Previous Page Next Page 
శతఘ్ని పేజి 32

 

    ఉద్విగ్నంగా అన్నాడు
    
    "నిజానికి విద్యార్ధి గురించే కాదు.....ఆ న్యూస్ పబ్లిష్ చేసిన ఈవెనింగ్ ఎడిషన్ గురించి చాలా చిన్నపత్రిక అది. పత్రికకి ఫైనాన్స్ చేసింది ముకుందమని తెలిసింది. నిన్న రాత్రి ముకుందం ఆ పత్రిక యజమానికి ఒక స్టాడ్ హోతల్లో పార్టీ ఇచ్చాడని ఎంక్వయిరీ లో తేలింది"
    
    చిన్నదికాదు.....బలమయిన క్లూనే అందించింది.
    
    ఇంతకాలం ముకుందం బ్రహ్మాజీకి సానుభూతి పరుడే అనుకున్నాడు. తప్ప ఇంత లోతుగా వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నాడని తెలీదు......తన అనుమానం నిజమనిపిస్తోంది.
    
    అంతే.......ముకుందం ఇంటికి బయలుదేరాడు త్యాగి.
    
    --
    
    "హాయ్"
    
    ద్వారంతెరిచిన సౌందర్య పలకరించింది త్యాగిని అవహేళనగా చూస్తూ. ఆ పలకరింపులో అభిమానం లేదు. అవహేళన ధ్వనించింది.
    
    అప్పుడు చూశాడు హాల్లో కూర్చుని వున్న సౌందర్య స్నేహితురాళ్ళని.....అసంకల్పితంగా తనఛాలెంజ్ కూడా గుర్తుకొచ్చింది....
    
    "నేనువచ్చింది మీ డాడీ కోసం"
    
    "లేరు"
    
    "అదేమిటీ? మా వాళ్ళంతా మీకోసం ఎదురుచూస్తుంటే మీరు పారిపోతారేం" అంది ఎగతాళిగా.
    
    "ఇచ్చినమాట నిలబెట్టుకునే శక్తి లేదనయినా ఒప్పుకోవచ్చుగా"
    
    "అంటే" రూపిణి దూకుడుగా పరుగెత్తుకొచ్చింది"అయితే మీ బాయ్ ఫ్రెండ్ కెపాసిటీ అంతేనన్నమాట"
    
    "పాపంవదిలేయండే, సాధ్యం కాదేమో"
    
    "అదికాదు డాళింగ్" అన్నాడు తాపీగా.
    
    హఠాత్తుగా జరిగిన ఈ ఎదురుదాడితో దెబ్బతింది సౌందర్య.
    
    "నన్ను మరీ తక్కువ అంచనా వేస్తున్నాను. నీ కోసం, నీ పరువుకోసం రెండు లక్షలయినా ఇస్తాను. కానీ, ఒక అరగంట నాతోపాటు బయటికి రాగలవా"
    
    "ఎందుకు" అడిగింది రూపిణి.
    
    "మాఇద్దరికీ మాత్రమే పరిమితమైనవి చాలావున్నాయి" అన్నాడు దిగ్ధంతాల దుర్నిధ్వ విబేధీకరణాంకుర వంజోగ మయాప్రేరిత నినాదంలా, ఒక చక్ర వివర్తిత సుబ్రమనర్వతింలా.....నాదోద్భవనసుబోధంలా నిగూఢంగా దృక్కులు ప్లావితం చేస్తూ.
    
    "ఇక్కడే చెప్పండి. మేం వెళ్ళిపోతాం" కువలయమనోహర సునందాదేవితా తూళ మన్వర్తినిలావయ్యారంగా భాషించింది రూపిణి.
    
    "అమ్మో, ఇక్కడ ప్రమాదం" మహిమోద్దితతంగోజ్వలితకవనంలా, భద్రఉద్యోకంగా మారిన కపోతంలా భయం నటిస్తూవ్యాఖ్యానించాడు మేరునగధీరుడు, కోదండరహిత దశరధసుతుడిలాంటి మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిత్వమే జీవనంగా చేసుకున్న త్యాగమూర్తిత్యాగి.
    
    తర్వాత స్వసమాప్తి వాక్యాన్ని వ్యక్తీ రచించేందుకు దుర్నిధ బ్నోరితప్రణవం లాంటి త్యాగి ఇలా అన్నాడు "ఒంటరితనంలో మరింత అల్లరి చేస్తుంది సుందు".    
    
    "దూకుడు అంటే" కనుబొమ్మలెగరేస్తూ అడిగింది రూపిణి.
    
    "ప్రాక్టికల్ గా తప్ప అర్ధం కాని విషయం"
    
    "ఏమిటీ" అంది రూపిణి
    
    "మిడ్త్ ఆఫ్ ఫోర్ ఫింగర్స్"
    
    అతడి జవాబులో ఏం బూతుధ్వనించిందో ఈ సారి సౌందర్య విరుచుకుపడింది "అంటే"
    
    "నాలుగువేళ్ళ చుట్టుకొలతవున్న వాస్తవం"
    
    ఆ మాటలకు అమ్మాయిలంతా ఎటో చూడటం మొదలుపెట్టారు రూపిణి అడిగింది "వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాం"
    
    "నానోటితో నేను చెప్పటం బాగోదు. సౌందర్యనడిగి తెలుసుకోండి"
    
    త్యాగీ....కోపంగా అంది సౌందర్య.
    
    "ఇట్స్ నాన్సెన్స్ కాబట్టే నా నోటితో నేను చెప్పదలుచుకోలేదు"
    
    "ఫర్వాలేదుచెప్పు"
    
    "చెప్పాలీ అంటే నాతో నువ్వురావాలి"
    
    అనంతం అంటే అంతు చిక్కనిది అన్న ఒక కవి జవాబులాగా తరంగోపవోజనితసమీరంలా సుబ్రోధయంలా మానవవీచికసంయుక్తోమహిమ శూన్వరక్షితశుక్తంలా చూశాడు త్యాగి, గర్భితశోభిత మానసంచారంలా, హృదయంకురజీవంలా ఏకీక్త్వ వల్లభవనంలా......
    
    "సరే, నడు వెళదాం" అంది సౌందర్య.
    
    "అంతవరకూ మీరు వెయిట్ చేస్తే మీకు తెలుస్తుంది" అన్నాడు త్యాగి.
    
    "ఏమిటది" అడిగింది రూపిణి.

    "నాలుగువేళ్ళనిడివి వున్న రహస్యంగురించి"
    
    --
    
    "ఎందుకుతీసుకొచ్చావు" అడిగింది పార్కులో అడుగు పెట్టిన సౌందర్య.
    
    జవాబుచెప్పలేదు త్యాగి.
    
    "నిన్నే" రెట్టించింది సౌందర్య.
    
    పార్కులో అక్కడక్కడా కూర్చున్న జంటల వేపు చూస్తూ అన్నాడు "ఓ చోట సెటిలయ్యాక మాట్లాడుకుందాం సౌందర్యా......"
    
    "నేను సెటిల్ కాను"
    
    "అలా అయితే నిన్ను ఎత్తుకుని తీసుకెళ్ళాల్సి వుంటుంది.....మరేం లేదు.......కాస్త ఎబ్బెట్టుగా వుంటుందని మర్యాదగా రమ్మంటున్నాను"
    
    దేనికైనా వెనుకాడని త్యాగి అన్నంతపనీ చేస్తాడనిపించిందేమోమౌనంగా అనుసరించి అతడితో బాటు ఓ పొద దగ్గర కూర్చుంది.    

 

    "చెప్పు" సీరియస్ గా అడిగింది. అసలు ఏ ఉద్దేశ్యంలో ఇలాతనను రప్పించాడూ అన్న విషయం గురించే ఆమె ఆలోచిస్తూంది.
    
    "పదినిముషాల్లో వెనక్కివెళ్ళాలి"
    
    "నిజానికి మూడు నిముషాలు చాలు"
    
    "దేనికి"
    
    "సృష్టికి"
    
    చివుక్కుమంది సౌందర్యకి. "మిస్టర్ త్యాగి....." సౌందర్య అధరాలు ఆవేశంతో కంపిస్తున్నాయి.
    
    "నీ హద్దు మరచిమాట్లాడుతున్నావు"
    
    "మరపించింది నువ్వు" క్షణం ఆగి అన్నాడు త్యాగి నిశ్చలంగా చూస్తూనే.
    
    "యస్ మిస్ సౌందర్య.....చాలా అందమైన ఆడపిల్లవనిపించిన నీకు సెక్స్ తో తప్ప నీ కాన్షస్ నెస్ ని గుర్తుచేయడం సాధ్యం కాదని పించి ఇలా తీసుకొచ్చాను."
    
    లేవబోయింది.    

    "ఆగు" త్యాగి గొంతు తీవ్రంగా పలికింది "నేను మూడునిమిషాల వ్యవహారానికి పబ్లిక్ గా సిద్దపడకూడదూ అనుకుంటే కనీసం పదినిమిషాలు కూర్చో అలా"
    
    ఎవరోపట్టి లాగినట్టు ఉక్రోషంగా నేల చూపులు చూస్తూ వుండిపోయింది.

    "చెప్పు  సౌందర్యా......అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి? నీ స్థాయిలో నువ్వు చేయటానికి చాలా వ్యాపకాలు వున్నా పని గట్టుకుని నామీద ప్రయోగానికి ఎందుకు సిద్దపడ్డావు"
    
    నిజంగా తప్పయిపోయిందని ఆమెకూ ఈ మధ్య చాలాసార్లు అనిపించినమాట నిజమే కాని ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఒకనాడు అతడి గురించి విశ్లేషణతోనే ఆగిపోవాల్సింది కాని అనుకోకుండా తొందర పాటుతో చాలా దూరం వెళ్ళింది..... కాదు చాలా ఎక్కువగా రెచ్చగొట్టింది.
    
    జవాబు చెప్పని సౌందర్యని చూస్తూ అన్నాడు "నీ జీవితంలో చాలామంది యువకులు తారసపడి వుంటారు. సంస్కారవంతులుగాని, అవినీతి పరులుగాని అయినా శ్రద్ద నామీదనే చూపేవూ అంటే ఇది ఫస్ట్సైట్ లోనే కలిగిన ప్రేమగా తీసుకోనా? లేక ద్వేషంతో ప్రారంభించి ప్రేమ దాకా పరుగెత్తాలన్నతపనని చెప్పనా...."
    
    "నేను కావాలీ అనుకుంటే నిన్ను మించిన వ్యక్తుల్ని కాళ్ళ దగ్గరికి రప్పించుకోగలను."
    
    "అలాంటప్పుడు నామీదే ఎందుకంత ఆసక్తి చూపించావు"
    
    "అది ఆసక్తి కాదు"
    
    "మరి....." సూటిగా అడిగాడు "నీ శక్తేమిటో నీ స్నేహితురాళ్ళకి చూపించాలన్న ఆసక్తా
    
    ......"
    
    "యస్......అదే....."
    
    "కాని జరిగిందేమిటి?"
    
    ఇక్కడతను ఓడినట్టు కంక్లూడ్ చేస్తున్నాడనిపించిందేమో వెంటనే అంది" నువ్వు గెలవలేదు. నా గెలుపుని కాస్త తెలివిగా ప్రశ్నించగాలిగావు" యూనివర్శిటీలోని నెక్లెస్ సన్నివేశాన్ని గుర్తుచేసుకుంది సౌందర్య. "ఆ తర్వాత నా పథకంలో నువ్వు ఇరుక్కున్నావు."
    
    "ఆనందంగా వుంది"
    
    "దేనికి"
    
    "ఆ రోజుతో పూర్తికావాల్సిన మన వార్ ఫేర్ ని మూలంగా కంటిన్యూ అయినందుకు."
    
    "అదికంటిన్యూ చేయడంకాదు ...... టిట్ ఫర్ టేట్ అని తెలియజెప్పడం......"
    
    "మామూలుగా అయితే నీ అంచనా ప్రకారం నేను నీకు దూరంగా పారిపోవాలి. కాని నా గురించి తెలీంది అదే....."

 Previous Page Next Page