ఆమె అసలు నడవడంలేదని ,ఎవరో నేట్టినట్టు ముందుకు దూసుకు వెళుతోందని, అదిగాక ఆమె భూమికి రెండడుగుల ఎత్తులో వుందని గమనించి వుండేవాడు.
అప్పుడు తేలిసేది అతనికి....ఆమె మామూలు యువతీ కాదని... ఏదో ప్రేతత్మయి వుంటుందని సత్యం హేలిశాక పిరికి గుండె కలవాడయితే తట్టుకోలేక పడిపోయి వుండేవాడు. అదే ద్తేర్యస్దుడతే ఆమెను ఆపి, పలకరించే ప్రయత్నం చేసి వుండేవాడు
అప్పడేం జరిగి వుండేదో కానీ....ప్రస్ధుతం మాత్రం ఆ తెల్లని ఆకారం హాస్పిటల్ వరండాలో సాగిపోతోంది.
ఎవరూ ఆమెను గమనించే అవకాశం లేకపోయింది.
రెండవ అంతస్దుకి చేరుకున్నదామే.
ఆ అంతస్దులో ఇద్దరు నర్సులు ఆమెకు ఎదురయినా...వాళ్ళిద్దరూ తమలో తామే ఏదో మాట్లాడుకుంటూ ఆమెను దాటి వెళ్ళిపోయారు తప్పు ఆ సమయంలో ఆమె ఎందుకు వచ్చిందో, ఎక్కడకు వెళుతుందోనన్న ఆలోచన కూడా వాళ్ళకు రాలేదు.
ఆ ఆకారం సూటిగా వెళ్ళి ఆ అంతస్దులోని చివరి గదిముందు నిలిచింది.
అప్పడే మెట్లెక్కి ఆ అంతస్దులోకి అడుగుపెట్టాడు ఒక వార్డు బాయ్.
ఆమెను చూడనే చూశాడతను.
అతని భృకుటి ఆశ్చర్యంతో ముడిపడింది.
ఎవరా యువతీ? ఆ గదిముందు ఎందుకు నిలిచిందో.....అదిగాక ఈ సమయంలో ఎవరికంటా పడకుండా అక్కడకు ఎలా వెళ్ళిందో....అనుకుంటూ తన అనుమానాలను తీర్చుకోవాలనే ఆభిప్రాయంతో ముందుకు నడిచాడు వార్డుబాయ్.
ఎవరో తలుపు తీసినట్టు ఆ చివరి గదిలోకి వెళ్ళిపోయిందమే.
ఆ దృశ్యం చూడడంతో వార్డు బాయ్ ఆశ్చర్యం రెట్టింపయింది.
ఎందుకంటే.....
ఆ గదిలో వున్న పేషెంట్ లెక్చరర్ నీలిమ!
అంతకుముందువరకూ స్పెషలిస్తులను నయితం తికమకపెట్టి ప్రస్ధుతం గాడమ్తెన మత్తులో ఆమె విశ్రాంతి తిసుకుంతోందని అతనికి తెలుసు.
అందుకే ఎవరో లోపలనుంచి తలుపు తీసినంత తేలిగ్గా ఆమె ఆ గదిలోకి వెళ్ళడాన్ని ఆశ్చర్యంతో చూశాడు.
ఎందుకయినా మంచిదని లెక్చరర్ నిలిమను లనిపెట్టి వుండడానికి ఆ గదిలో ఒక నర్సును వుంచిన విషయం అతనికి తెలుసు.
ఆమె తలుపు తెరిస్తేనే లోపలకు వెళ్ళడం సాధ్యం.
నర్సు తలుపు తీయకుండానే ఆ యువతీ లోపలకు ఎలా వెళ్ళిందో?
ఒక వేళ ఆమె తీసిందనుకోవడానికి అయినా ఈ సమయంలో పేషెంట్ కు సంబందించిన బంధువులను కూడా లోపలకు రానివ్వరు.
మరామే లోపలకు ఎలా వెళ్ళి వుంటుందో?
కానీ అప్పడే అతన్ని వెదుక్కుంటూ వచ్చిన మరో వార్డుబాయ్ అతన్ని పిలవడంతో ఎమిటన్నట్టు ఆగి వెనుదిరిగాడతను.
"ఆపరేషన్ ధియేటర్ దగ్గర సూపరిం టెండేంట్ గారున్నారు. ఆపరేషన్ అయిపోయినట్టుంది. ఆయన బయటకు వచ్చేసరికి మనం అక్కడ వుండాలి....రా పోదాం" అంటూ అతను పిలవడంతో ఆ వార్డ్ బాయ్ క్షణకాలం తటపటాయించాడు.
లెక్చరర్ నీలిమ వున్న రూమ్లోకి వెళ్ళి అంతకుముందు వచ్చిన యువతీ తెలుసుకోవాలని వున్నా....ఆ అవకాశం లేక అనుమానం గానే అతనితో క్రిందకు వెళ్ళిపోయాడు ఆ వార్డుబోయ్.
అతను వెళ్ళిన మరునిమిషంలోనే ఆపరేషన్ ధియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. డ్యూటి డాక్టర్స్ కు ఏమెం చేయాలో వివరిస్తూ తన గదివ్తెపు అడుగులు వేశాడు సూపరింటెండెంట్.
వార్డుబోయ్లిద్దరూ ఆపరేషన్ ధియేటర్ లోనికి వెళ్ళితమ డ్యూటిలో మునిగిపోవడంతో ....అప్పటివరకూ లెక్చరర్ నీలిమ గదిలోకి వెళ్ళిన యువతిని గురించి వున్న ఆలోచనలన్ని తాత్కాలికంగా మరచిపోయాడతను.
సమయం భారంగా గడిచిపోతోంది.
పన్నెండున్నర గంటలు.....
బాగా అలసటగా వుండడంతో బయటనుంచి వచ్చే చల్లటిగాలిని ఆస్వాదిస్తూ కిటికీ దగ్గర నిలిచి చికట్లోలో మునిగి వున్న నగరాన్ని చూస్తూ వున్నాడు ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్.
ఉన్నట్టుండి అతని దృష్టి ఒక గది కిటికీ వ్తెపు మళ్ళింది
ఆ గది కిటికీలోనుంచి ఒక తెల్లని ఆకారం బయటకు వచ్చ్చి గాలిలో ఎగురుకుంటూ వెళ్ళడాన్ని అతను గమనించాడు.
ఆశ్చర్యం....!
శూన్యంలో ఒక మనిషి ఎలాంటి ఆధారం లేకుండా నిలిచి వుండటమే అనంభవమ్తేతే ,నేలమీద నడిచినట్టు గాలిలో నడిచి వెళ్ళడం నమ్మ లేని వింతగా తోచింది.
అంటే__ఆ ఆకారం మనిషి కాదు....
మరెవరు? ఆ గదిలో వున్నది లెక్చరర్ నీలిమ.ఆ గదిలోకి ఇంత రాత్రివేళ ఎవరూ ప్రవేశించే విలిలేదు. అయినా కిటికీలో నుంచి బయటకు రావడమూ అసంభవమే!