Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 32

 

    "బల్ల మీద పరి....శోధన మాసపత్రిక వుందా!" అని శ్రీవిద్య ఆతృతగా అడగబోయింది.

 

    శ్రీవిద్య అడగబోయేదిసగంలోనే అర్ధం చేసుకున్న మహానంద తెలివిగా శ్రీవిద్య కాలుతోక్కి నోరు మూసుకో అన్నట్లు సిగ్నల్ చూపులతో కూడా ఇచ్చి జగ్రత్తపడింది.

 

    "బల్ల బల్ల ఏమిటి?" నిరంజనరావు అనుమానంగా అడిగాడు.

 

    "అదే పొడుగాటి బల్లచెక్క. స్టాండ్ అన్నమాట అది పెట్టడానికి సెలైన్ సీస అమరుస్తారు. ధైర్యకి అలాంటిదేమి చేయలేదేమిటి? ఈ డాక్టర్ కి ఏమి తెలియదేమో అంకుల్" తెలివిగా మాట తప్పిస్తూ అంది మహానంద.

 

    "సెలైన్ ఒక్కటే ఏమిటి బ్లడ్ బాటిల్ కూడా వుంటుంది తెలుసా? మా మామయ్యకి హార్ట్ కి సంభందించిన జబ్బు వస్తే అదేదో మిషన్ గదిలో పెట్టారు. అది గీతలు గీతలుగా గ్రాఫ్ తీసేది. వీళ్ళు ధైర్యకి ఏమి చేయటంలేదు ఏమి చూడటంలేదు" శ్రీవిద్య అంది.

 

    "కాలేజిలో చదువుతున్నారాన్నామాటేగాని ఈ పిల్లలికి బొత్తిగా ఏమి తెలియదు" అనుకున్నాడు నిరంజనరావు.

 

    ధైర్యతో కలిసి ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వచ్చేవారు శ్రీవిద్య, మహానంద. అంకుల్ అని నిరంజనరావుని అంటి అని సావిత్రిని పలకరించేవారు. అంతవరకే! వాళ్ళతో మాటలు ఏముంటాయి? వీళ్ళిద్దరూ ఎలాంటి ఘట్టాలో నిరంజనరావుకి సరిగ్గా తెలియదు, అందుకే ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మాడు.

 

    "ఈ డాక్టరుకి మంచి పేరు వుంది అవసరం అయితే తన నర్సింగ్ హోమ్కి పెద్ద డాక్టర్లని పిలిపిస్తుంది. అంతేకాదు ఆధునిక పరికరాలు ఇతర దేశాలనుంచి తెప్పించింది" నిరంజనరావు చెప్పాడు.

 

    "మరి ధైర్యని?"

 

    "జాగ్రత్తగా చూస్తున్నది. మన అదృష్టం సరిగ్గా వుండాలి కదమ్మా !"

 

    నిరంజనరావు భాధగా ఆ మాట అనేసరికి అంత వరకు నిస్సత్తువుగా బెడ్ కి వాలివున్న సావిత్రి దోసిట్లో ముఖం దాచుకుని సన్నగా రోదించడం మొదలుపెట్టింది.

 

    మహానంద, శ్రీవిద్య చటుక్కున ఆమెకు చెరోపక్క చేరి "ఊరుకో అంటి! ధైర్యకి ఏమి కాలేదు. రేపు ఈ పాటికి చూడండిలేచి తిరుగుతుంది. అప్పుడు మిరే అంటారు మా మాట ఎంత నిజమన్నదీను" అంటూ వురడించారు ఇరువురు కలిసి.

 

    రేపు ఇదే సమయానికి ధైర్యకి ఏం జరగబోతున్నది వాళ్ళిద్దరికీ తెలియదు. రేపు ఏం జరుగుతుంది అన్నది ఎవరికి తెలియదు. పక్క వారి భవిష్యత్తు చెప్పేవారికి వారి భవిష్యత్తు తెలియదన్నట్టుగా అన్నమాట. మహానందకి ఏ చిన్న అనుమానం వచ్చినా జగ్రత్తపడేది, చిన్న అనుమానం కూడా రాలేదు. ధైర్య దురదృష్టవంతురాలు. చాలా చా....లా.....

    కొద్దిసేపు రోధించి మళ్ళి నిస్సేత్తువుగా బెడ్ కి చేరగిలబడింది సావిత్రి.

 

    "ఇదీ వరస" నిరంజనరావు నిట్టుర్పు విడుస్తూ అన్నాడు.

 

    "ధైర్య విషయం డాక్టరు ఏం చెప్పింది అంకుల్?" మహానంద అడిగింది.

 

    "డాక్టరు కళ్యాణికి అర్ధం కాలేదు. ఇంకా ఇద్దరు పెద్ద డాక్టర్లని పిలిచి చూపించటం సంప్రదించటం జరిగింది. కొన్ని పరిక్షలు చేశారు. వ్యాధి అన్నది ఏది కనపడలేదు. కోమా అనుకుందామా అంటే ఆ లక్షణాలు అసలు లేవుట. ప్రస్తుతం డాక్టరు చెప్పటం షాక్ వల్ల  స్పృహ తప్పి ఉండవచ్చు అని. భయం వల్ల షాక్ తినివుంటే తెలివి తెప్పించటానికి మందులు వున్నాయట. వాటిని వాడటం జరిగింది. ఫలితం కనిపించలేదు. బ్రెయిన్ లో నరాలకి ఏమైనా అయిందేమోనని అదేదో మిషన్తో చూశారు. అక్కడ ట్రబుల్ లేదు. ఇదేమయినా కొత్త వ్యాధా! కారణం ఏమిటన్నది ఈ రాత్రి లోపల తెలివి రాకపోతే రేపు కొత్త పరిక్షలు జరిపి చూస్తారట. ఓ పక్క ధైర్య గురించి బాధ మరోపక్క ఇదేమౌతుందోనని బాధ ఏమిటో ఏమిచెయ్యాలో అర్ధం కావటం లేదు. అసలు జరిగింది ఏమిటో తెలిస్తే!" నిరంజనరావు ఇంక మాట్లాడలేక ఆగిపోయాడు.

 

    చివరి మాట వినంగానే మహానంద కళ్ళు మెరిశాయి.

 

    "ఓసారి ఇంటికి వేల్లివస్తాను. ఇక్కడ కాసేపు వుంటారా అమ్మా?" నిరంజనరావు అడిగాడు.    

 Previous Page Next Page