Read more!
 Previous Page Next Page 
మిదునం  పేజి 3

హాల్ లో టి వి చూస్తున్న సత్యభామ లేచి నిలుచుంది కృష్ణమోహన్ ని చూడగానే కూర్చోమని చెప్పి తను కూడా పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడువంటావిడ ఇద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది నిన్నొకటి సూటిగా అడుగుతాను. ఏమీ అనుకోవుకదా అన్నాడు సత్యభామ వైపు చూస్తూ నా పోస్ట్ పదిలమే కదా. నన్ను తీసెయ్యవు కదా అంది ఎందుకంటే వంటావిడ, ఆమె భర్త ఉన్నప్పుడు ఇక తన అవసరం ఆ ఇంట్లో లేనట్లే అని ఆమె ఒక అభిప్రాయానికొచ్చింది అప్పటికే ఆమె మొహంలో కంగారు చూసి తను అడగబోయే విషయానికి ఆమె ఎలా స్పందిస్తుందో అని భయపడ్డాడు అంత వయసులోనూ నీకిష్టమైతే నేను నిన్ను పెళ్లిచేసుకుంటాను అన్నాడు తను ఎలా తీసుకుంటుందో  అన్న మీమాంసలో  ఆమె మొహం వైపే చూస్తున్నాడు. తొందరేమీ లేదు అలోచించి నీ నిర్ణయం ఒక వారం తరువాత చెప్పు అన్నాడు ఆమె మోహంలో ఏ భావమూ లేదు కొంత నిర్లిప్తత కనిపించింది కూడా నీ మనసులో మాటలు నిర్భయంగా మాట్లాడొచ్చు అన్నాడు మనమేమీ చిన్న పిల్లలం కాదు శేష జీవితంలో ఒకరికొకరు తోడు కోసం నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పాను. నీవు నీ మనసులో మాట ఇబ్బంది లేకుండా చెప్పు అన్నాడు.

కొంచెంసేపు అలోచించిన పిమ్మట తను అంది. నావైపు అలోచించి నా బాగోగులు చూసేవారు ఎవరూ లేరు మీ అమ్మాయిల  అభిప్రాయం కూడా అడగండి వారికి సమ్మతమైతే మీరు ఎలా చెప్తే అలా అంది సరే, ముందు డిన్నర్ చేద్దాం పద అన్నాడు భోజనం చేసిన తరువాత వీడియో కాన్ఫరెన్స్ లో ఇద్దరు కూతుళ్ళకి సత్యభామ కధ మొత్తం చెప్పాడు. తను తీసుకున్న నిర్ణయం కూడా చెప్పాడు కూతుళ్లు, అల్లుళ్ళు అందరూ లేచి నిలబడి ఒక్కసారి చప్పట్లు చరుస్తూ తమ ఆనందం వెలిబుచ్చారు ఎంతో హ్యాపీగా ఉంది డాడీ ఇవాళ అన్నారు. మరి మా మమ్మీ ని చూపించండి అని అడిగారు ఉత్సాహంతో పక్కన కూర్చున్న సత్యభామ వైపు లాప్టాప్ తిప్పాడు అందరినీ ఆప్యాయంగా పలకరించింది ఆమె ఏ అరమరికలు లేకుండా మాట్లాడింది తను కేవలం నీడ కోసం అడిగితే మీ డాడీ తన జీవితాన్ని నాకు పంచుతున్నారు అంది ఆనందభాష్పాలతో గొంతు బొంగురుపోతుండగా నేను ఇందుకు అర్హురాలిని అవునో కాదో నాకు తెలీదు అని గద్గదికంగా అంది. కృష్ణమోహన్ కూతుళ్లు అలా అనకండి మమ్మీ. ఇక మా డాడీని మీ చేతుల్లో పెడుతున్నాము,  మేము ఇక్కడ ఉన్నా మా మనసంతా అక్కడే ఉంటుంది రోజూ రాత్రి మాట్లాడేంతవరకూ ఆత్రుతగానే.ఉంటుంది మాకు. 

ఈ రోజునుంచి మేము కొంత రిలాక్స్ అవుతాము అన్నారు సంతోషంగా అల్లుళ్ళు కూడా వరుస కలిపి అత్తయ్యగారు అంటూ వాళ్ళ మామగారి గురించి ఎన్నో గొప్పలు చెప్పారు రోజూ పదకొండు వరకు మాట్లాడేవాళ్ళు ఆరోజు తెల్లవారు ఝాము మూడయ్యింది కూతుళ్లు, అల్లుళ్ళు వాళ్ళిద్దరికీ  అమెరికాలోనే పెళ్లి చేస్తామని బలవంతం చేశారు. ఒప్పుకోక తప్పలేదు కృష్ణమోహన్ కి ఎన్నోసార్లు రమ్మన్నా బ్యాంకు లో బిజీగా ఉండటంతో అమెరికా వెళ్లలేకపోయాడు. భార్య చనిపోయిన తరువాత న్యాయవాద వృత్తిలో పడి ఇదిగో వస్తా అదిగో వస్తా అంటూ పొడిగిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇక వెళ్లి తన కూతుళ్లు, అల్లుళ్లను చూసి రావొచ్చు అనుకున్నాడు అందరూ బై చెప్పి సెలవు తీసుకున్నారు లాప్ టాప్ మూసేసి మళ్ళీ సంశయంగా అడిగాడు నీకిష్టమే కదా అని సత్యభామ ఏమీ మాట్లాడకుండా కృష్ణమోహన్ పాదాలను తాకింది. రెండు కన్నీటి బొట్లు అతని పాదాలను స్పృశించాయి, నీ ఆస్తి ని మీ పిల్లల పేర రాసేసి, మనం అమెరికా వెళ్లి పిల్లల సమక్షంలో మన పెళ్ళయ్యేంతవరకు ఇలానే విడిగా ఉందాం ఈ ఇంట్లో నీకు అన్ని స్వేచ్ఛలూ ఉన్నాయి నీవు ఈ ఇంటికి సర్వాధికారిణివి మా అందరిని నువ్వే చూసుకోవాలి   నీవు సంతోషంగా ఉండొచ్చు అన్నాడు కృష్ణమోహన్ సరే బావా అంది సత్యభామ బాల్యం రోజులు గుర్తుకొచ్చి బావ అన్న సంబోధన విన్న కృష్ణమోహన్ కి చిన్నప్పటి సత్యభామ గుర్తుకొచ్చి హమ్మయ్య అనుకున్నాడు ఆనందంగా ఇద్దరూ ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు.  
                                      ***

 Previous Page Next Page