అతను నవ్వాడు. ఆమెకు దగ్గరగా వెళ్ళి భుజాలు పొదివిపట్టుకుని తనవైపు తిప్పుకుని, పెదవులమీద గాఢంగా చుంబించాడు.
"పిచ్చిదానా! ఇంకా తెలుసుకోలేదా ? నీలో లీనమయే ప్రతి వారి ద్వారా నా దివ్యత్వం నీకు అందుతూనే వుంది. ఆ అమృత, ఆధ్యాత్మిక క్షణాల్లో నేనే... నా ... అంటే నీలో విలీనమవుతున్నది."
ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడి ఆమె గదిలోనుంచి బయటకు వెళ్ళిపోయింది.
* * *
నైలీనా లోపలకు అడుగుపెట్టింది. గదిలో వెలుగుతున్న విద్యుత్ దీపకాంతిలో ఆమె తెల్లని శరీరం ధగ ధగ మెరిసిపోతోంది. తెలియని లోకాలను ప్రదర్శిస్తున్నట్లు చెలించే తేనెకళ్ళు, అద్భుతమైన సౌందర్యానికి అమరిన పట్టుకుచ్చులాంటి కేశాలు, వంటికి చిత్రంగా చుట్టుకున్న అలవాటు లేని ఇండియన్ శారీ. ఆమె భూమ్మిద నడుస్తుంటే ఓ గంధర్వ స్త్రీ గాల్లో ప్రయాణం చేస్తున్నట్టు అనుభూతి కలుగుతుంది.
క్షణంసేపు ఆచార్య జగదీష్ ఆమెవైపు విస్మితుడైనట్లు చూసి, అంతలోనే మామూలుగా మారాడు.
అతనివంక అయస్కాంత శక్తితో ప్రకాశించే అతని కళ్ళలోకి ముగ్ధమోహనంగా చూస్తోంది నైలీనా.
ఇద్దరూ ఒకరినొకరు అభిముఖంగా నిలబడ్డారు.
"మీ గురించి విని, మీ ప్రసంగాలు పేపర్లో చదివి మిమ్మల్ని సందర్శించాలని కలలుగన్నాను. నేటికి నా అదృష్టం ఫలించింది" అన్నది ఇంగ్లీషులో. ఆమె గొంతు వీణ మీటినట్లుంది.
"నీ భర్త ..."
"అతని పేరు రైట్. ఫ్రాన్స్ లోని అత్యంత సంపన్నులలో ఒకడు. రాజకీయంగా కూడా అతనికి చాలా పలుకుబడి వుంది."
"అతన్ని నువ్వు ఇష్టపడలేకపోతున్నావా ?"
"మొదట్లో అతన్ని విడిచి ఒక్క క్షణం కూడా వుండలేనను కున్నాను. ఇప్పుడు తన్ని ఓ క్షణం కూడా భరించలేకపోతున్నాను."
ఆచార్య జగదీష్ నవ్వాడు. "మానవ జీవితంలో అత్యంత సహజమైన పరిణామాలివి."
"అతన్ని భరించలేక యాకంగా పారిపోయి వచ్చాను. కాని నా మీద చాలా కోపంగా వున్నాడు. అతని వల్ల నాకేమన్నా ప్రమాదం సంభవిస్తుందేమోనన్న భయంగా వుంది."
ఆచార్య జగదీష్ మళ్ళీ నవ్వాడు. "నీ వెనక ఓ మహాశక్తివుండగా అతను తలపెట్టిన ప్రమాదానికి అతనే ఆహుతవుతాడు."
నైలీనా ఉలికిపడి అతని ముఖంలోకి చూసింది. ఆ ఉలికిపాటు క్షణంసేపే. ఆమెలో భయం అంతరించిపోయి, అతన్లోని ఆకర్షణ శక్తి వైపు దూసుకుపోసాగింది.
"నువ్వు గురూపదేశం పొందబోతున్నావు"
"నేను సిద్దంగా వున్నాను స్వామీ !"
అతనామెను సమీపించాడు. చేతిలో ఓ పాత్ర వుంది.
"ఇందులో వున్న మధుర పదార్ధం సేవించు."
ఆమె అతని చేతిలోని బంగారు పాత్ర నందుకుని అందులో వున్న పానీయాన్ని భక్తితో స్వీకరించింది.
అది ఆల్కహాలు కాదు. కాని గొప్ప పరిమళాన్ని వెదజల్లుతూ నిజంగానే మధురంగా వుంది.
ఒక్కొక్క నిమిషం గడిచేకొద్దీ శరీరంలో అణువణువునా ఏదో మార్పు ఆవహిస్తూ, ఓ అనిర్వచనీయమైన అనుభూతి కలుగసాగింది.
"మనిషి పూర్తిగా నగ్నంగా వున్నప్పుడే ఉపదేశం పొందే అర్హత లభిస్తుంది."
ఆమె శరీరం మీది వలువలు క్రమక్రమంగా కరిగిపోతున్నట్టు జారి నేల వ్రాలిపోయాయి. అతనూ అదే స్థితిలోకి వెళ్ళిపోయాడు.
అతని ముందు పూర్తిగా నగ్నంగా నిలబడి వుంది. అసలే సౌందర్యరాశి. ఏ ఆచ్చాదనం లేకుండా అజంతా శిల్పంలాంటి వొంపుసొంపులతో కళ్ళలోకి ప్రవేశించిన విచిత్ర కాంతులతో అలా నిలబడి వుండేసరికి అప్పటికప్పుడు భూమిమీద ఓ శృంగార దేవత అవతరించినట్లయింది.
అతని రెండు చేతులూ ఆమె భుజాల మీద వ్రాలాయి. పాలరాతిలా తెల్లగా, నున్నగా మెరిసిపోతున్న భుజాలు. కొంచెం ముందుకు వంగి పెదవుల్ని ఆమె చెవి దగ్గరగా చేర్చి రహస్యం చెబుతున్నట్టుగా మంత్రోపదేశం చేశాడు.
దివ్యమైన గుసగుస.
ఆమెకు ఏదో లోకాల్లోకి పరుగులు తీస్తున్నట్టనిపించింది.