Previous Page Next Page 
69 సర్దార్ పటేల్ రోడ్ పేజి 31

 

    "మనకి లవ్ గివ్ ఏమీ లేదు. ఒక్కసారి నాకు నువ్వు గావాల! పైసలు గావాలో, ఇంకమైనా లైసెన్సులు, లోన్లు సెన్సార్ బోర్డు మెంబరు , కార్పోరేషన్ చైర్మన్ పోస్టులు లాంటి వేమైనా గావాల్నంటే జేస్తా ఏమంటావు?"
    తను సమాధానం చెప్పకుండానే వచ్చేసింది.
    రాఘవరావుతో అంతా డ్రమెటిక్ గా జరిగింది.
    వరకట్న హత్యకేసులో పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేయడానికి వెళ్ళినప్పుడు తనను అరెస్ట్ చేశారు.
    వ్యాన్ లో ఒక బాచ్ ని తీసుకెళ్ళి ఓ భవనంలో వుంచారు.
    వ్యాన్ లో రాఘవరావు తన పక్కన కూర్చున్నాడు వ్యాన్ మలుపు తిరుగుతున్నప్పుడు అతని ఒళ్ళో పడబోతే , అతను తన నడుం మీద చేయి వేసి పట్టుకున్నాడు. నగ్నంగా వున్న పొత్తికడుపు మీద.....అప్పుడు.......ఒళ్ళు జలదరించింది.
    పురుష స్పర్శతో అలాంటి జలదరింపు కలిగించడం అదే మొదటి సారి!
    ఆ గంటలో అతను తనతో చాలా చనువుగా మాట్లాడాడు.
    మన దేశంలో స్త్రీ పరిస్థితి ఇంత దారుణంగా వుండటానికి కారణం ఏక్ స్ట్రా మారిటర్ ఎఫయిర్ అనేవి కేవలం పురుషులకే పరిమితం. స్త్రీల కది నిషిద్దం అని పురుషులు నమ్మినట్లే స్త్రీలు కూడా నమ్మటం, అతని మాటలు ఒక్కసారిగా తన మనసును ఏవో తెలీని బంధాల నుంచి విముక్తి చేసినట్లనిపించాయి.
    "మీకిష్టమైతే అలాంటి సంబంధం నాక్కావాలి" అన్నాడతను.
    తను అదిరిపడింది. అతను తన స్నేహితురాలి భర్త! గుండె వేగంగా కొట్టుకోసాగింది. మరో పక్క సిగ్గు.
    "ప్లీజ్! అలాంటి మాటలు మాట్లాడకండి. నా కిష్టం లేదు" అనేసింది గాబరాగా.
    అతను నవ్వాడు.
    "విప్లవనారీ సమితిలో మీరు చేరింది మిగతా స్త్రీలకు అన్యాయం జరక్కుండా చూడటానికి అన్నది నిజమే , కానీ ఆ ప్రాసెస్ లో మీ వయస్సు మర్చిపోయి , మీకు మీరు అన్యాయం చేసుకోకండి" నవ్వుతూ అన్నాడు.
    తన మనసులో అప్పటికే ఘర్షణ మొదలయ్యింది.
    "మీరు నా ఫ్రెండ్ భర్త అయ్యుండి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు." నిష్టూరంగా అంది.
    "మీరు నమ్మరేమో! నేను వెలిబుచ్చే అభిప్రాయాలన్నీ మేమిద్దరం నమ్మినవే....."
    మరో పెద్ద షాక్!
    రెండు రోజుల తర్వాత హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గర కనిపించిన ఓ లేడీ లెక్చరర్ శవం విషయంలో పోలీసులు కేసుని తప్పుదారి పట్టించడానికి చూస్తున్నారన్న విషయం తెలిసి తామంతా ఆమె కుటుంబీకులని కలుసుకోడానికి వెళ్ళారు.
    వాళ్ళతో మాట్లాడటం పూర్తయ్యాక విజయలక్ష్మి తనను వాళ్ళింటికి తీసుకెళ్ళింది. ముగ్గురూ మాట్లాడుతుండగా ఆమె ఫోన్ చేయడానికి బయట పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర కెళ్ళింది.
    ఆ సమయంలో రాఘవరావు చనువు తీసుకున్నాడు.
    తను షెల్ఫ్ దగ్గర నిలబడి పుస్తకాలు చదువుతోంటే వెనుకనుండి వచ్చి కౌగలించుకుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు.
    తను అతన్ని చేతుల్నుంచి వదిలించుకోవడానికి పెనుగులాడింది. "ఏమిటది/ వదలండి....."
    అంటుండగానే పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు.
    అదే తనను పిచ్చిదానిని చేసేసింది. హిప్నటైజ్ అయినట్లు అతని కౌగిలిలో నలిగిపోసాగింది.
    ఏం జరుగుతుందో తెలీని పరిస్థితుల్లో విజయలక్ష్మి గది తలుపు దగ్గర కనిపించింది చిరునవ్వుతో.
    తను అదిరిపడి ఒక్కసారిగా స్పృహలోకి కొచ్చింది.
    అతనిని తోసివేసి లేవబోయింది.
    "సారీ ....... డిస్టర్బ్ చేసినట్లున్నాను. నేను ఏమీ అనుకోను. ప్లీజ్ ఎంజాయ్" అనేసి బయటికి నడిచి తలుపులు మూసేసింది.
    అంతవరకూ తననావహించిన మత్తంతా ఒక్కసారిగా వదిలిపోయింది.
    అతని కౌగిలి నుంచి వివాది లేచి నిలబడింది.
    "అదే! ఏమిటలా వెళ్ళిపోతున్నారు. విజయలక్ష్మి ఇలాంటివేం పట్టించుకోడు" అంటున్నా తను వినిపించుకోలేదు.
    త్వరత్వరగా బట్టలు సరిచేసుకుని బయటకు నడిచింది.
    అతను, విజయలక్ష్మి పిలుస్తున్నా వినిపించుకోకుండా వచ్చేసింది.
    ఆ రోజు నుంచీ తను చాలా కాలం ఇల్లు వదిలి బయటకు పోలేకపోయింది. ఆలోచనల్లో నుంచి బయటపడి లేచి గదిలో పచార్లు చేయసాగింది ఉమాదేవి యా జ్ఞాపకాలన్నీ కోర్కెలను మరింతగా రగిలిస్తున్నాయి గానీ తగ్గించటం లేదు.
    ఆ ప్రయత్నంగా ఆమె చేతులు మూసివున్న కిటికీ తలుపుల మీద పడినాయి.
    నెమ్మదిగా తెరుచుకుంది కిటికీ.
    శ్రీనాద్ గది కిటికిలో నుంచి ట్యూబ్ లైట్ కాంతి వరదలా తన గదిలో ప్రసరించింది.

 Previous Page Next Page