోను. మిస్ సూన కదూ!"
"నా పేరు 'ప్రసూన!' నాదగ్గర స్నేహితులంతా చనువుగా 'సూనా!' అంటారు . లోపలికు రండి ....." అని తన గదిలోకి ఆహ్వానించింది ...... విశాలమైన టేబుల్ ముందు ప్రసూన కూర్చునే కుర్చీగాక మరి నాలుగు కుర్చీలున్నాయి. టేబుల్ మీద టిఫ్ మిషన్ ఉంది .... టెలిఫోన్ ఉంది .... గదిచాలా పరిశుభ్రంగా ఉంది. దృష్టి కొత్తకుండా అన్నట్లు ఒక మూలమాత్రం కుప్పగా కొన్ని పాత మేగజైన్న్లు కట్టలు పడిఉన్నాయి. వాటి మీద మోహన్ చూపులు కొన్ని క్షణాలు నిలిచాయి. ప్రసూన సంజాయిషీ ఇచ్చుకొంటున్నట్లు "అవి అక్కణ్ణుంచి తీసేయ్యమని నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ సాంబశివంగారు వాటిని అక్కడే ఉందనియ్యమంటారు ....." అంది.
"ఈ గదిలోకి సాధారణంగా ఎవ్వరూ రారనుకుంటాను" ఆలోచిస్తూ అన్నాడు మోహన్.
"రారు ! నాతో సాంబశివంగారికి మాత్రమే పని ఉంటుంది"
"హాలో సర్! నమస్తే!"
చేతిలో పేపర్ తో ఆ గడులోకి వచ్చిన చిరంజీవి నవ్వుతూ విష్ చేశాడు.
మోహన్ తిరిగినవ్వి "నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా!" అన్నాడు.
"లేదుసార్! ఈ హొటల్ రూమ్స్ లో ఉన్న వాళ్ళందరికీ పేపర్లందిస్తాను వస్తానుసార్ ......"
మెరుపులా వెళ్ళిపోయాడు.
"మీకేం కావాలో చెప్పండి తెప్పిస్తాను" అంది ప్రసూన.
"ఏమీ అక్కర్లేదు ......"
"అయితే హొటల్ కెందుకు వచ్చినట్లు?"
మోహన్ నవ్వి "ఊరికే. తెప్పిస్తానంటే మీ యిష్టం " అన్నాడు.
ప్రసూన స్వీతూ, హాటూ అర్దరిచ్చింది.
బాయ్ ప్లేట్లలో ఫలహారాలు తీసుకొచ్చాడు _ ప్రసూన అవి స్వయంగా తను అందుకొని మోహన్ ముందు ఉంచింది ......
"నన్ను క్షమించండి "అంది సిగ్గుపడుతూ ....
స్వీట్ నోట్లోపెట్టుకోబోతున్న మోహన్ ఆశ్చర్యంగా "ఎందుకని?" అన్నాడు.
"నాకు తరువాత తెలిసింది. ఆ ఉత్తరం వ్రాసింది మా సుశీల ...."
"అదా!" అని పకపక నవ్వాడు మోహన్ .....
మరింత సిగ్గుపడిపోయింది ప్రసూన ..... ఆ సంగతి ఎప్పుడు గుర్తువచ్చినా సిగ్గుతో చితికిపోతుంది ప్రసూన ......
కాలేజీలో హీరోవర షిఫ్ ఎంజాయ్ చెయ్యగలిగిన కొద్దిమంది అదృష్టవంతులలో మోహన్ ఒకడు ..... అతడు మంచిచివక్త కాలీజీలకు సంభందించిన సభలలో ..... సమావేశాలలో అతడు ఉండక తప్పదు . మధ్య మధ్యలో నవ్విస్తూ ..... విషయాన్ని చక్కగా వివరిస్తూ అతడు మాట్లాడుతూ ఉంటే అందరూ ముగ్ధులై వినేవారు ....... లేడీస్ వేయిటింగ్ రూమ్ లో అతని పేరు తరచూ వినిపిస్తూ ఉండేది కానీ మిగిలిన మొగపిల్లల్లాగా మోహన్ లేడీస్టూడెంట్స్ అనుగ్రహం కోసం పాకులాడేవాడు కాదు. అసలు వాళ్ళని పట్టించుకునేవాడు కాదు. ఇది అతని ఆకర్షణను మరింత అధికం చేసింది .......
ఒకరోజు ప్రసూనకు ఒక ఉత్తరం వచ్చింది. "డియర్ సూనా! నేను నిన్ను ప్రేమిస్తూన్నాను. గాఢంగా .... ప్రేమిస్తున్నాను ..... నన్ను కరుణించు .....
నీ మోహన్ .........."
మిగిలిన చాలా అమ్మది ఆడపిలలతో పాటు ప్రసూనకు కూడా మోహన్ పట్ల గౌరవభావముంది. అప్పుడప్పుడు అతని గురించి కళలు కనటమూ , 'సీల్లీ ' అని తనను తను మందలించుకోవటమూ కూడా జరిగింది .... ఆ ఉత్తరం చూడగానే ప్రసూన తల క్రిందులయి పోయింది .... మోహన్ ప్రేమలేఖ వ్రాశాడు ..... తనకు వ్రాశాడు ......
వెంటనే సమాధనం వ్రాయటానికి కూచుంది. అంతలో ఆ ఆలోచన విరమించుకుంది. వెంటనే సమాధన మిస్తే లోకువ అయిపోతుందేమో! మోహన్ అలా లోకువకట్టి ఏడిపించే మనిషిలాగ కనిపించడు ..... కానీ, ఎందుకైనా మంచిది. సమాధానమియ్యికుండా అతనేం చేస్తాడో చూడాలి. మళ్ళీ ఉత్తరం వ్రాస్తాడా? తనను పలకరించి మాట్లాడతాడా?
ప్రతిక్షణమూ లెక్కపెట్టుకుంటూ నాలుగు రోజులు గడిపింది. అంతలో మరొక అనుమానం వచ్చింది. మోహన్ అందరిలాంటివాడు కాడు. తను సమాధానం ఇయ్యకపొతే తనకు ఇష్టం లేదని అర్ధం చేసుకుంటాడేమో! అలాగని సమాదానమిస్తే ... ఏమని రాయాలి! అంత కంటె ఇంటికి పిలిచి మాట్లాడితే బగుంటు౦దేమో! ఈ ఆలోచన అన్నింటికంటే బాగుంది.
ప్రసూనకు ..... తండ్రి హరి ఎప్పుడూ ఇంట్లో ఉండడు. ఒకవేళ ఇంటికెప్పుడైనా వచ్చినా అర్దరాత్రి తప్పతాగివస్తాడు. తల్లి రాధమ్మకు సినిమాలంటే వొళ్ళు తెలీదు. ఏ మాటనీకో వెళ్ళమని పంపేయవచ్చు.
ఆ రోజే మోహన్ ను కలుసుకుని "మీకు వీలయితే రేపోకసారి మా ఇంటికీ రాగలరా" అంది .....
మోహన్ ఆశ్చర్యంగా "ఎందుకు?" అన్నాడు.
మనస్సు కలుక్కుమంది ప్రసూనకు. కొంచెం కోపం కూడా వచ్చింది.
"మీతో మాట్లాడాలి!" అంది కరుగ్గా .......
"వస్తాను అడ్రసివ్వండి ....." అన్నాడు ......
"నా అడ్రస్ మీకు తెలియదా?"
"ఎలా తెలుస్తుందీ"
వేషాలు! బాగా బుద్ధిచెప్పాలి! ఇక్కడకాదు__ అడ్రస్ కాగితం మీద వ్రాసి ఇచ్చింది. జేబులో పెట్టుకున్నాడు.
"మరచిపోను! తప్పకుండా వస్తాను ......"
ఆ మరునాడు తల్లి రాధమ్మను సినిమాకి పంపించటం ఏమంత కహ్స్తంకాలేదు ప్రసూనకు ......
కొత్త సినిమా వచ్చిందనగానే ఏమిటి? ఎలా ఉందని కూడా అడక్కుండా తాగుతోన్న కాఫీ ఒక్కసారి గొంతులో పోసుకుని గబగబా బయలుదేరింది రాధమ్మ ......
ఎటొచ్చీ ఎప్పుడంటే అప్పుడు ఊడిపడేది సుశీల .... సుశీల రాకుండా చూసుకోవాలి __ వెంటనే ఫోన్ చేసింది.
"సుశీ! నేను అర్జంట్ పని మీద బయటకు వెళ్తున్నాను.