ఆయన మాటలు వినడంలో నిజంగానే మతి భ్రమించలేదుకదా అనే అనుమానం పెరిగిపోయింది వాళ్ళకు.
"ఏమిటి సార్! మీరు మాట్టాడేది? అసలు స్పృహలో వుండే మాట్లాడుతున్నారా?"
"షటప్! ఐయమ్ ఆల్ ర్తెట్."
"లేకపోతే ఏమిటి సార్! మనిషిని పట్టుకుని దేయ్యమంటున్నారు. ఏదో డెవిల్ సినిమా చూసివచ్చినట్టు ప్రేతాత్మ రావడం, గదిలోకి వెళ్ళడం, రాబందుతో మాట్లాడడం, గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోవడం....ఇవన్ని నమ్మే విషయాలేనా? ఒట్టి ట్రాష్" మరొక డాక్టర్ సీరియస్ గా చెప్పాడు.
హాస్పిటల్ సూపరింటెండెంట్ ముఖం కోపంతో నల్లబడింది.
మారు మాట్టాడకుండా విసురుగా గదిలోనుంచి బయటకు వెళ్ళి లెక్చరర్ నీలిమనీ వుంచిన గదివ్తెపు అడుగులు వేస్తున్నాడాయన.
ఇక రెండవది....
పారాస్తేకాలజి ప్రొఫెసర్ యోగానంద్ గారి బంగ్లాలో....
నలుగురు స్టూడెంట్స్ చెప్పింది విన్న తర్వాత ప్రొపెసర్ దీర్ఘంగా ఆలోచించి తన అభిప్రాయాన్ని చెప్పాడు.
"మీరు చెప్పింది వింటుంటే నాకూ అనుమానంగానే వుంది. కానీ నీలిమ చనిపోయి ప్రేతాత్మ మారి వుంటే తిరిగి నిలిమలా ప్రవర్తించ వచ్చేమోకాని....
ఒక మనిషిలా ఇరవ్తే నాలుగు గంటలూ మనలడం అతికష్టం. ఆ కోణంలోంచి చూస్తే ఆమె ప్రేతాత్మకాదని, మనిషేనని అనుకోవలసి వస్తుంది. ఎనిహౌ.... రెండు మూడు రోజుల్లో వీలు చూసుకుని మీ యూని వర్శిటీకి వచ్చి మీ మేడమ్ గారిని స్వయంగా చూసి, మాట్లాడిన తర్వాత నా అభిప్రాయాన్ని తెలియచేస్తాను."
స్టూడెంట్స్ ముఖాల్లో ఆతృత అప్పడుగాని తగ్గలేదు.
మూడవ సంఘటన!
సుధాకర్ ఉన్న హాస్పిటల్ లో అతను చెప్పేది సీరియస్ గా వింటున్న ఇన్స్ పెక్టర్ ధీరజకు కూడా లెక్చరర్ నీలిమ ప్తె అప్పడప్పడే చిన్న అనుమానం బయలుదేరింది.
అంతమంది, అన్నిరకాలుగా ఎందుకని నిలిమని గురించి మనిషా లేక దయ్యమా అని సందేహాన్ని వేలిబుచ్చుతున్నారో అప్పటికి ఆమెకు అర్ధమయింది.
తొలిసారిగా ఆమెకూడా పునరాలోచనలో పడింది.
నీలిమ నిజంగానే ప్రేతత్మయి వుంటుందా?
ఈ మూడు సంఘటనల నేపధ్యంలో ..... హాస్టల్ గదిలోవున్న లెక్చరర్ నీలిమ వున్నట్టుండి పగలబడి నవ్వడం మొదలెట్టింది.
మధ్య మధ్యలో నవ్వు ఆపినప్పడల్లా.....
"రండిరా.....రండి....మీకోసమే ఎదురు చూస్తున్నాను" అంటున్నదామె.
ఆ కంఠంలో కోపం....కసి....పగ....పోటిపడుతున్నాయి.
ప్రశాంతమయిన హాస్టల్ వాతావరణంలో బిగ్గరగా వినిపించిన ఆ కేకలను బిత్తరపోయిన లేడీ స్టూడెంట్స్ అనుమానంగా వార్డెన్ గదివ్తెపు పరుగుతీశారు.
మహంకాళిలా జుట్టు విరబోసుకుని గది మధ్యలో కూర్చునివింతగా ప్రవర్తిస్తూ, వెర్రిగా నవ్వుతూ, పిచ్చిగా మాట్లాడుతున్న లెక్చరర్ నిలిమని అలాంటి స్ధితిలో చూసి ఎవరికివారే దడదడలాడుతున్న గుండె లతో బిక్కు బిక్కు మంటూ చూస్తున్నారు.
వాళ్ళవ్తెపు అప్పడ తలతిప్పి చూసింది లెక్చరర్ నీలిమ.
* * * *
ఇన్స్ పెక్టర్ ధీరజ చూపులు ఆ గదిలోనీ ఒక మూల గూడు కట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న సాలిడుప్తెనే వున్నాయి.
దాదాపు అరగంటనుంచి పట్టుదలగా ప్రయత్నిస్తున్నది సాలీడు.... కానీ వున్నట్టుండి గాలిలో క్రిందకు జారిపోవడం, ఓపిగ్గా ప్తెకి చేరుకొని సాలెగూడు అల్లడానికి తీవ్రంగా కృషి చేస్తున్న ఆ సాలేపురుగుని చూస్తున్న కొద్ది దిరజకు ముచ్చటేస్తుంది.
ఒక విధంగా తన వృత్తిలో కూడా ఆ మూగజీవి పడే శ్రమకన్నా ఎన్నోరెట్లు ఓర్పు అవసరం. లేదంటే ఒక్కో సందర్భంలో చిన్నదిగా కనిపించే క్లూ వలెనే ఆ నేర స్వరూపాన్ని పూర్తిగా పరిశోధించే అవకాశం చేజారిపోతుంది.
ఆమె ఆలోచనలు అటు తిరిగి, ఇటు తిరిగి లెక్చరర్ నీలిమ కేసుప్తేల్ లోని పరిశోధన ప్తెకి మళ్ళాయి.
ఈ పదిరోజుల్లో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
లెక్చరర్ నీలిమ వుపయోగించే నీలిరంగు మారుతికారు ప్రస్ధుతం ముకుందరావు వద్ద వుండడంతో దిరజ ఆ ఆధారంతో అతన్ని ప్రశ్నించింది.