లెక్చరర్ నీలిమ హాస్పిటల్ నుంచి ఉమెన్స్ హాస్టల్ కు వెళ్ళిందన్న మాటే కానీ....తను హాస్పిటల్లో వుండటం, ఎవరూ ఏమీ చెప్పక పోవడం ఒక మిస్టరీ గా భావించింది.
ఆ ఆలోచనతోనే యూనివర్సిటికి బయలుదేరింది.
* * * *
ఉమెన్స్ లేడిస్ హాస్టల్!
విజిటర్స్ హల్లో సమావేశమ్తె వున్న నలుగురు అమ్మాయిలు చాలా సేపటి నుంచి ఏదో విషయాన్నీ గురించి సీరియస్ గా చర్చించుకుంటున్నరని వాళ్ళ ముఖాలే చెబుతున్నాయి.
వాళ్ళ వాదన ఎంతకూ తెగడంలేదు.
"నువ్వు ఎన్నయినా చెప్పు....మేడమ్ రూపంలో వున్నది దెయ్యం అయివుంటుందనే నా నమ్మకం "ఒక అమ్మాయి సందేహం.
"అలానే అనుకుందాం..... చనిపోయి, కోరికలు తీరని వాళ్ళే దెయ్యాల్లా తిరుగుతూ వుంటారని అంటుంటారు కదా....అలానే మన మేడమ్ కూడా చచ్చి దెయ్యమ్తెందనుకోవడానికి......మేడమ్ అచ్చం మనిషి లానే ప్రవర్తిస్తోంది కదా....మరెలా నమ్మడం?" మరొక అమ్మాయి సందిగ్ధం.....
"దెయ్యం కాకపోతే మామూలు మనిషి ఆరోగ్య స్ధితి ఎలా వుండేది మనకు తెలియద ఏమిటి? హాస్పిటల్ రిపోర్స్ బట్టే నీలిమ మేడమ్ మనిషి కాదని తెలిసిపోతోంది కదా" మూడవ అమ్మాయి నమ్మకం.
"అవునుమనం నిన్న మేడమ్ గారి గదిలో నుంచి ఇంకెవరి మాట లనొ విన్న విషయం మరచిపోతున్నారనుకుంటూ" నాలుగవ అమ్మాయి దీర్ఘంతీస్తూ అన్నాది.
అంటే ....నీ వుద్దేశ్యం?
"గదిలో వున్నది మేడమ్ గారేనని మనమంతా చూశాం....కానీ మరొక వ్యక్తి ఎవరో ఆ గదిలో వుండి వుండాలని మనం విన్న రెండవ గొంతు మాటలను బట్టి గ్రహించవచ్చు. అవునా? కాదా?"
"అవును"
"తరువాత తలుపుతీశాక ఆ గదిలో ఎవరూ కనిపించలేదు....అంటే ఎవరో అదృశ్య వ్యక్తితో మేడమ్ అంత సేపూ మాట్లాడిందనే అనుకోవలిసి వస్తుంది. అదికాక వాతావరణంలో హటాత్తుగా ఏదో మార్పు వచ్చినట్టు చల్లటి గాలితెర మనల్ని తాకుతూ వెళ్ళింది. వీటన్నింటిని బట్టి చూస్తుంటే నినిమా మేడమ్ చుట్టూ ఏదో మిస్టరీ వున్నట్టు అనిపించడంలేదు.
"నిజమే! ఎవరివో అడుగుల చప్పుడు కూడా మనం విన్నాం. కానీ ఎవరూ కనిపించలేదు. అదిగాక మేడమ్ ప్రవర్తన కూడా ఒక్కోసారి వింతగా వుంటుంది. అసలు మనం ఎవరో తెలియనట్టు వుంటుంది.....మళ్ళి అంతలోనే అప్యాయంగా, పలకరిస్తుంది. ఓకే మనిషి రెండు విధాలుగా ప్రవర్తించడం కూడా వింతగానే అనిపిస్తుంది."
"ఎస్! నీలిమ మేడమ్ మనిషా లేక దెయ్యమా అని మనలో మనం తర్కించుకునేబదులు పార స్తేకాలజి ప్రొపెసర్ యోగానంద్ గారిని కలిస్తే ఈ సమస్యకు పరుష్కరం దొరుకుతుందేమో....."
ఆమె సలహా మిగిలిన ముగ్గురికి నచ్చింది.
"కానీ, యోగానంద్ గారిని కలవాలంటే జరిగేపనేనా? ఆయనకోసం సిటికి వెళ్ళిరావాలి. అదిగాక ఆయన మనకు అపాయింట్ మెంట్ ఇస్తారో లేదో.... ఒక వేళ ఇచ్చినా మన వమస్య ఆయనకు సమస్యగా కనిపించక పోవచ్చ్చు. ప్రత్యేకించి మనకోసం ఆయన శ్రద్ధచూపడానికి కుదరదేమో కదా...."అంటూ తన సందేహాన్ని బయటపెట్టింది ఒక లేడీ స్టూడెంట్.
"ఒహ్! అదా నీ డౌట్ ఆయన దగ్గర అపాయింట్ మెంట్ తీసుకుని మన సమస్యకు పరిష్కారం సూచించేలా ఆయనను ఒప్పించే పూచి నాది సరేనా?"
"అదే....ఎలా అన్నదే నా అనుమానం."
"పారా స్తేకాలజిలో పేరొందిన యోగానంద్ గారు ఎవరో కాదు.... మా నాన్నగారి ప్రాణ స్నేహితులు. నేనంటే ఆయనకు చాలా అభిమానం అందుకే నా మాటను కాదనరనే నమ్మకంతో చెప్పాను."
ఆమె సమాధానం విన్న మిగిలిన ముగ్గురి మనసులూ తేలిక పడ్డాయి.
సాయంత్రం ఐదు గంటలకు హాస్టల్ నుంచి ఒకరి తరువాత ఒకరు షాపింగ్ కోసం అని చెప్పి బయటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
కానీ, అంతవరకూ వాళ్ళ మాటలన్నీ ఆ గది బయట నిలిచివున్న మరొకరు విన్నారనే విషయం వాళ్ళకు తెలిసే అవకాశం లేకపోయింది.
ఆమె ఎవరో కాదు.....
అంతవరకూ ఎవరిగురించి వాళ్ళు సంభాషించుకుంటున్నారో ఆమె....హాస్టల్ వార్డెన్ నీలిమ!
కోపంతో పళ్ళు కొరుక్కుంటూ తన గదివ్తెపు పెద్ద పెద్ద అడుగులు వెస్తూ వెళ్ళాందామె.
* * * *