"ఇది చదవరా" అన్నాడు మధుకిస్తూ.
మధు చదివాడు.
"సేఫ్ డిటెక్టివ్ ఏజెన్సీ, జగదాంబ సెంటర్, ఈ డిటెక్టివ్ లు, జీరో జీరో సెవెన్ లు మనకెందుకురా" అన్నాడు మధు.
"ప్రేమ రెండువేపులా పదునయిన కత్తిలాంటిది. అంచేత రెండువేపుల నుంచీ మనం నరుక్కురావాలి. ఆ డిటెక్టివ్ ని మనం కలుస్తున్నాం. ఎందుకో తెలుసా?" అంటూ ఓ ఐదు నిమిషాల్లో తన ప్లానంతా వివరంగా చెప్పాడు సుల్తాన్.
"అయిడియా బాగానే వుంది. పద వెళ్దాం" లేచాడు మధు సుల్తాన్ తో పాటు.
* * *
ముందు మైదానం నారాయణకి ఫోను చేయడానికి నిర్ణయించుకుని, యూనివర్శిటీ డౌన్ లో, ఈగలు తోలుకుంటున్న ఓ ఎస్. టి.డి. బూత్ లోకి నడిచాడు.
"ఏలూరుకి ఎస్. టి.డి" అన్నాడు సుల్తాన్.
"చేసుకోండి సార్" ఏలూరు కోడ్ నెంబర్ చెప్పాడు బూత్ మనిషి.
ఎస్.టి,డి. కోడ్ నొక్కి, నెంబర్ ని ప్రెస్ చేశాడతను.
"ఎవరూ?" ఫోనెత్తిన మైదానం నారాయణ దీర్ఘం తీస్తూ అడిగాడు.
"నేనే! పెదపాడునుంచీ...... నీ ఫ్రెండ్ ని భీమవరం సోమరాజుని."
"ఏవిరా.....? మళ్ళీ ఫోను చేశావ్?"
"ఏం లేదు. మా మధుగాడు ఒక పక్క చదువుకుంటూనే రెండో పక్క బిజినెస్ చేస్తానంటున్నాడు. నీ ఒపీనియన్ ఏంటి.....?"
సోమరాజు ఎప్పుడూ ఎవర్నీ, ఒపీనియన్ అడగడు. సలహా యిస్తే తంతాడు. అలాంటివాడు ఫోను చేసి మరీ, ఒపీనియన్ అడగటమా-?
రోమాలు నిక్కబొడుచుకున్నాయి నారాయణకి.
"నువ్వు యింతగా మారిపోతావని...... నా సలహా అడుగుతావని నేను జీవితంలో అనుకోలేదురా. నాకీ క్షణంలో ఎంత ఆనందంగా వుందో తెలుసా?
"ఆనందం తర్వాత...... సలహాకాదు ఇంకా నిన్ను చాలా అడుగుతాను. ముందు చెప్పు......"
"అడగరా..... నువ్వు ఏది అడిగినా, ఆఖరికి నా లేంబ్రెట్టా అడిగినా కర్ణుడు కవచకుండలాలు యిచ్చేసినట్టు, రామదాసు ట్రాన్సుపోర్టులో పంపేస్తాను. బిజినెస్ మంచిదే...... చేయించు" అన్నాడు నారాయణ.
"నేనూ అదే అనుకుంటున్నాను. గానీ, నువ్వోపని చేయాలి. మా వాడు వస్తాడు...... వెంటనే ఒ యాభై వేలివ్వు..... పంటల డబ్బు అందగానే వడ్డీతో ఇచ్చేస్తాను. సరేనా....." ఒక్కక్షణం తటపటాయించాడు నారాయణ.
"రేపొస్తాడు వాడు..... మళ్ళీ ఫోను చేస్తాలే" అని ఫోను పెట్టేశాడు సుల్తాన్.
"జంబలడికి పంబ..... యాభైవేలు రెడీ" హుషారుగా అన్నాడు.
"నారాయణ మాస్టారు ఎలా నమ్మేస్తున్నాడ్రా.... గొంతు..... గోల ఏవో వుంటాయి గదరా...." కూర్చున్న ఆటో కదిలాక అడిగాడు మధు.
"నీ టైమ్ బావుంది కాబట్టి, నీ లవ్ సక్సెస్ అవుతుంది కాబట్టి- మిగతా ప్రశ్నలు వెయ్యకు. జవాబులు తెలిసినా నేను చెప్పను" అన్నాడు సుల్తాన్, డిటెక్టివ్ వ్యవహారం గురించి ఆలోచిస్తూ.
* * *
జగదాంబ జంక్షన్ లో కె.జి.హెచ్.కి వెళ్ళేదారిలో రెండో కార్నర్ లో మేడమీదున్న పెద్ద బోర్డును చూశారు సుల్తాన్, మధు.
"సేఫ్ డిటెక్టివ్ ఏజన్సీ"
గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళారు. రెండు రూముల ఏజెన్సీ కంపెనీ అది. ఫ్రంట్ రూమ్ లో టెలిఫోన్ ఆపరేటర్ కమ్ పి.ఏ. టు డిటెక్టివ్ వాళ్ళ వేపు చూసి-
"వాట్ కెన్ ఐ డు ఫర్ యూ.....?" అంది.
"డిటెక్టివ్ గారిని కలవాలి" చెప్పాడు సుల్తాన్. ఒక అప్లికేషన్ ఫారమ్ యిచ్చి-
"దీన్ని నింపండి..... కన్సల్టేషన్ ఫిఫ్టీ రూపీస్" చెప్పిందామె.
అప్లికేషన్ నింపి యిచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాడతను. రసీదు ఇచ్చిందామె.
"కూర్చోండి" ఎదురుగా వున్న కుర్చీలను చూపెడుతూ అందామె.
పదినిమిషాలు గడిచాయి.
బజర్ మోగింది.
"వెళ్లండి" అందామె.
అప్పటికే ఆ అప్లికేషన్ ఫారమ్ లోనికెళ్ళింది.
లోన అడుగుపెట్టిన మధు, సుల్తాన్ లకు, నేవీ ఆఫీసర్ లాంటి యువకుడు రివాల్సింగ్ చైర్ లో కూర్చుని కనిపించాడు. అతనికి ముప్ఫై ఏళ్ళుంటాయి.
"కూర్చోండి" తన విజిటింగ్ కార్డుని మధుకిస్తూ అన్నాడతను.
ఇద్దరూ కూర్చున్నారు.
"అయామ్ రవితేజ..... చెప్పండి....."
చెప్పాడు సుల్తాన్. అంతా శ్రద్ధగా విన్నాడు రవితేజ.
"చూడండి ఫ్రెండ్స్..... దిసీజ్ ప్లూర్లీ లవ్ కేస్...... ముందు ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలు, అభిరుచులు కనుక్కోవాలి. ఎప్పటికప్పుడు మీకు రిపోర్టు చేయాలి..... అంతేనా.......?"
"అంతే...." అన్నాడు మధు.
"నెనుఇ స్కాట్లాండ్ లో ట్రైనింగై వచ్చాను. డిటెక్షన్ గురించి మనవాళ్ళకు సరయిన అవగాహనా లేదు. డొమెస్టిక్ వ్యవహారాల్లో ప్రస్తుతం డిటెక్షన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. లవ్ కి సంబంధించి నా దగ్గిరి కొచ్చిన మొట్టమొదటి కేస్ ఇది. నేటితరం అమ్మాయిల్ని ప్రేమలోకి దిచంతం అంత తేలికయిన విషయం కాదు. ఫస్ట్ అండ్ గుడ్ అప్రోచ్. డైరెక్టుగా సదరు అమ్మాయితో ప్రేమిస్తున్నానని చెప్పేయటం. అది మీకు సాధ్యమయ్యేలా లేదు. కనుక ఆమెకు అభిరుచులు, ఇష్టాయిష్టాలు కనుక్కుని ఆ లైనులో నరుక్కెళ్ళడం..... కానీ....." ఆపి ఇద్దరివైపూ చూశాడు రవితేజ.
"చెప్పండి" అన్నాడు సుల్తాన్.
సరిగ్గా అదే సమయంలో ఖద్దరు పంచె, లాల్చీ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు హడావిడిగా లోపలికొచ్చారు.
వాళ్ళను చూసి రవితేజ విసుక్కున్నట్లుగా మొఖంపెట్టాడు.
"సారీ..... మిస్టర్ రవితేజా! మీరిచ్చిన టైమ్ కి రాలేకపోయినందుకు క్షమించాలి" ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి అన్నాడు.
"అయిదు దశాబ్ధాలుగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మీరు క్షమాపణలు కోరని రోజుందా? ఇంకెన్నిసార్లు మీరు క్షమించమని అడుగుతారు? మేం ఎన్నిసార్లు క్షమించాలి?
ప్రజలకిప్పుడు వాళ్ళ సమస్యలు తీరటం కావాలి. కనీస వసతులు కావలి. మంచినీరు, సాగునీరు, రోడ్లు, వైద్య సదుపాయాలు. విద్యావకాశాలు, నిత్యావసర వస్తువులు చౌకధరలకి కావాలి. ఈ విషయాన్ని మీరెప్పుడూ ఆలోచించలేదు.
ఇకపై ఆలోచిస్తారన్న ఆశకూడా ప్రజల్లో లేదు- మీరోద్దు అని ప్రజలు పదే పదే మొత్తుకుంటున్నా, మరలా మరలా వచ్చి మమ్మల్ని గెలిపించండి, మేలు చేస్తాం అంటారెందుకయ్యా?
గతంలో మిమ్మల్ని ప్రజలు నమ్మి అధికారంలోకి ఎన్నిసార్లు పంపలేదూ? అప్పుడు కనీసం రోజుకి ఒక్క గంటైనా ప్రజలకి కేటాయించారా? ఇంత అన్యాయం, అక్రమం ఎక్కడైనా వుందా?
అది లేకపోగా, మన భారతాన్ని పరిపాలించడానికి మీ పార్టీకి ఒక్క భారతీయుడు లేడా?
భారత ప్రజలకు మరో జాతి ముందు మోకరిల్లటానికి సిద్ధంగా లేరని నా సర్వేలో తేలింది.
మంచి చేసే వాళ్ళని చేయనిస్తే పోలా? ఎందుకయ్యా మరలా మీరు?
ప్రపంచ డ్రీమ్ కేబినెట్ గురించి మీకు తెలుసా?
ప్రపంచరూపురేఖల్ని మార్చటం కొందరికే సాధ్యం. అటువంటి విశిష్టమైన వ్యక్తుల్ని ఒ కేబినెట్ గా రూపొందించి, వారి చేతిలో మొత్తం ప్రపంచాన్ని పెడితే, ప్రపంచ దేశాల్లో ఇప్పుడు రాజ్యమేలుతున్న పేదరికం, ఆకలి, టెర్రిరిజం, అరాచకం, అధికారం దాహంలాంటి రుగ్మతలన్నీ తొలిగిపోయి ఒ ఆదర్శ సమాజం ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఏర్పడుతుంది.
అటువంటి ఊహ వాస్తవంలో సాధ్యం అవుతుందా? లేదా అన్న మీమాంస అటుంచితే 14 మంది సభ్యులు గల వరల్డ్ డ్రీమ్ కేబినెట్ ఏర్పడితే ఆ కల నిజం కాగలదని, అటువంటి విశిష్ట వ్యక్తుల కలయిక వల్ల విశ్వ విశాల ప్రయోజనాలు సాధించగలమని, వారి దార్శనికతతో నవసమాజం ఆవిష్కారం అవుతుందని కోట్లాది ప్రపంచ ప్రజల నమ్మకం.
అటువంటి ఆదర్శవంతమయిన డ్రీమ్ కేబినెట్ లో చంద్రబాబు కి స్థానం లభించటం, అంతర్ణాతీయ స్థాయిలో తెలుగుజాతికే లభించిన విశిష్ట పురస్కారం.
వరల్డ్ డ్రీమ్ కేబినెట్ లో స్థానం లభించటం అంత తేలికైన విషయం కాదు. దాదాపు 200 దేశాలకు చెందిన దేశ ప్రధానులు, కేంద్రమంత్రుల నుంచి సెలెక్ట్ చేస్తే, మన చంద్రబాబుకి అందులో స్థానం లభించటం ఎంత గొప్ప విషయం?
అందుకే నా మాట విని ఇంతకు ముందు ఆధికారంలో వుండగా సంపాదించుకున్న డబ్బుని వడ్డీలకు తిప్పుకొని ప్రజల్ని వదిలేస్తే, వాళ్ళే మీకు శతకోటి వందనాలు సమర్పించుకుంటారు. ఈ ఎన్నికల్లో మీరు గెలవరు. డబ్బు వృధా చేసుకోకండి.
"మీ గెలుపు మీద నేను చేసిన సర్వేలో నాకు తెలిసిన విషయాలు ఇవి.
ఎలాగూ మీరు గెలవరు. అందుకే మీరు నాకు ఫీజు పే చేయనక్కర్లేదు వెళ్ళండి" ఆగ్రహవేశాలతో అన్నాడు రవితేజ.
ఖద్దరు మనుషులిద్దరు ముఖాలు పాలిపోగా, బయటికెళ్ళిపోయారు.
వాళ్ళలా వెళ్లగానే, రవితేజ బాత్ రూమ్ లోకెళ్ళి ముఖం కడుక్కొని వచ్చి సీటులో కూర్చుని, మధు, సుల్తాన్ లకేసి చూశాడు ప్రసన్నంగా.
"చెప్పండి సార్" అన్నాడు సుల్తాన్ తిరిగి.
"సైంటిఫిగ్గా ఎప్రోచ్ కావాలంటే కొంత ఖర్చవుతుంది" చెప్పాడు తేజ.
మధు గుండెల్లో రాయి పడింది.
"మీకు ఫోనుందా?"
"ఉందిలెండి" అన్నాడు సుల్తాన్.
"మీ లవర్ ఇంట్లో - ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మైక్రోఫోన్ బగ్స్ ని ఫిక్స్ చెయ్యాలి. ఆ బగ్స్ వాళ్ళింట్లో జరిగిన ప్రతి సంభాషణనీ మనకు చేరవేస్తుంది. ఆ బగ్స్ అందించే కమ్యూనికేషన్స్ ని రిసీవ్ చేసుకోడానికి మనకు రిసీవర్ కావాలి. సెల్యులార్ ఫోన్..... బైనాక్యులర్స్...... వీటికి మీరు రెంట్ పే చేయాల్సి వుంటుంది. ఆ రెండూ మా ఏజెన్సీకి వున్నాయి. అలాగే సర్వీస్ ఛార్జెస్...."
"ఎంతవుతుంది సార్?" ఆ పేర్లు వినగానే కంగారుగా అన్నాడు మధు.
"ఏభై అవుతుంది. అడ్వాన్స్ పదివేలు. ఇస్తూ, మీ లవర్ అడ్రస్, ఫోన్ నెంబరివ్వండి. మీ ఫోన్ నెంబరూ, అడ్రసూ ఇవ్వండి..... మరుక్షణం వర్క్ స్టార్టవుతుంది" చెప్పాడు రిలాక్సింగ్ గా రవితేజ.
ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
"రేటు తగ్గదా?" అడిగాడు మధు నీరసంగా.