Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 2

   
    మోహన్ మాట్లాడలేదు _ వృత్తి అలవారచిన గాంభీర్యంలో అలానే కూర్చున్నాడు.
    ఒక రక్షక భటుణ్ణి నేను శిక్షించటం అన్యాయమే సార్! కాని పైన కనిపించే న్యాయం లోపలి పొరల్లో మరో న్యాయంకూడా దాగి ఉంటుంది. అది మాత్రాలకందరు సార్! మనసుకి తడ్తుంది ...."
    అవును! న్యాయం ... సూత్రాలకు దొరకని న్యాయం .... మనసును నిలబెట్టి ప్రశ్నించే న్యాయం .... తమరు ఊపిరి తీసుకోనీయక ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా న్యాయం .....
    ఒక్క నిట్టూర్పు విడిచాడు  మోహన్ .
    "చురుకైన కుర్రాడివి __ ఈ గొడవలన్నీ వదిలి చదువుకోరాదూ?"
    "గొడవల్లో పుట్టి  గోడవులు పీలుస్తూ గొడవల్లో బ్రతుకు తున్న వాడిని. ఈ గొడవలు నాకెలా తప్పుతాయి సార్? నన్ను మీ దగ్గరుంచుకోని చదివిస్తారా?" అల్లరిగా అడిగాడు.
    గతుక్కుమన్న మోహన్ తేరుకుని "ఆ! చదివిస్తాను" అన్నాడు.
    వాడు పెదవి విరిచి "లాభంలేదుసార్! నేనొక్కణ్ణె కాదు! నాకు బావలూ, మరదళ్ళూ , అన్నలూ అక్కలూ మావయ్యలూ అత్తయ్యలూ, పిన్నమ్మలూ , చాలామంది ఉన్నారు. వాళ్ళ సంగతేమిటి సార్?"
    "అండరున్నారా?"
    "అవును సార్! మొదట ఒక అత్తయ్యగారింట్లో ఉన్నాననుకోండి ఆ తరువాత కొన్నాళ్ళకి ఆ అత్తయ్యగారు నన్ను పోషిమ్చక పొమ్మంటుంది. అప్పుడుమళ్ళీ మరొక పెద్దమ్మ గారి దగ్గిర చేరతాను . అక్కడ మళ్ళీ అన్నయ్యలూ, తమ్ముళ్ళూ, వగైరా .... వగైరా .... ఆ తరువాత ఒక బామ్మ గారు .... ఇలా నా బందువర్గం చాలా పెరిగిపోయింది సార్!"
    అనాధ .... వాళ్ళు  వెళ్ళగొడితే వీళ్ళి౦ట్లో .... వీళ్ళు వెళ్ళగొడితే వాళ్లింట్లో ..... కాలం గడుపుకొంటున్నాడు. ఆ విషయం అందంగా చెప్తున్నాడు .... నవ్వుతూ చెప్తున్నాడు. ముఖ్యంగా ధైర్యంగా చెప్తున్నాడు.
    తనకూ ఉన్నారు అలాంటి బావలూ, అన్నలూ, వగైరా వగైరా .... అయితే వాళ్ళని తనేన్నడూ తన బందువులని అనుకోలేదు. బద్దశత్రువులనుకున్నాడు ........ "నీ బంధువర్గంమీద ..... నిజంగా నీకు అభిమానం ఉందా?"
    ఎందుకుండదు సార్? వెళ్ళగొట్టినందుకా? ఆమాత్రం అర్ధంచేసుకోలేకనాసార్! వాళ్ళు మనుష్యులు సార్! అందుకే ఆకలితో ఉన్న నన్ను పిలిచి అన్నం పెట్టారు. మనుష్యులు మాత్రమె సార్! అందుకే అంతకంటే ఎక్కువ చెయ్యలేక వెళ్ళిపోమన్నారు __"
    మోహన్ మాట్లాడలేదు. సోఫాలో వెనక్కువాలి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు .... ఆ మూసుకున్న కళ్ళ వెనుక అనేక దృశ్యాలు ముసురుకుంటున్నాయి.
    నన్ను వెళ్ళమంటారా సార్?"
    "వెళ్ళు!"
    "నాకేదైనా పని చెప్తారేమోనని ఆశపడ్డాను సార్!"
    మోహన్ కళ్ళు తెరచి చూశాడు. ఆ కుర్రవాడి కళ్ళలో నికాష స్పష్టంగా కనిపిస్తోంది.
    "తప్పకుండా చెప్తాను _ నాకు నీలాంటివాళ్ళతో అవసరం ఉంటుంది _ కానీ ఆ సమయం రావాలి ....."
    థెంక్యూ సర్! మీలాంటివాళ్ళు చెప్పినపనులు చేస్తే తగిన ప్రతిఫలం ముడుతుంది...."
    అసాధ్యుడు! నవ్వుకున్నాడు మోహన్.
    "నీ పేరేమిటి?"
    "ఏ పేరు చెప్పమంటారు సార్? పోలీస్ రికార్డులో ఎక్కినా పేరా? కాలేజీ రిజిస్టర్ ఉన్న పేరా? ప్రెండ్స్ ముద్దుగా పిలిచేపేరా? శేఠ్ జీ కోపంతో తిట్టే పేరా? ....."
    "చాలు! చాలు ! నా దగ్గర నీపేరు చిరంజీవి ..... నీలో ఇవాళ నేనేం చూశానో అది మానవజాతి ఉన్నాన్నాళ్ళూ ..... అన్ని కాలాల్లోనూ ..... అన్ని సమాజాల్లోనూ ...... ఎక్కడో ఏ అడుగు పోరల్లోనో ..... చిరంజీవిగా నిలిచే ఉంటుంది ....."
    "థేంక్యూ సార్?"
    నవ్వాడు వాడు .......జీవం ఉట్టిపడేనవ్వు.......!          

                                             2

    "హొటల్ లోటస్ " అని చక్కని ఇంగ్లీషు అక్షరాలు .    
    అందంగా చెక్కిఉన్నాయి. ఆ భవనంమీద చీకటిపడగానే విద్యుద్దీపాలు ఆ అక్షరాలను వెలిగిస్తాయి. ఆపేరు పరశీలనగా చూసి లోపలకుఅడుగు పెట్టాడు మోహన్ ...... రిసెప్షన్  హాలులోనే పద్మంలోవున్న లక్ష్మీదేవి పాలరాతి విగ్రహం ఉంది. జీవకళ ఉట్టిపడుతూవుంది. ఆ విగ్రహానికి పూజపునస్కారాలు జరిగిన ఆనవాళ్ళున్నాయి. హొటలు అంతా పాశ్చాత్యపద్ధతుల్లో నడుస్తున్నా, నడుపుతోన్నది మాత్రం అసలు సిసలైన ఆంధ్రులనటానికి ఆ విగ్రహామే సాక్ష్యం.
    పరిసరాలన్నీ పరిశీలనగా చూస్తూ రెస్టారెంట్ సెక్షన్ లోకి అడుగు పెట్టబోతున్న మోహన్ కాళ్ళకు సంకెళ్ళు వేసినట్లు ఆగిపోయాడు. మేనేజర్ రూమ్ కి ప్రక్కనేఉన్న మరొకరూమ్ స్ప్రింగ్ డోర్ తెరుచుకుని బయటకు వస్తోన్న ప్రసూన కూడ అంతే ఆశ్చర్యంతో ఆగిపోయింది.

 Previous Page Next Page