ఫెంటాస్టిక్! రాజకీయ నాయకుల దగ్గర మంచి పలుకుబడీ, కోట్లకొద్ది ఆస్తీ సంపాదించి ఉండవచ్చీపాటికి! ఓసారి అమ్మాయిల ఆల్బమ్ నాక్కూడా చూపించమను....."
"ఛీ! సిల్లీ ఫెలో! బ్రోకరంటే కంపెనీల షేర్లు అమ్మే బ్రోకర్! మనల్ని కూడా ఓ మంచి ఇండస్ట్రీ షేర్లు కొనమని అడిగింది. ప్రతి వందకూ నూటపాతిక తిరిగి సంపాదించవచ్చట! మన దగ్గర ఎలాగూ తొంభయ్ వేలుంది కదా బేంక్ లో! కొంత ఇన్ వెస్ట్ చేద్దాం.....ఏమంటావ్?"
"మీ సుశీల మెజర్ మెంట్స్ ఏమిటో ఖచ్చితంగా తెలీందే ఎలా చేస్తాం?"
అతని తొడమీద గట్టిగా గిల్లిందామె.
"ఇవాళ మధ్యాహ్నం వస్తోంది సుశీల."
"ఇంతకూ ఏ కంపెనీ షేర్లని?"
"ఫోమ్ బెడ్స్!"
"హో! బ్రహ్మాండమయిన బిజినెస్! బెడ్ రూమ్......టు......నర్సింగ్ హోమ్.....మొత్తం ఫోమ్ బెడ్సేకదా!"
"అందుకే దీని షేర్లు మనకి రికమెండ్ చేసింది......"
"టూ సెన్సిబుల్! అసలు ఆ ఫోమ్ బెడ్స్ కీ సేల్స్ వుమెన్ గా పనిచేస్తే ఎప్పుడో పైకి వచ్చేసేదే పైకి అంటే నా ఉద్దేశ్యం మీదకు అని. అర్ధమవలేదా ఇంకా? మీదకు అంటే నా అర్ధం...." ఆటో నర్సింగ్ హోమ్ ముందాగింది. డాక్టర్ కుమారివారిని చూస్తూనే గుర్తుపట్టింది.
ఓ మళ్ళీ వచ్చారా?
"అవును డాక్టర్! హాపి డేస్ ఆర్ హియర్ ఎగైన్" ఆనందం ప్రకటించాడు.
ఆమె ముఖంలో అనుమానం......
"హాపీడేస్ ఏమిటి?"
"అంటే అదే డాక్టర్! అదృష్టం వుంటే అబార్షన్......ఇంకా లక్ వుంటే సిజేరియన్......ఇంకా .....ఇంకా...."
ఆమె ముఖం చిట్లించుకుంది.
"లోపలకుపదండి తులసి వేపుచూస్తూ అంది"
తులసి వెనుకే తనూ లోపలకునడవబోయాడుగానీ డాక్టర్ వెనక్కు తిరిగి అడ్డంగా నిలబడడంతో ఠక్కున ఆగిపోయాడు.
"మీరెక్కడికి?"
కన్ ఫర్మేషన్ ఎలా చేస్తారో ఓసారి తెలుసుకుంటే ఇకనుంచీ మీకు శ్రమ ఇవ్వకుండా వుండవచ్చని.....
అతని మొఖంమీదే విసురుగా డోర్ వేసి బోల్ట్ చేసేసింది.
పది నిమిషాల తర్వాత బయటికొచ్చిందామె.
మీకు శుభవార్త అంది వుత్సాహంగా.
సురేష్ వులిక్కిపడ్డాడు.
ఆమె మొఖంలో మళ్ళీ అనుమానం కనిపించింది.
అలా అయిపోయారేమిటి? మీ ఇద్దరికీ పెళ్ళయిందా అసలు?
లేదు....
అయితే మీకు దుర్వార్త!
తులసి బట్టలు సర్దుకుంటూ బయటికి వచ్చింది.
మీకు ఇదివరకే చెప్పాను. ఇలా ఊరికూరికే పరిగెత్తుకు రావటంకంటే వేరే మెథడ్స్ వుపయోగించటం మంచిదని......"
"ఓ! వేరే మెథడ్స్! వుపయోగించాం డాక్టర్! అయినాకూడా....."
"ఉపయోగిస్తే ఎలా వస్తుంది? అబద్దాలు చెప్తున్నారు."
"బహుశా ఆ మెథడ్ లో ఏమయినా వుందా, లేక మీ టేబుల్ మీదే డిమాన్ స్ట్రేషన్ ఇవ్వాలా?" గదంతా బెడ్ కోసం వెతుకుతూ అన్నాడు.
డాక్టర్ అదిరిపడింది.
"డిమాన్ స్ట్రేషనేమిటి?"
"అదే డాక్టర్! ఆ మెథడ్! అందులో ఏమయినా డిఫెక్ట్ వుందేమో మీరే చెక్ చేద్దురుగాని, కమాన్ తులసి!" టేబుల్ మీద కూర్చోబోతూ అన్నాడు.
కుమారి మొఖం ఎర్రబడింది.
మీకు మతివుండే మాట్లాడుతున్నారా? కోపంగా అంది.
తులసినవ్వాపుకోలేక బయటగదిలోకి పరుగెత్తింది.
"టేకిట్ ఈజీ డాక్టర్! నేను చిన్నప్పట్నుంచీ బాగా ప్రాక్టికల్! అందుకని అన్నీ ప్రాక్టికల్ గా....."
"ఇంతకూ మీరేం మెథడ్ ఫాలో అవుతున్నారు?"
"రివర్స్ మెథడ్! సీరియస్ గా" చెప్పాడు.
మళ్ళీ ఆమె కళ్ళలో అనుమానం.
అలాంటి మెథడ్ గురించి నేనెప్పుడూ వినలేదే......"
"ఎవరికీ తేలిందికా! నా సొంత పరిశోధనతో కనుక్కున్నాను. దయచేసి మీరు కూడా ఎవరికీ చెప్పకండి."
ఆమె మొఖంలోకి కోపం ముంచుకొస్తోంది.
"అంటే ఏం చేస్తున్నారు?"
"అంటే......టు పుటిట్ మోర్ ఫ్రాంక్ లీ.....వైఫ్ యాక్టివ్ పార్టనర్! మరి హజ్ బెండే మోహజ్ బెండంటే.....అయ్ మీన్......యాక్చువల్ గా హజ్ బెండ్ అవాలని రూలేమీ లేదు. ఆ సమయంలో ప్రక్కనున్న తను..... అంటే పార్టనర్.....ఆహా.....కర్ క్టువర్డ్.....పార్ట్ నర్......అతను జస్ట్ స్లీపింగ్ పార్ట్ నర్ అన్నమాట. అంటే నిజంగా నిద్రపోతాడనికాదు."
"నిద్రపోయినంత నిశ్చలంగా..అంటే....మరీతుమ్మమొద్దులాపడి ఉంటాడని కూడా కాదు. అప్పుడేం జరుగుతుందంటే......మీకీపాటికి అర్ధమయ్యే ఉండాలే! లేదా? అందుకే డిమాన్ స్ట్రేషన్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్! కానీ మీరు డిమాన్ స్ట్రేషన్ వ్యతిరేకం కాబట్టీ......"
ఆమె మొఖం బాగా ఎర్రబడిపోయింది.
"ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్......" అసహనంగా అరచింది.
అతను ఆశ్చర్యంగా చూశాడు.
"వాట్? అది నాన్సెన్స్ అయితే ప్రపంచ జనాభా అంతా ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నట్లు?
"ప్లీజ్ గో ఎవే......"
"థాంక్యూ......."
బయటకు వచ్చేశాడు.
కౌంటర్ లో బిల్ కట్టాక 'థాంక్యూ' అందా యువతి.
"నో మెన్షన్! మీ వెనకున్న కాలెండర్ మీద స్లోగన్ దేశసౌభాగ్యానికి అంత మంచిదికాదనుకుంటాను. మార్పించండి" నవ్వుతూ చెప్పాడు.
ఆమె చటుక్కున వెనక్కు తిరిగి చూసింది.
మెనీ హాపీరిటన్స్ ఆఫ్ ది డే అని ఉందక్కడ.
"అందులో తప్పేముంది?" అమాయకంగా అడిగింది.
"అన్ని అబార్షన్లు మాకు హాపీకాదు గదా......మీ స్టాఫ్ కయితే కన్సెషన్స్ ఉంటాయ్....."
"ఓ" అందామె సిగ్గుపడుతూ.
తులసి అతని చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్ళింది.
"ఇంతకూ ఇప్పుడిది మనకు శుభవార్త, దుర్వార్త? హోటల్లో భోజనం చేస్తూ తులసినడిగాడతను."