3. హృదయమందలి నూరు నాడులు వేలశాఖానాడులందలి మధ్యమ నాడి వ్యాధి కారణముగ రక్తము స్రవింపచేయు చుండెను. ఇప్పుడు మంత్ర ప్రభావమున రక్తస్రావమును నిలిపి స్థిరపడును గాక. తదుపరి రక్తస్రావము చేయునట్టి మిగిలిన నాడుల వలె ఈ నాడులు ఆనందించును గాక.
సాముద్రిక దుర్లక్షణములు గల స్త్రీ యొక్క దోషనివారణార్ధము ముఖము కడిగించుట,
స్నానము చేయించవలెను. లేదా ఫలీకరణ తుషావతక్షణ హోమము చేయించవలెను.
1. తిలకపు స్థానమున నిలిచినా అసౌభాగ్య చిహ్నమును ఈ శరీరము నుండి పూర్తిగా తొలగించుచున్నాము. శత్రువు వలె శరీరమున నిలిచిన దుర్లక్షణమును తొలగించుచున్నాము. తదుపరి శుభచిహ్నములు మా సంతానమునకు, అశుభ చిహ్నములు శత్రువులకు కలుగును గాక.
3. నీ దేహమందు, కేశములందు, నేత్రములందు ఉన్న ఘోర దుర్లక్షణములను ప్రయోగ కుశలురమగు మేము మంత్రములచే తొలగించుచున్నాము. సవితా దేవత నీకు శుభములు కలిగించును గాక.
4. సారంగ మృగము వంటి పాదములు, ఎద్దు వంటి దంతములు, గోవు వంటి నడక, బుసకొట్టు మాట స్త్రీకి గల దుర్లణములు. ఆ దుర్లక్షణములను నాశనము చేయుచున్నాము.
వ్యాఖ్య - ఈ సూక్తము వితంతు వివాహమునకు సంబంధించినట్లు తోచుచున్నది. వితంతు లక్షణములు తొలగించి సౌభాగ్యవతిని చేయుట వలె ఉన్నది. ఇది నా అభిప్రాయము మాత్రము. మరింత ఆలోచించవలసి ఉన్నది.
1. అస్త్రశస్త్రములు ధరించి యుద్దమందు మా మీదకు దాడికి వచ్చువారు మమ్ము చేరుకొనకుందురు గాక. ఎదురుగా వచ్చు భటులు కూడ మమ్ము చేరకుందురు గాక. ఇంద్రదేవా! శత్రువుల శరపరంపర మాకు దూరముగ పడునట్లు చేయుము.
2. శత్రువులు విడిచిన బాణములు, విడువనున్న శరములు మమ్ము విడిచి అన్య స్థానముల పడును గాక. మా చేతనున్న దైవీ, మానుషాస్త్రములు శత్రువులను వధించును గాక.
4. సజాతి శత్రువులు, అన్యజాతి శత్రువులు, వృధాగా కోపించి శపించు శత్రువులందరను సమస్త దేవతలు హింసింతురు గాక. మంత్ర వాక్కులు మాకు కవచములు అగును గాక.
నాలుగవ సూక్తము - 20
వినియోగము :-
మూడవ సూక్తము వలె 2. మొదటి మంత్రము దర్శపూర్ణ మాసములందు శృత హవిర్నిరీక్షణమందు
1. చంద్రదేవా! నా శత్రువు స్థానభ్రష్టుడై ఎన్నటికి తనభార్యను చేరకుండును గాక.
నలుబది తొమ్మిది మంది వాయు దేవతలారా! నా యజ్ఞము వలన మాకు సుఖములు కలిగించండి. ఎదురుగా వచ్చు శత్రువు నన్ను తాకకుండును గాక. అపకీర్తి నన్ను చేరకుండును గాక. నేను ద్వేషించు శత్రుసేన నన్ను తాకకుండును గాక. ఓటమి కలిగించు నట్టియు ఫలితములకు ఆటంకము కలిగించు పాపములు నన్ను ముట్టకుండును గాక.
2. ఈ యుద్దమున శత్రుసేన ప్రయోగించు శస్త్ర సమూహము మా మీదకు వచ్చుచున్నది మిత్రావరుణులారా! ఆ శస్త్రములను మా మీదకు రానీయకండి. మళ్ళించండి. అవి మమ్ము తాకకుండ చేయండి.
3. దూరముగ నిలిచిన శత్రువు మరణాయుధము, దగ్గర నిలిచిన శత్రువు మారణాయుధము నా మీదకు వచ్చుచున్నది. వరుణదేవా! వానిని దారి మళ్ళించండి. మాకు తాకకుండ చేయండి. శత్రువునకు అందని సుఖములను నాకు కలిగించండి. మంత్ర సహితముగ ప్రయోగించిన అస్త్రశస్త్రములను మానుంచి దూరము చేయండి.
4. ఇంద్రా! నీవు నియంతవు. మహానుడవు. శత్రు తిరస్కర్తవు. అపరాజితుడవు. ఇన్ని మహిమలవాడవు మిత్రుడుగా గలవాడు శత్రువు చేత వధించబడడు. అతనికి ఓటమి కలుగదు.
అటువంటి ఇంద్రుని అనుగ్రహమున మేము సహితము శత్రువును ఓడించగలము.
ఐదవసూక్తము - 21
వినియోగము:-
1. సాంగ్రామికాదులందు ప్రయోగము.
2. గ్రామ గమనాదులందు క్షేమము కోరువాడు ఈ సూక్తము చదువుచు కుడికాలు ఎత్తి, దుమ్ము, గడ్డిని తొలగించి ఇంద్రోపస్థానము చేయవలెను.
1. ఇంద్రుడు అవినాశ్యుడు. శుభప్రదుడు. సకల ప్రజాపాలకుడు. వృత్రహంత. శత్రుసంహారి. సకల ప్రాణులను అధీనమందు ఉంచుకొనువాడు. సోమపాయి.
అట్టి ఇంద్రుడు అభయము ఇచ్చుచు యుద్దమున అగ్రసరుడు అగును గాక.
అట్టి ఇంద్రుడు అభయము ఇచ్చుచు యుద్దమున అగ్రసరుడు అగును గాక.
2. పరమ ఐశ్వర్యవంత ఇంద్రా! యుద్దములందు మా పగతురను నష్టపరచుము. శత్రుసేనలను చిన్నాభిన్నము చేయుము. మా ధనక్షేతాదులను హరించుచు మా శత్రువును అంధకారమున పడవేయుము.
4. ధనశాలి ఇంద్రా! ద్వేషించు శత్రువు యొక్క క్రూర మనమును అణచి వేయుము. మమ్ము వధించదలచు వాణి ఆయుధమును నష్టపరచుము. మాకు మహా సుఖసంపదలను ప్రసాదించుము. అస్త్ర శస్త్రములను మాకు దూరముగా ఉంచుము.
అయిదవ అనువాకము మొదటి సూక్తము -22
వినియోగము :- హృద్రోగ, కామిలా రోగ నివారణము.
1. ఎరుపు వృషభము రోమములను నీటిలో కలిపి త్రాగించవలెను.
2. రక్త గో చర్మచ్చిద్రమణిని ఆవు పాలలో వేసి సంపాతన అభిమంత్రణములు చేసి పాలు త్రాగించి, మణిని కట్టవలెను.
3. రోహిణి హరిద్ర ఒధానము తినిపించవలెను. మిగిలిన దానిని కాళ్ళ వరకు రాసి మంచములో కూర్చుండ పెట్టవలెను. శుక కాష్ట, శుక, గోపీతనక పక్షులు కుడి కాళ్ళకు హరి సూత్రము కట్టి మంచము క్రింద విడువవలెను.
1. వ్యాధిగ్రస్తా! నీ హృదయ బాధయు, కామిల వలన కలిగిన రంగును సూర్యుని చేరును గాక. హృదయ బాధయు, శరీరపు హరిత వర్ణమును దేహము నుండి వెడలి హరిద్వర్ణ సూర్యునిలో కలసి పోవును గాక. లోహిత వర్ణ గోవు యొక్క లోహిత వర్ణముచే నిన్ను ఆచ్చాదించుచున్నాను. నీ శరీరమును మంచి వన్నె గల దానిగ చేయుచున్నాను.
2. వ్యాధిగ్రస్తా! నిన్ను గోసంబంధి రక్త వర్ణముచే ఆచ్చాదించుచున్నాను. అందువలన నీవు రోగ రహితుడవు, పాపరహితుడవు ఆగుము. పాపక్షయమైనంత వ్యాధి వలన కలిగిన పచ్చరంగు తొలగి పోవును గాక. దీర్ఘాయువు కలుగును గాక.
3. దేవతల అరుణవర్ణ గోవు మానవుల అరుణ వర్ణ గోవునుండి అరుణరూపమును, పరిపూర్ణ యవ్వనము తీసి నీ యందు ప్రవేశపెట్టుచున్నాము.
4. రోగీ! నీకు వ్యాధి వలన కలిగిన హరిద్వర్ణమును శుకములకు, శుక కాష్టములకు, గోపీతనక పక్షులందు ప్రవేశపెట్టుచున్నాము.
రెండవ సూక్తము - 23
వినియోగము :- శ్వేత కుష్ఠు నివారణకు.
1. భ్రుంగరాజము, పసుపు, నీలి మొక్కలను నూరి, ఎండిన ఆవు పేడతో కలిపి గాయపు చోట రక్తము కనిపించునంత వరకు రుద్ది రాయవలెను.
2. ఫలిత కేశ నివారణకు తెల్లని వెండ్రుకలను కత్తిరించి పై లేపమును రాయవలెను.
3. ఘ్రుత హోమమును మారుత కర్మలను వృష్టి కర్మమును అనుసరించి చేయవలెను.