Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 34


    ఇన్స్ పెక్టర్ గొంతు ఖంగుమన్నది.

    మిత్రులు ముగ్గురూ  తమ లెక్చరర్ సుధాకర్ వ్తెపు చూశారు.

    అందరి ముఖాలల్లోనూ  ఇన్స్ పెక్టర్ ధీరజ తమ మాటలను నమ్మడం లేడనే బాధ స్పష్టంగా కనిపిస్తోంది.

    "ఇన్స్ పెక్టర్ ! మేము ఎంత చెబుతున్న మీరు మా మాటలను విశ్వసించలేదు. కావాలంటే మీరే నీలిమ  మేడమ్ నీ నాలుగు రోజులపాటు అనుక్షణం గమనిస్తూ వుండండి....ఆమె మనిషో, లేక దెయ్యమో మీరే ఒక అవగాహనకు వస్తారు. అంతేకాదు.....ఇంతవరకూ వచ్చాక మాకు తేలి లింది చెప్పకపోవడం వలన మీరు మిమ్మల్ని అనుమానిస్తున్నారు.....మా  మాటలను నమ్మడం లేదు, అందుకే మాకు తెలిసిన నిజాలను ఇప్పుడు చెప్పక తప్పడంలేదు. అంతా విన్న తరువాత కూడా ఆమె దెయ్యం కాదు....మనిషే అంటారా ఇక మేము  చెప్పేదేమీ లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.....దట్సాల్...." అంటూ సీరియస్ గా ముఖం పెట్టాడు సుధాకర్.



                *    *    *    *

    సుధాకర్ చెప్పే మాటలకు అసలు అర్ధంలేకుండా పోతున్నది_ ప్రతిసారి ప్రతి సంఘటన వెనుకా ఉన్నది నీలిమ దెయ్యమేనంటాడు నీలిమ చచ్చి దయ్యం అయి తిరుగుతుందన్న భ్రమలో వున్న వ్యక్తికి ప్రతి క్షణమా దెయ్యం తన చుట్టూనే తిరుగుతున్నట్టు  విపరీతమయిన భయానికి లోనవుతుంటాడు.

    ప్రస్తుతం సుధాకర్ అలాంటి స్ధితిలోనే వున్నాడు.

    మొదటిసారి షాక్ కు గుర్తెనప్పడు నీలిమ దయ్యం వచ్చి ఏకంగా తన బెడ్ ప్తెనే కూర్చుంది. ఎంతో దగ్గరగా తన కళ్ళతో తను స్వయంగా  చూశానని ఘంటాపథంగా చెబుతున్నాడు.

    ఒక విధంగా  అతను చూసింది నిజమే కావచ్చు. కానీ ఆమె దెయ్యం కాదు. నిలిమే అయ్యిండాలి. ఎందుకంటే ఎవరినో చూసి నీలిమ అనుకునేటంత అమాయకుడుకాదు సుధాకర్.

    దెయ్యం కాదు అనుకోవడానికి ఇంకొక రీజన్ నీలిమ బ్రతికే వుంది. ఆ విషయాన్నీ సుధాకర్ ఒప్పుకోకపోవచ్చు.

    అంతవరకూ అతనితో  కలిసివున్న  రజని  బాత్ రూమ్ కు వెళ్ళింది. అదే సమయంలో కరెంట్ పోయింది. తిరిగి  కరెంట్ వచ్చేసరికి బెడ్ ప్తె వున్న నిలిమని చూసి  దెయ్యంలా  భావించడానికి అవకాశముంది. ఏం జరిగిందో తెలియడానికి కానీ, నీలిమ వెళ్ళిపోవడం కానీ బాత్ రూమ్ లో వున్న రజనీకి తెలిసే  అవకాశమేలేదు.

    అంటే కావాలనే కరెంట్ ఫెయిల్ అయిన సమయంలో ప్రత్యక్షమయి అతను భయంతో స్పృహ తప్పాక ఏమీ ఎరుగనట్టు తప్పుకోవడానికి నిలిమకు ఎంతో అవకాశముంది.

    కానీ అలా చేయడానికి నీలిమ మోటివ్ ఏమిటో తెలియాలి.

    అబ్బులు మరణం కూడా పాముకాటు వలనా ,షాక్ వలనా మరణించిందే తప్పు దెయ్యంపని కాదని తన నమ్మకం!

    అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళి సుధాకర్ చెప్పే ఈ వింత కథనం కూడా అతను  భావిస్తున్నట్టు నీలిమ దయ్యమనే భావనకు లోబడే వుంటుంది.

    సరే! ఏం చెబుతాడో విందామనే నిశ్చయానికొచ్చిందామే.

    "ఓకే....మీకు తెలిసిందేదో చెప్పండి.....అవసరమయితే నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను" ధీరజ స్ధిరమ్తెన కంఠంతో గంబిరంగా చెప్పింది.
   
   

    సుదాకర్ నోరువిప్పి చెబుతున్నాడు.

    వింటున్న ఇన్స్ పెక్టర్ ధీరజ ఆశ్చర్యపోతున్నది.

   
               *    *    *    *

    హాస్పిటల్లో.....

    సూపరింటెండెంట్ కోమాలోనుంచి అప్పడే కోలుకున్నాడు. అతనివ్తెపు డాక్టర్లు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు.

    "లెక్చరర్ నీలిమ....దెయ్యం."

    ఆయన నోటివెంట వచ్చిన  తోలి మాటలు అవి....

    కొంపదీసి  మతి చలించలేదుకదా అనే అనుమానం వచ్చింది అక్కడి వాళ్ళకు

    హాస్పిటల్ సూపరింటెండెంట్ ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. అతనెక్కడున్నారో మరుక్షణం అర్ధమ్తెంది.

    చుట్టూ డాక్టర్లు తనవ్తెపు అందోళనాగా  ఆత్రుతగా  చూస్తున్నారు.

    "ఏ....ఏమ్తెంది నాకు....ఏమిటిదంతా..."

    ఏం చెప్పాలో తోచక ఒకరి ముఖాలొకరు  చూసుకున్నారు.

    "సర్లే....ముందు అర్జెంటుగా నీలిమ గడికి వెళదాం పదండి....నాకెందుకో  ఆమెను చూసినప్పడే అనుమానం వచ్చ్సింది. రాత్రి ఆమె గది లోకి ప్రేతాత్మ ఒకటి వెళ్ళింది. ఆ ప్రేతాత్మ తిరిగి కిటికీలో నుంచి బయటకు వెళ్ళి, చెట్టుప్తే కూర్చున్న రాబందులో మాట్లాడి, ఆ రెండూ కలిసి గాలిలో  ఎగురుకుంటూ వెళ్ళాయి" అంటూ అమాంతం బెడ్ దిగాడు సూపరింటెండెంట్.

 Previous Page Next Page