Read more!
 Previous Page
మిదునం  పేజి 4


అనుకున్నట్లే రెండో రోజు సతీష్, రాఘవ్ ఇద్దరూ వచ్చారు రాత్రి ఏడు గంటలకు పైనున్న సత్యభామ ని పిలిపించాడు కృష్ణమోహన్ ఆమె సమక్షంలోనే వాళ్ళిద్దరికీ అన్ని విషయాలు చెప్పాడు. తను ఆమెను త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్న సంగతి కూడా చెప్పాడు వాళ్ళ మొహంలో లిప్తపాటు ఆందోళన కనిపించింది ఎక్కడ ఈ లాయర్ గారు ఆస్తి మొత్తం తన చేజిక్కించుకుంటాడో అని వారి సందేహాన్ని గమనించి కృష్ణమోహన్ చెప్పాడు. ఆస్తి మొత్తం మీ పేరనే రాస్తుంది. ఆ భయమేమీ మీకు వద్దు ఇప్పుడు తనకి నేను, నా కూతుళ్లు ఉన్నాం. ఆమె పట్ల మీకు తల్లి అన్న అభిమానం ఉంటె చాలు ఇక మీరేమీ వర్రీ అవకండి అన్నాడు నవ్వుతూ ఆస్తి వాళ్ళకే అన్న మాటతో సతీష్, రాఘవ్ మోహంలో వెలుగొచ్చింది. ఇద్దరూ లేచి తల్లి పాదాలకి నమస్కరించారు కొద్ది రోజులకి ఆస్తి వారి పేర రాయడం జరిగిపోయింది కృష్ణమోహన్ తన బంధువులకు, స్నేహితులకు సత్యభామను తను పెళ్లి చేసుకోబోతున్న సంగతి చెప్పాడు అందరూ ఎంతో సంతోషించారు. 

చాలా మంచి పని చేస్తున్నావురా నువ్వు అని ప్రాణ స్నేహితులు పదే పదే పొగిడారు నువ్వు ఒంటరిగా ఉంటె మాకూ భయంగా ఉంటుంది ఇప్పుడు మాకు కాస్త రిలీఫ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యారు జూనియర్స్ కి కేసులు మరియు ఆఫీస్, వంటావిడ ఆమె భర్తకి  ఇంటి బాధ్యత అప్పగించి కృష్ణమోహన్, సత్యభామ అమెరికా వెళ్లారు.కృష్ణమోహన్ కూతుళ్లు, అల్లుళ్ళు వీళ్ళను చూడగానే ఎగిరి గంతేశారు పెళ్లి ఏర్పాట్లు సింపుల్ గా చెయ్యండిరా, కేవలం దండలు మార్చుకుంటాం అన్నా వాళ్ళుఊరుకోలేదు అన్నీ శాస్త్రోక్తంగా అమెరికాలో ఉన్న తమ బంధువులని, స్నేహితులందరిని పిలిచి చాలా గ్రాండ్ గా చేశారు కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల, ఆమె భర్త, పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు రెండు రోజులముందే వచ్చారు సత్యభామని చూసి శకుంతల చాలా ఆనందపడింది ఇద్దరు స్నేహితురాళ్ళు మనసు విప్పి చాలా కబుర్లు చెప్పుకున్నారు. సత్యభామ తన వదినయ్యినందుకు శకుంతల అమితంగా సంతోషించింది కృష్ణమోహన్ కూతుళ్లు సత్యభామని నెత్తిన పెట్టుకున్నంత పని చేశారు అమ్మకు ఎన్నో బహుమతులిచ్చారు వాళ్ళు వారి ప్రేమానురాగాలను చూసి ఆమెకు నోట మాట రాలేదు..
 తన జీవితం ఇంత మంచి మలుపు తిరుగుతుందని కలలో కూడా అనుకోలేదు ఇది కలా నిజమా అన్న సందేహం ఆమెను కొన్ని రోజులు పట్టి పీడించింది కూడా కొద్ధి రోజులు కూతుళ్ళ దగ్గరుండి యూరోప్ ట్రిప్ కి బయలుదేరారు కృష్ణమోహన్, సత్యభామ కూతుళ్లు సత్యభామకు ఓ ఖరీదైన మొబైల్ గిఫ్ట్ గా ఇచ్చారు. యూట్యూబ్ లో పదే పదే ‘మిథునం’ సినిమా చూస్తూ ఆనందిస్తోంది సత్యభామ అది గమనించాడు కృష్ణమోహన్ ఎందుకు అదే సినిమా అరిగిపోయేట్లు చూస్తున్నావు అన్నాడు చిరునవ్వుతో తనకీ ఆసినిమా అంటే చాలా ఇష్టం, తనూ అనేక సార్లు చూసాడు ఆ సినిమాని సత్యభామ అభిప్రాయం కనుక్కుందామని అడిగాడు ఆసక్తిగాఈసినిమాలోబాలసుబ్రమణ్యం గారు, లక్ష్మిగారు దంపతులుగా చేసిన అద్భుతమైన నటన  నాకు ఎంతో నచ్చిందండీ ఆ పాత్రల తీరు చాలా ఉత్తమంగా ఉంటుంది అందుకే నాకు చాలా ఇష్టం అంది. ఓహ్ గుడ్ నాకూ చాలా ఇష్టం.. మనమూ వాళ్ళని ఫాలో అవుదాం అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ... తప్పకుండా అంటూ అతని భుజంపై హాయిగా తలవాల్చింది సత్యభామ... 
                             ******

 Previous Page