Home » Chandu harshavardhan » నల్లతంబి

తెల్ల వారుతున్నది....
చీకట్లు తొలగిపోతున్నాయి.
వెలుగు కిరణాలు చెట్ల ఆకుల సందులలోనుంచి మెల్లిగా నలువైపులా ప్రాకుతున్నాయి.
కనులు తెరచి చూసేసరికి చెట్లు ఆపై ఆకాశం కనిపించేసరికి అనుమానంగా చుట్టూ చూశాడు అధికారి.
అతనికి కొంచెం దూరంలో కూర్చొనివుంది సంజీవి.
దట్టంగా వున్న చెట్లమధ్య, ఎత్తయిన కొండగుట్టమీద వేసివిన్న ఒక గుడారం ముందు తను, సంజీవి వున్నారని అర్ధమైంది అధికారికి.
అతనికి స్పృహ వచ్చిన విషయం గమనించి, చటుక్కున లేచివచ్చి సుడిగాలిలా అతనిని అల్లుకుపోయింది సంజీవి.
జరిగిందేమిటో లీలగా స్పురించిందతనికి.
"సంజీవి! నేను ఇక్కడకు ఎలా వచ్చాను? ఆ ఇన్ స్పెక్టరు ధీరజ్ కు మనం బందీలుగా దొరికిపోలేదా?" భుజంపై వున్న కట్టును తడిమి చూసుకుంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అధికారి.
"లేదు మిస్టర్! సమయానికి మేము వచ్చి నిన్ను రక్షించాం." గుడారంలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి నోటినుంచి వచ్చాయి ఆ మాటలు.
అతనివైపు పరిశీలనగాచూసిన మరుక్షణం ఉలిక్కిపడ్డాడు అధికారి.
"ఆశ్చర్యపోతున్నావా...లేక నమ్మకం కలగడం లేదా?"
"అదేమీ లేదూ....మీరు."
"నువ్వు అనుకునేది నిజమే. నిరంతరం పోలీసులు వెదకే నక్సలైట్ల దళాల్లో మాదొకటి. నీ గురించి విన్నాం. అందుకే నిన్ను రక్షించాలని బుద్దిపత్తి నీకోసం కాపుకాసి సమయానికి ఆదుకోగలిగాం."
"చాలా సంతోషం కామ్రేడ్స్..."
"నువ్వు దోచిన సొత్తు ఇంత త్వరగా నీ దగ్గర లేకుండా ఎలా చేయగలిగావు?"
"మొత్తాన్ని పార్సిల్చేసి ప్రయివేట్_పార్శిల్ సర్వీస్ ద్వారా ఒక చోటుకు పంపేసి, 'టు పే' రశీదులనూ కూడా ఆ వ్యక్తిని పోస్టుచేసేశాను. రశీదులంధగానే ఆ సొమ్మును స్వాధీనపరచుకుని జాగ్రత్త చేస్తుంటాడతను. మూడో కంటికి తెలియకుండా, అనుమానం రాని విధంగా దోపిడీ సొత్తు ఆ వ్యక్తి దగ్గరకు చేరిపోతుంది. అందుకే దోపిడీ జరిగిన మరుక్షణం నా దగ్గర ఏమీ దొరకదు..."
"నీలాంటి తెలివైన వ్యక్తి మాతో ఎందుకు చేతులు కలపకూడదు? మేము పోరాడేది కూడా ధనికవర్గంతోనే కదా.....ఉన్నవాళ్ళని దోచి, లేని వారికి సహాయం చేయాలనేదే మా అభిమతం. అయితే, స్వార్ధపరులైన రాజకీయ నాయకులు వున్నంత కాలం మా పోరాటాన్ని తప్పుపట్టడమే జరుగుతోంది. ఫలితంగా కిడ్నాప్ లు, ఎన్ కౌంటర్లు, హత్యలు, దోపిడీలు, పేల్చివెతలూ జరుగుతున్నాయి. చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా వుంటుందనేది విస్మరించి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు రాజకీయ నాయకులు నీ పోరాటం కూడా ఇంచుమించు మాలాంటిదే కనుక మాతో చేయి కలుపు!"
అప్పటికే ఆ నక్సలైట్ దళానికి చెందిన మిగిలిన అన్నలంతా వచ్చి చేరారు.
వారందరినీ తేరిపార చూశాడు అధికారి. పెదవి విప్పి ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు.
"నిదానంగానే ఆలోచించి చెప్పు....తొందరేమీలేదు. అవునూ....ఈమె నీ భార్యా?" ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నప్రశ్నను వేశాడు ఆ దశ నాయకుడు.
"కాదు.....నా బాడీగార్డు."
వింతగా అతనివైపు చూశాడు ఆ దళ నాయకుడు.
"బాడీగార్డుగా వుండవలసిన ధైర్య సాహసాలు వున్నాయా ఆమెలో...?"
ఉన్నాయన్నట్టు తలూపాడతను.
కృతజ్ఞత ఉట్టిపడుతున్న చూపులతో అతన్ని ఆరాధనా పూర్వకంగా చూసింది సంజీవి.
"ప్రతి దోపిడీలోనూనన్ను ఎప్పుడూ వేయి కన్నులతో కాపలా కాస్తూ రక్షించుకునేది ఈమే"
"అంటే...నీ ప్రియురాలన్నమాట."
"కాదు....స్నేహితురాలు"
"నీ సమాధానం వింతగా వుందే! భార్య కాదు, ప్రియురాలు కాదు, స్నేహితురాలు మాత్రమే అంటున్నావు! వయసులోవున్న ఇద్దరు స్త్రీ, పురుషులు కలిసి తిరిగితే వారిమధ్య వుండే అనుబంధం ఎలాంటిదో మాకు తెలియనిదేమీ కాదులే" అన్నాడు అన్నల్లో ఒకతను.
"మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం"
అతని సమాధానానికి ముభావంగా తల తిప్పుకుంది సంజీవి.
కనీసం వారి మాటలకైనా, అతని మనసులోని మాట చెపుతాడేమోనని ఎదురుచూసింది కానీ, ఆమె వూహించే సమాధానం మాత్రం రాలేదు అతని నోటివెంట.
అన్నలు అతని సమాధానాన్ని ఎలా అర్ధం చేసుకుంటారోనని ఆందోళన పడిందామె.
నల్గొండజిల్లా, ఆపరిసర ప్రాంతాలలో అన్నల ప్రాబల్యం బలంగా వున్న రాయనగూడా, మాడుగులపల్లి, కుక్కడం, అబ్బయ్యపాలెం, తిప్పర్తిలలో సంచరించే దళాలలో ఇదొకటి.
ఉదయం పది గంటల ప్రాంతంలో గోధుమ రొట్టెలు తెచ్చి ఇచ్చి వెళ్ళాడు ఒక దశ సభ్యుడు.
ఆకలితో వుండడంవల్ల వాటిని నములుతూ, బహుశా అవి రెండు రోజుల క్రితం నిప్పులపై కాల్చిన రొట్టెలు అయి వుండాలనుకున్నాడు అధికారి.
చూస్తుండగానే పగలు గడిచిపోయి రాత్రి ప్రవేశించింది.

                                                 *    *    *
మరల భళ్ళున తెల్లవారింది...
ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఎందుకో అనుమానం వచ్చి, గుడారంలోకి చూశాడు సెంట్రీ.
అధికారి, సంజీవి వుండవలసిన పక్కమీద రెపరెపలాడుతున్న ఉత్తరం కనిపించిందతనికి. తెరచి చదివిన మరుక్షణం బిత్తరపోయాడతను. వెంటనే ఆ ఉత్తరాన్ని దళ నాయకునికి అందజేశాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra