Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 29


    "ఒకవేళ పిచ్చెక్కిందని వప్పుకుంటేరడీయేనా?"
    ఆమె అతనిని తప్పించుకుని బయటకెళ్ళిబోయింది. "మీరెళ్ళక పోతేనేనే వెళతాను" అంది రుసరుసలాడుతూ.
    ఛటుక్కునచేయి అడ్డు పెట్టాడతను.
    "సర్లెండి! మీ ఇష్టం! మా ఇంట్లోకి వెళదాంపదండి" అంటూ బయటకునడిచాడు. ఆమె వెనకే తలుపులు మూసేసింది.
    ఇంట్లోకొచ్చాక వెనక్కు తిరిగి కిటికీలోనుంచి చూసేసరికి వాళ్ళ కిటికీపక్కనే నిలబడి తాలో తాను నవ్వుకుంటోందో గంగాభవాని.
    సురేష్ అటేచూస్తూండిపోయాడు కొద్దిసేపు.
    సెక్సీకి వయసు తెలీదనిపిస్తోంది ఆమె నవ్వు చూస్తోంటే ఆమె నవ్వటం చాలా తక్కువసార్లు చూశాడు తను.
    బహుశా ఒకసారో, రెండుసార్లో!
    చూసినప్పుడల్లా ఇదే ఎగ్జయిట్ మెంట్.
    శరీరం కలిగించే ఆకర్షణ కన్నా ఓ స్త్రీ నవ్వు ఇంత ఎగ్జయిట్ మెంట్ కలిగిస్తోందంటే...... ఇటీజ్ సమ్ థింగ్.
    స్నానంచేయగానే నిద్రముంచుకొచ్చేసింది.
    పక్కన తులసి లేకపోయేసరికి రాత్రంతా సరిగ్గా నిద్రపట్టనేలేదు తిరిగి మెలుకువవచ్చేసరికి సాయంత్రం అయిదయిపోతోంది.
    "ఇదిగో మిమ్మల్నే" కిటికీబయటనుంచి వినిపించిందామె గొంతు.
    ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.
    గంగాభవాని సరికొత్త డ్రస్ లో..... మరింత ఆకర్షణీయంగా.... మొఖంలో సౌమ్యత.....
    "భోజనంకూడా లేకుండా ఏమిటా నిద్ర? ఇదిగో 'టీ' తాగండి."
    లేచివెళ్ళి 'టీ' అందుకున్నాడతను.
    "మీకు కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో అర్ధం కావటంలేదు. ఒకసారి లోపలికొస్తారా?"
    "ఎందుకు?"
    "కనీసం కొంతరుణమయినా తీర్చుకుందామనీ....."
    విసురుగా వెనక్కు తిరిగి వెళ్ళి వాళ్ళింటి గడప దగ్గర నిలబడింది.
    "ఇల్లుఖాళీ చేయటంగురించి ఏమాలోచించారు?"
    "ఆడ దిక్కుని తీసుకొస్తానని చెప్పానుకదా!"
    "ఇంటికలాంటివాళ్ళనెవర్నయినా తీసుకొస్తే ఊరుకోను.... ముందే చెపుతున్నాను."
    "మీ రెక్కడ దొరికారండీ! తను పెట్టదు, అడక్కు తిననివ్వదని...." విసుగు నటించాడు.
    "ఆ మాటే వద్దన్నాను."
    "నేనూ అదే అంటున్నాను మాటలనవసరం అని. రండి!" ఆమె తృళ్ళిపడింది.
    "ఇంకోసారలా అంటే మర్యాదగా వుండదు."
    "అందుకే త్వరగా తేల్చండి! మనం ముగ్గురం ఎంతసేపని ఇలా నిలబడి ఉంటాం?" ఆమె అనుమానంగా చుట్టూచూసిందోసారి.
    "ముగ్గురెవరు?"
    అతను పగలబడి నవ్వసాగాడు జవాబు చెప్పకుండా కొద్ది క్షణాల తర్వాత అప్పుడు ట్యూబ్ లైట్ వెలిగిందామెకి. హఠాత్తుగా అర్ధమయి ఖాళీ కప్పుతీసుకుని జేవురించిన ముఖంతో "ఛీ" అనేసి చరచరా ఇంట్లోకెళ్ళిపోయింది.
    మెస్ లో భోజనం చేసి తులసి నడిచే రోడ్ మీద ఆమె పక్కనే నడుస్తున్న అనుభూతిపొందుతూ నడవసాగాడతను.
    ఆమె లేకుండా రెండు రోజులు గడపటానికే ఏమిటోగా వుంది. అలాంటిది కనీసం ఆరు నెలలు ఎలావుండగలడు? నో!
    అన్ని రోజులు తనవల్ల కాదు.
    అందుకే సుచిత్రాదత్ ని గాలం వేయమంటున్నాడు విజయ్ చందన్.
    ఆమె పేరు తల్చుకోగానే శరీరమంతా చక్కని ఫీలింగ్ విద్యుత్ లా పాకింది.
    వీడియో పార్లర్ ముందు బోర్డు పెట్టివుంది.
    'హాట్ ఇన్ పారడైజ్ .....'
    తను నిలబడటం చూసి పార్లర్ ఓనర్ నెమ్మదిగా దగ్గరకొచ్చాడు.
    "రా బ్రదర్! చాలా హాట్ గా వుంటుంది పిక్చర్....."
    "అంత హాట్ గా ఉంటే ఇన్నిసార్లు ఆ సినిమా చూసి చూసి...... నువ్ ఈ పాటికి పేలిపోయి వుండేవాడివి కదా!"
    "అవున్సార్! నేను పార్టు త్రీనిమాట్లాడుతున్నాను."
    సురేష్ లోపలకు నడిచి కూర్చున్నాడు.
    ముసలతను ఓ మూలగా మఫ్లర్ చుట్టుకుని కూర్చున్నాడు. ఎవరూ తనని గుర్తుపట్టకుండా, సినిమా మొదలయింది. మరో నలుగురయిదుగురు ప్రేక్షకులు పోగయ్యారు.
    గంట సేపు సినిమా అయ్యాక పోలీస్ వాన్ వచ్చింది.
    "పదండి అందరూ వాన్ ఎక్కండి" తలుపు దగ్గర నిలబడి అరచాడు కానిస్టేబుల్. అందరూ ఆశ్చర్యపోయారు.
    "ఎందుకు?" ఒకతను అడిగాడు.
    "అదంతా ఇన్ స్పెక్టర్ సాబ్ నడగండి! బయట వాన్ లో ఉన్నారు!"
    సురేష్ తోపాటు అందరూ బయటకునడిచారు.
    ఇన్ స్పెక్టర్ వాన్ లో డ్రైవర్ ప్రక్కనే కూర్చుని వున్నాడు.
    "మమల్నెందుకు స్టేషన్ కి రమ్మంటున్నారు?" అడిగాడు సురేష్.
    "బూతు సినిమా చూస్తున్నందుకు!"
    "అది సెన్సార్ అయిన సినిమా!"
    "ఆ పేరు మీద ఇంకో బూతు కాసెట్ వేస్తున్నాడు పార్లర్ వాడు"
    "యూ ఆర్ మిస్టేకెన్! ఈ పిక్చర్ నేను అదివరకే చూశాను థియేటర్ లో! అదే ఇక్కడ కూడా చూపిస్తున్నాడు."
    "అని మీరంటారు!"
    "మీరేమంటారు?"
    ఇన్ స్పెక్టర్ చిరాగ్గా చూశాడు. "ఓసారి చెప్పానుగా....మర్యాదగా వానెక్కండి!"
    వీడియో పార్లర్ వాడు పాలిపోయిన మొఖంతో ఇన్ స్పెక్టర్ దగ్గర కొచ్చాడు.
    "ఇది మామూలు సినిమాయే సార్! కావాలంటే వీళ్ళందర్నీ అడగండి!"
    "బాస్టర్డ్! మా వాళ్ళను పంపిస్తేనిన్న పైసలు ఇయ్యకుండా ఏమిటన్నావంట?" మండిపడుతూ అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "నేనేమన్లేదు సార్! ఈ నెలంతా కలెక్షన్ అస్సలు లేవు. అందుకని మామూలు కట్టలేనని చెప్పాన్సార్!"
    "బాడుకవ్! నీ తాత కడతాడు బే ఈనెలకి? చేసేదిబాడుకవ్ దందా....పైసలు కట్టవ్?"
    "అమ్మతోడుసార్! బూతు సినిమాలేబంద్ చేసినా."
    "ఒరేయ్! నీకు పార్లర్ పెట్టే రోజేచెప్పినా! నువ్ ఎలాంటి సినిమాలేసుకున్నాగానీ మాపైసల్ మాకు కట్టాలని! లోపలెయ్యండ్రా ఈడిని! రెండు నెలలులోపలుంటేగానీ ఈడికి సమజ్ కాదు..."

 Previous Page Next Page