Previous Page Next Page 
శతఘ్ని పేజి 31

 

    గభాల్న గౌను జేబులోని చాక్ లెట్ తీసి అంకుల్ నోటి కందించింది. సగం కొరికి మున్నీ కిచ్చాడు. మున్నీ ఆనందాన్ని వ్యక్తం చేసే పద్దతి అది....తల్లిదండ్రుల ఎంగిలి సైతం ముట్టుకోనిమున్నీ త్యాగి విషయంలో ఈ విషయాన్నీ ఉల్లంఘిస్తుంది.
    
    "మరిఆడుకోనా...." అడిగింది.
    
    వెంటనే త్యాగి చెంపపై ముద్దుపెట్టుకొని వచ్చిన పనయినట్టు వెళ్ళబోతోంది" ఎవరో ఆంటీ వచ్చారు"
    
    అప్పుడు చూశాడు త్యాగి.

    ఎప్పుడొచ్చిందో లిజీ ద్వారం దగ్గరనిలబడి వుంది.
    
    "వాటె సర్ప్రయిజ్" విభ్రమంగా అడిగాడు "ఎన్నాళ్ళకెన్నాళ్ళకి"
    
    "ఏళ్ళూ నెలలూ గడవలేదు. రోజులే" మృదువుగా నవ్వి వెళుతున్న మున్నీని చూస్తూ అంది "ఈ పాపెవరు"
    
    "మాపాపే"
    
    "చెప్పనేలేదు"
    
    "ఏమిటి నాకు పెళ్ళయిందనా?"

    "మరేం"
    
    "మీరూచెప్పలేదుగా"
    
    "ఏమిటి"
    
    "మీకు పాప లేదని"
    
    లిజిచెంపలు ఎరుపుగా మారాయి "పెళ్ళికానిది పాపెలావుంటుంది"
    
    "భలేవారే నాకు మాత్రం అయిందా"
    
    అర్ధంకానట్టు చూసింది లిజి. అంతకుమించి చిర్రెత్తుకొచ్చింది.
    
    "సూటిగా ఏ విషయమూ చెప్పవుకదూ"
    
    "కోపగించుకోకండి. మా పాపంటే అలసిపోయిన నాకు అణువంత...కాదు....చాలినంత ఊరట నందించేసంగీతంలా....ఏం తోచనప్పుడు తోడుగా అల్లరి చేసే డాల్ లా అనిపించేయింటివాళ్ళ అమ్మాయి.....ఓ.కె.."లిజీ మొహంలో రిలీఫ్ ని అతడూ గుర్తించాడు "చెప్పండి......ఏం తీసుకుంటారు"
    
    "నేనుతీసుకోవటానికి రాలేదు.....తెలుసుకోవాలనివచ్చాను"
    
    "ఏమిటి"
    
    సూటిగా అడిగింది "ఆ విద్యార్దెవరో మీరు తెలుసుకోగలిగారుకదూ"
    
    "లేదు"
    
    "మరి" అబ్బురంగా చూసింది "అబ్జర్వర్ లో అలా రాశారేమిటి"
    
    నిజమే ఆ వ్యక్తి ఎవరో ఎవరి ఆధ్వర్యంలో కోఠి యజ్ఞంలో మారబోతున్నాడో తెలుసుకోవటానికి ఒక రోజు ఆగండి అంటూ పత్రికాముఖంగా ఛాలెంజ్ విసిరాడు. మొత్తం కాకపోయినా కొంతైనా తెలిసివుంటుందనుకుంటే యిలా అంటున్నాడేమిటీ అనుకుంది.
    
    "మీకు నేను అబద్దం చెప్పడం లేదు మిస్ బిజీ....నిజంగా ఆ విద్యార్దెవరో నాకూ తెలీదు. చాలా ప్రయత్నించి నా తెలుసుకోలేకపోయాను"
    
    "మరి చాలా తెలుసుకున్నట్టు అలా రాశారేం"
    
    "తాము చేసే దారుణం గురించి పత్రికా విలేఖరి గా నేను తెలుసుకున్నానని ప్రత్యర్దులకి తెలియచెప్పాలని"
    
    ఉద్విగ్నంగా చూసింది"అసలు ఇదంతా ఎవరో ఆర్గనైజ్ చేస్తున్నట్టు ఎందుకనుకుంటున్నారు"
    
    "ఇది చెప్పడానికి పెద్దమేధస్సు అక్కర్లేదు లిజీ.....కోరి నూరేళ్ళబతుకుని కడతేర్చుకోవాలని ఏ విధ్యార్దీ కోరుకోడు. ఇది తప్పనిసరిగా బ్రహ్మాజీ ఉద్యమానికీ బూస్టర్ లా వాడు కోవాలని అతడి బృందం ప్రయోగిస్తున్న బలమయిన అస్త్రం.....కావచ్చు"
    
    "నిజంకాదేమో"
    
    "బుల్ షిట్" త్యాగి మొహం వివర్ణమైపోయింది"ఇదొక ఉద్యమం.....ఈ ఉద్యమానికో ఆత్మార్పణ.....షేమ్ ....షేమాన్ ది పార్టాఫ్ ది స్టూడెంట్ జనరేషన్..... ఒక రాజకీయనాయకుడు స్వలాభాపేక్షతో అర్ధం పర్ధం లేని ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు......ఆ ఉద్యమం ద్వారా శాంతిభద్రతలు విచ్చిన్నం చేసి ప్రభుత్వాన్ని కూలదోసితను సింహాసనాన్ని అధిరోహించాలనుకుంటూ సామాన్య జనాన్ని మెట్లుగా వాడుకుంటాడు. నిరక్షరాస్యులూ నేర వ్యవస్థలో బతకటమే అలవాటుగల గూండాలతో పాటుచదువూ, సంస్కారమూ, ఆలోచించగలిగే పరిజ్ఞానమూ వుండాల్సిన విద్యార్ధులూ ఇందులో భాగస్వాములవుతారు. ఆగ్రహాలకీ, సత్యాగ్రహాలకీ వ్యత్యాసం తెలీదు వినాశనానికీ, ఉద్యమాలకీ భేదం బోధపడదు"
    
    "మేబి సం థింగ్ రాంగ్ విత్ దిసిస్టమాఫ్ ఎడ్యుకేషన్"
    
    "నాన్సెన్స్.....ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలను ఔపోసనపట్టడం మాత్రమేకాదు లిజీ......ప్రపంచాన్ని చదవగలిగే అవగాహన్నీ పెంచుకోవాలి.....పదవులకోసం పాకులాడే ఈ రాజకీయ చదరంగంలో ఇలా ఎత్తులు వేస్తూ సామాన్య జనాన్ని తప్పుదోవ పట్టించడమే గాక ఉత్పత్తి నాశనంకావటానికి ద్రవ్యోల్భణం తో సగటు మనిషి జీవనపరిమాణాన్ని కుంచింపచేయటమే రాజకీయ వ్యవస్థ అసలు లక్ష్యమని వీళ్ళకెప్పుడు అర్ధమవుతుందోమనకు అర్ధం కాని విషయం"
    
    సాలోచనగా చూసింది "అంటే ఇప్పుడు జరగబోయే విద్యార్ధి ఆత్మాహుతికూడా రాజకీయమే అంటారా"
    
    "ఇదితిరకాసు లేని సత్యంలిజీ! నా అంచనా తప్పుకాకపోతే కరెన్సీ కట్టల మెరుపులతో రాజ్యాంగ ప్రతుల్ని చిత్తుకాగితాలుగా మండించగలిగే ఒక రాజకీయ వ్యవస్థ ఈ సంఘటనకి కారణమవుతుంది"
    
    "క్షీణించిపోతున్న సీతారామరాజు ఉద్యమానికి విద్యార్ధి లోకాన్ని మళ్ళించాలనే ఆలోచన కావచ్చు"
    
    "ఒక విద్యార్ధి మరణిస్తే వాళ్ళకి ఒరిగేదేమిటి"
    
    "ఇదిప్రారంభం మాత్రమే.....ఈ సంఘటన ఆగనినాడు ఇలాంటి మరో సంఘటనకి స్ఫూర్తినిస్తుంది. ఫస్ట్ వీక్ లో కూడుకున్న కొద్దిపాటిమంది విద్యార్ధులు వాలంటరీగా ముందుకొస్తారు. ఇక్కడ ప్రారంభమైన ఆత్మాహుతి కార్యక్రమం అవిచ్చిన్నంగా కొనసాగుతూనే వుంటుంది"
    
    ఎందుకో ఈ విశ్లేషణ ఆమెకు సంతృప్తిగా అనిపించలేదు. నచ్చకకాదు. అది నిజమే అయితే రేపు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గురించి భయంగా ఆలోచించింది.
    
    "మరో ముఫ్ఫై గంటలు....." గుర్తు చేసుకుంటూ అంది" ఇది నిజంగా జరిగితే ఒక విద్యార్ధి జీవితం ముగిసిపోతుంది. అతడ్ని పెంచిన తల్లితండ్రుల వందేళ్ళ కలలుకూలిపోవటానికి అది తొలిక్షణం అవుతుంది"
    
    "తప్పదులిజీ.....ఇదో విషస్ సర్కిల్.....ఇందులో మనం చాలావరకు ప్రేక్షకులమే కానీ, నిరోధించలేం"
    
    త్యాగి అలా నిస్సహాయంగా మాట్లాడటాన్ని అంగీకరించలేకపోయింది "మీరు నన్నో ప్రశ్నడిగారు గుర్తుందా.....ఎక్కడో రుమేనియా లో ఒక భూకంపం జరిగి యాభైవేలమంది చనిపోవటానికి సిద్దంగా వున్నారు. ఢిల్లీలోని ఒక విమాన ప్రమాదంలో సుమారు మూడువందల మంది ప్రాణాలు కోల్పోబోతున్నారు. నాకు దగ్గిరలో నాకిష్టమైన ఒక వ్యక్తి కారు ఏక్సిడెంట్ లో
    
    మరణానికి సిద్దంగా వున్నాడు. ఆ మూడింటిలో ఏదో ఒకదాన్ని ఆపగలిగే శక్తినాకు భగవంతుడిస్తే దేన్ని ప్రిపేర్ చేస్తానూ అని"
    
    క్షణం విరామం తర్వాత అంది.
    
    "ఎక్కడో జరగబోయే ఉపద్రవాల గురించి నేను పట్టించుకోను త్యాగీ......మీరన్నట్టు భగవంతుడు నాకు అలాంటి శక్తినే ఇస్తే ఇప్పుడు నాకు ఇష్టుడిగా మారిన ఆ విద్యార్ధిని రక్షించుకుంటాను"
    
    "ఒక్కడికంటే మూడువందలమంది, మూడు వందలమందికంటే భూకంపంలో చనిపోయే ఏభైవేలమంది ఎక్కువ"
    
    "అయినానేను ఈ విద్యార్ధినే దక్కించుకుంటాను"
    
    "ఎందుకని"
    
    "నా ముందున్న అరాచకాన్ని ఆపటం నాకెక్కువ సంతృప్తినిస్తుంది కాబట్టి"
    
    "దేర్ యు ఆర్ మిస్ లిజీ.....ఖచ్చితంగా ప్రతి మనిషీ ఆలోచించాల్సిందిలానే" తిరుగులేని వివరణలా చెప్పాడు త్యాగి. "ప్రపంచాన్ని దేశాన్ని సంస్కరించాలని చాలీచాలని చేవతో హిపోక్రసీ ప్రదర్శించటంకాదు. నీ ఇంటిలో వున్నవ్యక్తుల్ని నువ్వు సంస్కరించుకో గలిగితే నీ వాళ్ళని కలుపుమొక్కలు కాకుండా నువ్వు రక్షించుకోగలిగితే ప్రతి ఇంటి మనిషి అనుకుంటే దేశం క్షేమంగా వుంటుంది. అదే సుభిక్ష మైన సంఘానికి కారణమవుతుంది"
    
    ఆమె అంది "త్యాగీ..... నిజానికి ఆడదానిగా నాకుకొన్ని పరిమితులున్నా మీ సంపర్కంతో అబ్బినతెలివో లేకనా వ్యక్తిగతమైన అభిరుచి నుంచి నేను నేర్చుకున్నదో....ఆ విద్యార్ధి గురించి చిన్న క్లూ నేను మీకు అందించాలనుకుంటున్నాను"

 Previous Page Next Page