ఎలా ప్రవర్తించాలో, ఏం చేయాలో క్షణాలమీద నిర్ణయం తీసుకున్నాడు అధికారి.
మళ్ళీ అతనెక్కడ మనసు మార్చుకుంటాడోనన్నట్టు మరుక్షణంలోనే అతని నడుంచుట్టూ చేయివేసి అతన్ని హత్తుకుపోయి నడవసాగింది సంజీవి.
ఎలాంటి జంకూ లేకుండా నడచివెళుతున్న ఆ జంటను గమనించిణ ఇన్ స్పెక్టరు ధీరజ్ భ్రుకుటి అనుమానంగా ముడిపడింది.
ఎవరో యువకుడు ప్రియురాలితో విహారానికి వచ్చాడని భావించాలే తప్ప వారి ముఖాల్లో పోలీస్ ను చూసిన ఆందోళన లేకపోవడం వాళ్ళ కొన్ని నిమిషాల అయోమయానికి లోనయ్యారు ఇన్స్ పెక్టరు ధీరజ్.
పోలీసులపై తల తిప్పి చూడకుండానే తమ మానాన తాము అడుగులు వేస్తున్నారు ఆ ఇద్దరూ.
అంతటితో మట్టిరోడ్డు అంతమై పిచ్చి మొక్కలు, రక్కినపొదలు అడ్డురావడంతో ఇద్దరూ దూరంగా వున్న సరివి చెట్ల తోపువైపు నడిచారు.
దూరంనుంచే వారిని గమనిస్తున్నాడు ఇన్స్ పెక్టరు ధీరజ్.
తాను ఎంతో వేగంగా రియాక్టరు వచ్చినా నేరస్థులు దొరకలేదు. ప్రతి నేరంలోనూ ఇద్దరు పాల్గొంటున్నారు. ఇద్దరూ మగవారే. కానీ, ఈసారి మాత్రం ఆ ఇద్దరిలో ఒక యువతి చేయి కలిపినట్టు గుంటూరు దోపిడీ తెలియజేస్తోంది. ఇంతవరకూ ఎప్పుడూ ఎక్కడా ఏ స్త్రీ సాయం తీసుకొని కమెండో ఈసారి ఆమెను ఉపయోగించుకున్నాడంటే ఆ ఇద్దరిలో రెండవ యువకుడు తప్పనిసరిగా మగవేషంలో వున్న స్త్రీ అయి వుండాలి.
అంటే ఇంతవరకు తాము భావిస్తున్నట్టు నేరస్థులు ఇద్దరు యువకులు కాదు, ఒక స్త్రీ, ఒక పురుషుడు.
ఇంతవరకూ అలాంటి ఇద్దరు నేరస్థులు తనకు కానీ-గుంటూరు ఇన్స్ పెక్టరు టీమ్ కు కానీ తారసపడలేదు. ఎందుకని? అంటే, ఎక్కడో ఏదో పొరపాటు జరిగివుండాలి. అదేమిటో? క్షణాల మీద పెద్ద అనుమానం స్పురించిందతనికి!
ఇంతకుముందే...తన కళ్ళెదురుగా ఒక జంట నడచివెళ్ళిపోయారు. ఒక మగ, ఒక ఆడ. వీళ్ళేనా తాను వెదికే నేరస్థులు కంటపడలేదంటే...క్షణక్షణానికి అది పెద్దదై అతని బుర్రను కొంచెం కొంచెంగా తొలిచి వేయసాగింది.
ఇప్పుడెళ్ళెన ఆ ఇద్దరినీ ప్రశ్నించి చూస్తే? యస్....అలా ఎందుకు చేయకూడదు?
వాళ్ళమీద ఏ మాత్రం అనుమానం వున్నా వారిని ఇంటరాగేషట్ చేస్తే తప్ప తన ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే కదా!
అప్పటికే ఆ ఇద్దరు సరివి తోటలోకి జారుకున్నారు.
ధీరజ్ ఊహలను ముందే పసిగట్టిన కమెండో, సంజీవి చేయి పట్టుకుని పరుగు ప్రారంభించాడు.
అది గమనించిన ఇన్స్ పెక్టరు ధీరజ్ సందేహం పటాపంచలై పోయింది. తాము వెదికే నేరస్థులు ఆ ఇద్దరేనని అర్ధమైందతనికి.
చెట్లకు అడ్డంపడి వారిని అందుకోవడానికి సిబ్బందితో తానూ పరుగు అందుకున్నాడు ధీరజ్.
వారిని చేజుక్కించుకోవడం అసాధ్యం అని భావించి, పట్టరాని కోపంతో, పళ్ళు కొడుకుతూ రివాల్వరును తీసి షూట్ చేశాడు ఇన్స్ పెక్టరు ధీరజ్.
అది సూటిగాపోయి కమెండో ఎడను భుజంపై తగిలింది.
వెచ్చటి నిప్పుకణిక ఏదో అమాంతం భుజంలోకి దిగబడినట్టు, ఒక్కసారిగా నరాలు జివ్వుమని ముందుకు తూలాదతను.
చటుక్కున అతన్ని పొదివి పట్టుకుని భోరుమంది సంజీవి.
"షటప్....యూ బ్లడీ ఇడియట్. ఏడుపులకు ఇదా సమయం. నాకేం కాలేదు. నువ్వు నోరు మూసుకో ముందు" అని పళ్ళ బిగువున బాధను భరిస్తూనే హాండ్ కర్చీఫ్ ను భుజంపై అదిమి పట్టుకున్నాడు కమెండో.
బలవంతాన దుఃఖాన్ని దిగమింగుకుంది సంజీవి.
తిరిగి పరుగుపెట్టారు ఆ ఇద్దరూ.
ఎలాగైనా వారిని పట్టుకోవాలనే పంతంతో వాళ్ళ వెంటపడ్డాడు ఇన్స్ పెక్టరు ధీరజ్.
ఆ దృశ్యంచూసి మరింత పట్టుదలగా అడుగుల వేగాన్ని పెంచాడు కమెండో.
మరొకసారి షూట్ చేశాడు ధీరజ్.
ఈసారి ధీరజ్ గురి తప్పలేదు. బుల్లెట్ అతని కుడిభుజంలోంచి దూసుకుపోయింది. చివ్వున రక్తం చిమ్మింది.
అంతే....ఆపై ఎన్నో అడుగులు కదలకముందే అతని కనుల ముందు మగత కమ్ముకోవడంతో ముందుకు తూలి పడిపోయాడు. పడిన వెంటనే లేవాలని ప్రయత్నించాడు కానీ, ఫలించలేదతని ప్రయత్నం.
పోలీసులు అధికారిని మరలా షూట్ చేస్తారేమోనన్న భయంతో హఠాత్తుగా అతనిపైకి వాలిపోయింది సంజీవి.
అంతవరకూ వారి ప్రతి కదలికనూ గమనిస్తున్న నలుగురు వ్యక్తులు దాపులనే వున్న చెట్ల చాటు నుంచి వచ్చి ఆ ఇద్దరి చుట్టూ గుమికూడారు.
అదిరిపాటుగా తల పైకెత్తి చూసిన సంజీవి కెవ్వున కేకవేయబోయింది. ఆమె ప్రయత్నాన్ని గమనించిన ఒక వ్యక్తి అమాంతం ఒక చేత్తో ఆమె నోటిని మూసివేసి, రెండవ చేతితో అవలీలగా ఆమెను భుజాన వేసుకున్నాడు.
తనను ఎవరో బలవంతంగా ఎత్తుకు పోతున్నారనే విషయం అర్ధం కావడంతో, అతని పట్టునుంచి తప్పించుకోవడానికి బలమంతా ఉపయోగించి గింజుకోసాగింది. అయినా ఫలితం లేకపోయింది.
ఇంకొక వ్యక్తి స్పృహలో లేని కమెండోను పైకెత్తుకున్నాడు.
హడావుడిగా పడుతూ లేస్తూ ఇన్స్ పెక్టరు ధీరజ్ ఆ ప్రదేశానికి వచ్చే సమయానికే ఆ నలుగురు వ్యక్తులు ఎలా వచ్చారో అలానే ఆ చెట్ల చాటున అదృశ్యమైపోయాడు.
ఆ చుట్టుప్రక్కల ఎంత వెదికినా తను ఛేజ్ చేస్తున్న ఆ ఇద్దరు కన్పించలేదు.
బుల్లెట్ తగలడం, గాయపడడం తను స్పష్టంగా చూశాడు కాబట్టి-ఎలాంటి పరిస్థితుల్లో అతను ఎంతో దూరం తప్పించుకుపోలేడనే ధీమాతో చాలాసేపటి వరకూ ఆ చెట్లు చేమలను వదలకుండా అంగుళం అంగుళం గాలిస్తూనే వున్నాడు తన సిబ్బందితో ఇన్స్ పెక్టరు ధీరజ్.
* * *