Previous Page Next Page 
అరుణ పేజి 35

    "వదులు, వదులు నీ వెవరు అసలు? మీ రెవరు......ఏమిటి మీ ఉద్దేశం? వదులుతారా వదలరా....." పెనుగులాడి అరుణ గదిలో పిచ్చిగా అరుస్తూ ఇటు, అటు పరుగెత్తడం ప్రారంభించింది. ఎటు వెళ్ళినా ఎవడో ఒకడు పట్టుకుని లాగుతున్నాడు.    
    "మా ఉద్దేశమా! తెలుస్తుంది. తొందరపడకు పిల్లా!" అన్నాడొకడు నవ్వుతూ.    
    "ఇదిగోనే నెవరనుకుంటున్నారో...... మిమ్మల్ని వదిలేస్తాననుకుంటున్నారో ఏమో? పోలీసులనిపిలుస్తా జైలులోతోయిస్తా జాగ్రత్త వదలండి నన్ను "బింకంగా బెదిరించబోయింది అరుణ పెనుగులాడుతూ."    
    "నిన్ను ముందు మేం వదలం తరవాత కావలిస్తేమమ్మల్ని నీవు వదలవద్దులే." వికటంగా నవ్వాడు.    
    అరుణ చేయి పట్టుకుని మంచంకేసిలాగుతూ ఒకడు అరుణకి ఆ క్షణంలో తనెంత నిస్సహాయ స్థితిలో వుందో అర్ధం అయిపోయింది. తను అరిచినా, గీపెట్టినా వీళ్ళ చేతుల్లోంచి రక్షించేవారు ఎవరు లేరని అర్ధం అయిపోయింది. అయిపోయింది తన పని........ తనింక ఏం చేయగలదు? ఒకడు కాదు, ముగ్గురు: వాళ్ళ నించి తప్పించుకోలేదు. వాళ్ళ నించి తప్పించుకోలేదు. వాళ్ళు తనని జీవచ్చవం చేసిగాని వదలరు. తను ఇలా భ్రష్టురాలవడానికా ఎంతమంది వారించినా ఈ ఊరొచ్చింది భగవంతుడా అరుణ పెనుగులాడింది. గిల్లింది, రక్కింది పెద్ద పెద్ద కేకలు పెడుతూ పెనుగులాడింది. ఆఖరి ఆయుధంగా వైర్ని అందిన చోటల్లా కరిచింది. దానితో ఒక్కక్షణం వదిలినా, మరింత కసితో అరుణని మంచంమీదికి ఒక్క త్రోపు తోసి మీదపడ్డాడు వాడు. అరుణకికళ్ళు బైర్లుకమ్మాయి ఊపిరి ఆడనట్టుగిలగిలాడింది ఉక్కిరిబిక్కిరి అయింది. తరువాత శరీరం తేలికయిపోతున్నట్టు, ఏ లోకంలోకో వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. అరుణకి తెలివి తప్పింది.    
    అరుణ మళ్ళీ కళ్ళు విప్పేసరికి లైటు వెలుగుతూంది. తన మొహంమీదికి వంగి ఎవడో యువకుడుఆదుర్దాగా చూస్తున్నాడు, చేతిలో వీళ్ళగ్లాసుపట్టుకుని, అరుణ వెర్రిదానిలా చూసింది. అతను చేతిలో గ్లాసులో నీళ్ళు మరికాసిని అరుణ మొహంమీద చల్లి ఆమె చీరకొంగుతో మొహం అద్దాడు. పెదాలకి గ్లాసు ఆనించి కొంచెం కొంచెంగా నీళ్ళు పోశాడు. అరుణ అలా చూస్తూనే గుటకలు వేసింది.    
    "మెలుకువ తెచ్చుకోండి, తెలివివచ్చిందా? ఇటు చూడండి భయం లేదు వాళ్ళు పారిపోయారు మీకేం భయం లేదు. మెలుకువ తెచ్చుకోండి." అతను నెమ్మదిగా అరుణని చూస్తూ అన్నాడు.    
    అరుణకి ఆ పరిసరాలు, అసలు తనిక్కడికి ఎందుకు వచ్చిందో ఏమిటో గుర్తుచేసుకోవడానికి రెండు మూడు నిమిషాలుపట్టింది. గుర్తు వచ్చాక ఒక్క ఉదుటున లేచి కూర్చుంది భయంతో. "వాళ్ళు.....వాళ్ళేరి? మీ రెవరు? ఇక్కడికి ఎలావచ్చారు? వాళ్ళు...... వాళ్ళు...... నన్ను...... నన్ను...... ఏం చేశారు?" చిన్నపిల్లలాబావురుమంది అరుణ, ఒక్కసారిగా అంతా గుర్తు రాగానే.    
    "లేదు లేదు, ఏం జరగలేదు. ఏం భయం లేదు మీ రూరుకోండి, సమయానికి నేనొచ్చాను వాళ్ళ పథకం పారలేదు పారిపోయారు. మీకేం ఫరవాలేదు. ఏం అనిష్టం జరగలేదు. మీరుఆదుర్దా పడకండి. కొంచెంసేపు అలా పడుకోండి. చాలా షాక్ తిన్నారు మీరు. అంతకంటే ఏం కాలేదు." తుఫానులో చిగురు టాకులా వణికిపోతున్న అరుణని భుజాలు పట్టి అతను నెమ్మదిగా పడుకోబెట్టాడు. కొద్దిసేపటి క్రిందట జరిగిన ఆ భయంకర దృశ్యం కళ్ళముందు కదులుతూంటే అరుణ మొహంరక్తం లేనట్లు పాలిపోయింది. పెదాలు తడారిపోయాయి. శరీరం అంతా గజగజ వణుకుతూంది. నోటమాట రావడంలేదు. కళ్ళంటనీరు కారిపోతూంది.            
    అతను అరుణకి ధైర్యం చెబుతూ, నెమ్మదిగా భయంపోగొట్టసాగాడు. మొహంమరో మాటు రుమాలు నీళ్ళతో తడిపితుడిచాడు. ఆమె చేతులువణకుండా పట్టుకున్నాడు కాస్త వేడి వేడి టీ, కాఫీ దొరికితే బాగుండుననిపించినా ఆ చుట్టుపక్కల ఏమీ దొరకవు గనక మరికాసినిచన్నీళ్ళే త్రాగించాడు. ఓ పదిహేను నిమిషాల తరవాత కాస్త కాస్త స్పృహలోకి వచ్చింది అరుణ. పూర్తిగా తెలివివచ్చింది. అతను చెబుతున్న ధైర్యవచనాలకి భయం కాస్త కాస్త తగ్గి ఆమె శరీరం వణకడం తగ్గింది. లేచికూర్చోగలిగింది స్థిరంగా.    
    "మీరు ఈ వేళకి ఇలా రావడం నిజంగా దేవుడేపంపినట్లున్నాడు....." హీనస్వరంతో అంది అరుణ.    
    'నిజమే అలాగే అనుకోవాలి మరి" అన్నాడతను. అతని పేరు రమేష్ చౌదరి. చౌదరిగారబ్బాయి. వారం రోజుల క్రిందటే పట్టణం నించి వచ్చాడట. చౌదరిగారు బాగా డబ్బున్నభూస్వామి. రాత్రి మొదటి ఆట సినిమాకి వెళ్ళిటౌనునుంచి తిరిగివస్తూంటే సగం దూరంవచ్చాక సైకిలు పంచరు అయిందట. మళ్ళీవెనక్కి వెళ్ళి టైరు పంచరు అది వేయించుకుని రావడంతో ఆలస్యం అయిపోయింది.    
    ఇక్కడికి వచ్చేసరికి ఓ స్త్రీ కేకలు బంగళలోంచి వినిపించి చటుక్కున సైకిలు దిగి బాటరీలైటు వేసి చూశాడు చీకట్లో ఆ కేకలు బంగళాలోంచే అని దృఢ పరుచుకుని అటు పక్కకి గబగబ వెళ్ళాడు. తలుపులు తట్టాడు నిశ్శబ్దంఅయిపోయింది. తలుపులు తట్టుతూ ఎంతకేకలు వేసినా తీయకపోవడంతో లోపల ఏదో అత్యాచారం జరుగుతోందని అతనికి అర్ధమయి కిటికీ గాజుతలుపులు బద్దలుకొట్టి గదిలో ప్రవేశిస్తుంటే ఆ ముగ్గురూ రెండో వైపు తలుపులు తీసుకుని పారిపోయారు. అతను బ్యాటరీ లైటువేసి వాళ్ళని వెంబడించినా ఆ చీకట్లో ముగ్గురూ తలో మూలకి ఆ తుప్పల్లోకి పారిపోయారు. వెంటనేలోపలికొచ్చి లైటువేసి చూసేసరికి అరుణ స్మృతిహీనురాలైమంచం మీద పడిఉంది. అరుణ పడి ఉన్న తీరు తనువచ్చే క్షణం ముందు కేకలు ఆగిపోవడం దాన్ని బట్టి ఇంకా ఏ అత్యాచారం జరగక ముందే తను వచ్చినట్టు తెలుసుకున్నాడు.    
    "నిజంగా ఏది జరిగినా మనమంచికే అంటారు. అలా సైకిలు పంచరవకపోతేపద కొండు గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోయిఉండేవాణ్ణి ఇలా ఒంటిగంటకు రావలసిన అవసరం కలగచేయడంనిజంగా ఆ భగవంతుడిమీ పట్ల ఉండి, నన్ను ఇలా పంపి ఉంటాడు. లేకపోతే ఈ అర్ధరాత్రి ఇటుపక్క ఎవరూ వచ్చే అవకాశమేలేదు."    
    "చెప్పకండి మీరే రాకపోయి ఉంటే....... తలుచుకుంటే నాకు వణుకు వస్తూంది. నిజంగా మిమ్మల్ని ఏమని అభినందించాలో, ఎలా కృతజ్ఞతలు చెప్పాలో, ఏం చేసి మీ ఋణం తీర్చుకోవాలో......"    
    "బాగుంది ఇందులో అభినందించడానికేముందండి? కాస్తోకూస్తో మానవత్వం ఉన్నవాడెవడైనా ఆ సమయంలో చూస్తూ ఊరుకోడు. ఎటొచ్చీ ఆ టైముకి నే నిక్కడికి రావడం ఆక్సిడెంటల్ గా అయి అదేమీకు రక్షణ ఇచ్చింది. అంతకంటే నేను మీకు చేసిందేం లేదు అసలు మీరు ఈ సమయంలో ఎందుకొచ్చారు ఇక్కడికి? మీరు ఈ ఊళ్ళో డాక్టరుగా ఉన్నారనివిన్నాను. దూరంనించి మిమ్మల్ని ఒకసారి ఎవరోచూపిస్తే చూశాను కనకమిమ్మల్ని చూడగానే గుర్తుపట్టాను. ఏదన్నా అర్జెంట్ కేసని పిలిచారా ఎవరన్నా? మీ బాగ్ చూసి అదే అనుకున్నాను."    
    అరుణ తల ఊపింది "ఈ ట్రావెలర్స్ బంగళాలో ఎవరో ఆఫీసరుకి కలరా వచ్చిందని ఎవరో వస్తే జీపులోవచ్చాను. తీరా చూస్తే ఎవరూ లేదు. వాళ్ళు పన్నిన వల ఇది. ఇంతకీ ఆ జీపు ఉందా మీరు వచ్చేసరికి?"    
    "జీపా: లేదే అసలు నేనొచ్చేసరికి లేదు" విస్మయంగా అన్నాడు. "ఆ జీపునంబరు చూశారా గుర్తుందా?"  ఆదుర్దాగా అడిగాడు.    
    "లేదుచూడలేదు చీకట్లో నంబరు అది చూడాలని అప్పుడునా కెందుకు తట్టుతుంది?"

    "పోనీ ఆ మనుష్యులని మరోసారి చూస్తే గుర్తుపట్టగలరా? అసలు వాళ్ళు ఇలాంటిపనికి ఎందుకు పూనుకున్నారంటారు?"        "ఏమిటో నాకేం అర్ధం కావడం లేదు. వాళ్ళకి నేనేం ద్రోహంచేశానని నా మీద ఇలా కత్తి కట్టారు? అసలు వాళ్ళని చూసినగుర్తయినా లేదు నాకు నే వచ్చేసరికి గుమ్మంముందు క్రీనీడలో ఉన్నారు. గదిలోకి రాగానే లైటు ఆర్పేశారు. వాళ్ళని అసలు సరిగా చూడనేలేదు నేను" ముందునించి జరిగిందంతా వివరించింది అరుణ.  
    "ఊతరవాత ఆలోచిద్దాం ఆ సంగతి. ముందు ఇంటికి వెడదాం, పదండి, నడవగలరా? లేకపోతే ఎలాగూ రెండు గంటలయింది ఇక్కడే పడుకోండి. నేనుసాయం కూర్చుంటాను ప్రొద్దుటవెళ్ళి బండి తెస్తాను."    
    అరుణ గాభరాగా వారించింది. "వద్దు, వద్దు ఇక్కడా? ఒక్క క్షణం ఉండను పదండి వెళ్ళిపోదాం, నడవగలను, పదండి."    
    నడవగలను అది గాని, అరుణ లేచినించోగానే కాళ్ళు భూమి మీద నిలవలేదు. ఒక్క గంటలో ఏ టైఫాయిడ్ జ్వరమో వచ్చి లంఖణాలు చేసినంత నీరసంగా ఎలా అయిపోయిందో అరుణకే ఆశ్చర్యం అనిపించింది. ఆ షాక్ నించి నెర్వస్ వీక్ నెస్ ఆ అదటు తగ్గితేకాని మామూలు మనిషికాలేదు తను. తను ఎంతో ధైర్యసాహసాలు గల వ్యక్తినని ఇన్నాళ్ళుగా అనుకునేది. అలాంటిది తనేఎలాయిపోయింది: ఎంత ప్రమాదంనించి తప్పించుకుంది. నించుని రెండు అడుగులు వేయగానే అరుణ నిలబడలేక మళ్ళీ మంచంమీద కూలబడింది.    
    మీరు చాలా నెర్వస్ అవుతున్నారు. చాలా షాక్ తిన్నారు. స్థిమితపడండి. కొంచెం సేపుండి వెడదాం. లేకపోతే నా సైకిలుంది మీ కభ్యంతరం లేకపోతే....." సందేహిస్తూ ప్రశ్నార్ధకంగా చూశాడు.    
    "అబ్జెక్షన్ ఏముంది? పదండి, వెడదాం ఇక్కడ మరొక క్షణం ఉంటే ఇంకేం జరుగుతుందో నని భయం వేస్తూంది ఇంటి కెడితే గాని ఈ భయం పోదు నాకు."నిలుచున్నా అరుణకి చేయి అందించి మరో చేత్తో బాగ్ తీసుకుని నడిపించుకువెళ్ళాడు రమేష్ సైకిల్ దగ్గరికి.    
    "జాగ్రత్తగా పట్టుకు కూర్చోగలరా? వణుకు వస్తే చెప్పండి. నెమ్మదిగా తీసుకెడతానులెండి" అరుణని కూర్చోబెట్టిసైకిలు తొక్కడం ఆరంభించాడు రమేష్.    
    ఇంటిదగ్గిర మణి వీధి అరుగుమీదే అరుణ కోసం చూస్తూకునికి పాట్లు పడుతున్నాడు. జీపులో వెళ్ళిన అరుణ, ఓ అపరిచితుడి వెంట సైకిలెక్కిరావడం చూసి ఆశ్చర్యపోయాడు ఎదురెళ్ళి బాగ్ అందుకుని ఆశ్చర్యంగా ప్రశ్నలు వేయబోతూంటే రమేష్ వారించాడు.    
    "అమ్మగారికి ఒంట్లో బాగులేదు. వెంటనే వేడివేడి కాఫీ కలిపి పట్రా, తొందరగా అతనే పురమాయించాడు.    
    అరుణ అతని సాయంతో ముందుగదిలోకి వెళ్ళి అక్కడున్న సోఫాలో వాలిపోయింది. మణి కాఫీ కలిపి రెండు కప్పులతో తీసుకొచ్చాడు. బాగ్ లోంచి నెర్వస్ నెస్ తగ్గడానికి ఓ మాత్ర తీసి వేడివేడి కాఫీతో వేసుకుంది అరుణ. రెండు నిమిషాలలో కాస్త ప్రాణం వచ్చినట్లు అనిపించింది లేచికూర్చుంది.

 Previous Page Next Page