Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 31


    "థాంక్యూ! అతని రూమ్ నెంబరెంత?"
    "వన్ మినిట్ ఇప్పుడే చెప్తాను" ఠక్కున ఫోన్ పక్కన పెట్టిలేచి రిసెప్షన్ దగ్గరకొచ్చాడు సురేష్.
    సుచిత్ర వెనుకకు తిరిగి ఫోన్ చెవిదగ్గర పెట్టుకుని వింటోంది.
    ఎదురుగా వున్న ఆక్యుపేషన్ బోర్డు చూశాడు సురేష్. సిక్స్త్ ఫ్లోర్ లో ఓ రూమ్ ఖాళీగా వుంది. 687.... ఆ లేడీ డాక్టర్స్ పక్కరూమ్.
    వడివడిగా తన కాబిన్ లోని ఫోన్ అందుకున్నాడు.
    "హలో సుచిత్రా! నోట్ చేసుకోండి. రూమ్ నెంబర్ 687!"
    ఆమె ఆశ్చర్యపోయింది. కౌంటర్ మీదున్న వేకెంట్ రూమ్ పొజిషన్ ఛార్జ్ తీసి చూసింది.
    "రూమ్ నెంబర్ 687? ఇంపాజిబుల్! అది ఖాళీగా వుంది."
    "బహుశా ఇంకా రిజిష్టర్ లో రాసివుండరు. జస్ట్ నౌ...... రూమ్ తీసుకున్నాడు."
    "ఓ.కే. అయ్ విల్ చెకప్! వాటీజ్ హిజ్ నేమ్?"
    "శరత్!"
    "ఫైన్! వుంటాను"
    "థాంక్యూ సుచిత్రా! నేను నెక్స్ట్ వీక్ లో వస్తున్నాను. టిల్ దెన్ బై!"
    "బై!"
    ఫోన్ డిస్కనెక్టు చేశాడు సురేష్.
    ఒక్క ఉదుటున లేచివడివడిగా కౌంటర్ దగ్గరకు నడిచాడు.
    సుచిత్ర అప్పుడే రూమ్ ఆక్యుపెన్సీ రిజిష్టర్ చెక్ చేస్తోంది.
    "మిస్ సుచిత్రా!" పిలిచాడతను.
    "యస్ ప్లీజ్!" మళ్ళీ అదే చిరునవ్వు.
    "చెప్పటం మర్చిపోయాను. పదినిమిషాల క్రితం రూమ్ ఎలాట్ చేశాను ఒక పార్టీకి!"
    ఆమె ఆసక్తిగా చూసింది.
    "ఏ రూమ్?"
    "687"
    "ఓ! పేరు శరత్ కదూ!"
    "మీకెలా తెలుసు?" ఠక్కున అడిగాడు.
    ఆమె కలవరపడిందిగానీ ఠక్కున సర్దుకుంది.
    "ఇప్పుడే ఫోన్ చేశారు. రూమ్ సర్వీస్ కావాలని...."
    "ఐసీ.....!"
    "పేరు రాసేయండి. మిస్టర్ శరత్! ఫ్రమ్ స్టేషన్ బాంబే! బిజినెస్ మాగ్నెట్ అంతే!
    మిగతా డిటైయిల్స్ రేపు!"
    ఆమె చకచకారాసుకుంది.
    సురేష్ మళ్ళీ తన కాబిన్ కొచ్చేశాడు.
    అల్మారాలో వున్న విజయ్ చందన్ ఖరీదైన డ్రస్ ఒకటి తీసుకుని న్యూస్ పేపర్ లో పాక్ చేసుకుని రూమ్, డూప్లికేట్ 'కీ' జేబులో వేసుకుని లిఫ్ట్ దగ్గరకు నడిచాడు.
    సుచిత్ర తనవంకే చూస్తోంది.
    "ఫిఫ్త్ ఫ్లోర్ కెళ్ళి వస్తాను" అబద్దమాడాడతను.
    ఆమె చిరునవ్వు నవ్వింది.
    ఫిఫ్త్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఆగక మళ్ళీ సిక్స్ త్ ఫ్లోర్ బటన్ నొక్కాడతను. లిఫ్ట్ ఆగగానే త్వరత్వరగా నడిచి రూమ్ నెంబర్ 687 లోకివెళ్ళాడు. లోపల బోల్ట్ వేసుకుని గదంతా చూశాడొకసారి.
    త్వరగా డ్రస్ మార్చుకున్నాడు. క్రాఫ్ మరోవేపుకి దువ్వుకుని కళ్ళజోడు పెట్టుకున్నాడు.
    డిమ్ లైట్ ఆన్ చేశాడు.
    ఈ లైట్ లో మొఖం స్పష్టంగా కనిపించటంచాలా కష్టం.
    వీ.సి. ఆర్ ఆన్ చేసి విశాలంగా వున్న డబుల్ కాట్ మీదపడుకున్నాడు.
    ఇంకోగంటో, అరగంటో! అంతే! సుచిత్ర అసలు కధేమిటో బయటపడుతోంది.
    ఆమె రూమ్ లో ఉన్నవారికి ఎలాంటి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందో చూడాలి. అంటే ఇంచుమించుగా తనకి రెడ్ హాండెడ్ గా దొరికిపోయినట్లే!
    కానీ అర్ధం కాని విషయం ఒకటుంది.
    ఆమె తీసుకువస్తానంటున్న ఫ్రెండ్ ఎవరు? ఆడా? మగా?
    మగయితే ఎందుకు తీసుకొస్తున్నట్లు?
    ఆడయితే ఎందుకు తీసుకొస్తున్నట్లు?
    ఏమీ తెలీటంలేదు.
    కానీ సుచిత్ర ఏవో ఇల్లీగల్ కార్యకలాపాల్లో మునిగి వుంది.
    ఏమయి వుంటుంది?
    డ్రగ్స్ సప్లయ్ చేయాలా?
    మరో అరగంట గడిచిపోయింది.
    అప్పుడు వినిపించింది ఇంటర్ కమ్ ఫోన్.
    అదురుతోన్న గుండెలతో ఫోన్ అందుకున్నాడు.
    "గుడ్ మాణింగ్ మిస్టర్ శరత్! అయామ్ సుచిత్రాదత్, రిసెప్షనిస్ట్! మొహన్రావ్ గారు ఇప్పుడే బాంబే నుంచి ఫోన్ చేసి మాట్లాడాడు. మీకు ఎంటర్ టైన్ మెంట్ కావాలని......?"
    "యస్ సుచిత్రా! అయామ్ వెరీ బాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్......"
    "అయితే సరిగ్గా పన్నెండు గంటలకువస్తాను! ఈజిట్ ఓ.కే?"
    "ఓ.కే దట్ సూట్స్ మీ..."
    "గుర్తుంచుకోండి! ఇది చాలా రహస్యంగా వుంచాలి. మా హోటల్లో స్టాఫ్ ఎవరికీ తెలీకూడదు.
    "దట్ విల్ బి రీడ్ ఇన్ దిస్ రూమ్!"
    "థాంక్యూ మిస్టర్" శరత్!
    "ఇటీజ్ ప్లెజర్"
    ఆమె ఫోన్ డిస్కనెక్టు చేసింది.
    సురేష్ గడియారం వేపు చూశాడు.
    సరిగ్గా పన్నెండు గంటలు కొట్టింది గడియారం అప్పుడే!
    సురేష్ గడియారం వేపు చూస్తున్నాడు.
    ఇంకొద్దినిమిషాలు! అతనికి సస్పెన్స్ పెరిగిపోతుంది. ఏం జరుగుతుందసలు? ఎంటర్ టైన్ మెంట్ అంటే ఏమిటీ? వాళ్ళ ఫ్రెండ్ ఎవరు! ఆడా? మగా?

 Previous Page Next Page