అందరూ వాన్ ఎక్కక తప్పలేదు.
పోలీస్ స్టేషన్ లోకి మొదటిసారిగా అడుగుపెట్టాడు సురేష్.
పార్లర్ వాడిని లాకప్ లో వేశారు.
"వాడి కాసెట్ కాల్చి అవతలపారెయ్యండి! మనదగ్గరున్న బూతు కాసెట్ ఒకటి వాడుచూపిస్తున్నట్లు ఎఫ్.ఐ.ఆర్ లో రాయండీ!"
సురేష్ ఇన్ స్పెక్టర్ దగ్గరకు నడిచాడు.
"మీకు అయిదునిముషాలు టైమిస్తున్నాను. ఆలోగా నన్ను ఎక్కడినుంచి తీసుకొచ్చారో అక్కడ వదలకపోతే మీరు ట్రబుల్లో పడతారు" అన్నాడు గంభీరంగా.
"అంటే?" అతని మొఖంలో కొంచెం కలవరం కనబడుతోంది.
"అంటే.....మీరు రోజూ రాత్రుళ్ళు గడిపే ప్లేస్ నాకు తెలుసు! నేను జర్నలిస్ట్ ని!"
అతను బుర్ర గోక్కున్నాడు.
"ఏయ్! ఈయన్ని జీప్ లో తీసుకెళ్ళి వదిలేసిరండీ!" ఓ కానిస్టేబుల్ తో చెప్పాడు.
సురేష్ జీప్ ఎక్కి కూర్చున్నాడు.
టైమ్ తొమ్మిదవుతోంది. జీప్ హోటల్ ముందాగేసరికి.
"గుడీవినింగ్" అంది అందమైన గొంతు రిసెప్షన్ లోనుంచి. అదిరిపడ్డాడు.
సుచిత్రాదత్! మరో కొత్తరూపం డ్రస్ లో..రక్తాన్ని ఆవిరి చేసే సెక్సీ నవ్వుతో.....
"గుడీవినింగ్! మీరెలా ఉన్నారిక్కడ?"
"నైట్ షిఫ్ట్ లోకి మార్చారు."
"వెరీ నైస్!"
"అఫ్ కోర్స్.....ఐ లైక్ నైట్ షిఫ్ట్!"
"ఐ లవ్ డే అండ్ నైట్!"
ఆమె నవ్వేసింది.
ఫోన్ మోగసాగింది ఇద్దరి మధ్యలో.
రిసీవర్ అందుకుంది. "హలో"
ఫోన్ సురేష్ కందించింది. "విజయ్ చందన్ వాంట్స్ యూ!"
"హలో బాస్" అన్నాడు సురేష్.
"ఇవాళ చాలా జాగ్రత్తగా సి.ఐ.డి వర్క్ చేయాలి నువ్వు!"
"దేన్నిగురించి?"
"సుచిత్రాదత్ గురించి!"
"అందులో సి.ఐ.డి వర్క్ ఏముంది?"
"నీకదివరకు చెప్పాను కదా ఆమె గురించి ఓ రిపోర్టు వచ్చిందనికానీ ఇంతవరకూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫ్రూఫ్ దొరకలేదు."
"ఎలాంటి రిపోర్టు వచ్చింది?"
"బాగా కాస్ ట్లీ కస్టమర్స్ తో కాంటాక్ట్స్ పెట్టుకుంటోందని!"
"అర్ధమయింది."
"ఇవాల కావాలని నైట్ షిఫ్ట్ తీసుకుంది గనుక....."
"తెలుసు! టు నైట్ ఈజ్ దినైట్!"
"యస్ టు నైట్ ఈజ్ దినైట్!"
"ఓ.కే. గుడ్ నైట్!"
"విష్ యూబెస్టాఫ్ లక్!"
"థాంక్యూ!"
ఫోన్ పెట్టేశాడు.
"యూ కెన్ టేక్ రెస్ట్ మిస్టర్ సురేష్ ఐ విల్ లుకాఫ్టర్ ఎవ్విరి థింగ్."
ఎవ్విరి థింగ్?" టీజింగ్ గా అడిగాడు.
"యస్! ఎవ్విరి థింగ్!"
"థాంక్యూ!"
తన కాబిన్ లోకి నడిచి ఈజీ చైర్లో కూర్చున్నాడు.
సుచిత్రాదత్ ని ఎలా ట్రాప్ చేయాలి
గంటసేపు ఆలోచించాకా వెలిగింది ఫ్లాష్!
పక్కనే వున్న ఫోన్ తీసుకుని రిసెప్షన్ కి రింగ్ చేశాడు.
సుచిత్రా దత్ ఫోన్ అందుకుంది "హోటల్ లవ్ లీ గాళ్!"
"హలో సుచిత్రేనా మాట్లాడేది?" కొంచెం గొంతుమార్చి అడిగాడు.
"అవును! మీరెవరు?"
"హలో సుచిత్రా! గొంతు గుర్తుపట్టలేదా?"
ఆమె కొంచెంతటపటాయించింది.
"అయామ్ అనేబుల్ టు మేకవుట్!"
"పోనీ ఓ హింట్ ఇస్తాను. ఫ్రమ్ బాంబేవిత్ లవ్!"
"ఓ! అయితే మీరు మోహన్ రావ్! యామ్ అయ్ కరెక్ట్!"
"ఎగ్జాక్ట్ లీ...యిప్పుడు నాకో ఫేవర్ కావాలి సుచిత్రా!"
"ఏమిటది?"
"మా బెస్ట్ ఫ్రెండ్ ఒకతను మీ హోటల్లో వున్నాడు ప్రస్తుతం. అతన్ని మీరు ఎంటర్ టైన్ చేయాలి!"
"షూర్! ఎప్పుడు?"
"టు నైట్!"
ఆమె ఓ క్షణం ఆలోచించింది.
"ఏమిటాలోచిస్తున్నారు?"
"మా ఫ్రెండ్ ని కాంటాక్ట్ చేయాలికదా! ఇంత రాత్రయిపోయింది మరి! ఇప్పుడు సడన్ గా రమ్మంటే....."
"ప్లీజ్ సుచిత్రా! అతను నాకు బాగా కావలసినవాడు! ఉదయం నుంచీ మీకోసం రింగ్ చేస్తున్నాను."
ఆమె మళ్ళీ ఆలోచనలో పడింది.
"అదిగో! ఓ.కే. అనమంటే మళ్ళీ ఆలోచిస్తున్నారు కదూ?"
"ఓ.కె. అని నవ్వుతూ అంది ఆమె."
"ఓ! థాంక్యూ!"
"అతనికి మా ఫీజ్ సంగతి చెప్పారా?"
"ఓ! ఇన్ ఫాక్ట్ ఇంకొంచెం ఎక్కువే ఇస్తాడు."