Read more!
 Previous Page Next Page 
మిదునం  పేజి 2

కృష్ణమోహన్ వాళ్ళ పూర్వీకులది కావలి, అక్కడే తన బాల్యం నుంచి కాలేజీ చదువు వరకు సాగింది. ఆ రోజు తను స్కూల్ నుంచి రాగానే తమ పక్క పోర్షన్ లో ఎవరో అద్దెకు దిగిన వాళ్ళు సామాను దించుతున్నారు పాతకాలం రోజులవి కాన్వెంట్ స్కూల్స్ పెద్దగా లేని రోజులు అందరూ గవర్నమెంట్ స్కూల్స్ లో చదవాల్సిందేకృష్ణమోహన్ అప్పుడు ఏడో క్లాస్ చదువుతున్నాడు కావలి జిల్లా పరిషద్  హై స్కూల్ లోతండ్రి కోర్ట్ లో గుమాస్తా గా పని చేసేవాడు కృష్ణమోహన్ కి అన్న, చెల్లెలు వున్నారు. పెద్ద ఇల్లు కావడంతో ఓనర్ రెండు పోర్షన్ లు గా చేసాడు. ఒక పోర్షన్ లో కృష్ణమోహన్ వాళ్ళు ఉండేవాళ్ళు పక్క పోర్షన్ రెండు నెలలు నుంచీ ఖాళీగా ఉందిఆ రోజె సత్యభామ  కుటుంబం అద్దెకు దిగింది. సత్యభామకు ఇద్దరు అక్కలు. తండ్రి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లో గుమాస్తాగా ఉన్నాడు అదే ఊర్లో వేరే ఇంటినుంచి ఇక్కడికి మారారు కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల రెండో క్లాస్ సత్యభామ కూడా రెండో క్లాస్ లో చేరింది. శకుంతలకి సత్యభామ కి బాగా స్నేహం కుదిరింది శకుంతల కృష్ణమోహన్ ని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుండేది మరి నేనేమని పిలవాలి అని అడిగింది సత్యభామ శకుంతల తమ అన్నయ్యను సత్యభామ ఎక్కడ లాక్కెళుతుందో అని నువ్వు బావ అని పిలువు అని చెప్పింది అప్పటినుంచి సత్యభామ బావ అని పిలుస్తుండేది కృష్ణమోహన్ ని కృష్ణమోహన్ తల్లికెళ్లి చెప్పాడు బావ అని పిలుస్తోందని ఫరవాలేదులేరా, అది అలానే పిలవాలి నిన్ను అని సర్ది చెప్పింది. 
దాంతో సమాధానపడ్డాడు.వాళ్ళిద్దరికీ ఏ  సహాయం కావాలన్నా కృష్ణమోహన్ చెయ్యాల్సిందే  అది కృష్ణమోహన్ తల్లి గారి ఆర్డర్స్, తల్లి మాటంటే కృష్ణమోహన్ కి వేదవాక్కు ఎందుకో ఆమెకి సత్యభామ అంటే అమిత ఇష్టం అందరికంటే ఆమెను ప్రత్యేకంగా చూసేది ఆమెకు నచ్చిన విషయాల్లో మొదటిది సత్యభామ అన్న పేరు రెండోది చలాకీగా అందంగా ఉండేది పోత బోసిన బొమ్మలా ఉండేది స్కూల్ లో కూడా సత్యభామ అందరిలోకి ప్రత్యేకంగా ఉండేది చిన్న పిల్ల అయినా అణకువగా ఎంతో ఒద్దికగా తన తల్లికి అన్ని పనులు చేసి పెడుతుండేది అందుకే కృష్ణమోహన్ తల్లికి సత్యభామ అంటే అంత ఇష్టం. 
 
ఆ రెండు కుటుంబాలు చక్కగా అరమరికలు లేకుండా ఒక్కటిగా ఉండేవాళ్ళు ఏ పండుగైనా, ఫంక్షన్ అయినా అందరూ కలిసి మెలిసి ఆనందించేవాళ్ళు, అలా రెండేళ్లు గడిచాయి పిల్లలందరూ సరదాగా ఆటలు, కబుర్లు ఒకటేమిటి ఆనందంగా గడిపేవాళ్ళు పెద్దవాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒద్దికగా ఉండేవాళ్ళు
రెండేళ్లు యిట్టె గడచిపోయాయి అనుకోకుండా సత్యభామ వాళ్ళ నాన్నకి వేరే ఊరికి బదిలీ అయ్యింది ఆ విషయంలో అందరూ ఉదాసీనులయ్యారు పెద్దలు, పిల్లలు విడిపోతున్నందుకు ఎంతో బాధపడ్డారు. ఆ రోజుల్లో ఇప్పటిలా ఫోన్లు, మొబైల్ ఫోన్లు ఉండేవి కావు ఇళ్లలో ఉత్తరాలతోనే సంగతులు తెలిసేవి. అవి కూడా మెల్లగా వారం , పది రోజులు పట్టేవి చేరేందుకు కొద్ది కాలం ఇరు కుటుంబాల మధ్య ఉత్తరాల ద్వారా సంగతులు తెలిసేవి మెల్ల మెల్లగా అవి ఆగిపోవడంతో సమాచారాలు కూడా ఆగిపోయాయి కానీ కృష్ణమోహన్ మనసులో మాత్రం సత్యభామ పేరు, ఆమె రూపం అలా ముద్రించి ఉండిపోయాయి అందులోనూ తొమ్మిదో తరగతి చదివేప్పుడు నంది తిమ్మన గారి 'పారిజాతాపహరణం' అన్న పద్య కావ్యంలో అతనికి సత్యభామ పేరును మరీ మరీ గుర్తు చేసేది మరలా ఇన్ని రోజులకు ఆమెను చూసాడు వయసులో వచ్చిన మార్పు తప్ప చిన్నప్పటి పోలికలలో ఏమీ మార్పు కనిపించలేదు ఆమెలో తన తల్లి చిన్నప్పుడు ఆమె గురించి చిదిమి దీపం  పెట్టుకోవచ్చు ఈ పిల్ల తోటి అంటుండేది చిన్న వయసులో ఆ మాటలు తనకు అర్ధమయ్యేవి కావు కానీ ఇప్పుడు ఆమెని  చూస్తే ఆ మాట నిజమని తన మనసుకు తెలుస్తోంది అనుకున్నాడు అలా తననే చూస్తూ ఏమీ మాట్లాడకపోవడంతో సత్యభామ మెల్లగా దగ్గి కృష్ణమోహన్ గారు అంది. 

ఆ పిలుపుతో ఈలోకంలోకి వచ్చాడు. పేరు గుర్తుందన్నమాట అన్నాడు నవ్వుతూ ఎందుకుండదూ. బాల్యం ఎవరికైనా జీవితాంతం గుర్తుంటుంది  అంది. ఎలా ఉన్నారు అని వివరాలు అడిగింది తన విషయాలు అన్నీ చెప్పాడు తెల్ల డ్రెస్ వేసుకోవడం గమనించి మీరు అడ్వకేట్ గా ఉన్నారా అంది అవును అన్నాడు తన విషయాలు చెప్పింది. డిగ్రీ వరకు చదువుకుంది. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చెయ్యడంతో ఆస్తులు కర్పూరంలా కరిగిపోయాయి. ఆ బాధతో తండ్రి మంచం పట్టి చనిపోవడంతో తనకు ఎలాగోలా పెళ్ళిచెయ్యాలని తల్లి తపనపడి ఇద్దరు మగపిల్లలున్న గోవిందరావును ఇచ్చి చేసింది ఆ ఇద్దరు పిల్లలకు తల్లయితే అయ్యింది కానీ తను మాత్రం తల్లికాలేకపోయింది ఎందుకంటే అప్పటికే గోవిందరావు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. సవతి తల్లి కావడంతో తను ఎంత ప్రేమ చూపించినా పిల్లలకి మాత్రం ఆమెపై ప్రేమ కలుగలేదు ఆ దూరం పెద్దయ్యేకొద్దీ ఇంకా పెరిగింది.   భర్తకు మాత్రం తనపై అమితమైన ప్రేమ ఉండేది. అందుకే బ్రతికుండగానే ఆస్తి ఆమె పేరుతో వీలునామా రాసాడు రెండేళ్ల క్రితం భర్త హఠాన్మరణంతో ఆమె ఒంటరయ్యింది కొడుకులు, కోడళ్ళు ఆమెను పట్టించుకోవడం మానేశారు.

ఆస్తి కోసం రోజూ నానా మాటలూ అనేవారు. అది భరించే ఓపిక పోయింది ఆమెకి అందుకే ఓల్డేజ్ హోమ్ లో చేరుస్తామని కొడుకులంటే సరే అని ఒప్పుకుంది అవన్నీ చెప్పేప్పుడు చాలా నిర్లిప్తత గోచరించింది ఆమె మొహంలో ఏదో తెలియని ఒంటరితనం ఛాయలు స్పష్టంగా కనిపించాయి ఆమె కొడుకులు వచ్చి ఆస్తి విషయం గురించి మాట్లాడిన విషయం అంతా చెప్పాడు కృష్ణమోహన్. ఏమి చెయ్యమన్నావు అని అడిగాడు నా పేరున ఉన్న ఆస్తి వాళ్లకు ఇచ్చేయండి. నాకు ఆ ఆస్తి పల్లేదు ఇలా ఎక్కడో  ఒక చోట తలదాచుకుంటాను అంది స్థిరంగా ఆమె నిర్ణయానికి ఒక్క క్షణం నివ్వెరపోయాడు కృష్ణమోహన్ అంతా వాళ్లకు ఇచ్చేస్తే మరి రేపు వాళ్ళు నీకు ఏ సహాయమూ చెయ్యకపోతే నీ శేష జీవితం ఎలా గడుస్తుంది అని అడిగాడు తేరుకుని ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను. నా ఒక్క పొట్ట పోషించుకోవడం అంత కష్టమేమీ కాదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటె చెప్పండి ఇంట్లో వంట నుంచి అన్ని  పనులు చేసిపెడతాను అంది అదే  నీ నిర్ణయమంటావు, ఆస్తి లో చిల్లిగవ్వ కూడా నీకు వద్దంటావు అని గుచ్చి గుచ్చి అడిగాడు ఒక అడ్వకేట్ గా అవును నాకు వద్దు వాళ్లనే అనుభవించనివ్వండి అంది ఈ కాలంలో ఏమీ లేకుండా ఈ వయసులో ఒంటరిగా ఎలా బ్రతకగలవు, కొంచెం ఆలోచించు అన్నాడు. 

 ఫరవాలేదు బ్రతకలేని రోజంటూ వస్తే నేనే ఎదురెళ్లి మృత్యువుని ఆహ్వానిస్తాను అంది కాసేపు మౌనంగా ఆలోచనలో ఉండిపోయాడు కృష్ణమోహన్ మీరు అంతగా ఆలోచించకండి నా గురించి కొన్ని బ్రతుకులంతే అలా రాలిపోవాల్సిందే అంది తెచ్చుకున్న నవ్వుతో మా ఇంట్లోనే నువ్వు అడిగిన పోస్ట్ ఉంది. వచ్చి చేస్తావా అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు అడిగాడు ఆమెని ఓ ! నేను చేస్తాను నాకు ఇప్పించండి అంది ఎక్కడ ఆ పోస్ట్ పోతుందో అన్న బెంగతో మరి  ఎప్పుడు చేరతావు అన్నాడు.
మీరు ఎప్పుడంటే అప్పుడే ఇప్పుడు నాతో వచ్చెయ్యగలవా అని అడిగాడు ఓహ్ తప్పకుండా అంది మరి నీ పిల్లల పర్మిషన్ అక్కర్లేదా అన్నాడువాళ్ళు ఇక్కడ నన్ను చేరిపించేప్పుడే చెప్పారు వాళ్ళని ఎప్పుడూ విసిగించొద్దని ఏదన్న అవసరముంటే ఆశ్రమం మేనేజర్ వాళ్ళతో మాట్లాడుతాడు నా తరపున అని చెప్పారు వాళ్లకి నన్ను చూడటం, నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు అంది బాధగా సరే నీ బట్టలు అవి తెచ్చుకో నాతో వెళదాం మా ఇంటికి అన్నాడుఈ లోపు ఆశ్రమం మేనేజర్ వచ్చాడు అతనితో చెప్పింది సత్యభామ తను ఖాళీ చేస్తున్నానని అతను నివ్వెరపోయాడు. మీ వాళ్ళు మూడు నెలల డబ్బు కట్టాలి మీరు ఉన్నందుకు. అడుగుతుంటే ఇంకా కట్టకుండా జాప్యం చేస్తున్నారు అని కోప్పడ్డాడు. మాట్లాడుతూనే సతీష్ కి ఫోన్ చేసాడు మేనేజర్  మీ మదర్ వెళతానంటున్నారు బాకీ డబ్బులు కట్టండి అర్జెంటుగా అనిఇంతలో సతీష్ సత్యభామ కి ఫోన్ చేసాడు,  ఎక్కడికి వెళుతున్నావు  అమ్మా అని. 

కృష్ణమోహన్ సైగ చేసాడు తన పేరు చెప్పొద్దని తెలిసిన వాళ్ళింట్లో వంటమనిషిగా కుదిరింది అని చెప్పింది పేరు చెప్పకుండా. వెళ్ళిన తరువాత ఫోన్ చేస్తానని చెప్పింది
సరే అని సతీష్ ఫోన్ పెట్టేసాడు కృష్ణమోహన్ అడిగాడు మేనేజర్ ని ఎంత డబ్బులు బాకీ  వున్నారు అని పదివేలు అని చెప్పాడు అతను జేబులోంచి డబ్బులు తీసి అతని చేతిలో పెట్టాడు అయ్యో మీరెందుకు ఇవ్వడం అంది సత్యభామ నొచ్చుకుంటూ ఫరవాలేదులే  నీ జీతంలో కట్ చేస్తాను నెల నెలా అని చెప్పాడు రూమ్ లో కెళ్ళి తన సూట్ కేసు తో వచ్చింది ఈలోపు డ్రైవర్ వచ్చాడు. ఆమె చేతినుంచి సూట్ కేసు తీసుకున్నాడు సత్యభామని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు కృష్ణమోహన్ అప్పటికే టైం పదకొండు దాటింది.ఫోన్ చేసి జూనియర్స్ కి చెప్పాడు ఇవాళ కోర్ట్ కి రావడం లేదని వాళ్ళని మేనేజ్ చెయ్యమని చెప్పాడు. అంత ఇంపార్టెంట్ కేసెస్ కూడా లేవులే అని సమాధానపడ్డాడు సామాన్యంగా కోర్ట్ కెళ్ళడం మానడు కృష్ణమోహన్ ఇంటికెళ్ళగానే వంటమనిషిని పిలిచి సత్యభామని గెస్ట్ రూమ్ లో ఉండేట్లు ఏర్పాటు చెయ్యమని చెప్పాడు తను కిందికి ఆఫీస్ కి వచ్చి కూర్చున్నాడు. 
వంటమనిషి, ఆమె భర్తని పిలిచి సత్యభామ తన గెస్ట్ అని, జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు సరే అన్నారు వాళ్ళు మధ్యాన్నం లంచ్ టైం కి పైకి వెళ్ళాడు అప్పటికే సత్యభామ అటూ ఇటూ తిరుగుతోంది హాల్ లోకృష్ణమోహన్ వెళ్ళగానే అడిగింది తనకి ఇంకా పనేమీ చెప్పలేదేమని రేపటినుంచి చెపుతానని చెప్పాడు ఇద్దరూ కలిసి భోజనం చేశారు బాల్యం నెమరువేసుకున్నారు. ఎన్నో కబుర్లు, జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. రెస్ట్ తీసుకోమని చెప్పి తనూ తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు సాయంత్రమయ్యింది. 
హాల్ లో టి వి చూస్తూ కూర్చుంది సత్యభామ సాయంత్రమైతే కృష్ణమోహన్  చాలా బిజీ అవుతాడు  క్లయింట్స్ తో మాట్లాడటం పూర్తయ్యేసరికి రోజూ రాత్రి తొమ్మిదవుతుంది. తరువాత జూనియర్స్ తో కాసేపు రేపటి కేసులు గురించి డిస్కస్ చేస్తాడు. ఆ రోజు టైం ఎనిమిది కాగానే ఇవాళ నేను తొందరగా వెళుతున్నాను అని జూనియర్స్ కి చెప్పి పైకి వచ్చాడు.

 Previous Page Next Page