Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 30



    తను చూసింది అక్షర సత్యం....

    ఆ ఆకారం ఒక ఆడమనిషిదని స్పష్టంగా తెలిసిపోతోంది.

    అంతేకాదు.....

    ఆమె ఒక చెట్టుకొమ్మల దగ్గర  ఆగి ఎవరినో పరామర్శిస్తున్నట్టు ఆగిపోవడంతో మరింత ఆశ్చర్యానికి  ఆలోనయింది అతని అంతరంగం.

    పరీక్షగా  గమనించిన అతని కళ్ళకు మరొక విచిత్రం గోచరించింది.

    ముందు రెండు  నిప్పు  కనికల్లా  ఎర్రగా మండిపోతున్న జ్యోతులు- తరువాత తెలిసింది అవి రెండు కళ్ళన్న విషయం!

    ఆ కళ్ళు ఒక పక్షివీ....

    ఆ పక్షి రాబందు.....

    ఆత్మీయురాలీని పలకరించినట్టు మూగగా, మౌనంగా చాలా సేపు ఆ ఆకారం....రాబందు ఒకదాని నొకటి చూసుకుంటూ వుండిపోయాయి.

    రెప్పవేయండ సయితం మరచిపోయి ఆ ఆపురూప దృశ్యాన్ని చూస్తున్న హాస్పిటల్ సూపరింటెండెంట్ కు  గుండె దడ ప్రారంభమయింది. వెంనేముకలోంచి నన్నని వణుకు మొదల్తెంది కాళ్ళూ చేతులు చల్లబడటం మొదల్తెంది.

    తనకు ఏదో  అవుతుందని అతనికి  తెలుస్తూనే వుంది. కానీ అదే మిటో, తనకు అసలేమావుతుందో....ఉన్నట్టుండి అలా ఎందుకనిపిస్తుందో అర్ధంకావడం లేదతనికి.

    లెక్చరర్ నిలిమని పరిశీలించిన స్పెషలిస్ట్ ల రిపోర్టు లన్ని  ఒక్క సారిగా అతని కళ్ళముందు మెదిలాయి.

    విచిత్ర మయిన ఆమె కండిషన్....క్షణ క్షణానికి మారిపోయిన ఆమె ఆరోగ్య స్ధితి  వ్తేద్యశాస్త్రి  పరికరాలనే  సవాల్ చేసిన విషయం....నీలిమ మనిషి  కాదేమో, ప్రేతాత్మ అయివుంటుందనే రూమర్లు వినివుండడం చేతనూ.. ప్రస్తుతం తను చూసిన దృశ్యంతో ఒక విధమయిన భయం పట్టుకుందతనికి.


    నీలిమ సాధారణమయిన ఆడది కాదు......

    ప్రేతాత్మ అయి వుండాలనే  అనుమానం వచ్చిందతనికి. రావడమే ఆలస్యం  తనకు  ఎదురయిన అనుభవం చెప్పి, నీలిమ నిజస్వరూపం  సంబందిత అధికారులకు చెప్పడం తన బాధ్యతగా భావించాడు.

    అతను చూస్తుండగానే ఆ ఆకారం  గాలిలో  తేలుకుంటూ  వెళ్ళి పోయింది.

    హాస్పిటల్ సూపరింటెండెంట్ గిరుక్కున వెనుతిరిగి టేబుల్ ప్తెన వున్న ఫోన్ తీశాడు. ఇన్స్ పెక్టర్ ధీరజ నంబర్ డయల్ చేశాడు.

    ఎంగేజ్ శబ్దం వచ్చింది.

    మళ్ళి మళ్ళి  ప్రయత్నంచాడు.

    నో రెస్పాన్స్!

    ఉన్నట్టుండి  గుండె చిక్కబట్టినట్టనీపించి వెనక్కి  జారాగిలబడి పోయడతను.....చ్ర్తిలోని రిసీవర్  దానంతట అదే జారిపోయింది.

    కానీ సరిగ్గా అదే సమయంలో ఇన్స్ పెక్టర్ ధీరజ ఫోన్ తీసింది. ఎంత ప్రయత్నించినా ఎవరూ  రిప్లయ్  ఇవ్వకపోవడంతో విసుగ్గా ఆమె ఫోన్ పెట్టేసింది.


    సూపరింటెండెంట్ కు స్పృహతప్పిపోతున్న సమయంలో తన గదిలోకి ఎవరో రావడం వరకే తెలుసు. తరువాత ఏమ్తెందో తెలుసుకునే  అవకాశం  అతనికి లభించలేదు.

    డ్యూటి డాక్టర్ ఏదో  పనిమీద  లోపలకి  వచ్చ్చి, అపస్మారకంగా  పడివున్న  ఆయాన్ని  చూసి వెంటనే ఎమర్జెన్సీ రూంకు తీసుకువెళ్ళాడు.....డాక్టర్లు ఎంతగా ప్రయత్నంచినా  అతనికి తెలివిని రాస్పించలేకపోయారు.

    కోమాలోకి  వెళ్ళిపోయడాయన.

    అలా ఎందుకు  జరిగిందో....అందుకు  దారితీసిన కారణాలు ఏమిటో  ఎవరికీ అంతుబట్టలేదు.

    మనిషి ప్రానాలయితే నిక్షపంగా వున్నాయి....కానీ డిఫ్ కోమాలో వున్నాడు.

    అప్పటికప్పుడు ప్రముఖ స్పెషలిస్టు లందరినీ రప్పించి పరిక్షలు జరిపినా కోమాలో నుంచి  ఆయన్ని బయటకు  రప్పించలేకపోయారు.

    సూపరింటెండెంట్ కండిషన్ ఇలా వుండగానే......

    తెల్లవారింది!

    పూర్తి ఆరోహ్యవంతురాలిగా వున్న లెక్చరర్ నిలిమని డిశ్చర్ట్ చేశారు.

    తను  హాస్పిటల్ కు ఎప్పుడు వచ్చిందో, ఎందుకు వచ్చిందో....అసలు తనకు ఏమ్తెందో ఏమీ తెలియదని, అసలేం జరిగిందో చెప్పండని హాస్పిటల్ స్టాఫ్ నీ  నిలదీసింది లెక్చరర్ నీలిమ.

    ఎవరూ పెదవి విప్పి నిజాన్ని చెప్పలేదు.  

 Previous Page Next Page