Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 33



    "అదేమీ నాకు తెలియదు....నీలిమ మాత్రం దెయ్యమే."

    "అంత ఖచ్చితంగా ఎలా చెప్పగాలుగుతున్నారు?...." అతని వ్తెపు పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది ఇన్స్ పెక్టర్  ధీరజ.

    "మీ ప్రశ్నకు  నా దగ్గర సమాధానం  లేదు. కానీ ఆమె మనిషి కాదనేది నిజం. ప్లీజ్ బిలీవ్ మీ."

    అతని మాటలు వింటున్న కొద్ది దిరజలో అసహనం, చిరాకు. అయోమయం రెట్టింపవుతున్నాయి.

    మనిషిని  పట్టుకుని దెయ్యం అంటే ఈ ఇరవయ్యవ శతాబ్దంలో నమ్మడం  ఎంత  తెలివితక్కువతనమో దిరజకు తెలియని దేమి కాదు.

    మనిషి చనిపోయాక కోరికలు తిరనీవాళ్ళు ప్రేతాత్మలుగా  మారిగాలిలో  తిరుగుతూ  వుంటారనే మూడనమ్మకాలను తేలిగ్గా కొట్టిపారేసే ధీరజ....ఇప్పుడు సుధాకర్ మాటలను ఇంకెలా నమ్మగలదు!

    "ఇట్సాల్ ర్తెట్ !నీలిమ దేయ్యమయిందంతున్నారు....అంటే ఆమె చనిపోయిన తరువాతనే కదా దెయ్యం అయ్యేది. ఆఫ్ కోర్స్ .....నాకయితే ఈ దెయ్యాల మీద, భూతాల మీద నమ్మకం లేదనుకోండి. మీరు చెబుతున్నారు.... నేను వింటూన్నానంతే!"

    "అవును....చనిపోయిందనే నా అనుమానం?"

    "ఎప్పుడు  చనిపోయిందంటారు?"

    "ఏమో....నాకు  తెలియదు."

    "మరి నిలిమ చనిపోయుంటుందని చెబుతున్నది మీరే.... తెలియదనీ చెబుతున్నది మీరే....మీ  మాటలను  ఎలా నమ్మమంటారు?" విసుగ్గా అంది ఇన్స్ పెక్టర్ ధీరజ.

    "ఓకే మేడమ్! నమ్మకపోతే పోనియండి....ఇందులో  బలవంతం ఏముంది?" మొండిగా బదులు పలికాడు సుధాకర్.

    అంతవరకూ మూగ ప్రేక్షకుల్లా నిలుచుని వున్న మిత్రులు ముగ్గురూ  అప్పుడు నోరు తెరిచారు.

    "ఎక్స్ క్యూజ్ మీ ఇన్స్ పెక్టర్.... కొంచెం మా మాటలు కూడా వింటారా?" అనిల్ సీరియస్ గా  అడిగాడు.

    "ఎస్! చెప్పండి."

    "సుధాకర్ సార్ చెప్పినట్టు నీలిమ మేడమ్ మనిషి కాదు."

    "నీలిమ రూపంలో వున్నది నీలిమ  ప్రేతాత్మ అని మా అనుమానం"

    "ఆమె ఖచ్చితంగా దేయ్యమేనని మా నమ్మకం."

    ఆ ముగ్గురి నోటి వెంట ఓకే సమాధానం  అంత సూటిగా రావడంతో ఒక్కసారిగా బిత్తరపోయింది ఇన్స్ పెక్టర్ ధీరజ.

    ఒక్కరు కాదు....నలుగురు చెబుతున్నారు.

    ఆమె  మనిషి కాదు....దెయ్యామని !

    నిజమేనా?

    మనిషి రూపంలో తిరుగేది ఆమె ప్రేతాత్మ అయివుంటుందా? అదెలా  సంభవం?

    పునర్జన్మ  సిద్డంతాన్నే అపహాస్యం చేస్తున్న స్తేన్స్ దెయ్యలున్నాయంటే ఒప్పకుంటుందా? విశ్వంతరాళాలలోని చీకటి కోణాలను నయితంపరిశోధించి విజయం సాధిస్తున్న  శాస్త్రజ్ఞలు ఈ ప్రేతాత్మల  ఉనికిని నిర్దారించాగాలరా?

    అసలు ఒక సాధారణమయిన  ఆడది ప్రేతత్మాగా మారి....తిరిగి అదే రూపంతో , అచ్చు ఆమెలానే సంచరించడం సాధ్యమేనా ?

    ఎన్నో ప్రశ్నలు ....ఎన్నో సందేహాలు.....

    అసలు నీలిమా మేడమ్ ఎప్పుడు  చనిపోయింది....? ఎలా చనిపోయింది?  అనే విషయం తేలిస్తే ....ఆమె మనిషా, లేక ప్రేతాత్మ అనేది  తరువాత తేల్చుకోవచ్చు అనే అభిప్రాయానికి వచ్చింది ఇన్స్ పెక్టర్ ధీరజ.

    "ఓకే స్టూడెంట్స్.....! మీ లెక్చరర్ దెయ్యమా ,మనిషా అన్నది కాసేపు పక్కన పెట్టండి. నా సందేఃలకు సూటిగా సమాధానం చెబితే  అప్పుడు మీ మాటలను నమ్ముతాను. ఏమంటారు?"

    "అడగండి ఇన్స్ పెక్టర్!"

    "నీలిమా మేడమ్ ఎప్పుడు చనిపోయింది?"

    ముగ్గురిలో ఎవరూ నోరు విప్పలేదు.

    "సరే__ఎలా చనిపోయిందో తెలుసా?"

    అప్పుడూ  మౌనమే జావాబుగా నిలిచింది.

    "వెరీగుడ్! ఎప్పుడు  చనిపోయిందో తెలియదు.....ఎలా చనిపోయిందో తెలియదు.....అసలు  చనిపోయిందో లేదో అంతకన్నా  తెలియదు. కానీ మీరు చెప్పే మాటలను మాత్రం నేను  నమ్మలంటారు....." ధీరజ గొంతులో అవహేళన తొంగి చూసింది.

    "సారి మేడమ్! మమ్మల్ని  మీరు అపార్దం చేసుకుంటున్నారు."

    "నో....నో.....అర్ధం చేసుకున్నాను కనుకనే మీరంతా కలిసి మీ లెక్చరర్ నీలిమ మేడమ్ మీద ఏదో వదంతులు పుట్టించి, ఏదో సాధించాలనే దురుద్దేశంతో వున్నారని భావించవలసి వస్తుంది."

 Previous Page Next Page