Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 36



    "మీకు తెలుసో తెలియదో....ఆ  కారు మోడల్ చూడగానే నాకు ముచ్చటేసి, ఒకవేళ ఆ కారుని ఆమ్మే ఆలోచన అంటూ వుంటే నాకే అమ్మమని ,లెక్చరర్ నిలిమకు  ఒక ఆఫర్ యిచ్చాను. ముందు ఆమె తిరస్కరించినా, తర్వాత ఏం అవసరం వచ్చిందో ఏమో నాకు అమ్మడానికి యిష్టపడి డబ్బు తీసుకుని, తన కారుని నాకు అమ్మేసింది. అందుకు సంబంధంచిన కాగితాలు నావద్ద   భద్రంగానే  వున్నాయి. నా మాటలు మీకు అనుమనం కలిగింనట్టయితే ఆ డాక్యుమెంట్స్  ను మీరు పరిలించవచ్చు."

    ధీరజ ప్రశ్నకు ముకుందరావు సూటిగా జావాబిచ్చాడు.

    అందులో ఎంత నిజం వుందో తెలియాలంటే లెక్చరర్  నిలిమను సంప్రదించాలి.

    అంత ఖచ్చితంగా చెబుతున్నాడు కాబట్టి నిజంగానే  ఆ కారును కొన్నా,  కొనకపోయినా ఆ పత్రాలు మాత్రం అతను కోరుకున్నట్టే కరెక్ట్ గానే  వుంటాయని వూహించాగాలిగింది.

    అందుకే ఆ పత్రాలను  చూడటానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదు ధీరజ.

    అతని మాటలను  నమ్మినట్టే మౌనం వహించి తన పరిశోదనను కొనసాగించింది.

    "ఎస్ మేడమ్ నాకు ఆ కారు వున్నందువలన లగ్జరిగా  పిలయ్యను. అందుకే ముకుందరావుగారికి ఆమ్మేశాను. అంతకుమించి ప్రత్యేకంగా కారణమేమి లేదు" అన్నది లెక్చరర్  నీలిమ.

    ఒక విధంగా ముకుందరావు చెప్పింది, లెక్చరర్ నీలిమా చెప్పింది విన్న తర్వత ఎలాంటి అనుమానం  రాకూడదు.

    కానీ అక్కడే  ధీరజ పోలిస్ బ్రెయిన్ పాదరసంలా పనిచేసింది.

    లెక్చరర్  నీలిమ ఏ రోజు అమ్మింది, అతను ఏ రోజు  కొన్నది ఆరా తీయగా లెక్చరర్ నీలిమ అదృశ్యమ్తెనట్టుగా  భావిస్తున్న్ మూడు  రోజుల్లో  మొదటిరోజు అని తేలింది.

    దాంతో ఆమె అనుమానం రెట్టింపయింది.

    ఆ రోజునుంచి ఆమెకు  సంబందించిన పూర్తి వివరాలను సేకరించింది.

    అందులో ఓకే ఒక విషయం ఆమెను మరింత ఆశ్చర్యపరిచేలా చేసింది.

    అబ్బులు  చనిపోయిన రాత్రి ఆ గెస్ట్ హౌస్ కు దగ్గర్లో వున్న పెట్రోల  బాంక్ లో ఆ కారు పెట్రోలు కొట్టించుకున్నది. ఆ సమయంలో పెట్రోల బాంక్ లో  నున్న స్టాఫ్ దృష్టిలో పడ్డారు  కారులో వున్న ఇండస్ట్రియలిస్థ ముకుందరావు, యూనివర్శిటి వ్తెస్ చాన్స్లలర్.

    ఆ ఆధారం  అభించడంతో అబ్బులు మరణం వెనుక మిస్టరీ మరింత బిగుసుకున్నట్టుగా తోచిందామెకు.

    అబ్బులు డెత్ రిపోర్టును మెడికల్ ఎనాలసిన్ కు పంపగా ఆసక్తికరమయిన విషయం బయటపడింది.

    అతను పాముకాటు వలన చనిపోలేదు.

    భయంతో గుండాగి మరణించాడు.

    అంటే....అందరూ భావిస్తున్నట్టుగా  నీలిమా దెయ్యం ఆ పని చేసి వుంటుందా? నిక్షేపంగా కనిపిస్తున్న మనిషిని అందరూ  ఒక పథకం ప్రకారం  దెయ్యంలా  చిత్రించి చెబుతున్నారే తప్పు ఆమె మనిషే నని ధీరజ విశ్వాసం. అందుకే  అబ్బులు మరణం  వెనకనున్న అసలు కారణం ఏమ్తే వుంటుందోనని ఇదమిద్దంగా ఒక అభిప్రాయానికి  రాలేకపోతోంది.

    లెక్చరర్ సుధాకర్, రమేష్ మిత్ర బృందం చెప్పింది ఓకే విధంగా వుండటంతో ఆ నలుగురు మాటలనూ నమ్మాలో లేదో ఒక అభిప్రాయానికి  రాలేకపోతోంది.

    వాళ్ళ మాటలని విశ్వసిస్తె నీలిమా మరణించి డయ్యమ్తేందనే భావించాలి.

    అలా జరగడం  అసంభవమని తన నమ్మకం  కాబట్టి.... వాళ్ళ  అభిప్రాయాలకు  విలువ నివ్వనవసరంలేడనే అభిప్రాయానికి  వచ్చింది.

    అది నిజమో కాదో తెలియాలంటే ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ ప్రేమ్ చంద్, వ్తెస్ చాన్సలర్ ను, ఇండస్ట్రియలిస్తూ ముకుందరావునీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి.

    ఎందుకంటే ఈ ఏడుగురికి తెలియకుండా ఏది జరిగి వుండదు. అసలు ఇంకేదో  జరిగి వుండాలి. దానిని కప్పిపుచ్చడానికి ఎవరికీ వారే చక్కటి కట్టు కథలల్లి తన దర్యాప్తును ప్రక్కకు మళ్ళిస్తూన్తెనా వుండవచ్చు.

    ఆ ఆలోచన  వచ్చిన మరుక్షణం ముందు  ప్రేమ్ చంద్ నీ  కలుసుకున్నది.

    అతని మాటలు సరిగ్గా సుధాకర్ ,రమేష్  మిత్రబృందం చెప్పిన కథనాన్నే తిరిగి రిపీట్ చేశాయి.

    తర్వత వంతు వ్తెస్ చాన్స్ లర్.....

    ముందుగా ఇన్స్ పెక్టర్ దిరజకు ఆపాయింట్ మెంట్ ఇవ్వడానికి నిరాకరించినా తర్వతా బలవంతగా మనసుని సమాధాన పరుచుకుని ఆమెను అనుమతించాడు.

 Previous Page Next Page