Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 3

    అందులోనూ- మాథ్స్ స్టూడెంట్స్ కు ఆర్ట్స్ వాళ్ళనూ, సైన్స్ వాళ్ళనూ చూస్తే జాలి, అలుసు! ఒకరు రాసీ- చదివీ అలిసిపోతారనీ, ఒకరు గీసీ- ప్రాక్టికల్స్ చేసీ విసిగిపోతారని! అందులోనూ కంప్యూటర్ కోర్సంటే తమ భవిషత్తును ఫారిన్ లోనే ఊహించుకుంటారు.
    అమ్మాయిలకూ, అబ్బాయిలకూ మధ్య మెచ్యురిటీతో కలిగే ఫ్రెండ్ షిప్ లాంటిదే జ్ఞాపిక, రేవంత్ ల మధ్య ఫ్రెండ్ షిప్!
    రేవంత్ జ్ఞాపికకు సీనియర్. మంచి మార్క్స్ స్కోరర్.
    ఎం.సి.ఎ.లో ప్రొఫెసర్స్ చెప్పేదేమీ ఉండదు. ఎందుకంటే... వాళ్ళూ ఫ్రెష్గా కోర్స్ కంప్లీట్ చేసి వచ్చినవాళ్ళే కనుక. సీనియర్స్ గా కొన్నాళ్లు వర్క్ చేసి   జాబ్ ఆఫర్ వచ్చి వెళ్లిపోతారు. జూనియర్స్ ఆ పోస్టులను ఫిలప్ చేస్తారు!ఫ్యాకల్టీ కొరత ఎక్కువ! కనుక స్టూడెంట్స్- ప్రొఫెసర్స్ చెప్పే లెక్చర్స్ మీద కంటే ఓల్డ్ క్వొశ్చన్ పేపర్స్, సీనియర్స్ అడ్వైజెస్, వాళ్ళ నోట్సుల మీద ఎక్కువ ఆధారపడతారు.
    జ్ఞాపిక ఎక్కువగా రేవంత్ హెల్ప్ తీసుకుంటుంది... యాజ్ ఎ సీనియర్ గా! అతను మంచి మార్క్ స్కోరర్ కాబట్టి.
    ఈరోజు డేటా బేస్ మేనేజ్ మెంట్ సిస్టమ్ థియరీ నోట్స్ కోసం రేవంత్ క్లాస్ కెళ్లింది. రేవంత్ క్లాస్ లో లేడు. రేవంత్ క్లోజ్ ఫ్రెండ్ క్రాంత్ నడిగింది-
    "వేరీజ్ రేవంత్?" అని.
    "ఐ థింక్... హి ఈజ్ ఇన్ లైబ్రరీ రూమ్!" చెప్పాడు.
    లైబ్రరీ రూమ్ కెళ్లేసరికి- రేవంత్ సీరియస్ రెఫరెన్స్ లో ఉన్నాడు.
    "హాయ్ఁ....రేవంత్!"
    "హాయ్ఁ...జ్ఞాపికా!"
    "ఐ హావ్ సమ్ డౌట్స్ డి.బి.ఎం.ఎస్.! కెన్ యు క్లియర్ దీస్?"
    "వై నాట్? విత్ ప్లెజర్... కమాన్!" అని ఎక్స్ ప్లనేషన్ స్టార్ట్ చేశాడు చిన్న గొంతుతో... ఎవరూ డిస్టర్బ్ కాకుండా!
    జ్ఞాపిక మధ్యలో రన్నింగ్ పాయింట్స్ నోట్ చేసుకుంది.
    ఎక్స్ ప్లనేషన్ అయ్యాక ఇద్దరూ క్లాస్ రూమ్స్ వైపు నడుస్తున్నారు.
    "ఇఫ్ యు డోంట్ మైండ్.... నేనొకటి అడగనా?"
    "ప్లీజ్!"
    "నాకు ఇయర్ మొదలయినప్పటి నుండి ఒక మంచిఫ్రెండ్ గా గైడెన్స్ ఇస్తున్నావు కదా! ఎప్పుడూ నీకు - అనవసరం టైమ్  వేస్ట్, ఎందుకు నా ఎనర్జీ నాలెడ్జీ తనకోసం వేస్ట్ చేసుకోవాలీ.... అని అనిపించలేదా?"
    "లేదు! పైగా... నువ్వు డిగ్రీ కోసమో, ఫారిన్ వెళ్లేందుకు ఛాన్స్ కోసమో, పెళ్ళికి ఇది కూడా మంచి రికార్డవుతుంది అనో కాకుండా- నాలా, అచ్చం నాలా సబ్జెక్ట్ కోసం  చదూకుంటున్నావనీ, నాలాగే అంతంలేని విజ్ఞానతృష్ణ నీలో ఉందనీ అనిపిస్తుంది! ఒక మంచి గైడ్ లేదా కోచ్ దొరకడం ఎంత అదృష్టమో, ఒక మంచి స్టూడెంట్ దొరకడం కూడా అంతే కష్టం! యామై రైట్?"
    "అవునూ! కానీ, నా నుంచి నీకేం బెనిఫిట్ లేదు కదా!"
    "లేకపోతే ఏం? అన్నీ బెనిఫిట్ కోసమే చేస్తామా! అయినా... ఎందుకు లేదు? నీకు ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు నేనూ ఒకసారి సబ్జెక్ట్ రివిజన్ చేసినవాడ్నవుతాను కదా! అపుడు ఆ సబ్బెక్ట్ లో ఇంకా థరో అయిపోతానుగా!"
    "హాయ్ఁ రేవంత్, హాయ్ఁ జ్ఞాపికా!" అంటూ ఫ్రెండ్స్ రావడంతో ఆగిపోయారు.
    "లైబ్రరీ నుంచా?" క్రాంతి అడిగాడు.
    "య్యా..!" రేవంత్.
    "ఏదయినా కొత్త మాటర్ నోట్ చేసుకున్నావా?" జ్ఞాపిక నోట్స్ తీసుకుంటూ అడిగింది కామిని.
    "హాఁ...! లైబ్రరీలో రెఫరెన్స్ కు వెళ్లాను. ఈలోపు జ్ఞాపిక డి.బి.యం.యస్. గురించి అడిగింది. జస్ట్ టైమ్ రన్నయిపోయింది..."
    "ప్లీజ్ జ్ఞాపికా! రేవంత్ ఎక్స్ ప్లెయిన్ చేసినపుడు నువ్వు రాసుకున్న నోట్స్ నాకు ఇవ్వగలవా....జస్ట్ ఫర్ రెఫరెన్స్!" స్ఫూర్తి రిక్వెస్ట్.
    "విత్ ప్లెజర్!" జ్ఞాపిక.
    "వియ్ విల్ మీట్ యు అగైన్...బై!" వెళ్లిపోయారు వాళ్ళు.
    రేవంత్, జ్ఞాపిక మళ్లీ నడవసాగారు.
    "జ్ఞాపికా! మన కోర్స్ లో కాక,  ఇంకే సబ్జెక్ట్స్ అంటే ఇష్టం నీకు?"
    "కొత్త కొత్త డిసీసెస్! వాటిని కంట్రోల్ చేస్తున్న రీసెర్చి ఫార్ములాస్!"
    "ఓహొఁ...మీ డాడ్ ఎప్పుడూ డిస్కస్ చేస్తుంటారేమో!"
    "అవును! డాడ్ తనకు తెలిసిన ఏ విషయమైన నాతో డిస్కస్ చేస్తారు! నాకు డాడ్ మంచి ఫ్రెండ్... నీలాగే!"
    "మరి... మీ మదర్?"
    "మమ్మీ నన్ను కనగానే చనిపోయింది. నేనసలు చూడ్నేలేదు!"
    "అయాం సారీ!"
    "ఇట్స్ ఓ.కే!మరి, నీకే సబ్జెక్ట్ ఇష్టం?"
    "కీట్స్, షెల్లీ పోయట్రీ, టాల్ స్టాయ్ బుక్స్ ఇష్టం!"
    "నాకసలు లిటరరీ ఫీల్డే తెలీదు. సైన్స్ అండ్ మాథ్స్ తప్ప!"
    "ఇందులో వింత ఏవుందీ! మాథ్స్ నీ సబ్జెక్ట్, సైన్స్ మీ డాడీ సబ్జెక్ట్ ! నువ్వు ఉన్న వాతావరణం నీకా సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ రేపింది. నువ్వూ లిటరరీ వాతావరణంలో ఉంటే నీకూ ఇంట్రెస్ట్ వచ్చేది... నాలాగే!"
    "అంటే... మీ డాడీ లిటరరీ సైడా?"
    "కాదు. మమ్మీ ఇంగ్లీష్ ఎమ్.ఎ. పి.హెచ్.డి. తన నాకు లిటరరీ పట్ల ఇంట్రెస్ట్ పెంచింది! కామ్ గా వెళ్లి మమ్మీ కాలేజ్ లో తన లెక్చర్ వినడం నాకు చాలాఇష్టం! క్లాస్ లో లెక్చర్ ఇచ్చేటపుడు తనను తాను మర్చిపోతుంది."
    "మీ మమ్మీ ఇంగ్లీష్ లెక్చరరా?"
    "చెప్పాలా? తెలిసిపోలేదూ?"
    "తెలిసిందిలే! మరి డాడ్!"
    "నాకు డాడ్ లేరు! నేను మమ్మీ కడుపులో ఉన్నపుడే చనిపోయారు. నేనసలు డాడీని చూడలేదు! ఫోటోలో తప్ప!"
    "ఓఁ... మనిద్దరి జీవితాల్లోనూ ఒక గ్యాప్ ఉందన్నమాట!" నవ్వింది.
    "ఆఁ... ఫిలప్ చెయ్యలేని గ్యాప్!" రేవంత్ గొంతులో జీర.
    కాలేజ్ రావడంతో ఇద్దరూ 'బై' చెప్పుకుని విడిపోయారు.
    'నిజంగా రేవంత్ మంచి ఫ్రెండ్!' అనుకుంది జ్ఞాపిక.
    'జ్ఞాపికది నిజంగా మంచి నేచర్!' అనుకున్నాడు రేవంత్.
    ఇప్పటికి చాలాసార్లు కలుసుకుని విడిపోయాక ఇద్దరూ అలాగే అనుకుంటారు.
    నాలుగడుగులు వేశాడో,లేదో- "రేవంత్..!" అంటూ పరిగెత్తుకువచ్చి, 'కెన్ స్పృహ లేకుండా కూలబడివుంది.
    "ఈమెను హాస్పటల్ కు తీసుకువెళ్దామా?" అంది.
    అక్కడ యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర ఆటోలు దొరకడం కష్టం! అందుకే హాస్టల్ నుండి సైకిల్స్ గానీ, స్కూటర్స్ గానీ వాడతారు అమ్మాయిలు. ఆ అమ్మాయి కూడా సైకిల్ మీద వచ్చినట్టుంది! జ్ఞాపికకు కైనటి క్ వుంది. కానీ, ఆ అమ్మాయినెలా తీసుకెళ్లగలదు ఆ స్థితిలో? పోనీ....రేవంత్ పట్టుకుని కూర్చున్నా- ముగ్గురూ కైనటిక్ మీద పోవడం అసాధ్యం! హాస్టల్ వరకు ఆ అమ్మాయిని మోసుకెళ్లడం మరీ కష్టం!
    వెంటనే ఐడియా వచ్చింది.
    "డూ వన్ థింగ్! నా బైక్ తీసుకురాలేదు. నేనీరోజు ఫ్రెండ్ తో కలిసి వచ్చాను. నీ కైనటిక్ తీస్కెళ్లి ఆటో తెస్తాను. అప్పటివరకూ నువ్వీ అమ్మాయి దగ్గర ఉండు! అనేసి వెళ్లి పది నిముషాల్లో ఆటో తెచ్చాడు.
    ఆటోలో జ్ఞాపిక, ఆ అమ్మాయి హాస్టల్ కెళ్లారు. వెనుక జ్ఞాపిక కెనటిక్ తీసుకుని రేవంత్ హాస్టల్ వరకూ వెళ్లి, గెట్ గద్దర కైనటిక్ ఇచ్చేసి వస్తూ-
    "వాట్ హ్యాపెండ్ టు హర్! ఈజ్ షి సిక్?" అడిగాడు.
    "య్యా! షీ ఈజ్ డ్రగ్ ఎడిక్ట్! అప్పుడప్పుడూ అలా అన్ కాన్షస్ అవుతుంది."
    "మైగాడ్! నువ్వింత ఈజీగా చెప్తున్నావేంటీ....డ్రగ్ ఎడిక్ట్ అని?!"
    "ఇలాంటి వాళ్ళను  అప్పుడప్పుడా చూస్తాం కాబట్టి కొత్తగా అనిపించదు. నువ్వు మొదటిసారి చూసినందుకు ఆశ్చర్యపోతున్నావ్! ఎనీహౌఁ.... థాంక్యూ రేవంత్! థాంక్యూ ఫర్ యువర్ కో ఆపరేషన్! నేను వెళ్లి తనను చూసుకోవాలి! వార్డెన్ కు  తెలిస్తే దాన్నింటికి పంపించేస్తుంది!" కంగారుపడింది.
    "అంటే.... వార్డెన్ కు తెలియకుండా మీరు  మేనేజ్ చేస్తున్నారన్నమాట! మీరే ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదూ..?!" కోపం వచ్చింది రేవంత్ కు.
    "మరీ  ఇరిటేట్ కాకు!  మనం రేపు మాట్లాడుకుందాం ఈ విషయం....బై!" అని, రేవంత్ "బై...!" అనేలోపే లోపలికి వెళ్లిపోయింది.  
                                   *    *    *
       మరుసటి రోజు లీజర్ అవార్ లో కూర్చున్నారు జ్ఞాపిక, స్ఫూర్తి, కామినీ, రేవంత్. క్రాంత్, ఈష్!
    అప్పటికి ఆ టాపిక్ స్టార్టయి అర్థగంట పైనే అయింది.
    "ఐ కాంట్ సపోర్ట్ యువర్ ఆర్గ్యుమెంట్! వార్డెన్ కూ, తల్లిదండ్రులకూ ఈ విషయం తెలీకుండా ఉంచడం మీ తప్పు! ఆ తరువాత వాళ్ళేం నిర్ణయం తీసుకుంటారో మీరెలా నిర్ణయించగలరు?" అన్నాడు రేవంత్ చేతిలోని రాయిని దూరంగా విసురుతూ.
    "మాకు ఒకమ్మాయి విషయంలో ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ ఉంది. కనుకే మేమీ డెసిషన్ తీసుకున్నాం!" స్ఫూర్తి.
    "నో! ఇట్స్ బాడ్! ఇట్స్ బాడ్! తల్లిదండ్రులకయినా చెప్పుండాల్సింది!" క్రాంత్.
    "తల్లిదండ్రుల వల్లే తను డ్రగ్స్ కు ఎడిక్ట్ అయింది! తండ్రి- తల్లికి డైవర్స్ ఇచ్చాడు. తల్లి వేరే  మ్యారేజ్ చేసుకుంది. తండ్రి  కూడా వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. తను తల్లి దగ్గర ఉంటోంది! రెండో తండ్రికి కూడా ఒక కూతురు. రెండో తండ్రి కూతురుకూ, తనకూ ఆ ఇంట్లో చూపే డిఫరెన్స్ కు ఆ అమ్మాయి డ్రగ్ ఎడిక్ట్ అయింది. ఇక  వాళ్ళ సపోర్ట్ ఆ అమ్మాయికి దొరుకుతుందా?" జ్ఞాపిక.
    "వార్డెన్ కోఆపరేట్ చెయ్యొచ్చుగా!" ఈష్.
    "నెవ్వర్! వార్డెనంత రిస్క్ తీసుకోరు!"
    "ఓ.కే.- వుయ్ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్! లాస్ట్ ఇయర్ మా పక్కరూమ్ అమ్మాయి ఒక అమ్మాయితో  లవ్ లో పడి పొరపాట్న ప్రెగ్నేన్నీ తెచ్చుకుంది. ఈ విషయం వార్డెన్ కు తెలిసి ఆ అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి ఆ అమ్మాయిని పంపించేసింది. ఆ విషయం అందరికీ తెలిసిందనే గిల్టీనెస్ తో తను కాలేజ్ మానేసింది! తల్లిదండ్రులు అబార్షన్ చేయించి ఇంకో పెళ్ళి చేశారు. పెళ్ళి తరువాత ఆ భర్తకా విషయం తెలిసి గొడవ చేస్తే... తను ఆత్మహత్య చేసుకుంది! ప్రేఅమించినవాడు బానే ఉన్నాడు, వార్డెన్ కూడా బావుంది. ఆ అమ్మాయికే బ్రతుకు లేకుండాపోయింది!" స్ఫూర్తి.
    "ఒక వీక్ నెస్ కు పరిష్కారం... పనిష్ మెంట్ కాదు. అర్థంచేసుకుని, నెమ్మదిగా దానిలో లోతుపాతులు వాళ్ళకు తెలియచేసి, వాళ్ళను అందులోంచి బయటకు తేవాలి! అంతేగాని, గొడవచేయడం, వాళ్ళను చులకన చేయడం... సొల్యూషన్ కాదు కామినీ!"
    "అందుకే రేవతి విషయంలో మేము చాలా డెలికేట్ గా వ్యవహరిస్తాం. తను  ఏదో ఫ్యామిలీ డిప్రెషన్ తో డ్రగ్స్ కు అలవాటు పడి ఎడిక్ట్ అయింది. మా కోఆపరేషన్ తో చాలావరకు తగ్గించింది. ఇంకొన్ని రోజుల్లో తను పూర్తిగా మానేస్తుందనే నమ్మకం మాకుంది" జ్ఞాపిక కాన్ఫిడెంట్ గా  అంది.
    "య్యా..! వీళ్ళ థింకింగ్ కూడా బానే ఉంది కదా!" క్రాంత్.
    "మా ఆలోచన - ఆ అమ్మాయి విషయంలో గొడవచేసి అల్లరిచేయకుండా మా ఫ్రెండ్ షిప్ తో తనను బయటకు తీసుకురావాలని!" కామిని.
    "అఫ్ కోర్స్! బెస్టాఫ్ లక్!" అన్నారు ముగ్గురబ్బాయిలు.
    "జ్ఞాపికా! మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మీలో మీ కోఆపరేషన్ చూస్తుంటే ఇది బాయ్స్ లో లేదేమో... ననిపిస్తుంది!" ఈష్ అన్నాడు.
    "ఎందుకు లేదూ! మన ముగ్గురి మధ్య లేదా? మనం బాయ్స్ కాదా? రేవంత్ నవ్వాడు.
    "ఎనీ డౌట్?" కామిని అంది.
    "డోంట్! స్టుపిడ్!" స్ఫూర్తి తిట్టింది.
    "సెల్ఫ్ ఇన్సల్ట్   చేసుకోకూడదు. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ కోల్పోకూడదు" రేవంత్ అన్నాడు.
    "అయాం ఆల్సో సపోర్టింగ్ రేవంత్!" జ్ఞాపిక అంది.
    అందరూ హాట్ హాట్ టాపిక్ లోంచి నవ్వుకుని రిలాక్సయి విడిపొయారు.  
                                  *    *    *
    హాస్టల్ వెనకాల కొంత ఖాళీ ప్లేస్ లో స్టూడెంట్స్ చదువుకోవడానికీ, రిలాక్స్ అవడానికీ లాన్ మెయిన్ టెయిన్ అవుతోంది. అక్కడే  కూర్చుని రిలాక్స్ డ్ గా కబుర్లు చెప్పుకుంటున్నారు.... జ్ఞాపికా, రేవతీ ,స్ఫూర్తీ, కామినీ!
    కొద్దికొద్దిగా మసక చీకటి, చల్లటిగాలి! వదిలేసిన జుట్టుకొసలు రవివర్మ కుంచెకొసల్లా- గీసిన చిత్రానికి తుదిమెరుగులు దిద్దుతున్నట్లు అమ్మాయిల నుదురూ, బుగ్గల్ని నాజూగ్గా  తడుముతున్నాయి. ఆ తడమడంలో - ఏదో మెత్తనిస్పర్శలోని గిలిగింత మనసుకు ఇంకా ఆహ్లాదం కలిగిస్తోంది. అల్లరి వెంట్రుకల్ని వెనక్కి  తోస్తూనే మళ్లీ విడిచిపెడుతున్నారు ఆ స్పర్శ కోసం!
    "నీకేం చూస్తే భయమే? నిజంగా  చెప్పాలి! లేనిపోని గొప్పలు వద్దు... నాకసలు భయమే లేదని!" స్ఫూర్తి అడిగింది కామినిని.
    "ఓ.కే! ఫ్రాంక్ లీ.... కాక్రోచ్ ను చూస్తే!" కామిని చెప్పి రేవతి వైపు చూసింది.
    "నాకు లిజర్డ్ ను చూస్తే!" ఒళ్ళంతా జలదరించినట్లయి వెంట్రుకలు నిక్కబొడుచుకుని, ఊపిరాగిపోయి, చూపు నిలిపేసి - "కెవ్వు" మని గట్టిగా అరిచింది.
    అందరూ కంగారుపడి లేచి పరిగెత్తబోయి- రేవతి రాకపోవడంతో.... ఆగిపోయి "రావే..." అన్నారు.
    "ఎక్కడికే?" నింపాదిగా అడిగింది.
    "నువ్వేకదే అరిచావ్! అసలేం జరిగింది? నువ్వరిచావని మేం పరిగెడుతున్నాం!" స్ఫూర్తి అయోమయంగా అంది.
    "అయోమయపు జగన్నాధాలూ.... మీరెలా బ్రతుకుతారో, ఏవిటో... ఈ అమాయకత్వంతో! నేనేమీ భయపడి ఆరవలేదు. లిజర్డ్ ను చూస్తే 'అలా అరవాలనిపిస్తుంది' అని అరిచి చూపించాను" బాసింపట్టు వేసుకుని కూర్చుంటూ నిదానంగా వివరించింది.

 Previous Page Next Page