Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 32


    మరోసారి అద్దం ముందు నిలబడి జుట్టు ముందుకి దువ్వుకున్నాడు. ఈ గెటప్ లో తనను అంత తేలిగ్గాగుర్తుపట్టలేదు. తలుపు మీద సన్నగా తట్టిన శబ్దం. కిటికీ వేపున నడిచాడు. లైట్స్ మరీ డిమ్ గా ఉందక్కడ. ఆ లైటులో కిటికీ ముందు నిలబడి అద్దాల్లోంచి నిద్రలోకి జారుతోన్న జంటనగరాలను చూస్తున్నట్లు  నటించసాగాడు.
    తలుపు తెరుచుకుని లోపలికి వచ్చిన శబ్దంవింటూనే వెనక్కి తిరిగి చూశాడు.
    సుచిత్రాదత్..... ఆమె వెనుకే మరోయువతి ... తలుపుమూసి లోపల్నుంచి బోల్ట్ చేసేశారు.
    సురేష్ ఆశ్చర్యపోయాడు.
    ఇద్దరూ స్త్రీలే అయితే ఇద్దరి అవసరం ఏమిటి!
    "హలో! గుడీవినింగ్" అంది రెండో యువతి చిరునవ్వుతో.
    "హలో!" అన్నాడు సురేష్ కొంచెం గొంతు మార్చి.
    "అయామ్ సుచిత్రాదత్" అంది సుచిత్ర అతనికి సమీపంగా వచ్చి నిలబడుతూ.
    "అయాం మమత" అంది రెండో అమ్మాయి.
    "నైస్ టూ మీట్ యూ" అన్నాడు.
    "మీరు ఈ సోఫాలో కూర్చోండి" చెప్పింది సుచిత్ర.
    అతనువెళ్ళి సోఫాలో కూర్చున్నాడు.
    "మా ప్రోగ్రాం ఎలా వుంటుందో మీకు మీ ఫ్రెండ్ చెప్పే వుంటాడు" అందామె.
    "చాలాగొప్పగా చెప్పాడు. అందుకే ఆ త్రిల్ అనుభవించాలనినాక్కూడా రికమెండ్ చేసి ఎరేంజ్ చేయమనిచెప్పాను."
    వాళ్ళిద్దరూ వెళ్ళి డబుల్ కాట్ ముందు నిలబడ్డారు.
    అప్పుడు ప్రారంభమయింది. వంటి మీద వలువలు ఒక్కొక్కటే తొలగించివిసిరిపారేయటం. అతనికి ఇంకా అర్ధం కావటం లేదు.
    ఇద్దరూ మంచంమీదకు ఒరిగిపోయేసరికి అప్పుడు తెలిసిపోయింది. యవ్వనంతో, అందాలతో అద్బుతమయిన నిష్పత్తులతో ఉర్రూతలూగిస్తోన్న శరీరాల్లో ఏదెవరి భాగమో తెలీకుండా పోయిన క్షణాల్లో సురేష్ కి చెమటలుపట్టేసినయ్.
    ఇంత ఎగ్జయిట్ మెంట్ ఇంత కోరికల ఉధృతం.....తన జన్మలో పొందలేదు. మనసునీ, శరీరాన్ని అదుపులో ఉంచుకోవటం కష్టంగా వుంది.
    ఇద్దరూ స్త్రీ, పురుషుల్లా వ్యవహరిస్తున్నారు. అయితే ఎవరు స్త్రీయో, ఎవరు పురుషుడో తెలీనంత ఉద్రేకంగా కలబడిపోతూ..... అతనికి ఇంకా నమ్మబుద్దికావటం లేదు. జంట నగరాలలో ఇంత వెర్రి పాశ్చాత్యధోరణులా? ఇవన్నీ ఇంగ్లీష్ సినిమాలకే పరిమితం అనుకుంటున్నాడతను.
    అతను లేచి నిలబడ్డాడు. లోపలి మానిటర్ భయంకరంగా గాండ్రిస్తోంది.
    సుచిత్రాదత్ కూడా ఠక్కున లేచికూర్చుంది.
    సురేష్ వాళ్ళవేపు అడుగులు వేయటం చూసి కలవరపడింది.
    "ప్లీజ్! దగ్గరకు రాకూడదు అక్కడే ఉండండి."
    అతను ఆగలేదు.
    "ఎందుకని?"
    "మేము షో బిజినెస్ చేస్తాముగానీ ప్రాస్టిట్యూషన్ కాదు!"
    "డబ్బు ఇంకొంచెం ఎక్కువిస్తాను."
    "సారీ! వుయ్ కాంట్!"
    "ఎయిడ్స్ భయమా?"
    ఆమె చిరునవ్వునవ్వింది.
    "అదొక రీజన్. అయినా వుయార్ నాట్ ఇంటరెస్టెడ్ ఇన్ మెన్ ...."
    "ఒక సారి ట్రయిల్ ఇవ్వకూడదూ!"
    ఆమెకు సమీపంగా వచ్చి మంచంమీద కూర్చున్నాడతను.
    రెండో యువతి కంగారుగా లేచి పరుగుతో చీర చుట్టేసుకోసాగింది గాబరాగా. సుచిత్ర కూడా లేవబోతూంటే ఆమె చేయి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడతను.
    ఆ విసురుకి వచ్చి అతని వళ్ళో పడిపోయింది.
    "ప్లీజ్ వదిలేయండి! అయామ్ నాట్ ఫర్ దట్" బెదిరిపోతున్న లేడికళ్ళు. "ముందే చెప్పాను" సురేష్ కళ్ళజోడు తీసేశాడు.
    ఉలిక్కిపడిందామె, మొఖంలో సింహాన్ని చూస్తున్న భయం.
    "మీరా?" పాలిపోయిన ముఖంతో అడిగింది.
    "యస్. నేనయితే ఏమయినా ప్రాబ్లమ్ ఉంటుందనుకుంటున్నారా అలాంటిదేమీ ఉండదు, కాష్ ఇవ్వలేకపోవచ్చుగానీ చెక్ ఇచ్చేస్తాను."
    ఆమె అతని చేతుల్ని తప్పించుకుని లేచి పరిగెత్తి తనూ డ్రస్ చేసుకోసాగింది. అతను ఆమె అందాలవంక రెప్పలార్పకుండా చూస్తున్నాడు.
    అజంతా శిల్పం నెంబర్.....టూ!
    నెంబర్ వన్ ఎప్పటికీ తులసే.
    ఎదురుగ్గా సోఫా చేతిమీద కూర్చుందామె దిగాలుపడి తలవంచుకుని.
    "దయచేసి నాకు సహాయం చేయగలరా?" అడిగిందామె.
    "ఏమిటది?"
    "ఇది నా ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్న. మీరీ విషయం మీలోనేదాచుకుంటే గానీ నా ఉద్యోగం నిలబడదు. ఉద్యోగం మీద ప్రస్తుతం నేనెంత డిపెండ్ అయున్నానో మీకు తెలీదు. కేవలం ఉద్యోగం తాలూకూ చిన్న జీతంమీద ఆధారపడి సాదా జీవితం గడపటం నాకు నచ్చటంలేదు. అందుకే ఈ సంపాదన కోసం ఇద్దరం ఈ మార్గం ఎన్నుకున్నాం.
    "మీ ఉద్యోగానికి ఏ ప్రమాదమూ రాదని నేను హామీ ఇస్తున్నాను."
    ఆమె ఛటుక్కున తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో ఆనందం, కృతజ్ఞత.
    సురేష్ లేచి ఆమె దగ్గరకు నడిచి భుజంమీద చేయివేశాడు.
    "కమాన్ లెటజ్ గో!"
    అతని వెనుకే లిఫ్ట్ లోకి నడిచారిద్దరూ.
    "నా గురించి ఎలా తెలుసుకోగలిగారు మీరు?" సుచిత్రాదత్ అడిగింది దీనంగా.
    "మేనేజ్ మెంట్ కి అనుమానంగా ఉంది. ముఖ్యంగా విజయ్ చందన్."
    "ఓ!" అందామె అర్ధమయినట్లు.
    "మీరు విజయ్ ని అవమానపరచారని కోపంగావున్నాడు."
    లిఫ్ట్ రిసిప్షన్ ముందాగింది.
    బయటకు నడిచాడు.
    "ఇంటెన్షనల్ గానే అలా ప్రవర్తించాను. అలా.... అంత.....ఎక్కువగా రియాక్ట్ అవుతేగానీ అతనికి నా మీద ఎలాంటి అనుమానం రాదనుకుని......" చెపుతోందామె.
    అందరూ రిసిప్షన్ చేరుకున్నారు.
    "ఏమాత్రం అనుభవం లేనితనం" సురేష్ మాటలకు బదులివ్వలేదు. విజయ్ చందన్ తరుముకొస్తున్నట్లనిపిస్తోంది సురేష్ కి.
    "ఫర్ మైసేక్! అయ్ వాంట్ టుకాచ్ హర్ రెడ్ హాండెడ్" విజయ్చందన్ కసి, రివేంజ్ అన్నీ ఆ గొంతులో నిండిపోయి ఉన్నయ్.
    సుచిత్రాదత్ బెదురుచూపులు అతనివంకే చూస్తోంది.

 Previous Page Next Page