Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 32



    వెయ్యి కందిరేగలు ఒక్కసారిగా తన ముఖంప్తె దాడిచేసి కుడుతున్నట్టు అనిపించడంతో ఖంగారుగా కళ్ళు తెరిచాడు ఆర్కియాలజీ ప్రొఫెసర్ సుధాకర్.

    ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూడగానే ఆశ్చర్యంతో నోరువెళ్ళబెట్టడతను.

    "హల్లో మిస్టర్ సుధాకల్ .... హౌ ఆర్ యూ...." అంటూ  కుర్చీని అతనికి  దగ్గరగా లాక్కుని కూర్చున్నది ఇన్స్ పెక్టర్  ధీరజ.

    అప్పటికే తనేక్కడున్నది అతనికి  అర్ధమయింది.

    అదొక హాస్పిటల్.....

    హాస్పిటల్ కు ఎందుకు తీసుకురాబద్దాడో, అసలు తనకేమయిందో గుర్తుకు తెచ్చుకున్నాడతను.

    ఆ రోజు రాత్ర్హి.....

    అంటే క్రితంరోజు రాత్రి.....

    గదిలో తన స్టూడెంట్స్  రమేష్, అనిల్, వెంకట్ లతో  మందు పార్టి చేసుకుంటూ కరెంట్ పోవడంతో గాలి కోసం  బయటకు వచ్చాడు తను.....

    తిరిగి లోపలకు వెళ్ళబోతుండగా తన వేనుకనే నిలిచి వున్న లెక్చరర్ నీలిమ  కనిపించడంతో వెర్రి  కేకపెట్టి విరుచుకుపడిపోయాడు.

    తరువాత ఇప్పుడు  కళ్ళు   తెరవడంవరకే తనకు  తెలుసు.....

    అంత రాత్రివేళ నీలిమ అక్కడకు ఎలా వచ్చిందో.....అదిగాక తను బయటనే  నిలిచివుండగా తన కంటికి  కనిపించకుండా ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళిందో.... తిరిగివస్తూ తనకు ఎదురుపడమటంవల్ల షాక్ తిన్నాడు తను....

    సుధాకర్  కళ్ళు తెరిచిన విషయం అర్ధంకావడంతో  గదిబయట నిలిచివున్న మిత్రులు ముగ్గురూ బిక్కుబిక్కుమంటూ లోనికోచ్చారు.

    వాళ్ళను చూడగానే నీలిమ వాళ్ళను ఏమీ చేయలేదని విషయం సుధాకర్ అర్ధమయింది.

    "లుక్ మిస్టర్ సుధాకర్....ఇలాంటి స్దితిలోనే మీరు మరొకసారి నాకు తారనపడతారనీ నేననుకోలేదు. ఎనిహౌ.....మొదటిసారి ఇదే హాస్పిటల్లో అపస్మారక స్ధితిలో చేరినప్పుడు నిలిమను చూసి దాడుసుకున్నానని చెప్పరే తప్పు రందుకు  దాడుచుకున్నారో.... అసలు  ఆమె అంతరాత్రి వేళ మీ గదిలోకి ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? అన్న ప్రశ్నలకు సమాధానం  చెప్పనేలేదు....ఇప్పుడు మళ్ళి అలాంటి కథలే చెప్పరని భావిస్తూన్నాను....

    ఇన్స్ ప్పెక్తర్ ధీరజ మాటలకు బిక్కచచ్చిపోయినంత పనయింది సుధాకర్ కు.

    ఇలాంటి స్ధితిలో తనేం చెప్పినా ఆమె నమ్మదని అర్ధమయింది అతనికి,

    "ఈసారి ఎవరిని చూసి  దడుసుకున్నారు సుధాకర్?"

    అతను పెదవిప్పలేదు.

    "మిమ్మల్నే అడిగేది ....సమాధానం చెప్పండి."

    "ఏం  చెప్పమంటారు....నిజం చెప్పినా  మీరు  నమ్మరు గదా?"

    "ఏమిటా నిజం...."

    "ఈసారి కూడా నిలిమనే  చూసి షాక్  తిన్నాను....నేను చెప్పే నిజాన్ని మీచేత ఎలా నమ్మించాలో అర్ధంకావడంలేదు ఇన్స్ పెక్టర్."


    సుధాకర్ గొంతులో ఆందోళన స్పష్టంగా తెలుస్తుంది.

    అతని మాటలు  విన్న ధీరజ కు ఆశ్చర్యం వేసింది.

    "అంటే.... ఈసారి  కూడా నిలిమను చూసే  దాడుసుకున్నానంటారు."

    "అనడంకాదు మేడమ్....పచ్చి నిజం."

    రెండు  నిమిషాలు నిశ్శబ్దం.....

    "సరే? అలానే అనుకుందాం.....మీతోటి లెక్చరర్ ను చూసి దడుసు కోవడం ఏమిటి? అసలు  ఈ కేసు  టేకప్  చేసిప్పటినుంచి  ప్రతి ఒక్కరూ చెప్పేమాట యిదే...." ధీరజ అసహనంగా  రెట్టించింది.

    "ఎందుకంటే ఆమె మనిషి కాదు కాబట్టి."

    "వాట్...."ధీరజ అదిరిపడింది.

    "ఎస్ మేడమ్....షి ఈజ్  ఏ డెవిల్...."

    "షటప్... మిస్టర్ సుధాకర్.... ఆర్ యూ మాడ్ ....నిక్షేపంగా కనిపిస్తున్న మనిషిని పట్టుకుని  దెయ్యం అంటావు....నీకేమయినా మతి చలించిందా?"

    "అవును మేడమ్! మీరు  నమ్మలేని  నిజం యిది.... నీలిమ మనిషి కాదు  -దెయ్యం."

    "అందుకనేనా ఆమె కనిపించిన ప్రతిసారి భూతాన్ని చూసినట్టు మతిచలించి పడిపోతున్నారు?" సీరియస్ గా ప్రశ్నించిండమే.

    "ఎస్!"

    "దెయ్యం అంటే చనిపోయిన మనిషి ప్రేతాత్మ  సంచరించడమెనా లేక మనిషిలా జీవించగలిగేదా?"

 Previous Page Next Page